జీవన పోరాటాల నడుమ కొడిశాల గీతా దృఢత్వం – మకాం

పొలం పనిచేయటం కన్నా బీడీలు చుట్టడమే నాకిష్టం, అలవాటైన నేర్పుతో చుట్టిన బీడీలను కట్టలుగా కడుతూ చెప్పారు గీత. “నేని ఈ పనిని ఇంట్లో కూర్చొని చేయగలను. రోజంతా పొలంలో పనిచేయటం కంటే ఇది చాలా సులభమైన పని.” అయితే, బీడీలు చుట్టటం ఆమె ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతోంది.

“నాకెప్పుడు వీపు, మెడ నొప్పిగా ఉంటాయి, కంటి చూపు కూడా తగ్గిపోయింది. ఒకసారి పరీక్ష చేయించుకోవాలి,” అన్నారామే. ఈ ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆమె ఆ ఒక్క పనిమీదే ఆధారపడలేరు. ఆమె రోజూ బీడీలు చుడుతారు, పొలం పనుల సీజన్లో వ్యవసాయ కూలీగా పనిచేస్తారు. ఇటువంటి పనులు లేని కాలంలో 17, 15 సంవత్సరాల వయసున్న తన కొడుకులను పోషించుకోవటానికి గ్రామీణ ఉపాధిహామీ పని కూడా చేస్తుంటారు.
ప్రస్తుతం 32 ఏళ్ల వయసున్న గీత, తెలంగాణలోని సిద్దిపేట జిల్లా సిరిసినగండ్ల గ్రామంలో నివసిస్తున్నారు. మరింత చదువుకోవాలనే ఆశ ఉన్నప్పటికీ, పదమూడు ఏళ్ల వయసుకే ఆమెకు వివాహం కావడంతో, ఏడవ తరగతి తర్వాత చదువు మానేయాల్సి వచ్చింది. 2016 వరకు, కుటుంబానికి చెందిన పొలం పనులను భర్త చూసుకుంటూ ఉండగా, ఖాళీ సమయంలో బీడీలు చుట్టుకుంటూ, ఆమె జీవితమంతా తన ఇంటి చుట్టే తిరిగింది. ఆ తర్వాత భర్త ఆత్మహత్య చేసుకోవటంతో ఆమె ప్రపంచమే తలక్రిందులైపోయింది. “నా భర్తకు వారసత్వంగా వచ్చిన ఒక ఎకరం పొలంలో పత్తి సాగు చేశాడు. వరుసగా రెండేళ్ల పాటు వర్షాలు పడకపోవడంతో పత్తి పంట ఎండిపోయింది. ఆయన ఒక లక్ష రూపాయలు ఖర్చుపెట్టి మూడు బోరులు తవ్వించినా దేనిలోనూ నీరు పడలేదు. చేసిన అప్పులను తీర్చడానికి, ఆయన భూమిని అమ్మాల్సి వచ్చింది. ఆ తర్వాత అమ్మిన ఆ ఎకరంతో పాటు మరో రెండు ఎకరాలను, ఎకరానికి 5000 చొప్పున చెల్లించి కౌలుకు తీసుకొని మళ్లీ పత్తి సాగును ప్రారంభించాడు.”
సాగు ఖర్చు, కౌలుకు తీసుకున్న భూమికి కట్టాల్సిన కౌలు డబ్బులు ఎక్కువ కావడంతో, వాళ్లు అప్పులు చేయాల్సి వచ్చింది. పెరుగిపోతున్న వడ్డీతో, అప్పు కూడా 3 లక్షలకు పెరిగింది. ఈ భారంతో కుంగిపోయిన ఆమె భర్త, 2016లో ఆత్మహత్య చేసుకున్నారు. అంతకు ఏడాది క్రితం గీత చెల్లెలు గంగుల మమత కూడా ఇలాంటి పరిస్థితులలోనే తన భర్తను కోల్పోయింది. ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విధంగా ఆ తోబుట్టువులిద్దరూ రెట్టింపు నష్టాన్ని ఎదుర్కొన్నారు.
“వడ్డీకి అప్పులిచ్చిన వాళ్లు మా ఇంటికి రాగానే నాకు కాళ్లు చేతులు వణికిపోయాయి,” అని ఆమె గుర్తు చేసుకున్నారు. భర్త అంత్యక్రియలు ముగిసిన పది రోజులకే, ఆ వడ్డీ వ్యాపారులు తమ దగ్గరున్న ప్రామిసరీ నోట్లను, అప్పు పత్రాలను తీసుకొని ఆమె ఇంటికి వచ్చి అప్పు తీర్చమని డిమాండ్ చేశారు. తరచుగా గ్రామ పెద్దలను తీసుకొని వాళ్లలా ఇంటి మీదకు రావడం ఆమెకు అవమానంగా అనిపించేది, ఆందోళనను పెంచేది. మరీ ఒత్తిడి పెట్టే అప్పులను తీర్చడానికి ఆమె తల్లిదండ్రులు ఆమెకు కొంత డబ్బు ఇచ్చారు. ఆమె కూడా చిట్టీల కట్టగా వచ్చిన డబ్బుతో 70,000 అప్పు తీర్చగలిగారు. ఈ రోజుకు ఆమె కేవలం ఒక లక్ష రూపాయల అప్పును మాత్రమే తీర్చగలిగారు, అది కూడా ఎక్కువగా తన తల్లిదండ్రుల సహాయం చేయడంతోనే. మిగిలిన మొత్తానికి వడ్డీలు చెల్లిస్తూ ఉన్నారు.
భర్త మరణించిన తర్వాత, గీత అత్తమామలు ఆమెకు కుటుంబ భూమిలోగాని, ఇంటిలోగాని ఆమెకు రావలసిన వాటా ఇవ్వడానికి ఇష్టపడలేదు. చాలా కాలం వివాదాలు సాగిన తర్వాత, వారు ఇష్టంగానే ఇంట్లో దెబ్బతిన్న భాగాన్ని ఆమెకు ఇచ్చారు. తర్వాత ఆమె తనకు విరాళంగా వచ్చిన లక్ష రూపాయలతో ఆ స్థలంలో చిన్న ఇల్లు కట్టుకోగలిగింది. ఆమెకు నీటి సౌకర్యం లేని ఆరు గుంటల బీడు భూమిని కూడా ఇచ్చారు. దానికి నీటి సౌకర్యం లేకపోవడంతో సాగుకు పనికిరానిదిగా మారింది. “నీ కొడుకులు పెద్దయ్యాక, మిగిలిన భూమిలో తన వాటాను తీసుకోవచ్చు” అని వాళ్లు ఆమె మాటలను తోసివేస్తూ అన్నారు.
గీత భర్త సాగు చేస్తున్న భూమి అతని సొంత భూమి కాక, గుత్తకు తీసుకున్నది కావడంతో, ఆయన మరణాన్ని అధికారికంగా రైతు ఆత్మహత్యగా గుర్తించలేదు. రైతు స్వరాజ్య వేదిక, ఇంకా ఇతర కార్యకర్తల సహాయంతో, అప్పటికే 100కి పైగా ఇతర కుటుంబాలతో కలిసి కొనసాగుతున్న న్యాయ పోరాటంలో గీత కూడా చేరారు. అన్ని ఆత్మహత్యలను వ్యవసాయ సంక్షోభ ఫలితంగా జరిగిన రైతు ఆత్మహత్యలుగా గుర్తించాలని వారు ఒత్తిడి తెచ్చారు. 2017లో ఆమె కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ్ మద్దతు ఇచ్చిన నేలమ్మ మహిళా రైతు సహకార సంఘంలో సభ్యురాలిగా చేరారు. ఈ సహకార సంస్థ ద్వారా ఆమెకు ఒక మేకను కొనడానికి రుణం లభించింది. అయితే 2019లో ఆమె చిన్న కొడుకుకు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి రావడంతో, వైద్య ఖర్చుల కోసం ఆ మేకను అమ్మాల్సి వచ్చింది.
ఇటువంటి సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ గీత ముందుకే సాగారు. ఆమె తల్లిగా, కూలీగా, సహకార సంఘ సభ్యురాలిగా తన పాత్రలను సమతుల్యం చేసుకుంటూ, తన కుటుంబానికి మెరుగైన భవిష్యత్తును సృష్టించాల్సిన దృఢసంకల్పంతో ఉన్నారు.
“నేను బయటకు వచ్చి అన్ని నేర్చుకోవాలని మా అమ్మ నన్ను చాలా ప్రోత్సహిస్తుంది,” అని ఆమె చెప్పారు. సహకార సంస్థ ద్వారా గీత ప్రకృతి వ్యవసాయం, పెరటి తోటల పెంపకం, ఫుడ్ ప్రాసెసింగ్‌లో శిక్షణ పొందారు. ఈ నైపుణ్యాలు ఆమెకు కొత్త జీవనోపాధిని వెతుక్కోవడానికి, భవిష్యత్తులో ఒక స్థిరత్వాన్ని సాధించే ఆశను కలిగిస్తాయి.
(భవిష్యత్తును అభివృద్ధి చేసుకుంటూ… మహిళా రైతుల గురించి ఫోటో వ్యాసాలు పుస్తకం నుండి..)

Share
This entry was posted in మహిళా రైతుల జీవన పోరాటాలు . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

అ
a
ఆ
aa
ఇ
i
ఈ
ee
ఉ
u
ఊ
oo
ఋ
R
ౠ
Ru
ఌ
~l
ౡ
~lu
ఎ
e
ఏ
E
ఐ
ai
ఒ
o
ఓ
O
ఔ
au
అం
M
అః
@H
అఁ
@M
உ
@2
క
k
ఖ
kh
గ
g
ఘ
gh
ఙ
~m
చ
ch
ఛ
Ch
జ
j
ఝ
jh
ఞ
~n
ట
T
ఠ
Th
డ
D
ఢ
Dh
ణ
N
త
t
థ
th
ద
d
ధ
dh
న
n
ప
p
ఫ
ph
బ
b
భ
bh
మ
m
య
y
ర
r
ల
l
వ
v
 
శ
S
ష
sh
స
s
    హ
h
ళ
L
క్ష
ksh
ఱ
~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.