భారతి కూతురు – వి.ప్రతిమ

ఉరి తియ్యడ మొక్కటే
తక్షణ పరమావధిగా
ఆగ్రహావేశాలతో వూగిపోతాం,
మూడంటే మూడు రోజులు
మళ్ళీ మనకెన్నో పుట్టి మునిగే పనులు
నిజానికి….
అణిచి వుంచబడిన ఆగ్రహం
లావాలా పెల్లుబకడమే రాజ్యానికవసరం
కుళ్ళిన వ్యవస్థ కుదుళ్ళను
కుదప గలిగే విచక్షణ లేమి దాని కనుకూలం
అరిచి ఆగంచేస్తే, లాఠీలతో
కొత్త చట్టాలతో కప్పెట్టొచ్చు…
అ(హ)త్యాచారాలతో మూసిపెట్టొచ్చు.
ఆలోచించి సంయమనం పాటిస్తేనే కష్టం.
ప్రశ్నిస్తే జవాబు లుప్తం.
పరువిప్పుడు అర్ధాలను మార్చుకుంది.
ప్రపంచమంతా వీక్షిస్తోందని తెల్సినా
బుల్లి తెరల ముఖాల మీద
లోపలా, బయటా, అసెంబ్లీలో
నిస్సిగ్గుగా కాట్లాడుకుంటాం..
పరువుపోదు… చీమ కుట్టదు.
అశ్లీలతకి ఎరువేసి పెంచిపోషించి,
సెన్సార్‌లెస్‌ సినిమాలని ప్రోత్సహించి,
విచ్చలవిడిగా మందు పాటలు పాడిపాడి,
స్త్రీల మీద హింసకి ఆమోదముద్ర వేస్తాం.
సరుకులన్నీ అమ్ముడు పోవడానికి
వారి శరీరాలను సాధనాలను చేసినా సరే
మన పరువుపోదు… చీమ కుట్టదు..
భరతఖండపు పుత్రికలపై
లక్షల దాడులు జరిగినా
ఎంతెంత మంది కూతుళ్ళు మిస్సింగయి పోయినా
చీమ కుట్టదు…పరువూపోదు.
దాన్నెవరయినా పుణ్యాత్మురాలు
బొమ్మ కట్టి చూపితే మాత్రం
లబలబా నోళ్ళు కొట్టుకుంటాం
నిషేధపు కత్తిని విసురుతాం.
కూతుళ్ళు పుట్టడమే నిషేధమైన
సమాజ సంస్కృతిలో
పచ్చి గాయలై సలపరిస్తూ
స్త్రీలంతా జీవితేచ్ఛను కోల్పోయాక
మిగుల్చుకోడానికి పరువెక్కడిది?
ఏలిన వారికి వేనవేల దండాలు
అమ్మాయిలకి చరిత్ర చెప్పొద్దు.
కరాటేని క్లాసు పాఠం చేయండి.
అబ్బాయిలకి మోరల్‌ ఫిలాసపీ
కంపల్సరీ!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.