ఏది అనుభవించానో
అది అమృతం
ఏ వాసనని ఆఘ్రానించానో
అది నా విశ్వాసం
దేనిని నిర్నిమేషంగా చూసి
ముగ్ధురాలినయ్యానో
అది నా ప్రేమ
దేనిని స్థిరభావంతో
స్పృశించానో
అది నా ప్రణయం!
అమృతం
విశ్వాసం
ప్రేమ, ప్రణయం
సర్వాన్ని
ఏకం చేశాను
ఆత్మీయంగా
ఒక్కసారి
చుంబించాను
అయింది
అది విషం!