దుర్గాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిల్లలు రాసిన కథలు
ఒక చెట్టు చెప్పింది
ఒక రోజున ఒక చెట్టు కింద అంబేద్కర్ గారు కూర్చున్నారు. అప్పుడు ఒకాయన ఆయనను చూసి, ‘‘లే, నువ్వు. ఇక్కడ కూర్చోకూడదు. నువ్వు తక్కువ కులం వాడివి. లేచి అక్కడ సుబ్బరం చేయి’’ అన్నాడు.
కొన్నేళ్ళు గడిచాయి.
ఒకరోజు ఆ చెట్టు ఇలా అంది ‘‘ఇప్పుడు అంబేద్కర్ గారు గొప్ప న్యాయ నిర్ణేతగా మారాక, ఇది ఆయన కూర్చున్న చోటు అని తెలుసుకుని, అందరూ నా కింద గర్వంగా కూర్చుంటున్నారు. ఆయన్ని ఆ చిన్నవయస్సులో ఏమీ లేనప్పుడు ఇక్కడ శుభ్రం చేయమన్నారు. ఇప్పుడేమో ఆయన గురించి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు’’ అని.
` సకునాల వీరమణి, 9వ తరగతి