దుర్గాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిల్లలు రాసిన కథలు
మా గ్రామం
మా గ్రామం పేరు దుర్గాడ. మా గ్రామం చాలా విశాలంగా ఉంటుంది. పచ్చని పొలాలు, కోయిల రాగాలు, అలా నడుస్తుంటే చల్లని గాలి. ఆ గాలి వీస్తుంటే నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మా ఊరిలో అనేక వృత్తులవారు నివసిస్తూ
ఉంటారు. మా చుట్టుపక్కలవారు అందరూ కలిసిమెలిసి ప్రేమానురాగాలతో నివసిస్తూ ఉంటారు. మా ఊరిలో చాలా దేవాలయాలు ఉన్నాయి. వాటికి చాలా ప్రసిద్ధి ఉన్నది.
మా ఊరిలో కోడి కుయ్యగానే మగవాళ్ళందరూ ఎవరి పనుల్లోకి వాళ్లు వెళ్తారు.ఆడవాళ్లు లేవగానే తలంటు స్నానం చేసి, పూజలు చేస్తారు. వంట చేసి క్యారేజీ తయారు చేసి పిల్లల్ని బడికి పంపిస్తారు. పనులు పూర్తి చేస్తారు. వంట చేసి క్యారేజీ తయారుచేసి పిల్లల్ని బడికి పంపిస్తారు. పనులు పూర్తి అయిన తర్వాత ఆడవాళ్లు అందరూ ఒక చోటుకు చేరి ముచ్చట్లు చెబుతూ సమయాన్ని గడిపేస్తారు. సాయంత్రం టీ తాగిన తర్వాత మళ్లీ కబుర్లు చెప్పుకుంటారు. రాత్రి అవ్వగానే ఇంట్లో వాళ్లందరు భోజనం చేసిన తరువాత మగవాళ్లు చెట్టుకింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. తర్వాత ఇంటికి వచ్చి కుటుంబంతో అందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగినది అంతా చెప్పుకుని ఆనందంగా నవ్వుతూ నిద్రిస్తారు. ఆ నవ్వులకు నక్షత్రాలు మెరుపులు కురిపిస్తాయి. ` గొల్లపల్లి కమలాశ్రీ, 9వ తరగతి