అమ్మ అంటే ధైర్యం
మా అమ్మ అంటే ధైర్యం
మా అమ్మ అంటే సర్వం
అమ్మే నాకు దేవుడు ఇచ్చిన వరం అమ్మంటే నాకు ప్రాణం
నా కష్టాలు పోగోడుతుంది
నాకు చదువును బోధిస్తుంది
నన్ను మంచి బాటలో నడిపిస్తుంది నాకోసం కష్ట పడుతుంది
అమ్మలేని జీవితం నాకు నరకమవుతుంది
అమ్మని చూసినప్పుడు నాకు గౌరవం కలుగుతుంది
అమ్మే నాకు స్ఫూర్తినిచ్చే దేవత
– న. మీరా, 7వ తరగతి