మాతృత్వమా మశానమా.. – పి. ప్రశాంతి

కరుణ మంచం మీద అచేతనంగా పడుంది. పక్కనే కూర్చున్న భాగ్యమ్మ బిడ్డని ఆందోళనగా చూస్తూ ‘ఏమైంది బిడ్డా, పెయ్యంతా సల్లగయితాంది, మూడు దినాలాయె మూత్రంజేసి.. పొయ్యి బిడ్డా కడుపు తీసేస్తది..’ అంటూ ఎత్తుగా ఉబ్బిన కరుణ పొట్ట మీద చెయ్యి వేసింది. అంతే, అంతెత్తున ఎగిరి పడిరది కరుణ. ఆమె వేసిన గావుకేకకి ఇంటిల్లిపాదీ పరిగెత్తుకొచ్చారు.

ముప్ఫై ఏళ్ళ కరుణకి పెళ్ళై పదేళ్ళయింది. డిగ్రీ ఫైనల్‌ పరీక్షలకి ఇంకో నాలుగు నెలలు ఉందనగా మంచి సంబంధం వచ్చిందని, ఒక్కడే కొడుకు, అతని నాయనమ్మ చచ్చిపోయే లోపు మునిమనవడ్ని, అంటే ఇంటి వారసుడ్ని ఎత్తుకోవాలని అంటోందని, పరీక్షలు పెళ్ళయ్యాక కూడా రాయొచ్చని ఒప్పించి పెళ్ళి చేశారు. పెళ్ళైన వెంటనే అత్తారింటికి వెళ్ళిపోయింది. ఇక డిగ్రీ పరీక్షలేమో కానీ జీవితంలో అగ్ని పరీక్ష మొదలైనట్లు అనిపించేది కరుణకి. రెండు నెలలు దాటినప్పటి నుంచి ఆ నాయనమ్మ ‘ఇంకా ముట్టైతున్నావా, నేనైతే పెళ్ళయ్యాక ఒక్కసారే బయటున్నా, నా కోడలూ అంతే. ఇంకెప్పుడు నువ్వు..’ అంటూ రొద పెట్టేది. నాలుగు నెలలు దాటిన దగ్గర నుండి అత్త కూడా మొదలుపెట్టింది. దాంతో భర్త దగ్గర బాధపడితే తనని ఓదార్చి, ‘నిన్న గాక మొన్న పెళ్ళయింది. ఏంటి మీ గోల? కనీసం సంవత్సరం వరకు పిల్లల్ని కనం’ అని అమ్మ, నానమ్మల దగ్గర తెగేసి చెప్పిన భర్త అంటే ప్రేమతో పాటు గౌరవం పదింతలయ్యింది. ఏడాది దాటింది, రెండేళ్ళు పూర్తయ్యాయి. అయిదారుసార్లు రెండేసి నెలలపాటు పీరియడ్స్‌ రాకపోతే ఏనుగెక్కినంత సంబరమయ్యేది. అంతలోనే ఉధృతంగా రక్తస్రావం అవుతూ పీరియడ్స్‌ వచ్చేసే సరికి అందరూ నీరసపడేవారు. కరుణ పరిస్థితైతే చెప్పక్కర్లేదు, శారీరకంగా, మానసికంగా అల్లాడిపోయింది. అసలు నీ ముఖాన పిల్లల్నికనే రాతుందా అని ఒకపక్క తిడుతూనే, ఆశతో ఎవరెవరో చెప్పిన పసరు మందులు తినిపించింది అత్త. ‘మొగుడితో ఎట్లుండాలో నేర్చుకో’ అంటూ పాఠాలు చెప్పేది నాయనమ్మ. గుళ్ళూ, గోపురాలూ తిప్పుకొచ్చింది అమ్మ. వీలు చిక్కినప్పుడల్లా బంధువులంతా అడగడం ఎక్కువయ్యింది.
పెళ్ళై మూడేళ్ళైనా పిల్లలు కాకపోయేసరికి అత్త, నానమ్మలతో పాటు భర్తకి కూడా బెంగ పట్టుకుంది. ఒక్కడే కొడుకు, ఇంకా పిల్లలు కాలేదు, వారసుడు కావాలంటూ మామగారు కూడా కొడుకుతో అనడం అయిదారుసార్లు వింది కరుణ. ఇంట్లో, బయటా అందరూ ఇంకో పెళ్ళి చేసుకోమని సలహాలివ్వడం ఎక్కువయ్యింది. తనకీ ఆతృత పెరిగింది.
ఒకరోజు ఆరోగ్య సర్వే కోసం ఇంటికొచ్చిన ఆశా కార్యకర్తతో తన బాధంతా చెప్పుకుంది. రెండేళ్ళ నుండి తను, భర్త వాడుతున్న చెట్లమందుల గురించి చెప్పింది. పీరియడ్స్‌ ఎలా అవుతున్నాయో వివరాలడిగి, ‘కొంతమందికి ఆలస్యం అవుతుంది, అయినా చదువుకున్నారు, పసరు మందులు, చెట్ల మందులేంటి.. ఒకసారి భర్తని తీసుకుని గైనకాలజిస్ట్‌ దగ్గరికెళ్ళు’ అంటూ సలహా ఇచ్చింది. ఆరోజు రాత్రి కరుణ పిల్లల కోసం తనెంత ఆతృత పడుతోందో, ఆశా కార్యకర్త ఏమి సలహా ఇచ్చిందో భర్తకి చెప్పి ఒకసారి పట్నంలో గైనకాలజిస్ట్‌ని కలిసొద్దాం అంది.
రెండోరోజే డాక్టర్‌ దగ్గరికి వెళ్ళారు. అప్పటిదాకా పిల్లలు పుట్టాలని వాళ్ళు చేసిన అశాస్త్రీయ పనులకి బాగా కోప్పడి. ఇద్దరికీ అన్ని పరీక్షలూచేసి, ఇద్దరిలోనూ పెద్ద సమస్యలేమీ లేవని, కాకపోతే కరుణ గర్భసంచి చాలా నాజూగ్గా ఉందని, దానివల్లే కొన్నిసార్లు గర్భం దాల్చినా నిలవలేదని, తను చెప్పినవి తూ.చ.తప్పకుండా పాటిస్తే పిల్లలు పుడతారని చెప్పింది. అన్నిటికీ సంతోషంగా ఒప్పుకుని మందులు తీసుకుని వెళ్ళారు. తర్వాత కూడా రెండుసార్లు గర్భస్రావం అయిపోయింది. దాదాపు పది నెలలు గడిచాక ఫలితం కనబడిరది. అన్నాళ్ళూ ఊరికీ, ఆసుపత్రికీ తిరుగుతూనే ఉన్నారు. ఇక తిరగకూడదని, బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాలని డాక్టరమ్మ చెప్పడంతో భార్యాభర్తలిద్దరూ పట్నంలోనే చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్నారు. సాయంగా కరుణ తల్లి వచ్చి ఉంది. నెలలు నిండకుండానే ఉమ్మనీరు పోవడంతో ఆపరేషన్‌ చేసి బిడ్డని తియ్యాల్సివచ్చింది. బిడ్డ బానే ఉన్నా కరుణ నీరసించిపోయింది.
కరుణకి తల్లి అయ్యానన్న సంతోషం కన్నా ఇంట్లో పెద్దవాళ్ళు మగపిల్లవాడు పుట్టలేదన్న అసంతృప్తితో బిడ్డని సరిగ్గా చూడకపోవడం విపరీతమైన దుఃఖాన్నిచ్చింది. బాలింతవాతం చేసి బాగా ఇబ్బంది పడిరది. చచ్చి బతికినంత పనైంది. కొడుకు కోసం ఇంకోసారి చూస్తాం అన్న కరుణ మాటకి డాక్టర్‌ తిట్టిపోసింది.
ఏడాది గడిచింది. నాయనమ్మ ఒత్తిడితో, మాతృత్వంతోనే మహిళ జీవితం సంపూర్ణం అని వినీ వినీ, అదే నమ్మి కరుణ పట్టుతో అతి ప్రయత్నం మీద ఇంకోసారి గర్భం దాల్చింది. డాక్టరమ్మ దగ్గరకి వెళ్తే ఊరుకోదని తెలుసు కాబట్టి ఈసారి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఊర్లోనే ఉండిపోయారు. చిన్నపిల్లని అమ్మమ్మ దగ్గరకు పంపేశారు. ఈసారి కూడా నెలలు నిండకుండానే ఉమ్మనీరు పోయి, బిడ్డ కదలికలు తగ్గిపోతే ఆశా కార్యకర్త 108కి ఫోన్‌ చేసి కరుణని తీసుకుని హాస్పిటల్‌కి వెళ్ళింది. దారంతా కరుణ స్పృహలో లేదు. ఒక రోజంతా గడిచాక స్పృహలోకి వచ్చింది కరుణ. కొడుకు పుట్టినందుకు పట్టలేని ఆనందంతో ఉంది. ఇంటిల్లిపాది ఆమెని అపురూపంగా చూస్తున్నారు. వారం గడిచాక డిశ్చార్జ్‌ చేసే ముందు, సమయానికి హాస్పటల్‌కి వచ్చారని, వెంటనే ఆపరేషన్‌ చేసినందువల్ల ఇద్దరి ప్రాణం నిలిచిందని కరుణతో చెప్తూనే డాక్టర్‌ ఇంకొన్ని విషయాలు కూడా చెప్పింది. చాలా రక్తం పోవడంతో కొలుకోడానికి సమయం పడుతుందని, శ్రద్ధ తీసుకోవాలని, గర్భసంచి బాగా రప్చర్‌ అయ్యిందని, ఎటువంటి ఇన్ఫెక్షన్స్‌ రాకుండా చూసుకోవాలని, లేదంటే ప్రమాదకర పరిస్థితికి దారి తీయొచ్చని చెప్తూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పింది. కొడుకుని చూసుకుంటూ, అందరి మెచ్చుకోళ్ళతో సంబరపడిపోతూ మొదటి ఏడాదిపాటు శ్రద్ధగా ఉన్నా తర్వాత తన గురించి డాక్టర్‌ చెప్పిన దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కొద్దికొద్దిగా పెరుగుతున్న పీరియడ్స్‌ ఇబ్బంది మూడేళ్ళు గడిచేసరికి సమస్యాత్మకంగా మారింది. విపరీతమైన రక్తస్రావం గడ్డలు గడ్డలుగా, కడుపు నొప్పితో కళ్ళుతిరిగి పడిపోతుండేది. అప్పుడప్పుడూ వాసనతో కూడిన తెల్లబట్ట అయ్యేది. కాళ్ళు గుంజడం, నడుము నొప్పి ఎక్కువయ్యాయి. ఇక డాక్టరమ్మని చూడక తప్పదని ఫోన్చేస్తే ఇప్పుడు ఇక్కడ లేరని, విదేశాలకి వెళ్ళిపోయారని చెప్పారు. గర్భసంచి జారిందని అనిపిస్తున్నా ఇంకో డాక్టర్‌ దగ్గరకి వెళ్ళాలంటే భయపడి ఇంకో ఆర్నెల్లు అశ్రద్ధ చేసింది. నడకకి కూడా ఇబ్బంది అవుతున్నప్పుడు మాత్రం వెళ్ళక తప్పలేదు.
ఆర్భాటంగా కట్టిన ఒక పెద్ద హాస్పిటల్‌లో గర్భసంచి ఆపరేషన్‌ చేయించి, మూడురోజులు ఉండి ఇంటికి తీసుకొచ్చారు. వచ్చి మూడు రోజులయ్యింది. వచ్చినప్పటి నుండి ఒక్కసారి కూడా మూత్రం పోలేదు. కడుపు ఉబ్బిపోయింది. మొదట్లో మందుల వల్ల వేడి చేసుంటుందని కొబ్బరి నీళ్ళు, ూRూ పట్టించారు. అయినా రాకపోవడంతో కడుపు బిగపట్టి ఉంటుందని, ఇంకేదో అని రకరకాలుగా ప్రయత్నం చేసినా ఫలితం లేకపోగా కరుణ పరిస్థితి క్షీణించడం మొదలయ్యింది. ఇంక ఆలస్యం చేయకూడదని తిరిగి హాస్పిటల్‌కి తీసుకెళ్ళారు.
అన్ని పరీక్షలు చేశాక స్కానింగ్‌ ద్వారా తెలిసింది ఏంటంటే గర్భసంచి తొలగించే క్రమంలో మూత్రనాళాన్ని కత్తిరించేశారు. దానివల్ల మూత్రం బయటికి పోక శరీరంలో కలిసిపోతోంది. కానీ ఆ విషయాన్ని చెప్పకుండా వెంటనే ఆపరేషన్‌ చేయాలని, అందుకు వేరే సర్జన్‌ని పిలిపించాలని, సమయం పట్టడంతోపాటు ఖర్చు కూడా బానే అవుతుందని చెప్పడంతో కరుణ బంధువులంతా ఆందోళనకి దిగారు. గర్భసంచి ఆపరేషన్‌ చేశాకే ఇలా అయ్యింది కనుక అప్పుడే ఏదో జరిగుంటుందని, విషయం దాచిపెడుతున్నారని, హాస్పటల్లోనే ఏదో జరిగిందని, ఇందుకు వాళ్ళే బాధ్యత వహించాలని గొడవ చేశారు. మొదట సెక్యూరిటీ గార్డులతో బయటికి నెట్టించేయాలని చూశారు. కానీ పత్రికా విలేకరులని పిలిచి లైవ్‌ వీడియోలు చేస్తున్నారని భయపడి కరుణ భర్తని, అన్నయ్యని పక్కకి పిలిచి, తప్పు తమదేనని, స్పెషలిస్ట్‌తో ఆపరేషన్‌ చేయిస్తామని, దానికయ్యే ఖర్చంతా తామే పెట్టుకుంటామని, నష్టపరిహారం కూడా ఇస్తామని బ్రతిమలాడారు.
కరుణని బ్రతికించుకోవడం ముఖ్యమని, వెంటనే ఆపరేషన్‌ చేయడానికి అందరూ ఒప్పుకోవడంతో అప్పటికప్పుడు ఇంకో హాస్పటల్‌కి అంబులెన్స్‌లో తీసుకెళ్ళి రివర్స్‌ ఆపరేషన్‌ చేయించారు ఆ హాస్పిటల్‌ వాళ్ళు. ఇలాంటిదే ఇంకో కేస్‌లో రివర్స్‌ ఆపరేషన్‌ చేసేలోపే మూత్రం శరీరంలో కలిసిపోయి ఇన్ఫెక్షనయ్యి ఆమె చనిపోయిందని ఆ హాస్పిటల్‌ ఉద్యోగి ద్వారా తెలిసింది. గర్భసంచి తొలగించే ఆపరేషన్లు విచ్చలవిడిగా చేస్తూ, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని డబ్బు సంపాదిస్తూ, స్త్రీల శరీరాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారని, ఇదీ స్త్రీల పట్ల హింసేనని, మెడికల్‌ క్రైమ్‌ అని, అటువంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా హక్కుల సంఘాలు, సంస్థలు పెద్దఎత్తున నిరసన తెలపడంతో అధికారులు కంటితుడుపుగా అప్పటికప్పుడు ఆ హాస్పటల్నిమూయించినా పరిస్థితిలో పెద్ద మార్పేమీ లేదు. కొన్ని వారాల్లోనే మళ్ళీ హాస్పటల్‌ తెరిచేశారు. ఇక అక్కడంతా మామూలే..
కానీ కరుణ జీవితంలో తేరుకోలేని దెబ్బ. తన ఆరోగ్యం మళ్ళీ మామూలుస్థితికి ఎన్నటికీ రాలేదు. ఇద్దరు పిల్లలతో, ఎన్నో రకాల శారీరక ఇబ్బందులతో, తట్టుకోలేని అలసటతో ‘మాతృత్వమా మశానమా.. అప్పుడే చచ్చిపోయున్నా బాగుండేది’ అని ఎన్నిసార్లు అనుకుని ఉంటుందో. ఈ పరిస్థితికి మూలం ఎక్కడుంది? కారణం ఎవరు? మాతృత్వాన్ని గ్లోరిఫై చేసే సమాజం.. వంశం నిలబెట్టడానికి కొడుకే వారసుడనే పితృస్వామ్య భావజాలం.. గర్భసంచి పిల్లల్ని కనడానికే అన్న అవగాహనా లోపం, సమాచార లేమి.. స్త్రీల శరీరాలను, ఆరోగ్యాన్ని కూడా డబ్బు సంపాదనా ధోరణిలో చూస్తున్న వైద్యులు.. సూపర్‌ స్పెషాలిటీల పేరన నైపుణ్యం కన్నా నంబర్ల మీదే నడుస్తున్న వైద్యరంగం.. ఇంత జరుగుతున్నా చూసీ చూడనట్టుండే పాలనా వ్యవస్థ.. వైద్యాన్ని వ్యాపారంగా మార్చిన ప్రపంచీకరణ.. అన్నీ ఇందులే భాగమే కదా! వీరందరూ ఈ హింసలో భాగస్తులే కదా!! మార్పు కోసం, మహిళల మెరుగైన జీవితాల కోసం, ఈ వ్యవస్థీకృత హింసకి వ్యతిరేకంగా, ఇక్కడ అక్కడ అని లేదు, ఎక్కడ వీలైతే అక్కడ.. ఎప్పుడు కుదిరితే అప్పుడు.. మనమంతా ఏకమై గళమెత్తాల్సిందే..

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.