‘ధిక్కార స్వరం’ – ఆర్ వెంకట్ రెడ్డి

కవిత పులి ‘అరుంధతీయం’ వ్యాసాలు ఆది నుండి అంతం వరకు సాధికారికత చుట్టూ తిరుగుతాయి. అంబేద్కర్ చెప్పిన ప్రాధమిక సూత్రమైన “సామాజిక సమానత్వం లేకుండా ప్రజాస్వామ్యం సంపూర్ణం కాదు’ అనే భావన చుట్టే ఈ వ్యాసాలు ఉంటాయి. గ్రేడె డెడ్ కాస్ట్ సొసైటీలో అది ఎంత జటిలమో తన స్వీయ అనుభవాలనే కాకుండా ప్రాపంచిక దృక్పథంతో రాసిన పుస్తకం.

సామాజిక కార్యకర్తలు తప్పక చదవాలి. కొన్ని వ్యాసాలు విధాన నిర్ణయాలపై ఎక్కు పెడితే మరి కొన్ని వ్యాసాలు అసమాన సామజిక వ్యవస్థలపై దిక్కార స్వరమే వినిపిస్తుంది. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో కొన్నిసార్లు సామాజిక ఉద్యమాలు కూడా చర్చకు తావు లేకుండా ఎలా దాట వేతకు గురి అవుతాయో చాలా బలమైన ప్రశ్నలనే లేవనెత్తినది. అంతే కాకుండా పాలనా వ్యవస్థలో ఈ అంతరాలను చూడ నిరాకరించే అధికార యంత్రాంగాన్ని పాలకులను ప్రశ్నిస్తుంది.
ఉదహరణకు పాఠశాలలో బాత్రూంలు తదితర వసతుల కల్పనలో నిర్లక్ష్యం కేవలం మౌలిక వసతుల సమస్య కాదని అది బాలికల పట్ల చూపెడుతున్న వివక్షత అని చెప్పింది. దీనిని ఎవరి దయాదాక్షిన్యాలు అవసరం లేదని ప్రభుత్వాల చట్టబద్ద బాధ్యతగా చూడాలని హెచ్చరిస్తుంది. బాలికలకు వాష్‌రూంస్ సమస్య ఆత్మగౌరవ సమస్య అని అవి కల్పించడం లేదంటే బాలికలను మహిళా టీచర్లను అగౌరపరచడమే అంటుంది. ఈ మద్య తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య అనే ఆడపిల్లల సంఘం జూనియర్ కాలేజీలో వాష్‌రూంస్‌తో పాటు అమ్మాయిలకు ప్రత్యేకంగా రెస్ట్‌రూంస్ ఉండాలని ప్రిన్సిపాల్‌కు అర్ధం చేయించి సాధించుకున్నారని తెలిసింది. కవిత పులి లాంటి వాళ్ళే వారికి ఆదర్శం. తన అనారోగ్యానికి కారణమైన పాఠశాలలో టాయిలెట్స్ లేకపోవడం అనే వివక్షతతో పాటు తన కులం తెలిసి డబుల్ వివక్షతకు గురి చేసిన సమాజం వెనుకబాటు ఆలోచనలను చర్చ చేయమంటుంది. వ్యక్తి గౌరవాన్ని కాపాడాలని మన రాజ్యాంగ పీఠికను గుర్తు చేస్తుంది.
అలాగే మొదటితరం చదువుకు కదిలిన దళిత అమ్మాయిల వివిధ రకాల వివక్షతలను ఎదురుకుంటూ విద్యా హక్కును పొందదానికి వారు చేస్తున్న తిరుగుబాట్లను తాను విద్యార్థిగా అలాగే టీచర్‌గా పూస గుచ్చినట్లు వివరించి విద్యా వ్యవస్థకు ఒక పెద్ద సవాలే విసిరింది. విద్యలో అసమాన అవకాశాలను కల్పించి సమానమైన పోటీ పెడుతున్న తీరును ప్రశ్నించింది. కవిత లేవనెత్తిన ప్రశ్నలు అతిముఖ్యమైనవి. విధానపరమైనవి కూడా. ఒక వ్యాసములో ప్రభుత్వానికి దళితుల పట్ల ఎలా పనిచేయాలో ఒక విధాన పత్రాన్నే రూపొందించినది.
‘పులి కవిత గ్రాండ్ డాటర్ ఆఫ్ పులి భాగయ్య’ అనే వ్యాసం తన తాత భాగయ్య తన దండే కడాలు అమ్మి కవితకు కొనిచ్చిన సైకల్ కవిత విద్యా చరిత్రనే మార్చిన ఘటన చాలా ఆసక్తికరంగా సాగింది. ‘తొడ హాట్ కె సొచొ అన్నట్లు’ ఒక తరాన్ని ముందుకు నడపాలన్న భాగయ్య తాత కవిత లాయరమ్మ కావాలన్న ఆశతో సైకిల్ కథ అద్భుతం. ఆ రోజుల్లో దళిత వాడల నుండి కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు చాలా అరుదని తాను సైకిలెక్కి బాటెంట తరతరాల వెనుకబాటును వెనకకు నెట్టి ముందుకు సాగిన తీరు అద్భుతం. కవితకు అండగా నిలిచి ముందుతరాలకు బాటలు వేసిన మట్టి మనుషులు భాగయ్యలను గుర్తించే సమాజం ఎప్పుడు వస్తుందో. ఇటీవల కన్నుమూసిన ‘మై ఫాదర్ బాలయ్య’ పుస్తక రచయిత ప్రొఫెసర్ వై .బి.సత్యనారాయణ గారు మరోసారి గుర్తుకు వచ్చారు.
‘పనికెళ్లిన బాల్యం’ సినిమా గురుచి రాస్తూ తన బాల్యంలో పడ్డ కష్టాలన్నీ వెల్లబొసింది. బాలకార్మికులు అనే నిర్వచనం ఇచ్చి ప్రమాదకర పని అంటే ఏమిటి ప్రమాదం కానీ పనులు అని కూడా శాసనాలు చేసిన దేశం మనది. పిల్లల దృక్పథం నుండి చూస్తే దళిత బలహీన వర్గాల పిల్లలు చేసే ఏ పని అయినా ప్రమాదకరమే అనే ఆలోచనను రేకెత్తించారు. ఆడపిల్లల బాల్యం అయితే ఇంకా ఎంత ఛిద్రం అవుతుందో తన బాల్యం అనుభవించిన విషయాన్ని కళ్ళకు కట్టినట్లు రాశారు. అంతే కాదు తాను టీచర్‌గా బడికి వస్తున్న బాలలు పడుతున్న కష్టాలను తలచుకుని దుఖంతో తన జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం బాలల పట్ల పనిచేసే ఎవరికైనా తన బాధ అర్ధం అవుతుంది.
మొత్తంగా కవిత వ్యాసాలు. బయటకు కనిపించని వివక్షతలను సూక్ష్మంగా గమనించాలని గుర్తు చేస్తుంది. సేవాభావంతో అయ్యో పాపం అని ఆలోచించే అవసరం లేదని పౌరులందరికీ దక్కని హక్కుగానే చూడలంటున్నది పరిరక్షించే బాధ్యత ప్రభుత్వాలదని గట్టిగానే చెప్పింది. సమాజంలో సామాజిక సమానత కోసం ఆలోచించే వాళ్ళు వివక్షతలను చాలా పొరలు పోరాలను అర్ధం చేసుకోని సోయితో పనిచేయాలని చెప్పినట్లు అనిపించింది. చివరగా కవిత పులి తన మాటలో రాసిన చిన్న పారాగ్రాఫ్‌ను చదివితే కవిత భావం అర్ధం అవుతుంది. ‘తన రచన ఉద్దేశ్యం బాధను రికార్డు చేయడానికి కాదని బాధలను సృష్టించే వ్యవస్థలను గుర్తించి సహాజమైనవిగా కనిపించే అసమాంతల వెనుక ఉన్న అధికార సంభందాలను తేటతెల్లం చేయడానికి అని, ప్రశ్నించే చైతన్యాన్ని పెంచడం తన లక్ష్యమని అలాగే దళిత మహిళను కేవలం అణిచివేతకు గురవుతున్న వ్యక్తిగా కాకుండా ఆలోచించే, విశ్లేచించే, ప్రతిఘటించే, ప్రత్యామ్నయ రాజకీయాలను నిర్మించగల జ్ఞానకర్తగా చూడాలని అదే ‘అరుంధతీయం లక్ష్యం అని’ చెప్తుంది. అద్భుతం. కవిత ఆరోగ్యంగా ఉండి మరిన్ని వ్యాసాలు రాయాలని కోరుకుంటూ. ఇంత మంచి పుస్తకాన్ని అందించిన పర్పుల్ వరండా ప్రచురణ కర్తలకు దాసరి శిరీష జ్ఞాపికను అంద చేసిన నిర్వాహకులకు ధన్యవాదములు.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

అ
a
ఆ
aa
ఇ
i
ఈ
ee
ఉ
u
ఊ
oo
ఋ
R
ౠ
Ru
ఌ
~l
ౡ
~lu
ఎ
e
ఏ
E
ఐ
ai
ఒ
o
ఓ
O
ఔ
au
అం
M
అః
@H
అఁ
@M
உ
@2
క
k
ఖ
kh
గ
g
ఘ
gh
ఙ
~m
చ
ch
ఛ
Ch
జ
j
ఝ
jh
ఞ
~n
ట
T
ఠ
Th
డ
D
ఢ
Dh
ణ
N
త
t
థ
th
ద
d
ధ
dh
న
n
ప
p
ఫ
ph
బ
b
భ
bh
మ
m
య
y
ర
r
ల
l
వ
v
 
శ
S
ష
sh
స
s
    హ
h
ళ
L
క్ష
ksh
ఱ
~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.