ఆమె 16-2-1929 న కర్ణాటకలోని హోస్‌పేటలో జన్మించారు. 1945లో డా|| మర్ల కాశీ విశ్వనాధం గారితో వివాహం జరిగింది. డా|| విశ్వనాథం గారు ట్రేడ్ యూనియన్ నాయకులు మరియు కమ్యూనిస్టు కార్యకర్త, రాష్ట్ర మహిళా సంఘ నాయకురాలిగా కాకినాడ పట్టణ కమ్యూనిస్టు నాయకురాలిగా, సంఘసంస్కర్తగా ఆమె దాదాపు 65 సంవత్సరాలుగా పార్టీకి సేవచేశారు. ఆమెకు వసంతకుమారి, విజయకుమార్, అరుణకుమారి, నయన కుమారి, సోమసుందర్, అను ఐదుగురు సంతానం. 2010 ఫిబ్రవరి నుండి సి.ఆర్.ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో చేరారు. నీలం రాజశేఖరరెడ్డి పరిశోధన కేంద్రం కన్వీనర్ శ్రీ యమ్. విజయకుమార్, ఢిల్లీలో సైంటిస్టుగా ఉన్న ప్రొ|| సోమసుందర్ వీరి బాటలో సమాజానికి సేవలందిస్తున్నారు. ఆమె రాసిన అనేక వ్యాసాలు రచనలు కొన్ని కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. అనారోగ్యం కారణంగా 4-12-2012 ఉదయం 2.50 ని|| 83వ ఏట ఆమె స్వర్గస్తులయ్యారు. కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా|| కె. నారాయణ గారు, రాష్ట్ర కోశాధికారి రామచంద్రరావు గారు, సి.ఆర్.ఫౌండేషన్ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి గారు, సి.ఆర్. ఫౌండేషన్ వృద్ధాశ్రమం మేనేజర్స్ డా|| సరస్వతి గారు, సరళాగారు, ఎన్.ఆర్.ఆర్. సెంటర్ డైరెక్టర్ డా|| లక్ష్మీనారాయణ గారు, కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు పశ్య పద్మ, ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి గారు, శ్రామిక మహిళా నాయకురాలు ప్రేమ్ పావని మొదలైనవారు ఆమెకు నివాళులర్పించారు. – సి.ఆర్.ఫౌండేషన్, కొండాపూర్
-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
