యువతీ నీ అడుగులు
అభివృద్ధివైపు మలుపు
చదువులో రాణించు
ఉన్నత శిఖరాలను అధిరోహించు
ప్రేమ ఉచ్చులో చిక్కుకోకు
ఆశయాలను దారి మళ్లించకు
దొంగచాటు చరవాణి
దోబుచులాట మానుకోన
కాలేజికి బంకు కొట్టి
గార్డెన్లల్ల విహరించకు
సినిమాహాల్లో షికారు చేయకు
మోసపు కాముకుల.కానుకలకు లొంగకు
నయవంచకుల ఒత్తిల్లకు కుంగకు
కష్టాల్ని కొని తెచ్చుకొని
అంతర్మధనంకు లోనుగాకు
ఆత్మత్యాగం చేసుకోకు
మానవ వనరులు మట్టుపెట్టకు
మంచి చెడుల సంగతులు
చెప్పుకో ప్రాణ దాతలకు