ఆ అమ్మాయి గాథ,
మనసు చలించే కథ,
చిరునవ్వుని మింగేసిన ఆ క్షణం,
తల్లిదండ్రుల శోకానికి కారణం.
జ్ఞానాన్ని పంచే గురువే
అన్యాయంగా జీవితాన్ని చిదిమేస్తే
ఏనాటికి న్యాయదేవత
కళ్ళు తెరవబడతాయి!
అమానుష దారుణాలకు అడ్డుకట్ట వేద్దాం!
ఎందరో ప్రాణాలను కాపాడుదాం!
ఆలోచించండి! ప్రశ్నించండి! మీలోని మానవత్వాన్ని చాటండి!