ఆమెకి
అన్ని రాత్రి స్పర్శలు
ఒకేలా అనిపించవు
స్పృశించేది తనవాడే
అయినా
ఏదో అయిష్టత
అట్లనీ
ఆమేమీ ముట్టుకుంటే
ముడుచుకుపోయే
అత్తిపత్తి ఆకు కాదు
కానీ,
భావాల్ని పంచుకున్నట్లే
భావప్రాప్తుల్ని పంచుకోవాలనుకుంటుంది
తన స్వేచ్ఛలో
రాతిరి స్వేచ్ఛా భాగమంటుంది
పగలంతా ‘మన’దయిన ఇష్టం
రాత్రి ‘నీ’దవ్వడం ఏంటని
పడక దిగి
”Lust is part of love, bu It should n’t vanish the love between us’ అని
సహజ సూత్రాన్ని గోడపై రాసింది.
అతడు గదిలోకి రాగానే ఒక నవ్వు
ఆ రాతను చూసి
రాసిన తనను చూసి
ఆమె అంతే
అతడిలో మార్పుని చూసి…