”మాకూ మనసుంది” – గొల్లపెల్లి రాంకిషన్‌ (రాఖీ)

సాటి ఎక్స్‌ క్రోమోజోమ్‌తో

నన్ను కలపకు ప్రభూ… తన ప్రార్థన

అరణ్యరోదనగా – ”ఎక్స్‌ క్రోమోజోమ్‌”

ఆ పిండం ఆడపిల్లే అన్న నిజాన్ని

దాచలేని అసహాయురాలు…

గుడ్లనీరు కుక్కుకుంటూ…

”అల్ట్రా సౌండ్‌ మిషన్‌”

తాను మోసుకొచ్చే వాస్తవం

ఆ దంపతులకు

ఆనందం చేకూరుస్తుందో లేదోనని

ఆతృతపడుతూ చెవిలో దూరింది – ”వార్త”

బయటికి సంతోషం

లోపల ఆదుర్దాతో

చిత్రంగా ప్రకటితమైంది

ఆ తండ్రి ”ఎక్స్‌ప్రెషన్‌”

ఎవరైతేనేం పుట్టింది,

పోనీలే పాపం

తల్లికి గండం గడిచింది అంటూ

చూడవచ్చిన ప్రతివాళ్ళ సానుభూతితో

పుట్టిన ఆ పాప నోటిపై వికసించింది ”బోసినవ్వు”

ముందు పుట్టినా వెనక పుట్టినా

సోదరుడివల్ల వెలికి వచ్చి

నిన్ను జీవితాంతం వీడనంటూ

ఆడపిల్లకు తొలి నెచ్చెలి ”వివక్ష”

విధికి ఎంతగా ఎదురీది

ఆకాశంలో సగమంటూ

ఎన్ని రంగాల్లో ఎదుగుతున్నా,

ఎంతగా రాణిస్తున్నా

ఎదురు దెబ్బలు తింటూనే ఉంది

ప్రకృతి సిద్ధమైన ”ఆడతనం”

సాటివాళ్ళూ శత్రువులై అసూయతో చేసే

అప్రకటిత యుద్ధంతో మ్రాన్పడిపోయింది ”స్త్రీత్వం”

జెండా పండగ జరుపుకున్నప్పుడల్లా దేశానికి తప్ప

మనుషులకు, అందునా మానవతులకు

తను గగన కుసుమమేగా

అంటూ వగచింది ”స్వాతంత్య్రం”

ఇరు మనసుల కలయికలో

చిరకాలం బ్రతుకు పంచుకోవడానికి

వింత ఆచారాలు, కట్టుబాట్లతో

చెమటోడ్చి ఒక్కో రూపాయి పోగుచేసి

దాచుకున్న సంపదనంతా

ఊడ్చుకుపోయే దోపిడీదారుగా

రూపాంతరం చెందింది ”పెళ్ళి”

ఇంటిపేరు మారనీకు

కంటనీరు కారనీకు…

అందం, శీలం, విద్య, బలం

ఇలా నీకున్న ప్రతి సొత్తు ఒక విపత్తు…

పురుషుడి కోసం, పురుషుడి చేత, పురుషుడికి…

అంకితమయ్యే

ఓ మానినీ…

అమ్మగా, ఆలిగా, సోదరిగా, సోపతిగా

ఎంతటి ఔదార్యం చూపినా

ఇంటా బయటా అనుమానాలు

ఊరూ వాడా అవమానాలు

ఇవేగా నీకు బహుమానాలు

ఇకనైనా తెలుసుకో

ఇలనికపై ఏలుకో

అంటూ మేలుకొలిపింది

”కవనం”!!!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.