హేమలత గారు నిగర్వి. అందుకే నాకు చాలా నచ్చారు. బొమ్మూరు యూనివర్శిటీలో మా పరిచయం. నా బయోడేటా చూసి సుధాకర్ సార్, నేను ఎంతో మురిసిపోయామని చెప్పారు. ఆ తర్వాత నర్సాపూర్ ప్రరవే మీటింగ్లో కలిశాం. అప్పటినుంచి మాట్లాడుకుంటూనే… విహంగలో రాయించేవారు. ఆమె సంకలనంలో నాకు స్థానం కల్పించారు.
మొన్న ప్రరవే వైజాగ్ సభలో శాంతిమూర్తిలా ఎంత బాగున్నారో!
మనందరికీ వెళ్తున్నానని సందేశం ఇచ్చారేమో!
మనకే అర్థం కాలేదేమో?
ఆవిడ ఇక లేరన్న వార్త వినగానే ఒక్క నిమిషం గుండె ఆగినట్లయింది. తన జంటను కోల్పోయిన సర్కి ఆ భగవంతుడే శక్తినివ్వాలి. మాటలు రావడం లేదు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి.
పుట్ల హేమలత గారు మాలాంటి ఎందరో రచయిత్రులను వారి విహంగ పత్రిక ద్వారా ప్రోత్సహించారు. మీరు భౌతికంగా లేకపోయినా మా అక్షరాల్లో ఎప్పుడూ కొలువై ఉంటారు…