నువ్వు లేని ఈ పెళ్ళి రోజు
పీడ కలలా ఉంది
తలచుకుంటేనే దుఃఖం
తుఫానులా తరుముకొస్తూనే ఉంది
నీ ప్రతి జ్ఞాపకం
నీడలా వెంటాడుతూనే ఉంది
నువ్వు మేలిముసుగులోంచి
మెరుపు కళ్ళతో చూస్తుంటే
నీ మెడలో మూడు ముళ్ళు వేస్తున్నట్టే ఉంది
దేహం దూరమైనా
దీపంలా నీ రూపం
ఆరకుండా వెలుగుతూనే ఉంది
తొలి రేయి
మన తొలి పలుకులన్నీ
మొలకలై నా మనసు పాదులో
పచ్చగా మొలుస్తున్నట్టే ఉంది
అర్థరాత్రి ఆరు బయట
నా కోసం
నువ్వు గొంతెత్తి పిలుస్తున్నట్టే ఉంది
హఠాత్తుగా నిద్రలేస్తానా
పడకగదిలో నువ్వు పడుకున్నట్టే ఉంది
తెల్లవారు జామున కళ్ళు తెరుస్తానా
పక్కలో చుక్కలా కదులుతున్నట్టే ఉంది
ఈ విహ్వల వియోగ వేళ