స్రీ శక్తి స్వరూపిణి
స్త్రీ ఒక శక్తి స్వరూపం
తల్లిగా ప్రాణం పోస్తుంది
చెల్లిగా చేరదీస్తుంది
అక్కగా ఆదరిస్తుంది
భార్యగా ప్రోత్సహిస్తుంది
కూతురిగా కలల పంట అవుతుంది
నానమ్మగా దారి చూపుతుంది
స్త్రీ కొవ్వొత్తిలా కరుగుతూ
అందరికీ వెలుగు పంచుతుంది
ఆలోచనలలో ఆత్మస్థైర్యాన్ని నింపుకొని
కుటుంబాన్ని తెలివిగా సాకుతుంది
ఆమె ఆత్మబలం అపారం
ఆమె ఒక గొప్ప సైన్యం
స్త్రీ లేకపోతే జన్మ లేదు
స్త్రీ లేకపోతే సృష్టేలేదు
మహిళలను గౌరవిద్దాం, అభివృద్ధి పథం పడదాం
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు