సృష్టికి ప్రతి సృష్టినిచ్చి…
సమాజానికి మార్గ నిర్దేశనం చేసే…
ఓ మహిళా నీకు వందనం…
సంసార సాగరంలో నీకు నీవే సాటిగా…
ఓర్పుకు, నేర్పుకు, ఓదార్పునకు…
అమ్మగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా…
ఆత్మీయతతో అనురాగాన్ని పెంచే…
అమృతమూర్తి నీకు వందనం…
మారుతున్న మర మనుషుల కాలంలో…
మానవత్వం మంటగలుస్తున్న రోజుల్లో…
దినదిన గండాల దాష్టీకాల నడుమ…
మారాలి నీ నడక… ఎప్పుడూ తడబడక…
కావాలి నీవు మరో రుద్రమవి…
అసురుల పాలిట అపర కాళికవి…