-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
మార్పు కోసం మంచి సినిమా – గిరిజ పైడిమర్రి
సమాజం మీద ప్రగాఢమైన ప్రభావం చూపగలిగిన మాధ్యమాలలో సినిమా అత్యంత ప్రధానమైంది. సినిమారంగం వ్యాపార ధోరణితో వెర్రితలలు వేస్తున్న సమయం. తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలతో కాశ్మీర్ ఫైల్స్, కేరళాస్టోరీ లాంటి సినిమాలు కూడా వస్తున్నాయి.
Posted in సినిమా సమీక్ష
Leave a comment
బస్తీలలో ఎగిసిపడిన చైతన్యం – భూమిక టీం
మూడు దశాబ్దాలుగా భూమిక ఉమెన్స్ కలెక్టివ్ జెండర్ ఆధారిత హింసపై మన తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తుందని మన అందరికి తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం హైద్రాబాదులో, అభివృద్ధిలో కొంచెం వెనకబడ్డ 10 బస్తీలలో స్త్రీలు, పురుషులు, కిశోర బాలబాలికలు మరియు యువతతో ఆడ వారి పట్ల, ట్రాన్స్ మహిళల పట్ల హింసకి వ్యతిరేకంగా భూమిక … Continue reading
Posted in రిపోర్టులు
Leave a comment
హైదరాబాదు విమెన్ రైటర్స్ ఫోరం తొలి సమావేశం – భండారు విజయ
భారతీయ పితృస్వామిక సమాజంలో ప్రాచీనకాలం నుండి స్త్రీలను తల్లులుగా, దేవతలుగా ఒకవైపు పూజిస్తున్నారని చెబుతూనే మరోవైపు వారిని రెండవస్థాయి పౌరులుగా 19వ శతాబ్దం దిగజార్చేసింది. అదే 20, 21వ శతాబ్దం వచ్చేసరికి ప్రపంచీకరణ నేపధ్యంలో పెట్టుబదీదారి వ్యవస్థ, స్త్రీలను అంగడి సరుకులుగా, ఆట బొమ్మలుగా మార్చివేస్తూ, వారి వ్యక్తిత్వాలను ఒకవైపు హననం చేసింది.
Posted in రిపోర్టులు
Leave a comment
పిల్లల భూమిక
Posted in పిల్లల భూమిక
Leave a comment
యాంత్రికతని మనమే సృష్టించుకుంటాం – కొండవీటి సత్యవతి
పర్ఫెక్ట్ డేస్ సినిమా పేరు. ఇది జపనీస్ చిత్రం. విన్ వెండర్స్ దర్శకుడు. హిరయామా అనే ఒక టాయ్లెట్ క్లీనర్ కధ. కోజి యకుషో అనే నటుడు టాయ్లెట్లు శుభ్రం చేసే పాత్రలో అద్బుతంగా నటించాడు. టాయ్లెట్ శుభ్రం చేసే మనిషిని కథానాయకుడుగా పెట్టి విన్ వెండర్స్ ఓ కళాత్మక చిత్రం తీసాడు. కళాత్మక చిత్రం … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
వర్షాకాలం! – ఆపర్ణ తోట
కాలమ్ రాయాలి! రాద్దామని కూర్చుంటే అన్ని పెద్ద పెద్ద ఆలోచనలు. ఏం రాయాలా అని ఆలోచిస్తూ స్నేహితురాళ్ళ గుంపులో (అదేనండి వాట్సాప్ గ్రూపులో) సలహాలు అడిగాను. వర్షం గురించి రాయమని రెస్పాన్స్. మొదలు పెట్టేశా. మిగిలిన వారు మాట్లాడేలోగా లాప్టాప్ కీబోర్డ్ మీద నా వేళ్ళు చకచకలాడాయి.
Posted in బోగన్ విల్లా
Leave a comment
వ్యాయామంతో ప్రయోజనాలెన్నో .. – వి.శాంతి ప్రబోధ
‘‘గిట్టయితే మా బతుకులేంగాను, మేమెట్ల బతకాలమ్మ’’ బాధ వెళ్లగక్కుకుంటూ వచ్చింది యాదమ్మ. ఏమైందన్న మా అత్తగారి ప్రశ్నకు జవాబుగా ‘‘ఆ ఉమా మేడం ఒకటో తారీకెల్లి పని బంద్ పెట్టమన్నది. కొలువు దిగిపో యింది కద. పనంతా ఆమెనే చేసుకుం టదట’’ దీనంగా చెప్పింది యాదమ్మ.
Posted in కిటికీ
Leave a comment
అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి
మా తల్లిదండ్రులు మృదు స్వభావులు. వాళ్లెన్నడూ మాపై చెయ్యెత్తింది లేదు, పల్లెత్తు మాటన్నది లేదు. ఇతరుల పట్ల.. ఇరుగుపొరుగు కావొచ్చు, ఇతర కులాలకు చెందిన పనివారు కావొచ్చు.. ఎవరి పట్లా వాళ్లు తెలిసి నిర్దయగా ప్రవర్తించింది లేదు. అయితే బ్రాహ్మణులుగా తాము ఇతరులందరికంటే అధికులమన్న భావన మాత్రం వారిలో ఉండేది.
Posted in జీవితానుభవాలు
Leave a comment
చీడ – గొరుసు
నా పేరు సంపంగి. ఎనిమిదేళ్ళ క్రితం సింహాచలం నుండి తీసుకొచ్చి ఇక్కడ నాటారు. అడుగు ఎత్తులో మొక్కగా ఉండేదాన్ని. పదహారడుగుల మానుగా పెరిగాను. ఇప్పుడు నా పూలని కోయాలంటే వంకీ కత్తి కట్టిన పెద్ద వెదురుబొంగు అవసరం మీకు. అదే నా చిట్టి తల్లి వచ్చి, నా కింద నిల్చుని దోసిలి పట్టిందంటే జలజలమని పూలవర్షం … Continue reading
Posted in కధలు
Leave a comment
ఆధునికుల మన్ననలందిన నవల ‘‘సిద్ధార్థ’’ – డా. రాయదుర్గం విజయలక్ష్మి
సమాజ దుఃఖ నివారణ మార్గాన్వేషకునిగా ఇల్లు వదలిన గౌతమ సిద్ధార్థుడు, ఆరేళ్ళ అన్వేషణానంతరం, జ్ఞానోదయాన్ని పొంది, బుద్ధుడయ్యాడు. తాను తెలుసుకున్న సత్యాన్ని, బోధనల ద్వారా మాత్రమే గాక, ఆచరణ ద్వారా కూడా ప్రజలకు అందించాడు. అందుకే బౌద్ధం అంటే మానవులను కరుణార్ద్రచిత్తులుగా తీర్చి దిద్దగలిగిన ధర్మంగా గుర్తింపును పొందింది. నాది, మాది అన్న మాటలను మనది … Continue reading
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
కొండవీటి సత్యవతి కథలు – వైవాహిక జీవితం – ఆవుల రేణుక
కుటుంబ వ్యవస్థకు పునాది వివాహం. పెళ్లి తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని, అన్ని విషయాలలో ఇరువురు సహకరించుకుంటే ఆ బంధం బాగుంటుంది. పితృస్వామ్య భావజాలంతో భార్యను బానిసగా చూడటం, అధికారం చెలాయించడం, ప్రతిక్షణం అణిచివేయడం సర్వ సాధారణమైంది.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
బ్రతుకు కేన్వాస్‌పై కవయిత్రి అంతరంగ ఆవిష్కరణ! ‘కాలం కేన్వాస్ మీద’ ` అనిశెట్టి రజిత కవిత్వం- సింగరాజు రమాదేవి
1984లో గులాబీలు జ్వలిస్తున్నాయి అనే కవిత్వ సంపుటితో మొదలైన అనిశెట్టి రజిత సాహితీ ప్రయాణం ఆరు కవితా సంపుటాలు, అనేక దీర్ఘ కవితలు, హైకూలు, నానీలు, వందలకొలదీ సాహిత్య సామాజిక వ్యాసాల రచనలతో పాటు, అనేక గ్రంథాలకు సంపాదకత్వంతో నేటి వరకూ కొనసాగుతూనే
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
మహాయాన బౌద్ధ మతంలో మహిళల స్థానం – ఒక విశ్లేషణాత్మక అధ్యయనం డాక్టర్ చింతల వెంకట శివసాయి
వ్యాస సంగ్రహము: స్త్రీల పట్ల వివక్ష అనేది ప్రపంచంలో సర్వసాధారణ విషయం. కొన్ని మతాలలో ఆత్మ కేవలం పురుషులలో మాత్రమే ఉంటుందని, స్త్రీలలో ఉండదని భావన. కానీ, గౌతమ బుద్ధుడు తన భిక్కూని సంఘం ద్వారా మొట్టమొదటి ఆధ్యాత్మిక రంగంలో మరియు
Posted in వ్యాసాలు
Leave a comment
