-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Category Archives: సంపాదకీయం
మీడియా దృష్టిలో మహిళా సాధికారత అంటే…
ప్రతిరోజూ ఏదో ఒక చానెల్ నుండి పిలుపొస్తుంది. వస్తామని చెప్పగానే ఎక్కించుకు పోవడానికి వాహనమొస్తుంది. అతి మర్యాదగా తోడ్కొని తీసుకెళ్ళి స్టూడియోలో కూర్చోబెడతారు. లైట్లు వెలుగుతాయ్.
Posted in సంపాదకీయం
Leave a comment
దశాబ్దంన్నర ఎదురు చూసాక ఎట్టకేలకు ఫిబ్రవరి 26న పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక బిల్లు 2012, రాజ్యసభలో కూడా ఆమోదం పొంది చట్టరూపం దాల్చింది.
Posted in సంపాదకీయం
Leave a comment
పోరాటరూపాలకు పదును పెట్టాల్సిందే!!
మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినం ను మళ్ళొకసారి తలుచుకునే సమయం వచ్చింది. మహిళా పోరాట దినంగా అన్ని దేశాల స్త్రీలు జరుపుకునే ఈ దినం గొప్ప స్ఫూర్తిని మహిళోద్యమానికి అందించింది. వందేళ్ళకుపైగా ఈ స్ఫూర్తి కొనసాగుతూనే వుంది. హక్కులకై ఉద్యమిస్తున్న స్త్రీలు పోరాట దినంగా చూస్తే, ప్రభుత్వాలు మార్చి ఎనిమిదిని పండగలా మార్చాయి.
Posted in సంపాదకీయం
Leave a comment
నిర్భయ వెలిగించిన జ్యోతి ఆరిపోకూడదు
ఢిల్లీ గ్యాంగ్‌రేప్, బాధితురాలి మరణం కలిగించిన గాయం నుండి దేశ మహిళలు ఇపుడిపుడే కోలుకొంటున్నారు. ఆ దారుణ సంఘటన కలిగించిన షాక్‌లోనే ఇంకా చాలామందిమి వున్నాం. అయితే ఆ షాక్ నుండి తేరుకోవడానికి ప్రభుత్వం చేసిన చర్యల కన్నా యువత స్పందించిన తీరు ఎక్కువ దోహదం చేసిందనేది వాస్తవం.
Posted in సంపాదకీయం
Leave a comment
పదహారు రోజులు కాదు… మూడొందల అరవై ఐదు రోజుల ఉద్యమం కావాలిప్పుడు
నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు స్త్రీలపరంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు జరుగుతాయి. చాలా సంవత్సరాలుగా ఇవి జరుగుతున్నాయి. స్త్రీల మీద అమలవుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబరు 25ని ‘వయొలెన్స్ అగెన్స్ట్ విమెన్స్ డే’ అంటూ మొదలుపెట్టి అంతర్జాతీయ మానవహక్కుల దినం డిసెంబరు 10తో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి.
Posted in సంపాదకీయం
Leave a comment
లాడ్లీ అవార్డుల నిర్వహణలో – నా అనుభవం
2008 నుండి నేను లాడ్లీి మీడియా అవార్డుల కార్యక్రమంతో దగ్గరగా పనిచేస్తున్నాను. ఆ సంవత్సరం బొంబాయి నుండి వచ్చిన పాప్యులేషన్ ఫస్ట్ డైరక్టర్ శారద హోటల్ తాజ్‌కృష్ణలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లాడ్లీ మీడియా అవార్డుల గురించి ప్రకటించింది.
గురజాడ కలగన్న అత్యాధునిక మహిళ ‘నాంచారమ్మ’
ఆధునిక మహిళ చరిత్రను తిరగ రాస్తుందని ఢంకా బజాయించి చెప్పిన గురజాడ జీవితం 54 సంవత్సరాలకే ముగిసిపోవడం తెలుగు సాహిత్యానికి సంబంధించి అత్యంత విషాదమైన అంశం.
Posted in సంపాదకీయం
Leave a comment
అభ్యుదయకరమైన ఆలోచనలకు గవాక్షం
(ఇటీవల మరణించిన సత్తిరాజు రాజ్యలక్ష్మిగారికి భూమిక నివాళి) సత్తిరాజు రాజ్యలక్ష్మి గారి నుండి ఫోన్ వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా వుంటుంది. ఎందుకంటే ఆవిడ చాలా కాలంగా భూమిక అభిమానిగా ఎంతో సహకారమందిస్తున్నారు. కథలపోటీకి ప్రథమ విరాళం ఆవిడ నుండే.
Posted in సంపాదకీయం
Leave a comment
అంటరాని పాట
డియర్ మున్నీ, బాగున్నావా? నువ్వెప్పుడూ ‘నీ గొంతుకు దండమే..నిన్ను చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. ఎన్ని బాధలున్నా నీఒళ్ళో పడుకొని నీ పాటవింటే చాలు బాధలు మర్చిపోయి బ్రతికే అదృష్టం ఎవరికుందో ”అంటూ వుండేదానివి. నా పాటలు విని ఎంతమంది వెర్రివాళ్ళు నా వెంట పడ్డారు! నన్ను పెళ్ళి చేసుకుంటానని ఎన్నెన్ని అప్లికేషన్లు! అన్నీ తిరస్కరించానే.
Posted in సంపాదకీయం
Leave a comment
పిల్లల ప్రథమ సంరక్షకురాలు తల్లి
పదోతరగతి అప్లికేషన్లో మొన్న మొన్నటి వరకు తండ్రిపేరు తప్ప తల్లి పేరు వుండేదికాదు. చిత్రంగా పిల్లలు పట్టుపట్టి తల్లిపేరు చేర్పించుకున్నారు. తండ్రి పేరుతో పాటు, తల్లిపేరును అప్లికేషన్లో చేర్చారు. పిల్లలకున్న ఈ జెండర్ సెన్సిటివిటి ప్రభుత్వానికి వుండివుంటే ప్రతి దరఖాస్తులోను ఇది ప్రతిబింబించి వుండేది.
కొస్టల్ కారిడార్ మింగేసిన రమణ చెల్లెలు
ప్రస్తుతం మీడియాలో హోరెత్తుతున్న కొన్ని కంపెనీల పేర్లు, వాటి నిర్వాకాలు చదువుతుంటే నాలుగేళ్ళ క్రితం జరిగిన కొన్ని సంఘటనలు నా కళ్ళ ముందు కనబడుతున్నాయి.
Posted in సంపాదకీయం
8 Comments
అగ్నిపుత్రి
టెెస్సి థామస్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఖండాంతర క్షిపణి అగ్ని ఖీ ప్రయోగం విజయవంతమవుతూనే అప్పటివరకు ఎవరికీ తెలియని టెస్సి అమాంతం మీడియాలో ప్రముఖవ్యక్తిగా మారిపోయారు.
Posted in సంపాదకీయం
3 Comments
తెలంగాణ గురించి
మొత్తానికి తెలంగాణ ప్రత్యేక సంచికను ఆలస్యంగానైనా మీ చేతుల్లో వుంచగలిగినందుకు మాకు సంతోషంగానే ఉంది. వివిధ అంశాల మీద ఒక సంవత్సరం పాటు ప్రత్యేక సంచికలు తీసుకు రావాలని భూమిక సంపాదకవర్గం నిర్ణయించింది.
Posted in సంపాదకీయం
Leave a comment
మెదడును మేల్కొలిపే కథల శిల్పి పి.సత్యవతి
”మీ కథ ‘ఇల్లలకగానే’ భలే వుందండి. చాలా అద్భుతమైన కథ రాసారండి”. ఈ ప్రశంసని అప్పనంగా చాలాసార్లు కొట్టిసాన్నేను. ఎన్నో సమావేశాల్లో పి. సత్యవతికి, కె. సత్యవతికి తేడా తెలియని వ్యక్తుల నుండి ఈ కామెంట్ విన్నాను.
Posted in సంపాదకీయం
4 Comments
ఫీనిక్స్ పక్షిలా, పడిలేచిన కెరటం – ఇందిరా గోస్వామి
2002 మార్చి నెలలో ఇందిరా గోస్వామి హైదరాబాదు వచ్చారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జరిగిన జాతీయ స్థాయి రచయిత్రుల మహాసభల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఇందిర
ఉత్తరం ఉత్త కాయితమేనా???
ఈ మధ్య ‘హిందూ’, న్యూస్ పేపర్లో ప్రతీ ఆదివారం ప్రచురించే ‘ఒపెన్‌పేజీ’లో ఉత్తరాల మీద చాలా అర్థవంతమైన చర్చ జరిగింది.