హాస పారిజాతం – ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ

ఆడపిల్లల్ని నవ్వ నివ్వండి
పారిజాత సుమాల్ని రాలనివ్వండి
ఏ హాస్యోక్తికి పులకరింపో అది

ఏ మధుర జ్ఞాపకాల చిలకరింపో ..
ఏదైనా కావచ్చు
వాళ్ళు కడుపు నిండా నవ్వుతున్నారు
కళ్ళ నిండా తడిసి
బుగ్గల నిండా కురిసి
విచ్చిన పెదవుల్తో
నవ్వుల నదులవుతున్నారు
ఆ నవ్వులు సరిహద్దులు లేవు
సంకోచాలు అసలే లేవు
ఆంక్షలు
అనకట్టలేం ఆగుతాయి?
ఆ పసికొమ్మల్ని డిస్టర్బ్‌ చెయ్యకండి
వెలుతుర్ల పక్కన నీడలు పరచకండి
శతాబ్దాలుగా నిషేధించబడిన నవ్వు
ఇప్పుడు రేకులు విప్పిన పువ్వు
పురుషాధిపత్యం
అది నిన్నటి సత్యం
నాలుగు విధాలా చేటన్నది
కలం చెల్లిన కట్టడి
వాదాలూ … వివాదాలూ వద్దు
నవ్వుల వెన్నెలలై వెలగనివ్వండి
ఈ అమృతధారల్లో తడిసిపోతే
మిత్రులారా!
మీరూ
ఓ కొండంత నవ్వై ప్రతిధ్వనిస్తారు

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.