పోలవరం వద్దే వద్దు

టోనీ స్టీవర్ట్, వి. రుక్మిణి రావు

పోలవరం ఆనకట్ట కట్టకూడదని ఈ పుస్తకం వాదిస్తుంది. దీనికి కారణాలు : అది చెప్పుకుంటున్న ప్రయోజనాలు ఒనగూరవు, దీనివల్ల
ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, నిర్వాసితులయ్యే ప్రజలపై దారుణ పరిణామాలుంటాయి.

ముఖ్యమైన అంశాలు

పోలవరం ఆనకట్ట ఆర్థికంగా లాభ సాటి కాదు.
ఆంధ్రప్రదేశ్ బడ్జెటుపై దశాబ్దాలపాటు ఇది తీవ్రప్రభావం చూపుతుంది.
ఎంతో అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలకు ఇది నిధులు లేకుండా చేస్తుంది.
ఆనకట్ట వల్ల ఒనగూరుతాయంటున్న ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్లోని అతి కొద్దిమందికే అందుతాయి.
విఫలమవుతున్న మౌలిక సదు పాయాలు, చాలీచాలని సేవలు వంటి కఠినమైన అంశాలను ఎదుర్కోవటం ఇష్టంలేని రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు ఈ ఆనకట్ట చేపట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో నీటి సమస్యల గురించి ఏదో చేస్తున్నారని ప్రజలు అనుకుంటారని ఆశిస్తున్నారు.
పోలవరం ఆనకట్ట వల్ల కనీసం పది లక్షల మంది జీవితాలు చెల్లా చదురవుతాయి.
ప్రతిపాదించిన నష్ట పరిహారం ప్యాకేజి సరిపోదు, దీనిని సమర్థంగా అందచేసే విధానం లేదు.
చారిత్రకంగా చూస్తే పెద్ద ఆనకట్టల నిర్మాణం భారత దేశానికి ప్రయోజనకరంగా లేదు.
ఆహార భద్రతను కల్పించటంలో పెద్ద ఆనకట్టల పాత్ర 10 శాతానికి మించి లేదు.
పెద్ద ఆనకట్టలు చాలా ఖర్చుతో కూడుకున్నవి అనుకున్న దానికంటే ఖర్చు పెరిగిపోవటం, పూర్తికాక పోవటం, సమర్థంగా పని చెయ్యకపోవటం వంటికి చారిత్రకంగా నిరూపించబడ్డాయి.
పెద్ద ఆనకట్టలు మేలు చేసిన కుటుంబాలకంటే ఎక్కువ కుటుంబాలకు నష్టం చేసింది.

పెద్ద ఆనకట్టలు

1850లలో అందుబాటులోకి వచ్చిన ఇంజినీరింగు విధానాలవల్ల 10 – 15 మీటర్ల కంటే ఎత్తయిన పెద్ద ఆనకట్టలు కట్టడం సాధ్యమయ్యింది.

అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మొదట్లో ఆనకట్టలను భారతదేశపు ఆధునిక దేవాలయాలు అని పేర్కొన్నాడు. కాని 1958 కల్లా ఆనకట్టల వల్ల సమస్యలను చూసి నిస్పృహ చెందాడు. అంతా పెద్దగా చెయ్యాలన్న జబ్బుగా వాటిని పేర్కొనసాగాడు. స్వాతంత్య్రం తరువాత నుంచి 1990ల మధ్య వరకు పూర్తి అయిన / నిర్మాణంలో ఉన్న 4129 పెద్ద ఆనకట్టలు, భారీ సాగునీటి పథకాలు భారతదేశంలో ఉన్నాయి.

నెహ్రూ ఉపయోగించిన ప్రతీకలవల్ల లక్షలాది ప్రజలకు ఆహారాన్ని సమకూర్చ టానికీ పెద్ద ఆనకట్టలకూ ప్రజల మెదడుల్లో సంబంధం ఏర్పడిపోయింది. దీనివల్ల పెద్ద ఆనకట్టలు, భారీ సాగునీటి పథకాలను విమర్శించటం కష్టమైపోతుంది. ఇంజినీర్లు, బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు కొన్ని దశాబ్దాల పాటు తమ ఇష్టం వచ్చినట్లు చెయ్యటానికి (అశ్రిత పక్షపాతం, అవినీతి, ప్రజావనరులు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయటం వంటివి) ఇది దారి తీసింది.

ఎన్నో పథకాలను ఎంతో వ్యయ ప్రయాసలతో చేపట్టినప్పటికీ పెద్ద ఆనకట్టలు ఆహారభద్రతకు దోహదం చెయ్యలేదు. ఒకవేళ చేసినా దానికెంతో ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.

పెద్ద ఆనకట్టలు కాలం చెల్లిన ఆలోచన లను సూచిస్తాయి. భారతదేశం ఆర్థికస్థితి విస్తరించడంతో వేగవంతమైన ప్రగతితో ముడిపడి ఉన్న సమస్యల పరిష్కారానికి ఇతర మౌలిక సదుపాయాలు కావాలి. చాలా పట్టణ ప్రాంతాలలో అనేక మౌలిక సదుపాయాలు క్షీణతకు గురయ్యి ఉన్నాయి, లేదా చాలి నంతగా లేవు. గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన వ్యవసాయ ప్రణాళికలు, నీరు అందించటానికి మెరుగైన పద్ధతులు, సమగ్ర వాటర్షెడ్ అభివృద్ధి, నదీ పరీవాహక ప్రాంత ప్రణాళికల అవసరం ఉంది. ప్రస్తుత వ్యవస్థలోని అవినీతి, గోప్యతా విధానాల వల్ల ఇవి అసాధ్యం.

పోలవరం ఆనకట్టమీద ప్రజాధనాన్ని దుర్వినియోగం చెయ్యటం వల్ల కనీసం ఒక దశాబ్దం పాటు ఎంతో అవసరమైన మౌలిక సదుపాయాలకు అవసరమైన డబ్బులుండవు. ఈ ఆనకట్ట కట్టిన తరువాత మన పిల్లలు, మనుమలు, ముని మనుమలు, వారి పిల్లలు కూడా ఆనకట్టవల్ల దుష్ప్రభావాలను ఎదుర్కోవాలి. సరైన, సమగ్ర ప్రణాళిక లేకుండా, బహిరంగ చర్చ లేకుండా ఇంతటి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం సహించరాని నేరం.

పెద్ద ఆనకట్టల భ్రమలు బట్టబయలు

ఆహార భద్రత
వివిధ పద్ధతులను ఉపయోగించి లోతుగా విశ్లేషించిన తరువాత ఆహార ఉత్పత్తి పెరుగుదలకు, తద్వారా ఆహార భద్రతకు పెద్ద ఆనకట్టలు 10 శాతానికి మించి దోహదం చెయ్యలేదని వెల్లడవుతుంది.

ఆనకట్టల వల్ల ఆర్థిక ఖర్చులు
రికవరీ రేటు (సాగునీటి రుసుముల ద్వారా నిర్వహణ ఖర్చులో వసూలయ్యే శాతం) 1976-77లో 93 శాతం నుంచి 1980-81లో 46 శాతానికి, 1980లో చివరికి కేవలం 9 శాతానికి పడిపోయింది. ఈ విధంగా సాగునీటి రంగం ఆర్థికంగా పెద్ద భారమైపోయింది 1993-94 నాటికి వార్షిక నిర్వహణ నష్టాలు 3000 కోట్ల రూపాయలను మించిపోయాయి.

పెద్ద ఆనకట్టల ఖర్చు ఎంతగానో పెరిగిపోయింది. 1947-1982 మధ్య కేంద్ర ప్రణాళికాబద్ద ఖర్చులో 15 శాతం వీటికే అయ్యింది. వీటి నిర్మాణం సమర్ధంగా లేదు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత చేపట్టిన 205 పెద్ద పథకాలలో 1979-80 నాటికి 29 మాత్రమే పూర్తి అయ్యాయి.

1970ల మధ్యకాలం, 1980ల నాటికి ఆనకట్టల ఖర్చు విపరీతంగా పెరిగిపోయి అవి ఆర్థికంగా లాభసాటిగా లేకుండా అయ్యాయి. 1990ల తరువాత చాలా తక్కువ కొత్త పథకాలను చేపట్టారు. కొత్త శతాబ్దంలో భారత దేశ ఆర్థిక పరిస్థితి బాగా వృద్ధి చెందుతుండ టంతో మరిన్ని ఆనకట్టలు కట్టడం అన్నది మరొకసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రజాధనాన్ని అక్రమంగా వినియోగించటాన్ని ఆపటానికి జరిగిన ప్రయత్నాలు

ఖర్చు పెరిగిపోవటం అన్న సమస్యను ఎదుర్కోటానికి అనేక కమిటీలను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇవి ఎంత తీవ్రమైన విమర్శలు చేసినప్పటికీ చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. పెద్ద ఆనకట్టలను అంచనా వేయడానికి 1.5:1 అన్న లాభం-ఖర్చు నిష్పత్తిని ప్రామాణికంగా తీసుకుంటూ వచ్చారు. దీనివల్ల మంచి ప్రాజెక్టులను చెడ్డ వాటినుంచి మేరు చేయడం కష్టమైపోయింది. ఈ నిష్పత్తిని సాధించటానికి అంకెల గారడీకి పాల్పడేవారు. ఇది గోప్య పరిస్థితులకు, పెద్ద ఎత్తున ఆర్థిక దుర్వినియోగానికి దారితీసింది.

నాయకత్వ వైఫల్యం

ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అనేక అంశాలను భారత విశ్లేషకులు పేర్కొంటారు. జవాబుదారీతనం, పారదర్శకత లేకపోవటం వల్ల సాగునీటి అభివృద్ధి దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతిన్నాయని ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు. ఇంజినీరింగు విభాగం వారి ఆధీనంలో ఉండటం, పరిపాలన స్థాయిలో విడివిడి ముక్కలుగా ఉండటంతో పాటు గోప్యత కారణంగా ఏదైనా కొత్తవి కనుక్కునే అవకాశమే లేకుండా పోయింది. అంచనా వేయటంలోని లోపాలు, బలహీన పర్యవేక్షణ వ్యవస్థవల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. అంతే కాకుండా మంచివాటిని చెడ్డవాటి నుంచి వేరుచేయటం సాధ్యపడదు. ప్రాజెక్టులు మొదలు పెట్టిన తరువాత అనుకున్న ప్రకారం జరిగేలా చూడటానికి ఎటువంటి విధానమూ లేదు.

ప్రపంచ బ్యాంకు సైతం తన విమర్శలో తీవ్రంగానే ఉంది. ఒక్క ఇంజినీరింగు విభాగంపైనే ఆధారపడటాన్ని అది కూడా విమర్శించింది. నిర్మించు-నిర్లక్ష్యం చేయి- నిర్మించు అన్న చక్రంలో ఆనకట్టలు, భారీ సాగునీటి పథకాలు భాగంగా ఉన్నాయని అది పేర్కొంది. నిర్వహణ, మరమ్మతు, చక్కని యాజమాన్యం అన్న సవాళ్ళను ఎదుర్కోవడం లో భారతదేశం విఫలమయ్యింది.

ప్రజా సాగునీటి, తాగునీటి సరఫరా సేవలలోని సమస్యలను ఎదుర్కోవటంలో రాష్ట్ర నీటి యంత్రాంగం వైఫల్యం చెందిందనడానికి అనేక ఆధారాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. సాగునటి, తాగునీటి సరఫరా విలువకీ ప్రజల నుంచి వసూలు చేసే రుసుముకీ మధ్య ఎంతో అంతరం ఉండడంతో ఇది తీవ్రమైన అవినీతికి కారణమయ్యింది. అంతర్జాతీయ ప్రామాణికాల కంటే సిబ్బంది పదిరెట్లు ఉన్నారు. ఇటీవల ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయం చేసిన సాగునీరు, తాగునీటి సరఫరా పథకాలలో కొత్త మౌలిక సదుపాయాలు
కల్పించటానికి కాకుండా జీర్ణావస్థలో ఉన్న వ్యవస్థల పునరుద్దరణకు ప్రాధాన్యతనిచ్చాయి.

ప్రజా సాగునీటి, తాగునీటి సరఫరా సేవలు దిగజారటం సాధారణంగా సామాజిక కల్లోలానికి దారి తీసేది అని ప్రపంచబ్యాంకు పేర్కొంటోంది. దీనికి బదులు అన్ని స్థాయిలలో వినియోగదారులు ఎంతో ఖర్చు పెట్టి భూగర్భ జలాలను వినియోగించు కోవడం ద్వారా సమస్యను తాత్కాలికంగా పరిష్కరించుకున్నారు. ఇప్పుడు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి.

నిర్వాసితుల దీనగాధల
ఆనకట్టలు కట్టినపుడు భారతదేశంలో నష్టపోయేది గిరిజనులు, షెడ్యూల్డ్ కులాలవారు, పేదలు, తరతరాలుగా నివసిస్తూ వస్తున్న వాళ్ళ ఇళ్ళు, స్థలాలు మునిగిపోతాయి, జీవనోపాధులు పోతాయి. అందుబాటులో ఉన్న నదులు, పచ్చికబీళ్ళు, అడవులు వంటి ఉమ్మడి వనరులు వాళ్ళకి అందకుండా పోతాయి.

నిర్వాసితులకు సరైన నష్టపరిహారం ఎన్నటికీ అందదు. కష్టకాలంలో ఆదు కోడానికి వాళ్ళకు ఎటువంటి ఆస్తులు ఉండవు. చాలా పెద్ద దిగ్భ్రాంతికి (ట్రామా)కి గురవుతారు. పోషకాహార లోపం, రోగాలు, మృత్యువు వాళ్ళను వెంటాడుతుంటాయి. సాధారణంగా వాళ్ళు మరింతగా పేదరికంలోకి కూరుకుపోతారు.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆనకట్టలు సంబంధిత ఇతర అభివృద్ధి పథకాల వల్ల 5 కోట్లమంది నిర్వాసితులయ్యారని నమ్మకంగా చెప్పవచ్చు. ముంపునకు గురికాని ఇతర పరోక్ష నిర్వాసితుల సంఖ్య (కాలవలు, వెనుకకు తట్టే నీళ్ళ వల్ల జీవనోపాధులు కోల్పోవటం వల్ల) తేలికగా పదికోట్ల వరకు ఉంటుంది. దీని గురించి మాట్లాడుతూ అరుంధతీరాయ్ ‘ఒక సామూహిక సమాధిని కనుగొన్న భావన కలుగుతుంది’ అంటుంది.

ఈ ప్రజలను భారత ప్రభుత్వం ‘గెంటి వేయబడిన వాళ్ళు’ (ఔస్టీస్) అంటుంది (ఏమాత్రం సున్నితత్వం లేని, నిరాదరణను సూచించే పేరు అది). వీరి వ్యక్తిగత గాథలు హృదయ విదారకంగా ఉంటాయి. స్వాతంత్య్రం తరువాత ఒకటి తరువాత ఒకటి వచ్చిన ప్రభుత్వాలు వీళ్ళపట్ల అవలంభించిన వైఖరిని గొప్పగా చెప్పాలంటే సదుద్దేశంతో కూడిన నిర్లక్ష్యంగా పేర్కొనవచ్చు. నష్టపరి హారం ప్యాకేజీలను ప్రకటించిన సందర్భాలలో వాటిని పూర్తిగా అమలు చేయటమన్నది చాలా అరుదైన విషయం. ఈ నిర్లక్ష్య ధోరణి ఎంతగా పాతుకుపోయిందంటే పైన ఉన్న వాళ్ళు నిర్వాసితులకు అన్నీ కల్పిస్తాం అని ఎంతో నమ్మకంగా వాగ్దానాలు చేసి అవి అమలు కానప్పుడు ఆశ్చర్యపోయి నట్లు నటిస్తారు. ఇది ఇక ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదు.

కాలవల సామర్థ్యత

ఆనకట్టల నుంచి నీటిని అందచేసే కాలవల సామర్థ్యత వంద ఏళ్ళుగా మెరుగుపడలేదు. కాలవల్లోకి వదిలిన నీళ్ళలో చివరికి 30 శాతం మాత్రమే పంట పొలాలకు చేరుతోంది. నీరు ఆవిరి కావడం వల్ల, కాలవల నుంచి ఊటలవల్ల 70 శాతం నీళ్ళు నష్టపోతున్నాం. కాలవలు ప్రవహించినంత మేర నేలలు చవుడుబారటానికి, పంట పొలాల్లో నీళ్ళు నిలిచిపోవటానికి ఇది కారణ మవుతోంది.

నదుల అనుసంధానం

భారతదేశంలో ఏ ఒక్కదానికీ నదీ పరీవాహక ప్రణాళిక లేకపోయినప్పటికీ 37 ప్రధాన నదులను అను సంధానం చేసే బృహత్ ప్రణాళికను ప్రతిపాదించారు. ఇందులో పోలవరం ఆనకట్ట మొదటి అనుసంధానం. ఆచరణీయం కానిదానికి, హద్దులు లేని కోరికకు ఈ పథకం ఉదాహరణ. ఇది ఎప్పటికీ పూర్తికాదు.

దురదృష్టకరమైన విషయమేమిటంటే ఈ పథకాన్ని త్యజించేలోపు ద్వీపఖండ ప్రాంతం లోని కొన్ని పనులను పూర్తిచేయ వచ్చు. ఆంధ్రప్రదేశ్లో 8 అనుసంధాన కాలవలు నిర్మిస్తారు. వీటిల్లో ఒక్కటీ రాష్ట్రానికి ప్రయోజనకారి కాదు. కాగా పొలాల్లో నీళ్ళు నిలబడిపోవడం, నేలలు చవుడు బారటం, ఊట/గండ్ల వల్ల వరద ముంపునకు గురి కావటం వంటి దుష్పరిణామాలను ఎదుర్కో వలసి ఉంటుంది.

పోలవరం పథకం

గత 25 సంవత్సరాలలో గోప్యత ముసుగులో ఈ పథకాన్ని అప్పుడు కొంత, అప్పుడు కొంత అభివృద్ధిపరిచారు. ప్రభుత్వం అందించే ఏ సమాచారమూ విశ్వసించటానికి లేదు.

ఆనకట్టకు అయ్యే ఖర్చు

పోలవరం పథకానికి అయ్యే ఖర్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక అంచనా ప్రకారం 10, 850 కోట్ల రూపాయలు. ఇది అవాస్తవికమైనదే కాకుండా కాలం కూడా చెల్లిపోయినది. ఈ అంచనా 1990ల నాటి దని ఆధారాలు సూచిస్తున్నాయి. 13,000 కోట్ల రూపాయలు అన్న మరో అనధికారిక అంచనా 2005 నాటిది.

ఇటువంటి పెద్ద పథకాలన్నింటికీ ముందు అంచనా వేసినదానికంటే ఎంతో ఎక్కువ ఖర్చు అవుతుంది. పోలవరం పథకం 2015 నాటికి పూర్తి అవుతుందని అనుకుని (ఇందుకున్న అవకాశాలు చాలా తక్కువ) అంచనా వేస్తే తక్కువలో తక్కువ 33,000 కోట్ల రూపాయల నుంచి 52,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 72,000 కోట్ల రూపాయల నుంచి 86,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్న మరో అంచనా మరింత సహేతుకంగా ఉంది. ఆనకట్టను పూర్తి చెయ్యటానికి 20 లేదా 30 సంవత్సరాలు పడితే ఖర్చు ఈ అంచనాలను కూడా మించిపోవచ్చు.

సాగునీటికయ్యే ఖర్చు

1990లలో పోలవరం నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ వేసిన ఖర్చునే తీసుకుని, వడ్డీ లెక్క కట్టకుండా, మరమ్మతులు, నిర్వహణ ఖర్చులను లెక్కలోకి తీసుకోకుండా సాగునీటి శిస్తు ద్వారా దీనిని రాబట్టడానికి 750 సంవత్సరాలు పడుతుంది. ప్రాజెక్టు ఖర్చును తక్కువగా చూపించిన ప్రభుత్వ అంచనాలే తీసుకున్నా ఒక హెక్టారుకు సాగునీటి సదుపాయం కల్పించటానికి అయ్యే పెట్టుబడి ఖర్చు 3, 72, 834 రూపాయలు.

పోలవరం ఆనకట్టవల్ల నిర్వాసితులయ్యే ప్రజలు

పోలవరం ఆనకట్ట వల్ల ప్రభావితులయ్యే వారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంచనా తప్పు – దీనివల్ల నిర్వాసితులయ్యే వారి సంఖ్య అంచనాకంటే రెట్టింపు ఉంటుంది. ఇతరత్రా ప్రభావితులయ్యే వారి సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ అధికారిక ప్రచురణలను ఆధారం చేసుకుని ఆనకట్టవల్ల, కాలవల వల్ల ముంపునకు గురయ్యే వారి సంఖ్య 5 లక్షలుంటుందని చూపించవచ్చు. పరోక్షంగా నిర్వాసితులయ్యే వారి (ఆనకట్టకు దిగువన ఉన్నవారు, నిర్వాసితులకు భూమి కోసం నిర్వాసితులయ్యేవారు, జీవనోపాధులు కోల్పోయిన బెస్తవాళ్ళు, ఇతరులు) సంఖ్య దాదాపు 10 లక్షల వరకు ఉంటుంది. ఆనకట్ట ముంపు ప్రజలలో ఎక్కువలో ఎక్కువ 1,77,275 మందికీ, కాలవల వల్ల నిర్వాసితులైనవారిలో 60,118 మందికి నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందిస్తుంది.

పునరావాసం, సహాయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో గత అనుభవాలు

పునరావాసం, సహాయ కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర చాలా దారుణంగా ఉంది.

నిజాంపాలనలో నిర్వాసితులకు నష్టపరిహారం బాగానే చెల్లించారని, ప్రాజెక్టు ప్రయోజనాలను వారు కూడా పంచుకునేలా విధానాలు ఉండేవని, ఆ తరువాత ఇవి పలచబారటం మొదలయ్యిందని కేస్ స్టడీలు తెలియ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు 1980ల నుంచి గందరగోళం, నిష్క్రియాపరత్వంతో నిండుకుని ఉన్నాయి. ఏ అతికొద్దిమందికో కొంత నష్టపరిహారం అందిన సందర్భాలు లేవు.

పునరావాసం, సహాయాలకు 2006లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజి

నష్టపరిహారం అందచేయటంలో గత కొన్ని దశాబ్దాలుగా నెలకొని ఉన్న గందరగోళం, అసమర్థత, చాలినంత లేక పోవడం అన్నది ఇంకా కొనసాగేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రస్తుత పునరావాసం, సహాయ కార్యక్రమాల ప్రణాళికలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేశంలోకెల్లా అత్యుత్తమమయినదని పేర్కొంటున్న పునరావాసం, సహాయ ప్యాకేజీని విశ్లేషిస్తే అది ‘ప్రామాణిక నమూనా’కి నకలని తెలుస్తుంది. అమల ప్రణాళికలు అరకొరగా, ఏ వివరాలు లేకుండా ఉన్నాయి. సరిగా అమలు చేయకపోతే ప్యాకేజీ ఎంత బాగా ఉన్నా అర్థరహితమవుతుందన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించటంలేదు.

ముగింపు

ప్రజాధన దుర్వినియోగం అయ్యే పథకం పోలవరం అనకట్ట. దీనివల్ల చాలా కొద్దిమందికి, చాలా కొంచెం ప్రయోజనం కలుగుతుంది. దీనిని గనక నిర్మిస్తే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొన్ని దశాబ్దాలపాటు వెనుకబడిపోయి భారతదేశంలో మిగిలిన ప్రాంతాల ఆర్థిక ప్రగతిలో పాలుపంచుకోలేదు.

ఏది ఏమైనప్పటికీ భౌతిక ఆస్తులు, జీవనోపాధులు, కొత్తగా ఇచ్చే స్థలం, ఆధ్యాత్మి కత వంటి అంశాల దృష్ట్యా నిర్వాసితులకు సరియైన, పరిపూర్ణమైన న్యాయం జరిగే వరకు ఏ ఆనకట్ట నిర ా్మణమూ చేపట్టకూడదు.

నిర్వాసిత బాధామయ గాథలు

ప్రజలు తమ ఇళ్ళు, జీవనోపాధులు కోల్పోయినప్పుడు ఏమి అవుతుంది?
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లేదా కొత్త ఢిల్లీలోని వసంత్విహార్తో పోల్చదగ్గ అభివృద్ధి చెందిన దేశంలోని ఒక సంపన్న నగరంలో అందరూ కోరుకునే ప్రాంతంలో రియల్ ఎస్టేట్పై కొన్ని సంవత్సరాల పరిశోధన చేశాను. స్థిరమైన ఆదాయం, నేపధ్యం ఉన్న సంపన్న కొనుగోలుదారులు సైతం ఇల్లుమారడంలో ఉద్వేగాలకు, ఆందోళనకు గురి అవుతారు’ అంటారు ఈ పుస్తక రచయితలలో ఒకరు.
తమది అనుకున్న ప్రాంతాల నుంచి, వాళ్ళు ఉంటున్న ఇళ్ళ నుంచి బయటకు తోసేసిన గిరిజన, షెడ్యూల్డ్, వెనుకబడిన తరగతుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది. తమ ఊరు తప్పించి ఈ ప్రజలకు వేరే ప్రపంచమేమీ తెలియదు.

నిర్వాసితుల గురించి వ్యాఖ్యానిస్తూ శేఖర్సింగు తదితరులు ఇలా అంటున్నారు :

చాలామందికి తమ ఇళ్ళతో, ప్రత్యేకించి పూర్వీకుల కాలం నుంచి ఉంటున్న ఇళ్ళతో బలమైన అనుబంధం ఉంటుంది. బల వంతంగా ఇళ్ళనుంచి గెంటివేయడం ఎంతో ఆందోళనకు గురిచేస్తుంది. ప్రత్యామ్నాయం గా వేరే ఇల్లు ఇస్తే సరిపోదు… నిర్వాసితులైన ప్రజలకు నదినుంచి స్వేచ్ఛగా నీరు, ఇతర వనరులు పొంది ఉంటారు చేపలు, నదీ భూములు వీళ్ళకు అందుబాటులో ఉండి ఉంటాయి. ఉమ్మడి పచ్చికబీళ్ళు, అడవులు, చిత్తడి భూములు వంటి సహజ వనరులు వీరికి అందుబాటులో ఉండి తమ మనుగడ కొనసాగించుకోవటమే కాకుండా ఆదా యాలను కూడా పొందేవారు.

నిర్వాసితులైన ప్రజలకు సరైన నష్టపరిహారం అందదు. తెలిసిన పరిసరాలు ఉండవు. తమకి ఇష్టమయిన జీవనోపాధులు కొనసాగించుకునే వీలు ఉండదు. తెలియని దానిలో ఉండే ఆందోళన, అనిశ్చితి, అభద్రత ఉంటాయి.

పేద ప్రజలు, నిరక్షరాస్యులు, షెడ్యూల్డ్ కులాలు, గిరిజన ప్రజలు ఇటువంటి సమస్యలకు మరింతగా లోనవుతారు.

కష్టకాలంలో ఆదుకోటానికి ఎటువంటి వనరులు ఉండవు. మార్పు వల్ల వాళ్ళు పరాయీకరణకు గురి అవుతారు. కొత్తగా వెళ్ళే చోట ఉండే ప్రజలతో సమస్యలు ఉండవచ్చు. అర్హతకి సంబంధించి ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి – ఎవరికి నష్టపరిహారం ఇవ్వాలి? జెండర్ అంశాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో మహిళలను రైతులుగా, భూమికి యజమానులుగా చూడరు. మహిళలు ఉమ్మడి వనరులపై ఎక్కువగా ఆధారపడి ఉండటం వల్ల వాళ్ళు మరింత ఎక్కువగా ప్రభావితం కావచ్చు. భారతదేశంలో పురుషులతో పోలిస్తే మహిళల మొబిలిటి తక్కువగా ఉంటుంది కాబట్టి గ్రామ, సామాజిక సంఘాలు విచ్ఛిన్నమవ్వటం వల్ల వాళ్ళు మరింతగా ప్రభావితమౌతారు. అదీ కాకుండా నష్టపరిహారంగా డబ్బు ఇచ్చినపుడు అది సాధారణంగా పురుషులకు అందుతుంది. ఇది, ప్రత్యేకించి బాధలు మరిచిపోటానికి ఖర్చు చేసినప్పుడు కుటుంబానికి సమస్యగా మారుతుంది.

పునరావాసంపై పనిచేస్తున్న పరిశోధ కులు భూమికి బదులు భూమి ఇవ్వటం నగదు నష్టపరిహారం కన్నా మంచిదని ఏకాభిప్రాయం వెలిబుచ్చారని ఇంటర్నేషనల్ రివర్స్ నెట్వర్క్కి సంబంధించిన పాట్రిక్ మాక్ కల్లీ అంటాడు. అవినీతి అధికారులు, ఇతర దళారులు తమ వాటా అంటూ కొంత నొక్కేయటం వల్ల భూమికి బదులు ఇచ్చే నష్ట పరిహారం చాలినంత ఉండదు.

అనేకమంది గ్రామీణ ప్రజలకి ప్రత్యేకించి పేదలకు ఉమ్మడి భూములు, అందరూ పంచుకునే ఇతర ఉమ్మడి వనరులు మునిగిపోవడం అతిపెద్ద నష్టంగా ఉంటుంది. ఇటువంటి నష్టాలకు పరిహారం ఇచ్చేది ఉండదు.

నిర్వాసితులైన ప్రజలలో సాంప్రదాయ పెద్దలు, నాయకులు తమ ప్రాముఖ్యతను కోల్పోతారు అని మాక్ కెల్లీ అంటాడు. నిర్వాసితులైన తరువాత పిల్లలు, ముసలి వాళ్ళలో జబ్బుపడటం, చనిపోవటం సాధారణంగా పెరుగుతుంది. పోషకాహార లోపం కూడా పెరుగుతుంది. నిర్వాసితులైన ప్రజలు దీర్ఘకాలంగా ఎదుర్కొనే సమస్యలలో అప్పులపాలు కావటం ఒకటని మాక్కల్లీ అంటాడు. ఈ ప్రజలు పేదరికానికి గురికావటమంటే తాము సాంప్రదాయంగా నిర్వర్తించే పూజలు, శుభకార్యాలు వంటివి జరుపుకోలేకపోతారు.

ఆనకట్టల వల్ల నిర్వాసితులైన ప్రజలలో అధిక సంఖ్యాకులు (వీరిలో చాలామంది హక్కులు గుర్తింపబడి ఉండవు) గణాంకాల నుంచి మాయమైపోయి ఉంటారు. మురికి వాడలు, వలసకూలీల గుడారాలు వీళ్ళని మింగేస్తాయి. ఆనకట్టల వల్ల నిర్వాసితులైన వారిలో 7.5 లక్షల మందికి ఎటువంటి భూమీ, ఇళ్ళు అందలేదు మహా అయితే చిన్నమొత్తంలో నష్టపరిహారం అంది ఉంటుంది. చాలామందికి అదీ లేదు. భారత దేశంలో నిర్వాసితులకు ‘పునరావాసం’ కల్పించిన తరువాత వాళ్ళు చివరికి పేదలుగా అయిపోయారని, నిరాశ, నిస్పృహలకు గురయ్యారని, తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని అనేక అధ్యయనాలు వెల్లడి చేశాయి. పునరావాసం కల్పించిన ప్రాంతాలలో వారు ఒరిస్సాలోని కెంగాలి ఆనకట్ట ఫలితంగా నిర్వాసితులైన ప్రజలను ”ముంపు నిర్భాగ్యులు” అని అనేవారు.

అయినప్పటికీ ప్రభుత్వం సంక్లిష్టతలన్నీ తెలిసి, నిర్వాసితులకు సంబంధించిన అంశాలపై పనిచేస్తున్న వాళ్ళని భాగస్వాముల్ని చేయకుండానే పైనుంచి ఆదేశాలు జారీచేయటం ద్వారా ఇవన్నీ చేయగలను అని అనుకుంటుంది.

ఎంతమంది నిర్వాసితులు?

ఆనకట్టల వల్ల తరలింపబడే ప్రజల గురించి అరుంధతి రాయ్ ఈ విధంగా వ్యాఖ్యానించింది:
”ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 54 పెద్ద ఆనకట్టలను విస్తృతంగా అధ్యయనం చేసింది. ఒక పెద్ద ఆనకట్ట వల్ల సగటున 44, 182 మంది నిర్వాసితులవుతున్నారని ఇది తెలియ చేసింది. 3300 ఆనకట్టలలో 54 ఆనకట్టలపై అధ్యయనం అంటే పెద్ద నమూనా కాదని ఒప్పుకుందాం. కానీ మనకి ఉన్న అధ్య యనం అదే… నిర్వాసితుల సమస్యను సగటు న ఒక ఆనకట్టకు 10,000గా తీసుకుందాం. అంటే 3.3 కోట్ల ప్రజలు… ఇతర అభివృద్ధి పథకాలవల్ల నిర్వాసితులైన వారి మాటేమిటి? మొత్తం 5 కోట్ల ప్రజలు… ఒక పెద్ద సామూహిక సమాధి మీద అడుగుపెట్టిన వ్యక్తిలా అనిపిస్తోంది”.

‘ఆనకట్టల వల్ల తమ ఇళ్ళల్లోంచి బయటికి గెంటివేయబడ్డ ప్రజల సంఖ్య దిగ్భ్రాంతికి గురి చేస్తుంది’ అంటాడు పాట్రిక్ మాక్ కల్లీ. ‘అయితే ఈ సంఖ్యకు సంబంధించి ఖచ్చితమైన అంచనాను ఇవ్వటం కూడా కష్టమే నిర్వాసితులకు సంబంధించి ఆధారపడ దగ్గ గణాంకాలను సేకరించాలని ప్రభుత్వ శాఖలుగానీ, ప్రభుత్వ స్పాన్సర్లుగానీ అను కోలేదు.

స్వాతంత్య్రం తర్వాత ఆనకట్టల వల్ల నిర్వాసితులైన ప్రజల సంఖ్య ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇచ్చారు. ఒకరు హాస్యాస్ప దంగా రెండు లక్షలు అన్నారు మాక్కల్లీ 1.4 కోట్లు అన్నారు ప్రత్యక్ష నిర్వాసితులు 2, 3.3, 4, 5 కోట్లు అని ఇతరులు అన్నారు. వరల్డ్ కమీషన్ ఆన్ డామ్స్ చేయించిన అధ్యయనం ప్రకారం 4291 ఆనకట్టల ఆధారంగా సగటు ముంపు భూమి, సగటున ఎకరంలో ఉండే ప్రజల ఆధారంగా 5.7 కోట్లమంది నిర్వాసితు లని తేలింది. ఈ అంచనాలు అంతగా ఆధార పడదగినవి కావని ఈ పుస్తక రచయితలు భావించినప్పటికీ అంచనా పరిధిలో తక్కువ సంఖ్యను కాక ఎక్కువ తీసుకోవాలని సూచిస్తున్నారు.

స్వాతంత్య్రం తర్వాత భారతదేశంలో ముంపువల్ల నిర్వాసితులైన వారి సంఖ్య 5 కోట్లు అన్నది సరైన అంచనా అనుకుంటే కాలవలు, వెనక్కి తట్టిన నీళ్ళు, జీవనోపాధి, ముంపుకి గురికాని ఇతర నిర్వాసితుల సంఖ్య మొత్తం మీద 10 కోట్ల దాకా ఉంటుందని అనుకోవచ్చు.

”ఒక పెద్ద సామూహిక సమాధి మీద అడుగుపెట్టినట్లు ఉంది” అన్న అరుంధతీరాయ్ మాటలు అతిశయోక్తి కాదు.
పెద్ద ఆనకట్టల వల్ల సాధించిన కొద్దిపాటి ఆర్థిక ప్రయోజనాలకు ఇంతమందిని నిర్వాసితులను చేయటం, క్షోభకు గురిచేయటం సమర్థనీయం కాదు. ఇంతా చేస్తే ఎంతో ఖర్చు పెట్టి (1982 వరకు ప్రణాళికా బద్ధ కేంద్రబడ్జెటులో 15 శాతం) ఆహార ఉత్పాదకతలో 10 శాతం అభివృద్ధి సాధించామంతే.

ప్రాజెక్టులు చేపట్టటానికి ముందు నిర్వాసితుల సంఖ్యను ఎలా తక్కువగా అంచనా వేస్తారో పట్టిక తెలియచేస్తోంది.

ప్రాజెక్టులు కట్టడానికి ముందు,ఆ తర్వాత నిర్వాసితుల సంఖ్య అంచనా, తేడా శాతంలో
ఆనకట్ట మొదటి సవరించిన పెరుగుదల శాతం
అంచనా (సం||) అంచనా (సం||)
ఆంప్ర ఇరిగేషన్ 11 63,000 (1986) 1,50,000 (1994) 234
గుజరాత్ మీడియం ఇరిగేషన్ 11 63,600 (19??) 1,40,370 (1994) 221
మధ్యప్రదేశ్ మీడియం ఇరిగేషన్ 11 8,000 (1981) 19,000 (1994) 238
సర్దార్ సరోవర్ 33,000 (1981) 3,20,000 (1994) 970
ఎగువ ఇంద్రావతి 8,531 (19??) 16,080 (1994) 189
నాగార్జునసాగర్ 8,239 (1960) 28,000 (1989) 294

మూలం : పాట్రిక్ మాక్కల్లీ నాగార్జునసాగర్ అంకెలు : ఠుక్రాల్

నిర్మాతల అంచనాకి సంబంధించి సర్దార్ సరోవర్ ప్రాజెక్టు వాస్తవానికి అతి దగ్గరగా ఉంది, ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఇంతగా చర్చ, పరిశోధనలు జరిగిన మరొక ప్రాజెక్టు లేదు. మన లెక్కల్లోంచి నర్మదానది మీద సర్దార్ సరోవర్ ప్రాజెక్టు తీసివేసి పట్టిక 8 లోని ప్రభుత్వ గణాంకాలను తీసుకుంటే ఏదైనా ప్రాజెక్టు మొదలు పెట్టకముందు ప్రభుత్వం, ఇతర సంస్థలు చూపించే నిర్వాసితుల సంఖ్య కనీసం 236 శాతం ఎక్కువగా ఉంటుంది.

ఈ అంకెల గురించి పాట్రిక్ మాక్ కల్లీ ఇలా అంటున్నారు: ‘నిర్వాసితుల సంఖ్యను తక్కువ చేసి చూపించటానికి ఒక కారణం ఉంది. ఇలా చేస్తే గాని అప్పు ఇచ్చే సంస్థలకు ప్రాజెక్టు వల్ల ఖర్చుల కన్నా ప్రయోజనాలను ఎక్కువగా ప్రాజెక్టు అథారిటీలు చూపించలేవు.
పెద్ద ఆనకట్టలు, ఇతర అభివృద్ధి పథకాల వల్ల నిర్వాసితులైన ప్రజల విషాద గాథ అంతటినీ ఈ అంకెలూ, ప్రభుత్వ ప్రకటనలు పూర్తిగా తెలియచేయవు. బర్గి, హీరాకుడ్, నాగార్జునసాగర్, ఉకాయ్, పోంగు, సర్దార్ సరోవర్ వంటి పథకాలను లోతుగా విశ్లేషిస్తేగాని అసలు కథలు తెలియవు (చూడండి నోట్స్ ఎండ్ రిఫరెన్సెస్)

ప్రభుత్వ నష్టపరిహారం సంగతి ఏమిటి?

నిర్వాసితులకు సంబంధించి వ్యక్తిగత గాధలు హృదయ విదారకంగా ఉంటాయి. కానీ భారతదేశంలో రాజకీయ, పాలనా యంత్రాంగం ఎంతగా మొద్దుబారి పోయిందంటే పైన ఉన్నవాళ్ళు ధాటిగా వాగ్దానాలు చేసేస్తారు, వాస్తవంలో అవి నెరవేరనప్పుడు ఆశ్చర్యపడుతున్నట్టు నటిస్తారు.

1948లో దామోదర్ వాలీ కార్పొరేషన్ ప్రాజెక్టుకి ఇన్ఛార్జి మంత్రి అయిన ఎన్వి గాడ్గిల్ చేసిన వాగ్దానాలు ఇలా ఉన్నాయి. ‘ఈ నేల నుంచి నిర్వాసితులయ్యే ప్రతి ఒక్క వ్యక్తికి పూరిపాకకి బదులు చక్కటి ఇల్లు, చీకటికి బదులు కాంతి, మూఢ నమ్మకాలకు బదులు విశ్వాసం లభిస్తాయి…’

స్వాతంత్య్రం వచ్చిన తరువాత నిర్వాసితులకు సరైన నష్టపరిహారం, సక్రమమైన అమలుకు సంబంధించి మంచి ఉదాహరణ ఒక్కటి కూడా లేదు.

1963లో ఉపయోగంలోకి వచ్చిన భాక్రానంగల్ ఆనకట్టను చాలా సంవత్సరాల తరువాత కేంద్రమంత్రి (ప్రఖ్యాత ఆనకట్టల నిర్మాత) డా|| కె.ఎల్. రావు సందర్శించి తన సందర్శన గురించి రాసుకున్న నోట్ని నిర్మల్సేన్ గుప్తా ఇలా పేర్కొన్నారు:

భాక్రా పథక నిర్మాణం అన్ని విధాల పూర్తి అయ్యింది దీనిని ప్రధానమంత్రి 22 అక్టోబరు, 1963న జాతికి అంకితం చేశారు. దానికి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. పారిశ్రామిక వేత్తలకు, వ్యవసాయదారులకు లాభాల పంటను పండిస్తున్న నమ్మకంతో అందరి ముఖాలలో ఆనందం వెల్లివిరుస్తోంది. అయితే ఆనకట్టల వల్ల ప్రభావితులైన ప్రజలను పట్టించుకోకుండా ప్రాజెక్టులను చేపట్టే తీరు తెలుసుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది. భాక్రా గ్రామం మునిగిపోవటంతో ఆ ప్రజలు చుట్టుపక్కల కొండలపై ఇళ్ళు కట్టుకున్నారు. ఆనకట్ట ఫలితంగా ఈ ఊరి ప్రజలు ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారు, కానీ ఆ ప్రజల విన్నపాలను పట్టించుకున్న నాధుడే లేడు. చాలా సంవత్సరాల తరువాత ఆనకట్ట ప్రాంతాన్ని నేను సందర్శించినప్పుడు చుట్టు పక్కల కళ్ళు మిరుమిట్లు గొలిపే దీపాలు ఉన్నప్పటికీ భాక్రా గ్రామానికి తాగునీరు, విద్యుత్ సదుపాయాలు లేవని తెలిసింది. ఇది చాలా దారుణం. భాక్రా మేనేజ్మెంట్ బోర్డుని ఆ ఊరికి నీరు, విద్యుత్తు సరఫరా చేయమని చెప్పాను. భవిష్యత్తులో పునరావాస గ్రామాలలో సరైన సౌకర్యాలు కల్పిస్తారని ఆశిస్తాను.
లక్షలాది ప్రజలు పాల్గొన్న 20 సంవత్స రాల నర్మదా బచావో ఆందోళన్ నేత మేథా పట్కర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇలా పేర్కొన్నారు: ”….. ప్రధానంగా సాధించింది ప్రజా సాధికారీకరణ… ఇది ఒక్క నర్మదా లోయకే పరిమితం కాలేదు. ప్రభుత్వం ఒకవైపు ఆశ చూపి, ఇంకోవైపు భయపెట్టి నప్పటికీ సర్దార్ సరోవర్లో ప్రజలు పారి పోలేదు. అభివృద్ధి దృక్పధాన్ని పూర్తిగా మార్చలేక పోయాం. కానీ ఉద్యమ ప్రభావం కొంత ఉంది.”

నష్టపరిహారం చెల్లింపులో గణనీయమైన పెరుగుదల ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. గత పద్ధతులతో పోలిస్తే సర్దార్ సరోవర్ ఆనకట్ట పునరావాస ప్యాకేజి ఎంతో మెరుగైందని రంగాచారి, ఇతర నీటి ఇంజినీర్లు, బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు పేర్కొంటున్నారు. ఇటువంటి మార్పు రావటం వెనుక సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలు, కష్టాలు ఉన్నాయన్నది వాళ్ళ అంతరాత్మను ఇసుమంతైనా బాధించదు.

అయినప్పటికీ ఈ విషయంలో మేధా పాట్కర్ విజయం సాధించారని అనుకోవటం లేదు. ఎందుకంటే భారతదేశంలో నిలబెట్టు కునేంతవరకు వాగ్దానాలకు విలువలేదు. భారతదేశంలో ప్రకటించిన పునరావాస ప్యాకేజి చాలా అరుదుగా అమలు అయ్యింది, లేదా కొంత భాగమే అమలు అయ్యింది. ఫలితంగా సమస్యలు మళ్ళీ, మళ్ళీ పునరావృత మౌతుంటాయి, వీటిని పట్టించుకునేవారు ఉండరు.

ప్రాజెక్టు ప్రభావితులు అన్న నిర్వచనానికి కొంత వెసులుబాటు ఉండేలా చూస్తే, ప్రభావితులైన వారికి కొంత భాగస్వామ్యం కల్పించి సకాలంలో చర్చలు జరిపి, (కనీసం కాగితం మీద) బాగా ఆలోచించి రూపొందిం చినట్టు అనిపించే అమలు ప్రణాళికలు ఉండి అతి మంచి ప్యాకేజీలు కూడా సరిపోవు. వ్యక్తిగత సంక్లిష్టతలను, స్త్రీల, సాంస్కృతిక అంశాలను క్లిష్టమైన ఉమ్మడి, బృంద వనరులకు సంబంధించిన అంశాలను పట్టించుకోవు కాబట్టి ఇవి చాలవు. ప్రతి వ్యక్తి వివరాలను బాగా అర్థం చేసుకోగల ‘స్థానికుల’ నిర్ణయాలు తీసుకునేలా ‘వికేంద్రీ కరణ’ జరగదు. పునరావాస ప్యాకేజీని అమలు చేయటం ఇంకా పైనుంచే జరుగుతోంది అంతిమ నిర్ణయాలు తీసుకునేది అధికారం ఉన్నవాళ్ళే కానీ, అధికారం లేని వాళ్ళు కాదు.

పెద్ద ప్రాజెక్టులలో ప్రభుత్వ ఉద్దేశాలకు, వాస్తవంగా జరిగేదానికి పెద్ద అంతరమే ఉండటం దురదృష్టకరం. ఇలా కాకుండా ఉండాలంటే :

ప్రాజెక్టు రూపకల్పనలో మొదటి మెట్టుగా సకాలంలో చర్చలు చేపట్టాలి అంటే ఆనకట్ట కట్టడానికి కనీసం 10 సంవత్సరాల ముందు ప్రాజక్టుతో ప్రభావితులయ్యే వారందరితో చర్చించాలి.

ముందునుంచే ప్రణాళికల తయారీ
సరియైన, పూర్తి నష్టపరిహారం: దీనిని అమలు చెయ్యటానికి స్పందించే యంత్రాంగం ఖర్చు చేసిన ప్రతీ పైసాకి జవాబుదారీ తనం కొన్ని సంవత్సరాలపాటు కొనసాగే ప్రాజెక్టు అనంతర అంచనా.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత నిరక్షరాస్యులైన పేద ప్రజలు, ప్రత్యేకించి షెడ్యూల్డ్ కులాలు, తెగల వారు (రాజ్యాంగపర సంరక్షణ ఉన్నప్పటికీ) నిర్వాసితులయ్యారు, నిర్మూలింపబడ్డారు. దీనిని మానవ హక్కుల హననంగా, మానవాళి పట్ల నేరంగా పేర్కొన వచ్చు. తమకిది సిబ్బంది చేసే అక్రమాలు మాకు తెలియదని అధికారులు తప్పించు కోచూడటం ఇక సాగదు. బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు తమకు సమాచారం లేదంటే సరిపోదు : చాలా వరకు భారతదేశ అనుభవాల ఆధారంగా నిర్వాసితు లకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలో వరల్డ్ కమీషన్ ఆఫ్ డామ్స్, ప్రపంచ బ్యాంకు మార్గదర్శక సూత్రాలను, కేస్ స్టడీలను, పరిశోధనలను వెలువరించాయి.

భారతదేశ, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితుల సమస్యను ఎదుర్కోటానికి తగిన విధానాలను రూపొందించి, వాటిని సరిగా, మానవీయంగా అమలుచేసే పద్ధతులను తయారు చేసేంతవరకు కొత్త ఆనకట్టల నిర్మాణం చేపట్టకూడదు.

(‘ప్రాజెక్టులలో నిజమెంత? మేలెంత? పుస్తకం నుంచి)

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

3 Responses to పోలవరం వద్దే వద్దు

  1. anonymous says:

    5000 టీ ఎం సి లనీళ్ళు సముద్రంలోకి పోయినా మీలాంటి కుహనా మేధావులకు బుద్ధిరాదు.

  2. Pingback: పోలవరం వద్దే వద్దు « Polavaram

  3. ramesh says:

    పొయెవదికి తెలుస్థుంది ఆ బాధ ఎమితొ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో