ఉత్తర భారతమంతా చితి మంటలు,
మనువాద పాలనలో.
కామాంధులు రేప్ చేసి, హత్యలతో,
హీరోల్లా ఊరేగుతున్నారు.
పురుషులు మహిళలను
అత్యాచారం చేయడం
అనుభవించి, హత్య చేసి
ఆధిపత్యం అంటారు.
మతోన్మాదం మా ఎజెండా.
ముందుకు తెస్తున్నారు,
సెక్యులరిజమే అంతం.
మహిళలపై కుట్రలు పన్నుతున్నారు.
వేధించి, హింసించి బలి తీసుకుంటున్నారు.
మనువాదమే రాజ ధర్మం అంటున్నారు.
హథ్రాస్ అత్యాచారాలను,
నిలదీసి అడిగితే
దేశద్రోహం, హింసావాదమంటారు.
ఆడతనం మీద పెత్తనం,
కామాంధుల క్రూరత్వంతో,
కామవాంఛ తీర్చుకుని,
గొంతు నులమడం.
అణచబడిన పీడితుల కోసం
పోరుకై కదలాలి.
ఆధిపత్య విష సంస్కృతికి
గోరీ కట్టాలి.