-
Recent Posts
Recent Comments
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
Meta
Tags
Author Archives: భూమిక
దశావతారాల్లో హేతువాద దృక్పథం – డాక్టర్ తిరునగరి దేవకీ దేవి
తారీఖులు దస్తావేజులు ఇవి కావోయ్ చరిత్రకర్ధం అనే శ్రీశ్రీ అభిప్రాయం వాస్తవమే అయినా అవి ఎన్నెన్నో విషయాలను ప్రోది చేసి ఇస్తాయి అనేది కూడా వాస్తవమే. అది విజయభారతి గారి రచనల్లో మరింత స్పష్టం. విజయభారతి గారు 1941లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జన్మించారు. ప్రముఖ కవి బోయి భీమన్న గారి కూతురు.
మానవ విలువలకి నిలువెత్తు సాక్ష్యం – ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి
తెలుగు నేల గర్వించ దగిన గొప్ప దళిత మేధావి, రచయిత్రి, విద్యావంతురాలు బోయి విజయభారతిగారు మన మద్య లేకపోవడం ఒక విషాదం. 1941 నుండి 2024 వరకు జీవించిన కాలం పూర్తిగా ప్రజలకోసం అనే చెప్పొచ్చు. కొందరికి మాత్రమే అరుదుగా లభించే ఆవకాశం. పుట్టి పెరిగిన బోయి భీమన్న కుటుంబ వాతావరణం, తాను పెళ్లి చేసుకొని … Continue reading
ఆమె జీవితం ఒక నిశ్శబ్ద పోరాటం – ఝాన్సీ గెడ్డం
ఆధునిక సమాజానికి సంబంధించిన స్త్రీ ఐకాన్ బోయి విజయభారతిగారు. విజయభారతిగారిని చూసిన ఎవరైనా ఒకసారి మాట్లాడితే చాలు మనసారా అమ్మ అని పిలుస్తారు. తెలుగు అకాడమీ డైరెక్టరుగా, రచయితగా ఆమె సమాజానికి చేసిన కృషి చాలా అమూల్యమైనది. కులం, మతం పట్ల ఆమె వైఖరి ఈనాటికి ఎవరితోనూ సరి తూగనిది.
ప్రత్యామ్నాయ సాహితీ ధృవతార డా॥ బోయి విజయభారతి – డాక్టర్ సుధారాణి
డాక్టర్ బోయి విజయభారతి గారికి మన:పూర్వక నివాళులు అర్పిస్తున్నాను. అమ్మతో మూడున్నర దశాబ్దాల సన్నిహిత సంబంధం నాది. విజయభారతిగారు నాకు పరిచయం కాకముందే వారి తండ్రి పద్మశ్రీ బోయి భీమన్నగారిని కలవడం జరిగింది. నేను జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో 1988`1992 మధ్య పరిశోధన విద్యార్థిగా ఉన్నపుడు, ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేసాను.
ఒక జ్ఞానజ్యోతి ఆరిపోయింది – ప్రొఫెసర్ కోదండరామ్
డాక్టర్ విజయభారతి అమ్మకి ముందుగా నా తరపున, తెలంగాణ జన సమితి తరఫున నివాళులు అర్పిస్తున్నా. తారకంగారితో, విజయభారతిగారితో, ఆ ఇంటితో ఉన్న చాలా అనుబంధాలు ఈ సందర్భంగా గుర్తొస్తా ఉన్నాయ్. విజయభారతి అమ్మకి హైదరాబాదులో ఉద్యోగం రావడంతో తారకంగారు కూడా నిజామాబాద్ నుంచి ఇక్కడికి షిఫ్టయిన్రు.
ఆధునిక సావిత్రిబాయి ఫూలే మన విజయభారతిగారు! – డా.గోగు శ్యామల
పచ్చదనంపై జరుగుతున్న వేట కనపడినంత స్పష్టంగా దానిని కాపాడే తపన కనపడదుగా! ప్రపంచంలో అణు యుద్ధాలు, వైరస్ దాడులు కనబడుతున్నంత స్పష్టంగా కుల వైరస్ చేసే విథ్వంసం కనపడదేమో! అది కనబడాలన్నా, దానిని చూడాలన్నా కళ్ళు మాత్రమే ఉంటె సరిపోదు. వాటికి తమని తాము వంచించుకోలేని కాస్త నిజాయితి, కాస్త సున్నితత్వం ఉండాల్సిందే.
అమ్మ – డా. బొజ్జా మహిత
25-10-2024 రోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, నాగర్ కర్నూలులో కొత్తగా చేరిన మెడికల్ కాలేజీ స్టూడెంట్స్‌కి స్వాగతం చెపుతున్న సభ. వేదిక మీద ఆ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్‌గా, హాస్టల్ వార్డెన్‌గా కూర్చున్నప్పుడు కలిగిన ఆనందం, అనుభూతి మాటలలో చెప్పలేనివి.
కులం, జెండర్ స్త్రీవాదం గురించి విజయభారతి – అనిశెట్టి రజిత
గత సంవత్సరం 28 సెప్టెంబర్‌న తెలుగు సాహితీ సామాజిక సమూహాల ముందు చీకటి సంతకం చేసి సెలవంటూ వెళ్ళిపోయారు పరిశోధక సాహిత్య మేరునగధీర బోయి (బొజ్జ) విజయభారతి. ఆమెది మహోన్నతమైన విజయగాథ. కవి, రచయిత బోయి భీమన్న నాగరత్నమ్మల కూతురైన ఆమె తండ్రి భీమన్న రచనా వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు.
నలుగురు కలిసి కూర్చున్న వేళ విజయభారతి గారిని ఒకసారి స్మరించుకుందాం – మరియం దవాలే
డాక్టర్ బోయి విజయభారతి ప్రముఖ విదుషీమని. ప్రముఖ సాహిత్య వేత్త బోయి భీమన్న గారి పెద్ద కుమార్తె. లెక్చరర్‌గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ డైరెక్టర్‌గా పనిచేశారు. ఏమైనా ఆమె విజ్ఞానం, విజ్ఞత, సంస్కారం ముందు ఆమె చేపట్టిన పదవులు అంత లెక్కలోనివి కాదు. తెలుగు సాహిత్యం మీద ఆమెకు మంచి పట్టు.
మానవతామూర్తి… బోయి విజయభారతిగారు – గిరిజ పైడిమర్రి
బోయి విజయభారతిగారు ఇక లేరనే పిడుగు లాంటి వార్త 28/9/2024 ఉదయమే తెలిసింది. చాలా సేపు ఆ షాక్ నుంచి తేరుకోలేక పోయాను. తరువాత కృష్ణకుమారికి ఫోన్ చేసాను. తనూ అదే షాక్‌లో ఉన్నానని చెప్పింది. ఆ మధ్య విజయభారతిగారు నేను, క్రిష్ణ కుమారి తరచుగా ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నాము.
‘విజయ గాథ’ ‘నిశ్శబ్ద విప్లవ తరంగిణి’ – బొమ్మకంటి కృష్ణకుమారి
పుస్తకాలను 23-11-2024 (శనివారం) రోజు ఆవిష్కరించారు. ‘విజయ గాథ’ డా. బోయి విజయభారతి గారి స్వీయ చరిత్ర. ‘నిశ్శబ్ద విప్లవ తరంగిణి’ విజయ భారతి గారి గురించి 52 మంది రాసిన జ్ఞాపకాలను గుదిగుచ్చి అందించిన స్మారక సంచిక. ‘నిశ్శబ్ద విప్లవ తరంగిణి’ లో నా వ్యాసం ఉంది. ‘విజయ గాథ’ ని నేను, గిరిజ … Continue reading
జీవిత నాటక రంగస్థలిపై యోధురాలు ! – యింద్రవెల్లి రమేష్
జీవితం ఒక నాటకరంగం, మనమందరం అందులో పాత్రధారులం. ఇలా అనుకుంటే తమ పాత్రను తాము అర్థం చేసుకుని ఘనంగా పోషించేవారు, ఈ జీవిత రంగస్థలిపై బాగా రాణిస్తారు. ఇక్కడ రాణిస్తారు అంటే, తాము అనుకున్న ఫలితాలు సాధిస్తారు అని, ఆ ఫలితాలు (ఇతరులకూ లేదా) సమాజానికి పంచుతారని అర్థం.
ఆమె మౌనంగా లేదు …. – భండారు విజయ
బోయి విజయ భారతి గారిని చూడడం అదే మొదటి సారి. నా సహచరుడు బొజ్జ తారకం గారి వద్ద అతి కొన్ని నెలలు మాత్రమే అప్రెంటిషిప్ చేయడం వలన ఒకసారి వాళ్ళింటికి వెళ్లడం జరిగింది. అప్పుడు ఆమెతో అయిన పరిచయం ఆవిడ గారు జీవించి ఉన్నంత వరకు నిలకడగా అలాగే ఉంది. ముఖ్యంగా ఆవిడ మృదుభావిని. … Continue reading
ప్రత్యామ్నాయ చరిత్రకారిణి విజయభారతి – డా॥ సంగిశెట్టి శ్రీనివాస్
ప్రత్యామ్నాయ చరిత్రను రాయడానికి పరిశోధన ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ప్రచారంలో ఉన్నటువంటి విషయాలను పక్కకుతోసి సత్యాలను నిలబెట్టడానికి గ్రంథవనరులు చాలా అరుదుగా దొరుకుతాయి. ఇట్లా దొరికిన ఆధారాలను కన్విన్సింగ్‌గా చెప్పడం ఒక కళ. ఈ కళలో నిష్ణాతులు, ఆల్టర్నేటివ్ చరిత్ర నిర్మాత, సబాల్టర్న్ విదుషీమణి బోయి విజయభారతిగారు.
సామాజిక చింతనా మాతృమూర్తి – డా॥ గూడూరు సీతా మహాలక్ష్మి
డా. విజయభారతిగారి గురించి చెప్పాలంటే గొంతుకేదో గీరబోయినట్లు అనిపిస్తోంది. చాలా వేదనగా కూడా వుంది. నిన్న మొన్న కలిసిన మనిషి, కళ్ల ముందు సజీవంగా నిలిచిపోయిన మనిషి, ఇవాళ భౌతికంగా మనమధ్య లేరు అనేది నాకైతే వ్యక్తిగతంగా జీర్ణించుకోలేని అంశం.
