Category Archives: ప్రత్యేక వ్యాసాలు

ప్రత్యేక వ్యాసాలు

బాపూగారూ! ఇంక సెలవండీ!- ఇంద్రగంటి జానకీబాల

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రఖ్యాత దర్శకులు, సుప్రసిద్ధులైన స్వర్గీయ బాపూగారి చిత్రాలలోని కొన్ని పాటల్ని, వాటి రూపకల్పననీ తలుచుకుంటూ, ప్రస్తావించుకుంటూ ఆయనకి ఒక సంగీతపరమైన నివాళినర్పించాలని ఈ వ్యాసం వుద్దేశమని సవినయంగా తెలియజేసుకుంటున్నాను.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

రాజ్యాంగ నైతికత – సొరాజ్జెం నవల – Volga

సామాన్యంగా రచయితలకు గ్రామీణ జీవితం మీద వల్లమాలిన వ్యామోహమూ మమకారమూ ఉంటుంది. కొడవటి గంటి కుటుంబరావు వంటి కొందరు రచయితలు తప్ప గ్రామీణ జీవితాన్ని చిన్నచూపు చూసిన, అందులో పురోగతి గానీ అభ్యుదయం గానీ లేదని చెప్పిన రచయితలు తక్కువ. సాహిత్యంలోనూ, మన సాంఘిక భావజాలంలోనూ బేషరతుగా గ్రామాలను గ్లోరిఫై చేసే ధోరణి మనకు జాతీయోద్యమ … Continue reading

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

నూతన ఆర్థిక విధానం స్త్రీలపై దాని ప్రభావం- డా|| రమా మెల్కోట

గత కొద్ది సంవత్సరాలుగా మన దేశ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు, నూతన ఆర్థిక విధానం, అంతర్జాతీయ విధానాలు, వాటి ఉద్దేశాల గురించి కిందటి సంచికలో (జులై-సెప్టెంబర్‌, ’93) చర్చించటం జరిగింది. అలాగే డంకెల్‌ ప్రతిపాదనలు, వాటిని ఆమోదిస్తే మూడవ ప్రపంచ దేశాల్లో వచ్చే మార్పులు, పేటెంట్‌ హక్కుల వల్ల మనకు జరిగే నష్టం – … Continue reading

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

సామాన్యుల్ని అంచులకి నెట్టివేస్తున్న ‘నూతన ఆర్థిక విధానం’

– డా|| రమా మెల్కోటె వేపచెట్టు చుట్టూ ఈ రోజు చాలా రాజకీయాలు నడుస్తు న్నాయి. వేపచెట్టు ఉపయోగాల గురించి మనందరికి తెలిసిందే. కాని, మన ఇళ్ళ చుట్టూ ఎక్కడ పడితే అక్కడ కనిపించే వేపచెట్లు మనకు చెందకుండా అవి ఏదో కంపెనీకో లేక ఏదో పెట్టుబడిదారుకో చెందినవంటే, నమ్మడానికి వీలు కాదు.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

ముజఫర్‌నగర్‌ నరమేధం – బాధితుల గోడు

– భండారు విజయ  పచ్చని చెఱకు తోటలు తియ్యని సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆకాశం అప్పుడప్పుడు జల్లెళ్ళతోటి వర్షాన్ని కుమ్మరిస్తోంది. రోడ్లన్ని బురదతో చితుకుచితుకుగా… చిత్తడయి దారి అంతా గుంటలు, రాళ్ళకుప్పలు, గులకరాళ్ళు డబ్బాలో వేసి ఊపినట్లుగా, ఎప్పుడు ఏ పార్టు కారు నుండి విడిపోతుందో తెలియదు.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

నిషిద్ధ మేఘాల్లోకి మా యాత్ర

(ముజఫర్‌నగర్‌ మారణకాండ) – అనిశెట్టి రజిత మతం కన్నా మానవత్వం – కులం కన్నా గుణం వర్ణం కన్నా వ్యక్తిత్వం – వర్గం కన్నా మనిషితనం గొప్పది. మతమనేది తనలో తానొక సంపూర్ణ వ్యవస్థ కాదు.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

మహిళా ఉద్యమాలు : దృక్పథం – గమనం

– కాత్యాయనీ విద్మహే ఐదవ పంచవర్ష ప్రణాళికా కాలంలో (1974-79) ఎస్సీల, బిసిల, మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక కార్పోరేషన్‌ను ఏర్పరచిన ప్రభుత్వం ఆరు (1980-85) ఏడు (1985-90) ప్రణాళికా కాలాలలో సామాజిక సేవా పథకాలకు ప్రాధాన్యత నియ్యటం పెద్ద వైరుధ్యం. ఇది దళితులకు, వెనకబడిన వర్గాలను, మహిళలకు అభివృద్ధి చట్రం వెలుపల తారట్లాడే తాత్కాలిక ఉపశమనాలనే … Continue reading

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

మహిళా ఉద్యమాలు – దృక్పథం – గమనం

– కాత్యాయనీ విద్మహే 1980కి అంతర్జాతీయ మహిళా దశాబ్దిలో సగభాగం గడిచిపోయింది. 1980 వేసవిలో ‘కోపెన్‌హాగ్‌’లో యునైటెడ్‌ నేషన్స్‌ అర్ధదశాబ్ది సమావేశం వివిధ దేశాల మహిళా అధ్యయన కేంద్రాల భాగస్వామ్యంతో నిర్వహించబడింది కూడా.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

మహిళా ఉద్యమాలు దృక్పథం-గమనం

– కాత్యాయనీ విద్మహే ”స్త్రీల పరిస్థితి ఎంత దయనీయంగా వుందో నాకు బయటకు వెళ్ళకుండా మా కుటుంబాలను చూస్తేనే తెలిసొచ్చింది. పైగా ఈ స్త్రీలందరూ డబ్బు కలవాళ్ళు. వీళ్ళ జీవితాలే ఇంత బాధాకరంగా వుంటే ఇక నిరుపేద స్త్రీల బ్రతుకు ఎంత అద్వనంగా వుండి వుంటాయో అర్థమయింది. అప్పటినుండి స్త్రీల జీవితాలు మెరుగుపడాలనీ అందుకై కృషి … Continue reading

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

మరుగునపడిన చరిత్రలు

– ఊర్వశి బుటాలియ స్త్రీల చరిత్రల గురించి నాకెప్పటి నుంచి అవగాహన కలిగిందనే విషయాన్ని నేను ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను. ‘ఎప్పటి నుంచి అవగాహన’ అని ఎందుకంటున్నానంటే, ఈ క్రమం అంతా కూడా ఒక రకంగా ఎన్నో విషయాల కలయికగా వుంటుంది. ఈ కథలన్నీ కూడా నా మనసులో ఇంకుతూ వచ్చా యి. అలా ఒక … Continue reading

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

– ఆశాలత’ దోజ్‌ హూ డిడ్‌ నాట్‌ డై’ అనే తన పుస్తకంలో రచయిత్రి రంజన పథ పంజాబ్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలలోని మహిళల పై వ్యవసాయ సంక్షోభపు ప్రభావాన్ని వారు ఎదుర్కుంటున్న సమస్యలను వివరించారు. వ్యవసాయంలో అప్పులు పేరుకుపోయి

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | 1 Comment

– షేఖ్‌ . మహబూబ్‌ బాషా, లక్నో. ‘…. నేనెంతటిపనినైనను, సులభముగా జేయగలను. భర్త ప్రీతిచేతనే గదా, ద్రౌపతి ఎన్నో కష్టములకోర్చినది. మనమిరువరము పరస్పరానురాగము గలిగి, తగినట్టు సంసారము నడుపుకొనిన మనలనీ దరిద్రదేవత ఏమి చేయును?’ ఈ సమాధానంతో ‘మిగుల సంతోష’ పడ్డ భర్త ‘ఓ సుందరీ!

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

– ఓల్గా  మాలతీ చందూర్‌ 30వ దశాబ్దపు తొలి సంవత్సరంలో జన్మించారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆమె పదిహేడు సంవత్సరాల ఆధునిక యువతి. ఒక విశాలమైన అర్థంలోనైనా ‘ఆధునికత’ అంటే చెప్పుకోవటం అవసరం.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

– మల్లిక్‌ మరియు సమాఖ్య రిపోర్టు కమిటీ సభ్యులు దక్షిణ భారత ఆదివాసీల ఉమ్మడి సమస్యల పరిష్కారం కొరకు జాతీయ స్థాయిలో ఒక సమష్టి ప్రయత్నం రెండు సంవత్సరాల క్రితం (2011, నవంబరు) ”దక్షిణ భారత ఆదివాసీ సమాఖ్య” పేరుతో ప్రారంభమైంది. దీనిలో భాగంగా గత సంవత్సరం ఏప్రియల్‌ 15, 16 తేదీల్లో నాలుగు రాష్ట్రాల … Continue reading

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

‘నిర్భయ’ మృతి ఓ పిలుపూ, ఓ మలుపూ

పి. ప్రసాదు, ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ కూడా కైరో బాట పట్టింది. జంతర్‌ మంతర్‌ కూడా త్రెహ్రిక్‌ స్క్వేర్‌ను అనుసరించింది. ఇక్కడ కూడా ‘ట్విట్టర్‌’ సందేశాలతో సైబర్‌ యువతరం మొదటిసారి రోడ్డెక్కింది. ‘ట్యూనీస్‌ సిటీ’లో ఓ యువకుని విషాదభరితమైన ఆత్మార్పణ అరబ్‌ జాతీయ వెల్లువకి నాంది పలికింది.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

అభివృద్ధి, సాధికారత ప్రక్రియల మధ్య సమన్వయం లేకుంటే సాధించేది శూన్యమే

పరుచూరి జమున ‘కుటుంబశ్రీ’ అనే పథకం గురించి తెలుసు కొనేందుకు మన మంత్రివర్యులు, సి.ఇ.ఓ. శ్రీ రాజశేఖర్‌ గారితో కలసి కేరళలో మూడు రోజుల పాటు పర్యటించే అవకాశం కలిగింది. అరేబియా సముద్రానికి ఆనుకొని కొండమీద కట్టిన అతిథి గృహంలో మాకు బస ఏర్పాటు చేశారు.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment