-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
February 2021 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 Meta
Tags
Monthly Archives: February 2021
ఆడపిల్లల జీవితాలను అల్లకల్లోలం చేసే వివాహ వయస్సు పెంపు ప్రతిపాదన -సత్యవతి
”అష్ఠ వర్షాత్ భవేత్ కన్యా” అంటే ఎనిమిదేళ్ళు వచ్చిన బాలిక కన్య కిందే లెక్కకట్టి ఎనిమిదేళ్ళు నిండకుండా పెళ్ళి చేయాలి అనేది ఒకప్పటి నియమం. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ రాసిన గురజాడ ఉద్దేశ్యం బాల్య వివాహాలు చెయ్యొద్దని చెప్పడమే. అయితే ఈ కథ చదివిన వాళ్ళు, దృశ్యంగా చూసిన వాళ్ళు కడవల కొద్దీ కన్నీళ్ళు … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
జెండర్ స్పృహ లేని బండ వ్యవస్థలు – పి. ప్రశాంతి
చెంగుచెంగున ఎగురుకుంటూ వచ్చింది రాణి నేస్తాన్ని కలవడానికి కర్రలు, తాటాకులతో కట్టిన దడికి వెదురు తడికను గేటులా అమర్చారు. దాని తోసుకుని ఉత్సాహంగా ‘సోనీ… సోనీ… అని అరుచుకుంటూ లోపలికొచ్చింది. అక్కడే జామచెట్టు మొదట్లో కూర్చున్న సోని నిరాసక్తంగా చూసింది రాణిని. చలాకీగా ఉండే సోని అలా ఉలుకూపలుకూ లేనట్లు కూర్చోడం రాణికి ఆందోళన కలిగించింది. … Continue reading
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
చదువుకోండి… చదవనివ్వండి… చదివించండి… – ఉమా నూతక్కి
”యత్ర నార్యస్తు పూజ్యంతే రమతే తత్ర దేవతా, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలాః క్రియాః” అని మనుస్మృతి చెప్పింది అంటారు.
Posted in మంకెన పువ్వు
Leave a comment
జయశాలి భాగ్యమ్మ – డా|| చల్లపల్లి స్వరూపరాణి
యిటీవల దళిత ఉద్యమాన్ని ప్రతిఘటనా స్థాయికి తీసుళ్ళిె అటు ప్రభుత్వాలకు, యిటు పెత్తందారీ కులాల దౌర్జన్యకారులకు మింగుడు పడకుండా వార్తలలో వ్యక్తిగా అసాధారణమైన గుర్తింపును పొందిన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం, పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన నిరక్షరాస్యురాలైన డెభ్బై రెండు సంవత్సరాల వృద్ధ దళిత పేద స్త్రీ జొన్నలగడ్డ జయ భాగ్యమ్మ. ఆమె తల్లిదండ్రులు పుల్లగూర … Continue reading
Posted in మిణుగురులు
Leave a comment
గమనమే గమ్యం – ఓల్గా
రాజమండ్రికి ఎక్కడెక్కడి నుంచో పెద్దలు వస్తున్నారు. పంతులు గారిని పరామర్శిస్తున్నారు. అందరికీ రాజ్యలక్ష్మి అంటే గౌరవం. అందరూ ఆమె చేతి అన్నం తిన్నవారే.
Posted in ధారావాహికలు
Leave a comment
కొండ ఒడిలో మరో ప్రపంచం ఈ కొండబడి… -పి. ప్రశాంతి
స్వేచ్చగా, నిర్భయంగా, ఎటువంటి కట్టడులు లేకుండా, ఆడుతూ పాడుతూ గడిచే కాలం ఎంత నిర్మలంగా ఉంటుంది! పచ్చటి చెట్లమధ్య, స్వచ్చమైన పచ్చిగాలి పీలుస్తూ, మట్టి పరిమళాన్ని ఆస్వాదిస్తూ, వాగునీటి సంగీతం వింటూ, సీతాకోకచిలుకల్లా తిరుగుతుంటే జీవితం ఎంత నిమ్మళంగాఉంటుంది!
Posted in వినూత్నం
Leave a comment
అంతర్జాతీయ మానవ హక్కుల దినం సందర్భంగా జరిగిన సమావేశం -భూమిక టీం
భూమిక ఉమెన్స్ కలెక్టివ్ 16 రోజుల యాక్టివిజమ్ పూర్తయిన సందర్భంలో హోటల్ అక్షర గ్రాండ్‌లో భూమిక మిత్రలు, వాలంటీర్లు మరియు సిబిఓ లీడర్లతో కలిసి 10 డిసెంబర్ 2020న సమావేశం నిర్వహించడం జరిగింది. భూమిక ఉమెన్స్ కలెక్టివ్ ఛీఫ్ ఫంక్షనరీ కొండవీటి సత్యవతి మాట్లాడుతూ భూమిక సంస్థ ఎప్పుడు ప్రారంభమయింది, దాని ప్రస్థావం గురించి వివరించారు. … Continue reading
Posted in రిపోర్టులు
Leave a comment
మునికాంతపల్లి కథలు -వంజారి రోహిణి
ఊరూరా ఉండే పుల్లమ్మ, ఎల్లవ్వ, ఎలిజబెత్ అక్కా, నజీర్ బాబాయ్, సుబ్బయ్య తాత… అందరూ ఓ తూరి ఈడకి రాండిరి. నేను మన ‘సొలోమోన్ ఇజియ కుమార్’ రాసిన ‘మునికాంతపల్లి కతలు’ పుస్తకం గురించి సిన్న సమీచ్చ రాసిన. అందరి మాదిరి చెప్పకుండా మన ఇజియ కుమారుకి జాబు రాసినట్టు చెప్పిన. మీరు గుడా చదవండి.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
దేశకాకి! -బమ్మిడి జగదీశ్వరరావు
కాదేదీ కథకనర్హం కథలు కాకి కాకి కడవల కాకి కడవను తెచ్చి గంగలో ముంచి గంగ నాకు నీళ్ళు ఇచ్చె నీళ్ళను తెచ్చి ఆవుకు ఇస్తే
Posted in కధానికలు
Leave a comment
నైల్ నది – వేలూరి కృష్ణమూర్తి
తమిళం: ఎస్.రామకృష్ణన్, మైసూరు కన్నడం: నల్లతంబి ఆ కారులో ఐదుమంది ఉన్నారు. మంచు మూసుకొన్న దారిలో కారు ముందుకు సాగిపోతోంది. కారులో ఉన్నవారిలో ఇద్దరు భారతీయులు. మిగిలిన ముగ్గురు ఉగాండాకు చెందినవారు. కారు నడుపుతున్నవాడు ఆ ఐదుగురిలో చాలా చిన్నవాడు. అతడి పేరు మువాంగా. అతనికి పద్దెనిమిదేళ్ళ వయసు. కానీ, అతడు మంచి దృఢకాయుడు. ఆరడుగుల … Continue reading
Posted in గల్పికలు
Leave a comment
స్నేహలత హత్య నుండి మనం ఏం నేర్చుకుందాం? -మానవ హక్కుల వేదిక
ప్రజలారా! 23-12-2020న ధర్మవరం దగ్గర స్నేహలత ప్రేమోన్మాది చేతిలో పాశవికంగా హత్య చేయబడింది. వెంటనే టీవీలలోనూ, వార్తా పత్రికలలోనూ ఈ వార్తను ప్రముఖంగా చూపారు. సామాజిక సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు పరామర్శ పేరుతో బారులు కట్టి వారి వారి పార్టీల అజెండా ప్రకారం ప్రకటనలిచ్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. సంఘాలు, రాజకీయ సంస్థలు, … Continue reading
Posted in కరపత్రం
Leave a comment
మహిళా రైతుల హక్కుల వేదిక -మకాం
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలు మహిళా రైతుల ప్రయోజనాలకు హాని కలిగిస్తాయి. ప్రభుత్వం వాటిని రద్దు చేయాలి, రాష్ట్రపతి తిరస్కరించాలి.
Posted in కరపత్రం
Leave a comment
నా వాళ్ళ ఎముకలు ఉన్నచోటే నా ఇల్లు! -మమత. కె
నులివెచ్చని ఎండ నా ఎదురుగా ఉన్న గుట్టకు వింత రంగులు పులుముతోంది. గుట్ట మీద సుపరిచితమైన దృశ్యం. కమానుతో కూడిన ద్వారబంధం. అందులోంచి లీలగా కనిపిస్తున్న ఒక స్మారక స్థూపం. పుస్తకాల్లో, సినిమాల్లో, ఆన్‌లైన్లలో చూసిన దృశ్యం. ఇప్పుడు కళ్ళముందు కనపడేసరికి వెన్నులో గగుర్పాటు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన సౌత్ డకోటాలోని ”వూండెడ్ నీ” … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
వలసాంధ్రలో స్త్రీ చైతన్య కెరటం – మరుగునపడ్డ స్త్రీ వాది వి.సరస్వతి – డా|| షేఖ్ మహబూబ్ బాషా
బ్రిటిషాంధ్రలో మహిళా చైతన్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెల్లివిరిసింది. పలువురు స్త్రీలు 20వ శతాబ్ది ప్రారంభం నుండి స్పష్టమైన స్త్రీవాద భావజాలంతో రచనలు చేయడం ప్రారంభించారు. 1920ల్లో వీరి రచనలు పదును సంతరించుకున్నాయి. వివిధ స్త్రీల పత్రికల్లో రచనలు చేసిన స్త్రీలు పితృస్వామ్య భావజాలాన్ని సూటిగా ప్రశ్నించి జెండర్ న్యాయాన్ని బలంగా ప్రతిపాదించారు. ఈ … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
సాఫ్ట్‌వేర్ నానీలు -కుడికాల వంశీధర్
ఇతరుల దృష్టిలో ఐటి ఉద్యోగులు స్వదేశంలోనే ప్రవాసులు! ఒకప్పుడు మాటల్లో ఫోన్ హ్యాంగ్ అయ్యేది నేడు ఫోన్‌కే హ్యాంగ్ అయ్యారు
Posted in కవితలు
Leave a comment