Monthly Archives: March 2021

భూమిక – మార్చి, 2021

భూమిక – మార్చి, 2021

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ప్రతిస్పందన 

సంపాదకులకు, అద్భుతం ‘కొండ ఒడిలో… కొండబడి’ ఫిబ్రవరి భూమిక సంచికలో ప్రచురించిన ప్రశాంతి గారి ‘కొండ ఒడిలో మరో ప్రపంచం ఈ కొండబడి…’ ఎంత అద్భుతంగా ఉంది. ‘కొండ ఒడిలో… కొండబడి’ వినడానికే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అమాయక ఆదివాసీల జీవితాలలో వెలుగులు నింపడానికి వారి భాగస్వామ్యంతోనే ‘కొండబడి’ ఆవిష్కరించబడడం మరింత అద్భుతం. మానవత్వంలో కొండంత … Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకురాలు సత్యవతి గారికి, మాకు తెలియని 18వ శతాబ్దం చివరి దశాబ్దాలు, 20వ శతాబ్దపు తొలి దశాబ్దాలకు సంబంధించిన మన సాంఘిక చరిత్రకు మూలకారకులైన నాయికా నాయకుల నేపథ్యంలో ఓల్గా గారు ‘గమనమే గమ్యం’ అన్న నవలను వ్రాయడం, ఆ నవలను మీరు భూమికలో జనవరి సంచిక నుంచి ధారావాహికంగా ప్రచురిస్తుండడం ముదావహం. ఓల్గా … Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు, భూమిక ఫిబ్రవరి సంచిక ఇప్పుడే చూశాను. సంపాదకీయంలో ఆడపిల్లల పెళ్ళి వయసు పెంచే ప్రతిపాదన గురించి చదివాను. పోయిన వారం ఈ వార్త పేపర్‌లో చూసినప్పుడే అనుకొన్నా, ఇది తప్పు అని. 18 ఏళ్ళ పెళ్ళి వయసును ఇంకా పెంచటం అనవసరం. ఎలాగూ ఇప్పుడు 20 ఏళ్ళు దాటాకనే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. కానీ … Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

పురుషత్వపు భ్రమల్లో… – పి. ప్రశాంతి

కోడి కూతతో పాటే చూరులో పిచ్చుకల కిచకిచలకి మెలకువ వచ్చింది అరుణకి. అర్థరాత్రి దాటాక ఎప్పటికో నిద్రపట్టింది కానీ నిద్రనిండా కలలే. బద్ధకంగా ఉన్నా లేచి కూర్చుంది. తొందరగా పనులు పూర్తి చేసుకుని మండలంలో ఉన్న బ్యాంక్‌కి ఎల్లాలను కుంటూ ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. రాత్రి జరిగిన గొడవ, భర్త అసహాయంగా కూలబడిన దృశ్యం … Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

సాంఘి’కుల’ జడ్జిమెంట్స్‌ – ఉమా నూతక్కి

స్త్రీల పట్ల ప్రపంచ దృక్పథం చాలా మారింది. ప్రస్తుత సమాజంలో చాలామంది అభిప్రాయం ఇది. నిజమే… చాలా మారింది. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలు విద్యావంతుల వుతున్నారు. మగవాళ్ళతో సమానంగా

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

కుల పితృస్వామ్యానికి వైద్యం చేసిన జ్యోతి లింగమ్మ – డా|| చల్లపల్లి స్వరూపరాణి

అవి 19వ శతాబ్దపు చివరి రోజులు. ఒకపక్క బ్రిటిష్‌ పాలనలో ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం అర్రులు చాస్తుంటే సామాజిక అంతస్తుల్లో ఆఖరి మెట్టుపైన ఉన్న కులాలు, అంటరానితనం, వెట్టిచాకిరీ, అవిద్య చుట్టుముట్టిన చీకటి కుహరంలో దుర్భరమైన పీడనను అనుభవి స్తున్నారు. చదువంటే కేవలం అగ్రహారాలలో పుట్టి పెరిగిన వారికి తప్ప ఇతరులకు అంతగా అందుబాటులోకి … Continue reading

Share
Posted in మిణుగురులు  | Leave a comment

మనోవ్యాధికి మందుంది – శివరాజు సుబ్బలక్ష్మి

డాక్టర్‌ మాధవరావు ఆ ఊరొచ్చి ఐదారు నెలలే అయినా మంచి పేరు తెచ్చుకున్నాడు. పేదవాళ్ళను ఎంతో దయగా చూసేవాడు. ఆ హాస్పిటల్‌లో అతనితో కలిసి పనిచేస్తున్న లేడీ డాక్టర్‌ కమల మొదట్లో ఇదంతా పేరు కోసం తెచ్చిపెట్టుకున్న ప్రవర్తన అనుకున్నా, తర్వాత్తర్వాత అతని పట్ల గౌరవభావం చూపసాగింది. ఆ రోజు మధ్యాహ్నం తాను హాస్పిటల్‌కి రానని … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

మట్టిగోడల మధ్య గడ్డిపోచ – శివరాజు సుబ్బలక్ష్మి

ఆ ఏడు వేసంగి ఎండలు మండిపోతున్నాయి. పొద్దువాలినా వేడి తగ్గలేదు. పసిపిల్లలు తట్టుకోలేక కంఠం జారిపోయేలా గోలపెడుతున్నారు. ముసలి అవ్వ ఆపుకారా పక్కన పెట్టుకుని కంఠం తడుపుకుంటూ తడిబట్ట వంటికి చుట్టుకు వచ్చే పోయేవాళ్ళని ”టైం ఎంతయిందర్రా” అంటూ గడుపుతోంది.

Share
Posted in కథలు | Leave a comment

గమనమే గమ్యం – ఓల్గా

ఉదయాన్నే చల్ల చిలికే చప్పుడికి నిద్ర లేస్తుంది శారద. అప్పటికే దాసి వచ్చి ఇంటి ముందంతా ఒత్తుగా పేడ కళ్ళాపి చల్లేస్తుంది. ఈ మధ్యనే నరసమ్మ శారదకు ముగ్గులు వేయటం నేర్పింది. ధనలక్ష్మి కూడా చాలా నేర్పింది. శారదా వాళ్ళింటి ముందున్నంత చోటు ఎవరింటి ముందూ లేదు. ఆ చోటంతా ముగ్గులు పెట్టటంలో అమిత శ్రద్ధ … Continue reading

Share
Posted in ధారావాహికలు | Leave a comment

గర్భిణీల వార్డు – అయోధ్యా రెడ్డి

డోరిస్‌ లెస్సింగ్‌ (1919-2013) పరిచయం : సుప్రసిద్ధ బ్రిటన్‌ రచయిత్రి, నోబెల్‌ సాహిత్య బహుమతి గ్రహీత డోరిస్‌ లెస్సింగ్‌, 1919 అక్టోబర్‌లో పెర్షియా (ఇరాన్‌)లోని కెర్మాన్‌ షాలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులిద్దరూ బ్రిటిష్‌ సంతతివాళ్ళే. చాలాకాలం రొడేషియా (ప్రస్తుత జింబాబ్వే)లో నివసించి తొలుత నర్స్‌ మెయిడ్‌గా, టెలిఫోన్‌ ఆపరేటర్‌గా పనిచేశారు. అక్కడే ఆమె సాహిత్య సృజనకు … Continue reading

Share
Posted in అనువాదాలు | Leave a comment

సాహిత్య కళా విదుషీమణి శివరాజు సుబ్బలక్ష్మి – శీలా సుభద్రాదేవి

పన్నెండో ఏట శివరాజు వేంకట సుబ్బారావు (బుచ్చిబాబు) చిటికెనవేలు పట్టుకొని సంసార బంధంలోకి వచ్చిన సుబ్బలక్ష్మిగారు… కథకుడు, చిత్రకారుడు అయిన బుచ్చిబాబు భార్యగా మాత్రమే ఒదిగిపోలేదు. బుచ్చిబాబు గారి స్ఫూర్తితోనే కలం, కుంచె చేతిలోకి తీసుకొని ఒక చేత కథలల్లటం మొదలుపెట్టి ‘కావ్య సుందరి కథ, ఒడ్డుకు చేరిన కెరటం, మనోవ్యాధికి మందుంది, మగతజీవి చివరి … Continue reading

Share
Posted in నివాళి | Leave a comment

నివాళి

శివరాజు సుబ్బలక్ష్మిగారికి నివాళి 2018లో నేను మొదటిసారి శివరాజు సుబ్బలక్ష్మిగారిని చూసాను. అమృతలత ప్రతి సంవత్సరం అందించే అపురూప అవార్డ్స్‌ ఫంక్షన్‌కి సుబ్బలక్ష్మిగారి ఆత్మీయ అతిధిగా వచ్చారు. ఆ రోజు అవార్డ్స్‌ ఫంక్షన్‌ పూర్తవ్వగానే స్టేజి మీదకి వెళ్ళి తనని కలిసాను. అప్పటికే చాలా ఆలస్యం అవ్వడం వల్ల ఎక్కువ సేపు మాట్లాడటానికి కుదరలేదు. నాకేమో … Continue reading

Share
Posted in నివాళి | Leave a comment

మమతల మల్లెలు – శ్రీలత అలువాల

మల్లెల సువాసనలను తన కథల ద్వారా వెదజల్లాలని ఆకాంక్షిస్తూ డా||తాళ్ళపల్లి యాకమ్మ గారు కథా రచనను మొదలు పెట్టారనిపిస్తుంది. తన అనుభవాలను రంగరించి పాఠకులకు తమ జీవితంలోని సంఘటనలను గుర్తుచేసే విధంగా ఈ కథలు కొనసాగుతాయి. అణగారిన వర్గంలో పుట్టిన దళిత బిడ్డగా, ఒక సగటు మహిళగా తన జీవితాన్ని సఫలీకృతం చేసుకోవడానికి తాను పడ్డ … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

అత్యాచారం వ్యక్తిగతం కాదు… సామాజిక నేరం – షేక్‌ పీర్ల మహమూద్‌

ఓ బూర్జువా సమాజం నిర్మించే చట్టాలతో నేరాలను ఏ మేరకు కట్టడి చేయగలం? ఈ సమాజానికి ఇంకో అదనపు కోర కూడా ఉంది. అది పితృస్వామ్యం. పురుషుల ఆధీనంలో నడిచే వ్యవస్థ స్త్రీల సహజ హక్కులను కాపాడగలదా? మగాడు కేంద్రంగా తయారు చేయబడిన ఏ చట్టమూ సరిగా పనిచేయదు. వరకట్న నిషేధ చట్టం దీనికో ఉదాహరణ. … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

కార్పొరేట్ల కబంధ హస్తాల్లో వ్యవసాయం -ఎ.నర్సింహారెడ్డి

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన సమయంలో, ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడుతున్న వేల ప్రజల ప్రాణాలను ఎంత మాత్రం పట్టించుకోని మోడీ ప్రభుత్వం తన ఆశ్రితుల కోసం, స్వదేశీ విదేశీ వ్యవసాయ వాణిజ్య సంస్థల కోసం రైతులను సంక్షోభంలోకి నెట్టే అతి ప్రమాదకరమైన మూడు వ్యవసాయ చట్టాలు చేయడం దారుణం. ఆదరాబాదరా తెచ్చిన చట్టాలు … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment