Monthly Archives: January 2021

భూమిక – జనవరి, 2021

భూమిక – జనవరి, 2021

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

తొలి తరం సామాజిక ఉద్యమకారిణి ‘సావిత్రిబాయి ఫూలే’ – పులి కవిత

గత సంవత్సర కాలంగా దేశమంతా ఎదుర్కొంటున్న ఉద్విగ్న సందర్భాలను చూస్తోంటే సమాజం తిరోగమనం దిశగా వెళ్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇలాంటి సమయంలో దాదాపు 150 ఏండ్ల క్రితం సమాజం మార్పునకు కృషి చేసిన మహనీయుల సేవలను మరొక్కమారు గుర్తు చేసుకోవాలని అనిపిస్తోంది. ముఖ్యంగా తొలి తరం సామాజిక ఉద్యమకారిణి, ఆధునిక భారతదేశపు తొలి మహిళా

Share
Posted in గెస్ట్ ఎడిటోరియల్ | Leave a comment

ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌ గార్కి , ”భూమిక” నవంబరు సంచికలో డా|| తిరునగరి దేవకీ దేవి గారు ప్రచురించిన ”బతకమ్మ పాటలలో స్త్రీల మనో భావాలు” – పాటల పరిణామ క్రమం అనే పరిశోధన గ్రంధాన్ని అనిశెట్టి రజిత గారు అర్థవంతంగా పుస్తక పరిచయం చేసారు. వారికి ధన్యవాదములు.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

పశ్చాత్తాపం లేని ఒక కార్పొరేట్‌ దళారీ – అశోక్‌ కుంబము

భారత ప్రభుత్వంతో రైతులు వీరోచితంగా చేస్తున్న పోరాటాన్ని మండీ దళారుల ప్రోత్సాహంతో నడిపిస్తున్న కృత్రిమ ఉద్యమంగా చిత్రీకరించే పనిని కొందరు మేధావులని ముద్రవేసుకున్న వాళ్ళు భుజానికి ఎత్తుకున్నారు. ప్రస్తుతం తెలుగు నేల మీద అలాంటి పని చేస్తున్న వాళ్ళలో ప్రముఖుడు జయప్రకాష్‌ నారాయణ (జెపి).

Share
Posted in Uncategorized | Leave a comment

ఆచారాలు సరే చట్టాల సంగతేంటి? – పి. ప్రశాంతి

కొండ చరియల్లో చెట్లని చాటు చేసుకుంటూ చకచకా కొండ కిందికి దిగిపోతున్నాడు రాజిరెడ్డి. ఎక్కడా ఆగకుండా లోయలాంటి చోటు వాగు ఒడ్డుకి చేరుకుని చిన్న బండమీద కూర్చుని అప్పుడు మాత్రమే వెనక్కి తిరిగి అల్లంత దూరంలో కొండపైన బొమ్మరిళ్ళలా కనిపిస్తున్న తన గ్రామంవైపు చూశాడు. చెట్ల కొమ్మలు, ఆకుల సందుల్లోంచి కాస్త వెలుతురు సోకుతున్నా తనెవరికీ … Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

మనసు చదివి చూడు – ఉమా నూతక్కి

ఈ మధ్య పత్రికల్లో ఒక వార్త చదివాను, శీతల్‌ ఆమ్టే ఆత్మహత్య చేసుకుని చనిపో యిందని. అదే సమయంలో తమిళ నాడులో ఒక నటి ఆత్మహత్య చేసుకున్న వార్త. తెలంగా ణలో ఒక తల్లి తన ఇద్దరు కూతుళ్ళతో సహా ఆత్మహత్య చేసుకున్న వార్త. ఒక్కో వార్తా చదువుతున్నప్పుడల్లా మనసు వికలమై పోతూ ఉంది. ఏ … Continue reading

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

ఆమె ఒక కాంతిపుంజం – డా|| చల్లపల్లి స్వరూపరాణి

ఎక్కడ పదిమంది అంబేద్కర్‌ బొమ్మ దగ్గర చేరి నినాదాలు ఇస్తున్నా అక్కడ ఒకే ఒక వయసు మళ్ళిన స్త్రీ కనిపిస్తారు. ఎక్కడ దళిత సమస్యపై సభ జరిగినా అక్కడ వేదికపై ఒకే ఒక మహిళ కనిపిస్తారు. క్రిస్మస్‌ పండగ రోజు తన ఈడు ఆడవాళ్ళంతా కుటుంబంతో చర్చికి వెళ్ళి ఆధ్యాత్మికంగా గడిపితే ఆమె మనుస్మృతి దహన … Continue reading

Share
Posted in మిణుగురులు  | Leave a comment

గాలివాన – సుజాత తిమ్మన

ఇంటికి తాళం పెడుతూ సరిగా పడిందా లేదా అని మళ్ళీ చూసుకుని ఒకసారి ఇంటిముందు ఉన్న చెట్లని, పూలమొక్కలని తనివితీరా చూస్తూ, మనసులో తన అర్ధాంగి లలితను గుర్తు చేసుకున్నాడు మోహనరావు. ఆవిడ ఈ లోకం విడిచి సరిగ్గా నలభై రెండు రోజులు. యాదయ్యకు గేటు తాళం వేసి వెళ్ళమని చెప్పగానే, అతని వెనకాలే సూట్‌కేస్‌ … Continue reading

Share
Posted in కధలు | Leave a comment

గమనమే గమ్యం – ఓల్గా

పరిచయం గమనమే గమ్యం నవలను భూమికలో ధారావాహికంగా ప్రచురించడానికి అనుమతినిచ్చిన ఓల్గాకి ధన్యవాదాలు. డా|| కొమర్రాజు అచ్చమాంబ జీవన స్ఫూర్తితో సాగిన ఈ నవల భూమిక పాఠకుల కోసం. – ఎడిటర్‌

Share
Posted in ధారావాహికలు | Leave a comment

వివాహ మంత్రాల తాత్పర్యం -అబ్బూరి ఛాయాదేవి

ఇది పెళ్ళిళ్ళ సమయం. ఎందరో వధూవరులు పెళ్ళిపీటల మీద కూర్చుని పురోహితుడు చదివే మంత్రాలను వింటున్నారు. కొన్నింటిని చిలక పలుకుల్లా పురోహితుడు చెప్పమన్నట్లు చెబుతున్నారు. అందులో ఎందరికి తెలుసు వివాహ మంత్రాల అర్థాలు? పీటలమీద కూర్చున్న వాళ్ళకి తెలియవు. పెళ్ళికి వచ్చిన ఆహుతులకూ తెలియవు, ఎవరో ఒకరిద్దరికి తప్ప.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రకృతి బిడ్డలు -రమాదేవి చేలూరు

పచ్చగా, దట్టంగా, నిండుగా, ఏపుగా అడవి అల్లిబిల్లిగా ఉంది. అడవికావల ఏరు యదేచ్ఛగా తేటగా వయ్యారంగా పారుతూ ఉంది. ఏటిగట్టున ఊరుంది. ఊరు ఒద్దికగా, ముద్దుగా, చిక్కుడు పందిరి ప్పుకున్న గుడిసెల్లో నవవధువులా ముచ్చటగా ఉంది. ఊరు చుట్టూ మైదానంలో పోడు వ్యవసాయ భూములున్నాయి. జొన్న, మొక్కజొన్న, ఉలవలు, సామలు పండుతాయి. అది ఆదివాసీల గూడెం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కనీస మద్దతు ధర అంటే ఏమిటి? ఎందుకు? – పి.ఎస్‌.అజయ్‌కుమార్‌

అందరికీ ఒక మాట సుపరిచితమయింది. అదే ‘కనీస మద్దతు ధర’ (వీూూ-వీఱఅఱఎబఎ ూబజూజూశీత్‌ీ ూతీఱషవ). ఇది దేశ రాజధాని చుట్టూ మోహరించిన రైతు ఉద్యమం వలనే సాధ్యమయింది. అనేక దశాబ్దాలుగా రైతులు వ్యవసాయంలో సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇప్పటివరకూ 3.5 లక్షలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. వీటి పరంపర ఇంకా కొనసాగుతూనే

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కార్పొరేట్లకు ప్రత్యామ్నాయం సహకార సంఘాలే – కన్నెగంటి రవి

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రైతాంగ ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతున్నది. కేంద్రం ఏకపక్షంగా రైతుల ఆకాంక్షలను, అన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రాలను పక్కనపెట్టి తనకున్న బండ మెజారిటీతో ఆమోదించిన 3 వ్యవసాయ రంగ చట్టాలు, దేశంలో చర్చకు పెట్టిన విద్యుత్‌ బిల్లు 2020 గ్రామీణ ప్రజలలో భయాందోళనలను రేకెత్తించాయి. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు భిన్నంగా, కేంద్ర ప్రభుత్వం … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వ్యవసాయ చట్టాలు ఎవరికి చుట్టాలు – అబ్దుల్‌ వాహెద్‌

భారతీయ జనతా పార్టీపై రైతులు మండిపడుతున్నారన్నది స్పష్టంగా తెలుస్తున్న వాస్తవం. రైతుల ఆగ్రహం ఇప్పుడు బీజేపీకి, ఎన్డీయేలో మిత్రపక్షాలకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సవాలుగా మారవచ్చు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లోని రైతులే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, కేరళ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

దేశంలో కొత్త రైతు చట్టం – దాని పరిణామాలు – ఎర్రోజు శ్రీనివాస్‌

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రైతు చట్టాలను, వాటి పర్యవసానాలను తెలుసుకునే కంటే ముందు పాత చట్టం ఏమి చెబుతుందో కూడా పరిశీలిద్దాం. భారతదేశంలో గల భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక భిన్నత్వాన్ని రూపుు మార్చాలని, దేశాన్ని ఏకరూప రాజ్యాంగా మార్చాలని అనుకునే కుట్రలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా నూతన చట్టాలు రూపొందించబడ్డాయి. ఇది … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పిల్లలపై లైంగిక హింస – కమలాభాసిన్‌

ముందుమాట ‘హింసలేని సమాజం మహిళల, బాలికల హక్కు’ అనే నినాదంతో 1993 నుండి భూమిక ఉమెన్స్‌ కలక్టివ్‌ నిరంతరాయంగా పనిచేస్తుంది. ఇంటా, బయట స్త్రీలు, పిల్లలు ఎదుర్కొనే హింసకు సంబంధించి వివిధ పద్ధతుల ద్వారా భూమిక పనిచేస్తున్నది. అందులో ముఖ్యమైనది ఇరవై నాలుగు గంటలూ పనిచేసే హెల్ప్‌లైన్‌ను బాధితులకు అందుబాటులో ఉంచడం. పోలీస్‌ స్టేషన్‌లలో స్పెషల్స్‌ … Continue reading

Share
Posted in సమాచారం | Leave a comment