-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: వ్యాసాలు
డెబ్భై ఐదేళ్ళుగా నెత్తురోడుతున్న పాలస్తీనా గాయం – నరేన్
‘‘నా పేరు రోసలిండ్ పెచాస్కీ. నేనిక్కడ న్యూయార్క్లో వేలాది మందితో జమగూడాను. మాలో చాలామంది యూదులు కూడా ఉన్నారు. గాజాలో జరుగుతున్న మారణకాండను వ్యతిరేకించడానికి ఇక్కడ మేము గుమిగూడాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆగాల్సిందే. గాజా నుండి వస్తున్న దారుణమైన వార్తలు వింటూ మేము రోజూ దుఃఖిస్తున్నాము.
Posted in వ్యాసాలు
Leave a comment
భామ్రాగడ్లో నెలసరి నరకయాతన – జ్యోతి శినోలి
అనువాదం: సుధామయి సత్తెనపల్లి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మాడియా సముదాయానికి చెందిన మహిళలను ఋతుక్రమానికి సంబంధించిన అపోహలు బలవంతంగా ఊరి బయట ఉండేలా చేస్తున్నాయి. శిథిలమై, అపరిశుభ్రంగా ఉండే ‘కుర్మా ఘర్’లో ఒంటరిగా ఉండాల్సి రావటం వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
Posted in వ్యాసాలు
Leave a comment
సనాతన ధర్మ మర్మం విప్పిన కొడవటిగంటి కుటుంబరావు కథలు – కాత్యాయనీ విద్మహే
కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యమంతా 1931`1980 మధ్యకాలంలోనిది. చదివిన ఫిజిక్స్ బిఎ, 1930లలో అందివచ్చిన మార్క్సిస్ట్ అవగాహన ఆయన ఆలోచనలకు శాస్త్రీయమైన చూపును ఇచ్చాయి. ఆ క్రమంలోనే అరసం (1942), విరసం (1970) సహజంగా ఆయన చిరునామా అయ్యాయి.
Posted in వ్యాసాలు
Leave a comment
వ్యాపార ప్రకటనలు – స్త్రీవాద ప్రభావం – డా.అయ్యగారి సీతారత్నం
ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యాపార రంగం ప్రాముఖ్యత పెరిగింది. వ్యాపార రంగంలో వ్యాపార ప్రకటనల ప్రాధాన్యత పెరిగింది. ఈ రంగంలో ప్రకటనలు అత్యంత ముఖ్యమైనవి. వ్యాపార ప్రకటనలు కేవలం వస్తువుల అమ్మకాన్ని పెంచేవి మాత్రమే కాదు, సమాజంపై, వ్యక్తులపై
Posted in వ్యాసాలు
Leave a comment
స్త్రీ గెలుపు ‘నాచి విజయం – అనిశెట్టి రజిత
క్రీస్తు శకం ఏడవ శతాబ్దానికి చెందిన చరిత్ర ప్రసిద్ధుడైన శాస్త్ర నిష్ణాతుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఏలేశ్వరోపాధ్యాయుడు. వీరిది ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబం. ఆంద్ర విదుషీమణులు అనే గ్రంథంలో ఆంధ్ర శేషగిరిరావు గారు, వీరు పల్నాటి ప్రాంతం వారని రాశారు. కానీ, తెలంగాణ పరిశోధకులు ఏలేశ్వరోపాధ్యాయుడు నల్గొండ జిల్లా వాసి అని కొన్ని ఆధారాలు చెప్తున్నారు. అది … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
ఓరుగంటి మహాలక్ష్మమ్మ ` ఆంధ్రప్రదేశ్లో బహుముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు-డా॥ వి.దిలీప్కుమార్
19వ శతాబ్దంలో భారతదేశంలోని సామాజిక`మతపరమైన ఉద్యమాలు పూర్తిగా భిన్నమైనవి. ఈ ఉద్యమాలు స్వాతంత్య్ర పోరాటం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి దోహదపడ్డాయి. బ్రిటీష్ పాలనకు బదులుగా భారతదేశం తన స్వంత నిర్ణయం తీసుకోవాలని ప్రజలు భావించడం ప్రారంభించారు. ఆంధ్రాలో రాజకీయ చైతన్యం, ముఖ్యంగా స్త్రీల భాగస్వామ్యం విశాల దృక్పథంగా పరిగణించబడుతుంది.
Posted in వ్యాసాలు
Leave a comment
తెలుగు ప్రాచీన కావ్యాలలో కవయిత్రులు జాతి, వార్త, చమత్కారాలు – వేపాడ మమత
1. ఉపోద్ఘాతంః తెలుగు లిఖిత సాహిత్యం ఆవిర్భావానికి పూర్వం వేదకాల సాహిత్యంలో యజుర్వేదంలో సులభ, గార్గి, మైత్రేయి, అపల, ఘోష, గోధ, విశ్వపర, లోపాముద్ర, జహుర్నామ వంటి స్త్రీ పండితుల పేర్లు కనిపిస్తున్నాయి. తెలుగు నాట తొలి సంకలన గ్రంథం ‘‘గాథా సప్తశతి’’. ఇందులోని మహిళా కవులతో తెలుగు మహిళా కవుల ప్రాచీనత క్త్రీస్తు శకం … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
అతడు అడవికి అండ – కొమెర జాజి – కొండవీటి సత్యవతి
కొమెర జాజి… ఇతని గురించి రాయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. నల్లమల అడవితో నా అనుబంధం చాలా గాఢమైంది. నల్లమలలో చాలా ముఖ్యమైన ఒక కృషి గురించి రాయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను.
Posted in వ్యాసాలు
Leave a comment
నూరేళ్ళ ‘మాలపల్లి’ – వి. ప్రతిమ
ఇది మాలపల్లి శతజయంతి సంవత్సరం… అంటే రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ గారి శతజయంతి సంవత్సరం కాదు… వారి రచన మాలపల్లికి జరుగుతున్న శతజయంతి ఉత్సవం.
Posted in వ్యాసాలు
Leave a comment
కట్టెల పొయ్యిల్లో ఊపిరాడని బ్రతుకులు – పార్ధ్ ఎం.ఎన్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
అనువాదం : నీరజ పార్థసారధి వంట కోసం నాణ్యమైన ఇంధనం అందుబాటులో లేని కారణంగా నాగపూర్లోని చిఖలీ మురికివాడకు చెందిన అనేకమంది మహిళలు శ్వాసకోశ వ్యాధులు, శ్వాస తీసుకోవ డంలో ఇబ్బందులు, ఊపిరితిత్తులు దెబ్బతినడం వంటి సమస్యలకు గురవుతున్నారు.
Posted in వ్యాసాలు
Leave a comment
కుట్రలు, కుతంత్రాలను కుకీలు ఎప్పటికైనా తిప్పికొడతారు – భండారు విజయ
ఈశాన్య రాష్ట్రంలో ఒక్కసారిగా మంటలు భగ్గుమని మండలేదు. కొన్ని దశాబ్దాలుగా ఇరు జాతుల మధ్య ఉన్న అనేక వైరుధ్యాలు, వైషమ్యాలతో పాటు వలసవాద రాజకీయాలు వారి మధ్యన జొచ్చి వర్గపోరుకు దారులు తీయించింది. 1981లో భారత రాజ్యాంగం, 371సి
Posted in వ్యాసాలు
Leave a comment
మనుస్మృతిని అంబేద్కర్ ఎందుకు తగలబెట్టారు? – డాక్టర్ దేవరాజు మహారాజు
పైకి ఎదగడానికి ఏ మాత్రం వీలులేని కుటుంబంలో పుట్టి, ఏ అవకాశమూ లేని సామాజిక పరిస్థితుల్లో పెరిగి, అస్పృశ్యుడిగా అవమానాల పాలవుతూ కూడా నిబ్బరంగా ఉంటూ, ఆత్మవిశ్వాసంతో, మొక్కవోని దీక్షతో ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ విశ్వమానవుడిగా ఎదిగినవారు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్. ఆ కాలంలో అన్ని పుస్తకాలు చదివి, అన్ని డిగ్రీలు సంపాదించి అత్యున్నత స్థాయికి చేరిన … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
భారతదేశంలోని మహిళల అభ్యున్నతిలో స్వయం సహాయక బృందాల పాత్ర – డా. ఎస్. రమేశ్ & డా.శ్రీరాములు గోసికొండ
ఈ కథనం భారతదేశంలోని మహిళలకు సాధికారత కల్పించడంలో స్వయం సహాయ సమూహాల (స్వసస`ఎస్హెచ్జి) యొక్క ముఖ్యమైన పాత్రను విమర్శనాత్మకంగా పరిశీలిస్తుంది. స్వససలు మహిళల్లో ఆర్థిక స్వావలంబన, నైపుణ్యాభివృద్ధి, సమిష్టి నిర్ణయం
Posted in వ్యాసాలు
Leave a comment
‘బండి’ నవలలు ` గతం నుంచి ప్రస్తుత నవలల్లో మార్పులు – బుక్కే ధనక నాయక్
బండి నారాయణస్వామి అనంతపురం వాస్తవ్యుడు. గద్దలాడుతుండై, మీ రాజ్యం మీరేలండి, రెండు కలల దేశం, శప్తభూమి, అర్థనారి అనే ఐదు నవలలు రాశారు. 2019 నాటికి శప్తభూమి నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. చారిత్రక నవలల విషయంలో నోరి నరసింహ శాస్త్రి, అడవి బాపిరాజు లాంటి ఎంతోమంది గొప్ప
Posted in వ్యాసాలు
Leave a comment
సంస్కరణ వాద రచయిత్రి వెంపల శాంతాబాయి – అనిశెట్టి రజిత
1903 డిసెంబర్ నుండి ‘హిందూ సుందరి’ పత్రికకు మొసలికంటి రామాబాయమ్మతో కలిసి సంపాదకత్వం వహించిన వెంపల శాంతాబాయి నాటి దొరతనము వారిచే విశేష గౌరవ మర్యాదలు పొందిన తండ్రికి కూతురు.
Posted in వ్యాసాలు
Leave a comment
‘నేను ఏమి కావాలనుకుంటున్నానో అదే అవుతాను -’ జమునా సోళంకే / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
నాథ్జోగీ సంచార సముదాయంలో ఇంతవరకూ ఏ బాలికా పదవ తరగతిలో ఉత్తీర్ణులు కాలేదు. గట్టి దృఢసంకల్పంతో మహారాష్ట్ర బుల్డాణా జిల్లాలోని ఒక కుగ్రామానికి చెందిన జమునా సోళంకే ఆ అడ్డంకిని బద్దలుకొట్టింది. ఇది ఆమె కథ.
Posted in వ్యాసాలు
Leave a comment