Monthly Archives: December 2006

సత్యం పౌండేషన్ అధ్యయనం

(సెప్టెంబరు 2006 లో సత్యం పౌండేషన్ “ఆంధ్రప్రదేశ్‌లో యువత – హెచ్ఐవి” అనే అంశం మీద ఒక సమగ్రమైన అధ్యయనం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పెళ్ళి కాని యువత జీవన శైలుల గురించి ప్రధానంగా ఈ అధ్యయనం జరిగింది. వారి రోజు వారీ జీవిత విధానం, వ్యక్తిగత, ఉద్యోగ జీవితంలో ఒత్తిళ్ళను వారు ఎలా సంభాళించుకుంటున్నారు,

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హెచ్ఐవి /ఎయిడ్స్ అవగాహన మీద చిన్న సర్వే

– భూమిక టీం నిఖితా ఖట్ర నాపేరు నిఖితా ఖట్రా. మేము మార్వాడీస్. మా నాన్నగారికి జువెల్లరీ షాపు వుంది. మేము సాయిరాం నగర్‌లో వుంటున్నాం. ఇక్కడకు దగ్గరలోనే ఒక కాలేజీలో కామర్స్ కోర్స్ చదువుతున్నాను. నా వయసు 17 సంవత్సరాలు. నాకు ఎయిడ్స్ గురించి తెలుసు. అది సెక్స్ వల్ల, రక్తం మార్పిడివల్ల వస్తుందని … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అక్కా! నన్ను ముట్టుకోవూ!!

– మమత, (ఏక్షన్ ఎయిడ్ సౌజన్యంతో) అనువాదం – మాధురి.కె మాది గుంటూరు జిల్లాలోని వినుకొండ. మా నాన్నగారు వ్యవసాయ కూలి, మా అమ్మ గృహిణి, ఒక అక్క. నాకు 10 సంవత్సరాల వయసులో మా అమ్మ గుండెజబ్బుతో మరణించింది. నన్ను, మా అక్కని పాఠశాల్లోంచి తీసేసి, ఇంటిపని మొదలుపెట్టించారు. కొన్ని సంవత్సరాల తరువాత నేను … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

భారతీయ మహిళలపై హెచ్ఐవి పంజా

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో నిస్సహాయ మహిళలు, పిల్లలకోసం నడిచే వాసవ్య మహిళా మండలిలో వుంటున్న 23 ఏళ్ళ నాగమణి తన ఐదేళ్ళ కూతుర్ని హత్తుకుని వుంది. ముఖంపై నవ్వులేదు. తల్లీ కూతుళ్ళు తీవ్ర మనస్తాపంలో వున్నారని డాక్టర్లు చెప్పారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హెచ్ఐవి/ ఎయిడ్స్- మహిళలపై కుటుంబ హింస

గోరుచుట్టులా బాధపెడుతున్న కుటుంబహింసతో సతమతమవుతున్న మహిళలకు హెచ్ఐవి సోకడం నిజంగా రోకటిపోటే. సాధారణంగా మహిళలకున్న సమస్యలకు తోడు హెచ్ఐవి/ ఎయిడ్స్ వల్ల కుటుంబహింస మరింతగా పెరుగుతున్నది. ‘పెళ్ళి’కి ముందే హెచ్ఐవి వుందని తెలిసి కూడా అవతలి అమ్మాయితో పెళ్ళికి సిద్ధపడే క్రూరులున్న సమాజంలో చాలామంది మహిళలు వారి భర్తల ద్వారా హెచ్ఐవి/ ఎయిడ్స్ బారిన పడుతున్నారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

యువతరానికి అందుబాటులో పరిజ్ఞానం

సంస్కృతిపరంగా చూస్తే యువతరం ప్రపంచం మొత్తంమీద ప్రమాదస్థితిలో వున్నారు, అందులో భారతదేశ శాతం మరీ ఎక్కువ. ఎందువల్లనంటే భారతదేశంలో సెక్సు అనేది మాట్లాడకూడని విషయం, అదీకాక యువతరానికి సమాచారం అందుబాట్లో లేకపోవడం. వారి మనసుల్లో మెదిలే చాలా ప్రశ్నల్ని చర్చించే వేదిక లేకపోవడం, వారు తమ నిత్యజీవితాల్లో ఎదుర్కొనే సంకోచాలు, అపోహలు, వారి తల్లితండ్రులతో కాని, … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రజలకు ఎపిఎస్ఎసిఎస్ ‘ధైర్యం’

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సిబ్బంది హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందరికీ ఆదర్శమయ్యే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌లో అక్టోబర్ 31 వ తేదీన నిర్వహించిన హెచ్ఐవీ పరీక్ష శిబిరంలో వాళ్ళు పాల్గొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా నిర్వహించ తలపెట్టిన ‘ బి బోల్డ్’ … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment