Monthly Archives: January 2007

మహిళలకు మేలు చేసిన 2006

భూమిక పాఠకులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు 2006 సంవత్సరంలో స్త్రీలపరంగా చూసినపుడు చాలా ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. భారతీయ స్త్రీలు అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధించి జయకేతనాలెగరేసారు. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, కల్పనా చావ్లా ఆశయాన్ని, రోదసికి ఎగిసి వెళ్ళి సాధించగలిగింది. ప్రపంచంలోనే శక్తివంతమైన వ్యాపారవేత్తగా ఇంద్ర నూయీ ఎదగగలిగింది.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

కుటుంబ హింసనుంచి మహిళలకు రక్షణ చట్టం, 2005 (చాప్టర్ -1)

1. ఈ చట్టం పేరేమిటి? కుటుంబ హింసనుంచి మహిళలకు రక్షణ చట్టం, 2005. 2. దీని పరిధి ఏమిటి? జమ్మూకాశ్మీర్ రాష్ట్రం మినహా భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కుటుంబ హింసనుంచి మహిళలకు రక్షణ చట్టం, 2005 (చాప్టర్- 2)

కుటుంబ హింస 3. కుటుంబ హింసకు నిర్వచనం ఏమిటి? ఈ చట్టం కింద, ఈ కింది ఫలితాలను కలిగించే ప్రతివాది చర్యలేవైనా కుటుంబ హింస కిందికి వస్తాయిః ఎ) బాధితురాలి ఆరోగ్యం, భద్రత, శరీరభాగం, సంక్షేమం, శారీరకంగా గాని, మానసికంగా గాని- హాని లేదా గాయం కలిగించడం, లేదా అలా చేసేందుకు ఉద్యుక్తులు కావడం,భౌతిక,లైంగిక, మాటలు, … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కుటుంబ హింసనుంచి మహిళలకు రక్షణ చట్టం, 2005 (చాప్టర్ – 3)

రక్షణాధికారుల, సేవలందించేవారి అధికారాలు, విధులు 4. రక్షణాధికారికి సమాచారం ఎలా? సమాచారం ఇచ్చినవారిపై బాధ్యతలేమిటి? 1) ఒక కుటుంబ హింసా సంఘటన కొంతకాలంగా జరుగుతూ వుందని గాని, ప్రస్తుతం జరుగుతోందని గాని, లేదా, జరిగే అవకాశం వుందని గాని విశ్వసించడానికి తగిన కారణం కలిగిన వ్యక్తి, ఆ సమాచారాన్ని సంబంధిత రక్షణ అధికారికి ఇవ్వవచ్చు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కుటుంబ హింసనుంచి మహిళలకు రక్షణ నిబంధనలు, 2006

(ముఖ్య నిబంధనలు) ఈ నిబంధనలు 2006 అక్టోబర్ 26 న అమలులోకి వస్తాయి. 2 (బి) ఫిర్యాదు అంటే, రక్షణాధికారికి, ఏ వ్యక్తి అయినా మౌఖికంగా లేదా లిఖిత పూర్వకంగా అందించే ఆరోపణ. (సి) ‘కౌన్సెలర్’ అంటే- చట్టంలోని సెక్షన్ 14 (1) కింద కౌన్సెలింగ్ ఇవ్వడానికి అధికారం కలిగిన ‘సర్వీస్ ప్రొవైడర్’ సభ్యులు

Share
Posted in వ్యాసాలు | Leave a comment

డైరీ

(భూమిక కథల పోటీలో రెండవ బహుమతి పొందిన కథ) టైము ఉదయం ఏడు గంటలు అవుతున్నా, నిద్రపట్టక మంచంమీదే దొర్లుతున్నాను. పనిమనిషి వచ్చేదాక ఇదే కాలక్షేపం. భాస్కర్ ఊర్లో లేడు, పనిమీద బెంగుళూరు వెళ్ళాడు. భాస్కర్ ఉంటే ఇలా బద్ధకంగా పడుకోనిచ్చేవాడు కాదు, యోగ చెయ్యని, లేక నడవమనీ, నావంటిని నేను సరిగ్గా పట్టించుకోవటం లేదనీ … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

ప్రపంచీకరణ నేపథ్యంలో స్త్రీల సమస్యలు

– కె.వి.ఎన్.ఎల్. ప్రసన్న కుమారి సకల ‘లోకాల’ను ఒక్క ఇల్లుగా చేసి వసుదైక కుటుంబంగా (లా); గ్లోబల్ విలేజి ఏర్పాటు గ్లోబలీకరణ పేరిట ఓ విశ్వ కుటీరాన్ని నిర్మించడం లక్ష్యంగా, అట్టహాసంగా బయలుదేరిన గ్లోబలైజేషన్ ఆ లక్ష్యాన్ని సాధించలేకపోగా దేశాలను, కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తోంది. సమాజాలను, జాతులను, మతాన్ని, ప్రాంతాల్ని, ఆఖరకు ఒక ఇంట్లో కలిసి … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆ వరద మీదాక వస్తే?

– కత్తి పద్మారావు నీ పరిసరాలను, నీ మనోగతాన్ని నీ సౌజన్యాన్ని, నీలోని శిల్ప ఔన్నత్యాన్ని ప్రభావితం చేస్తున్న సమాజం పట్ల నీవు మౌనం వహిస్తున్నావు

Share
Posted in కవితలు | Leave a comment

ఎలిఫెంటా కేవ్స్

– ఎన్.అరుణ విమానమెక్కి ఆకాశంలోనో రైలులో భూమ్మీదనో కాదు సముద్రం అలలమీద ప్రయాణం అలలకీ ఒక లయవుంది

Share
Posted in కవితలు | Leave a comment

ఆమె పుట్టిన ఊరు

– డా|| ఎన్.గోపి యాధృచ్చికమే కావొచ్చు ఆశ్చర్యం కూడా ఆనందమని వేరే చెప్పాలా!

Share
Posted in కవితలు | Leave a comment

ఉత్తేజపూరిత మహిళా శిక్షణ!

– కె. శోభాదేవి ఆ ఉదయం సువిశాలమైన హాలులో ఇరవై, ఇరవై మూడుమంది విద్యార్థినులు గుండ్రంగా నిలుచుని బంతిని విసురుకుంటూ ఆడుతున్నదేమిటో చూచేవారికి అంతుపట్టదు. అసలు చూచేవారంటూ అక్కడ లేరు. అందరూ చేసేవారే. వారేం చేస్తున్నారు? ఎందుకక్కడ చేరారు? ఈ ప్రశ్నలకు సమాధానమే, అమ్మాయిల శక్తులను మేల్కొలపడానికి, వారేమిటో వారికి వారే తెలుసుకొనేట్టు చేయడానికి ‘క్లేర్’ … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మహిళా జర్నలిస్టుల్ని విస్మరించిన అంతర్జాతీయ సదస్సు

నవంబర్ 16-17 తేదీలలో, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో “ప్రపంచీకరణ నేపథ్యంలో జర్నలిజమ్ ఎథిక్స్ అండ్ సొసైటి ఇన్ ద ఏజ్ ఆఫ్ గ్లోబలైజేషన్” అనే అంశం మీద అంతర్జాతీయ సింపోజియమ్ జరిగింది. నవంబరు 16న ప్రతి సంవత్సరం ‘నేషనల్ ప్రెస్ డే’ గా జరుపుకుంటున్నాం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సెకండ్ సెక్స్

(కొనసాగింపు) “పురుషుడెపుడూ తన ఆధిక్యతను నిలబెట్టుకోడానికే ప్రయత్నిస్తాడు. తన ప్రాముఖ్యతను నమ్మి కాపాడుకోడానికే యత్నిస్తాడు. తన సహచరితో సమానత్వాన్ని అంగీకరించలేడు. ఆమె శక్తియుక్తులపై నమ్మకం లేనట్లు తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తాడు. ఇదెట్లా వుంటుందంటే, చిరకాలంగా అణచివుంచబడిన వర్గం, తమను అణచివేతకు గురిచేసిన వర్గంతో ఘర్షించినట్లు వుంటుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఇప్పుడు వీస్తోన్న పైరుగాలి “పుప్పొడి”

రచయిత్రులం మా గోదావరి ప్రయాణం ముగించుకొని, ‘గోదావరి’ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ చేరుతుండగా సుజాత పట్వారి “పుప్పొడి”ని నా చేతికిచ్చింది. పుప్పొడిలాగే కనిపించిన పుస్తకాన్ని ఉషోదయం చల్లగాలికి ఎక్కడ రాలిపోతుందోనని సుతారంగా పట్టుకొని పేజీలు తిప్పుతూ కవితా శీర్షికలు చదివాను.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

రాచబాటమీది దొంగాటని దెబ్బకొట్టాలి

ఆ మధ్య పూనాలో జరిగిన అంతర్జాతీయ రచయితల సదస్సులో తెలుగునుంచి రచయిత్రుల్లేరు. వేదికమీద చేతులు కలుపుకుని జేకొట్టిన తెలంగాణా ఉద్యమ రథసారధుల్లో ఆడవాళ్ళు లేరు. బెంగుళూరులో జరిగిన జాతీయ సమ్మేళనంలో తెలుగు కవయిత్రుల్లేరు. ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ విలేఖరుల గోష్టిలో తెలుగునుంచి కె. సత్యవతి తప్ప మరే మహిళా జర్నలిస్టుల్లేరు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

లిడియా శాఖో గురించి ఆలోచించండి

– ఓల్గా లిడియా శాఖో మెక్సికన్ రచయిత్రి, జర్నలిష్టు, ఫెమినిస్టు కార్యకర్త. తను నివసించే క్యాంకున్ పట్టణంలో కుటుంబహింసకు, ఇతర అత్యాచారాలకూ గురైన స్త్రీలకు ఆశ్రయమిచ్చే సంస్థను నడుపుతోంది. ఆమె యిప్పుడు న్యాయ విచారణలో, నాలుగేళ్ళ జైలు శిక్ష పడుతుందనే స్థితిలో వుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment