Monthly Archives: September 2020

ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌ గారికి, గౌరవనీయ సోదరి కె.సత్యవతిగారికి హృదయపూర్వక నమస్కారములు. అమ్మా ! మార్చి సరచిక సంపాదకీయంలోని ఆర్ద్రత, నిజాయితీ, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ జీవితంపై గాంధీజీ ప్రభావానికి సంబంధించిన ఘటనల చిత్రీకరణ, ప్రశాంతి, అనిశెట్టి గారల వ్యాసాల్లోని మహిళా చైతన్యము; వనజ, ఇంద్రగంటి వారి వ్యాసాల్లోని కటు యథార్థత; అశోక్‌ గారి ఇంటర్వ్యూలో సంధ్యక్కని ప్రభావితం … Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ఎందాకా ఈ నిశ్శబ్దపు నడక – పి. ప్రశాంతి

రోహిణీ కార్తి… రోళ్ళు పగులుతాయంట! కాస్త పొద్దెక్కగానే మొదలౌతున్న వడగాలులకి పిట్టా, పురుగూ కూడా ఎక్కడివక్కడ సద్దుమణిగిపోతున్నాయి. ఇక లాక్‌డౌన్‌ పుణ్యమా అని పెద్దా చిన్నా తేడా లేకురడా అన్ని పనులకి తాళాలేయడంతో జనమంతా ఇళ్ళకి పరిమితమయ్యారు.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

పవహిస్తున్న దుఃఖంకాళ్ళు ప్రవహించిన దుఃఖం అలసట తీరగానే ఆగిపోతుంది కళ్ళు ప్రవహించే దుఃఖం చెక్కిళ్ళ మీదే ఆవిరవుతుంది

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

సంబంధాలు – కన్నడ: వసుంధర కె.ఎం., మైసూరు – అనుసృజన: వేలూరి కృష్ణమూర్తి

‘హాయ్‌, హౌ ఆర్‌ యూ?’ అతడి నుండి వచ్చిన మెసేజ్‌ ఈమె మొబైల్‌లో అర్ధగంట నుండి చల్లగా కూర్చొని ఉంది. హర్షిణి ఏదో ఒక నంబర్‌ సెర్చ్‌ చేయడానికి మొబైల్‌ తీసినప్పుడు స్క్రీన్‌పై ఉన్న అతడి మెసేజ్‌ చూసి, అతడి వాట్సాప్‌కు ‘ఓ! హాయ్‌! ఐ యాం ఫైన్‌… థాంక్స్‌’ అని మరుసందేశాన్ని పంపింది.

Share
Posted in కథలు | Leave a comment

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌

(గత సంచిక తరువాయి…) ఉప్పు సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమం ప్రపంచ చరిత్రలో ఏ దేశంలోనూ కనీవినీ ఎరుగం. 24 రోజులు పాదచారియై గాంధీ మహాత్ముడు తన అనుచరులతో 200 మైళ్ళు నడిచి పశ్చిమ సముద్ర తీర ప్రాంతమైన దండి గ్రామం చేరారు. దారి పొడవునా వేలాది మంది జనులు ఆయనకు స్వాగతం చెప్పారు. … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

బియాండ్‌ ది క్లౌడ్‌ : జీవితంలో ఎదురయ్యే సూక్ష్మతలకు పట్టిన భూతద్దం

వేలూరి కృష్ణమూర్తిటెహరాన్‌లోని (ఇరాన్‌) ఒక మధ్యమ వర్గపు కుటుంబంలో జన్మించిన మజీద్‌ మజిది ఇరానియన్‌ భాషలో ప్రతిష్టాత్మకమైన చిత్రాలకు దర్శకత్వం వహించి గొప్ప దర్శకుడన్న పేరు గడించాడు. 58 ఏళ్ల మజీద్‌ మజిది తన బాల్యం నుండే నటనలో ఆసక్తిని పెంపొందించుకొన్నారు. తన 14 ఏళ్ల వయసులోనే అమెచూర్‌ (ూఎa్‌వబతీ) నాటక తండం చేరి అనంతర … Continue reading

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

ఒక అచ్చమైన అన్వరీయం – రొంపిచెర్ల భార్గవి

ఇది ఒక అచ్చమైన అన్వరీయం. పసుపు పచ్చగా కాంతులీనే ‘అనగనగా ఒక చిత్రకారుడు’ అనే ఈ పుస్తకం నా చేతిలో పడి పదిహేను రోజులకు పైనే అయింది. ఫేస్‌బుక్‌లో చాలావరకూ చదివిన వ్యాసాలే అయినా పుస్తకంగా చూసినపుడు కలిగే అనుభూతి వేరు. అదే అక్షరానికున్న అధికారత.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

నా రాజకీయ ప్రస్థానం – మహిళా ఉద్యమంలో అనుభవాలు

(ఇటీవల మరణించిన సావిత్రి గారికి నివాళిగా ఈ వ్యాసాన్ని పునర్ముద్రిస్తున్నాం) నాకు పదమూడేళ్ల వయసులోనే మా గ్రామంలో (బేతపూడి, రేపల్లె దగ్గర) మూడు భిన్నమైన రాజకీయ ధోరణులు కనిపించాయి. మా చిన్నన్నయ్య కుడితిపూడి సత్యనారాయణ కారగ్రెసువైపు ఆకర్షితుడయ్యాడు. మా పెదనాన్న కొడుకు పుండరీకాక్షయ్యగూడా అప్పటికే కారగ్రెస్‌ కార్యకర్త. ఒకసారి మా ఇంటికి భారతీదేవిరంగా వచ్చారు. మా … Continue reading

Share
Posted in నివాళి | Leave a comment

దోర్నాదుల సుబ్బమ్మ రచనలు – మహిళాభ్యుదయం – కొండయ్య కోసూరు

పరిచయం : సింహపురి పరిధిలో ఆత్మకూరు మండల వాసి దోర్నాదుల సుబ్బమ్మ ”మోడుపడిన మూడు గుండెలు” (1958) నవలతో రచనకు శ్రీకారం చుట్టి సాహిత్యంలో తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. సుబ్బమ్మ ఇంతవరకూ కథలు, కథానికలు, కవితలు, వ్యాసాలు, పాటలు, లేఖలు, నవలలు, శతకం, జీవిత చరిత్ర రాశారు. ఈమె రచనలన్నీ మహిళా నేపథ్యాన్ని … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నాకు నచ్చిన సావిత్రిగారి కవిత ‘బందిపోట్లు’ ‘మహిళ’పై విశ్లేషణ డా|| బండారి సుజాత

రాజమండ్రికి పదిమైళ్ళ దూరంలో ఉన్న ‘ఉండేశ్వరపురం’ లోని దంతులూరి సూర్యనారాయణ రాజు, బుచ్చి సీతాయమ్మల ఆరవ సంతానంగా మే 18, 1949 లో జన్మించిన సావిత్రి అక్టోబర్‌ 4, 1991లో మరణించారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం -భండారు విజయ

ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం ప్రకటించి ఇప్పటికి 110 సంవత్సరాలు అయింది. దీనికి స్ఫూర్తిని ఇచ్చిన ఘటన 1857వ సంవత్సరంలో మార్చి 8వ తేదీన న్యూయార్క్‌ నగరంలో జరిగింది. చికాగో మహానగరంలోని ఒక జౌళి మిల్లులో పనిచేస్తున్న శ్రామిక మహిళలు తాము పనిచేస్తున్న (12 గంటల నుండి 18 గంటల వరకు) … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

CAA – అస్సాం పౌరసత్వ సవరణ చట్టం -రమామేల్కోటే

పౌరసత్వ సవరణ చట్టాలకు అస్సాంలో ప్రారంభమైన వ్యతిరేకత దేశవ్యాప్తంగా ఆందోళన ఊపందుకుని మరింత ఉధృతమవుతున్నది. ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో, అన్ని రాష్ట్రాలలో ఈ ఉద్యమం ఎప్పటికప్పుడు కొత్త రూపాన్ని, కొత్త హంగులతో, ఒక సాంస్కృతిక ఉద్యమంలా మొత్తం దేశాన్నే కుదిపివేస్తున్నది. ఈ ఉద్యమంలో స్త్రీలు, ముస్లిం మహిళలు ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున పాల్గొనడమే … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సుదీర్ఘ యుద్ధం – నాంపల్లి సుజాత

రాశి ఫలాల కోసం వెంపర్లాడితిమి కదా! రాజ్యపూజ్యాలను వెతుకుతూ ఆ పంచాంగంలో… విజృంభిస్తున్న వైరస్‌ గురించి విప్పి చెప్పిందా ఆ గ్రంథం?

Share
Posted in కవితలు | Leave a comment

చికిత్స – ఎస్‌.కాశింబి

ఉమ్మ నీటిలో కదులుతున్నప్పుడే… కమ్మనైన నీతి కథలు వినిపించండి! ఉగ్గునూరి గుక్క గుక్క తాగించేటప్పుడే విచక్షణా స్తన్యాన్ని రంగరించండి!

Share
Posted in కవితలు | Leave a comment

పౌరులుగా పవ్రర్తిద్దాం – భూక్యా గోపిరాజ్‌

ఈ మహమ్మారిని తరిమేయాలనే ఆవేశం అరదరిలోనూ వుంది కానీ ఆచరణ కొరతయింది! లోకాన్ని దాని విషకోరలతో అడుగడుగు వేసుకుంటు

Share
Posted in కవితలు | Leave a comment

ఆదర్శ జ్యోతి – జె.వినిత

సృష్టికి మూలం తానై అవనికి ఆదర్శమై జననిగా జగతిలో తన ఒడే తొలి బడిగా తన మాటే తొలి బాటగా ధైర్యసాహసాలకు నిలయంగా

Share
Posted in కవితలు | Leave a comment