-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
Meta
Tags
Monthly Archives: October 2020
ప్రతిస్పందన
భూమిక ఎడిటర్ గార్కి , అమ్మ నాకు post women భూమికను తెచ్చి ఇస్తుంది. ఎప్పుడైనా బుద్ది పుట్టి ఇతనికి వచ్చే భూమికలో ఏమి ఉంటుంది అని చూస్తే నేను తల ఎత్తుకునేలా భూమిక తీర్చి దిద్దుతున్న తల్లులందరికి ఏమిచ్చి ఈ ఋణాన్ని తీర్చుకోవాలి అని ఆలోచిస్తుంటే నిజంగా ఏదో ఒక రచన చేయాలి అబ్బా … Continue reading
Posted in ప్రతిస్పందన
Leave a comment
మహిళా రైతుల అంశాలు ప్రధాన ఎజెండాలో ప్రతిఫలించాలి -కొండవీటి సత్యవతి
నా చిన్నతనంలో నేనెప్పుడూ అనుకునేదాన్ని మా ఇంట్లో ఆడవాళ్ళెవరూ పొలానికి ఎందుకెళ్ళరని. మా అమ్మగాని, పిన్నమ్మ, పెద్దమ్మలు కానీ ఎప్పుడూ పొలానికెళ్ళినట్లు నేను చూడలేదు. మా తాతకి బోలెడంత పొలముండేది. మా నాన్న మాత్రం ఎప్పుడూ పొలంలోనే
Posted in సంపాదకీయం
Leave a comment
ఆమె అపరాజిత కాదు మహావిజేత -డా|| చల్లపల్లి స్వరూపరాణి
ఆమె లేని దారి లేదు ఆమె నాట్లేసి కలుపు తీసి కోతకోసి కుప్పలేసి అంట్లు కడిగి దొడ్లు కడిగి పిల్లా జెల్లా ముసలీ ముతకా
Posted in మిణుగురులు
Leave a comment
కులం కూలాల్సిందే – పి. ప్రశాంతి
చీకటిపడింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. రాణి కాలేజి నుంచి ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఇంట్లోకి బైటకి తిరుగుతోంది శారద. క్యాంప్‌కి వెళ్ళిన భర్త రావడానికి రెండు రోజులు పడుతుంది. ఈలోగా రాణితో మాట్లా డాలని నిర్ణయించుకుంది. నిన్న మధ్యాహ్నం రాధిక వచ్చినప్పుడు మాటల్లో మాటగా అన్నా, ప్రత్యేకించి అది చెప్పడానికే వచ్చిందని తర్వాత అర్థమయింది. … Continue reading
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
భారత పౌరులమయిన మేము… స్త్రీల రాజకీయ భాగస్వామ్యం-వాస్తవాలు
సంక్షిప్త పరిచయం: ప్రపంచంలో గాని, దేశంలో గాని, స్థానికంగా గాని స్త్రీల రాజకీయ భాగస్వామ్యం, నాయకత్వం ఎక్కడా తగినంతగా లేదు. ఓటర్లుగా, ఎన్నికయిన కార్యాలయాల్లో, ప్రఖ్యాత అధికార యంత్రాంగంలో ప్రైవేటు రంగంలో లేదా విద్యావ్యవస్థలో స్త్రీల ప్రాతినిధ్యం సరిపడినంత లేదు. ప్రజాస్వామ్య పరిపాలనలో పాల్గొనేందుకు సమాన హక్కులున్నా, నాయకులుగా మార్పుకి సాధకులుగా వారి సామర్ధ్యాన్ని స్త్రీలు … Continue reading
Posted in మనం గళమెత్తకపోతే
Leave a comment
దేశంలో ట్రాన్స్‌జెండర్ల స్థితిగతులు-కఠోర వాస్తవాలు – ప్రచారోద్యమం
భయంకర బాధల పాటల…పల్లవి! ”పూటపూట జేసుకోని బతికెటోళ్ళం…పూటగడవా ఇంతదూరం వచ్చినోళ్ళం… దేశమేమో గొప్పదాయె మా బతుకులేమో చిన్నవాయె… మాయదారి రోగమొచ్చి మా బతుకు మీద మన్ను బోసె… పిల్లజెల్లా ఇంటికాడ ఎట్ల ఉండ్రో… నా ముసలి తల్లి ఏమి బెట్టి సాదుతుందో…” అంటూ కరోనా కాలంలో వేనవేల మంది వలసజీవుల వెతలకి మారుగా మార్మోగింది ఆ … Continue reading
Posted in మనం గళమెత్తకపోతే
Leave a comment
తెలంగాణ పల్లె కోయిలమ్మ యశోదా రెడ్డి – డా|| కొమర్రాజు రామలక్ష్మి
స్వాతంత్య్రానంతర తెలంగాణ తొలితరం కథా రచయిత్రి అయిన పాకాల యశోదారెడ్డి గారు 1929 ఆగస్టు 8న మహబూబ్‌నగర్ జిల్లా (పాలమూరు జిల్లా) బిజినేపల్లి గ్రామంలో కత్తి కాశిరెడ్డి, సరస్వతమ్మలకు జన్మించారు. మూడు తరాలు చూసిన ముత్తవ్వగా పేరు గాంచిన యశోదారెడ్డి గొప్ప కథకురాలు. ఆమె కథలు అచ్చమైన మాండలికంలో ఉన్నాయి. మాండలిక పదాలను ప్రజలు ఎలా … Continue reading
Posted in సంస్మరణ
Leave a comment
కోవిడ్-19, లాక్‌డౌన్ సమయంలో మహిళలపై పెరిగిన గృహ హింస -కందగట్ల శ్రవణ్ కుమార్
పితృస్వామ్య అధికారం ఆధారంగా ఏర్పడిన లింగ విభజనలో భాగంగా పుట్టిన గృహ హింసలో అనేక కోణాలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఓ) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళలలో ఒకరు వారి జీవిత కాలంలో శారీరక లేదా లైంగిక హింసను అనుభవిస్తున్నారు. వైవాహిక సంబంధాలలో ఉన్న మహిళల్లో కనీసం 30 శాతం తమ భాగస్వాములచే … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
శృంగార దేవత మార్లిన్ మన్రో -రొంపిచర్ల భార్గవి
మార్లిన్ మన్రో పేరు చెప్పగానే కలల్లో తేలిపోయి వెర్రెక్కిపోయే అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా చాలామందే ఉన్నారు. ఆమె చనిపోయి సుమారు 58 ఏళ్ళయినా అత్యత ప్రజాదరణ పొందిన శృంగార తారగా ఆమె స్థానం చలన చిత్ర ప్రపంచంలో ఈనాటికీ చెక్కుచెదరలేదు. అంతేకాదు అది ఎప్పటికీ చెరిగిపోలేని శాశ్వత స్థానమే అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చలన … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
వ్యవసాయ రంగంపై నోట్ మరియు నిర్దిష్ట డిమాండ్లు – ప్రజా అసెంబ్లీ
తెలంగాణా ప్రజా అసెంబ్లీ – 2020 సెప్టెంబర్ 4, 5, 6 తెలంగాణ వ్యవసాయ రంగం గురించి, గ్రామీణ ప్రాంతం గురించి మాట్లాడుకోవడం అంటే రాష్ట్రంలో 65 శాతం జనాభా గురించి చర్చించడం. రాష్ట్ర ఆహార భద్రత గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుకోవడం. మొత్తంగా మెజారిటీ ప్రజల జీవనోపాధుల గురించి మాట్లాడుకోవడం. ఇంత కీలక … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
ప్రజారోగ్య రంగానికి ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక శ్రద్ధ పెట్టాలి – ప్రజా అసెంబ్లీ
సరిపడినంత సురక్షితమైన పోషకాహారము, సురక్షితమైన నీరు, స్వచ్ఛమైన గాలి వంటివి లేని పరిస్థితులలో, ప్రజలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజారోగ్య వ్యవస్థ నిర్లక్ష్యానికి గురై, ప్రైవేటు కార్పొరేట్ శక్తులు వైద్య రంగాన్ని వ్యాపారంగా మార్చివేయడంతో వైద్య ఖర్చులు … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
దుర్గాబాయి దేశ్‌ముఖ్ -అక్కిరాజు రమాపతి రావు
(గత సంచిక తరువాయి…) సాహితీవ్యక్తిత్వం భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో తన సమస్త శక్తులతో నిమగ్నం కాకపోయి ఉన్నట్లయితే, స్వాతంత్య్రానంతరం నవ భారత పునర్నిర్మాణంలో, సమాజ సంక్షేమంలో తన పాత్రను, తన వ్యక్తిత్వాన్ని సమర్ధంగా సమర్పించి ఉండనట్లయితే దుర్గాబాయి సాహితీలోకంలో శిఖరాధిష్ఠితురాలై ఉండేది. ఆమెలో సృజనశక్తి అపారం. హృదయ స్పందన అత్యుత్కటం. మానవతా స్పందన అపరిమేయం. గ్రహణధారణ … Continue reading
Posted in జీవితానుభవాలు
Leave a comment
ఇంకానా! ఇక చెల్లదు!! – నాంపల్లి సుజాత
(భూమిక నిర్వహించిన కథ, కవితల పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత) పుడుతూనే ఆమె నొసటికి దిష్టిచుక్కై తోడొచ్చింది బొట్టు.
Posted in కవితలు
Leave a comment
ఔషధం – ఎస్. కాశింబి
ఆకలితో పేగులు అరుస్తున్నా అవమానాలు కురుపులై సలుపుతున్నా అపనిందలు ఈగలై ముసురుతున్నా అవరోధాల ముళ్ళు గీసుకుంటున్నా
Posted in కవితలు
Leave a comment
మాట్లాడటం గురించి కొన్ని ఫలానా ఫలానా మాటలు – విమల
నువ్వు ఇప్పుడు మాట్లాడావనుకో అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అనవచ్చు పోనీ అపుడు మాట్లాడే ఉంటావనుకో, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనవచ్చు.
Posted in కవితలు
Leave a comment