-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2020 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Daily Archives: December 8, 2020
ఈ హైదరాబాదు మా సీతారామపురం ఒక్కటే నాకు -కొండవీటి సత్యవతి
1975 లో చిన్న బావిలాంటి మా సీతారామపురం నుండి నేను మొదటి సారి రైలెక్కి మా నాన్నతో కలిసి హైదరాబాదుకొచ్చినప్పుడు నేను చాలా భయపడిపోయాను. రైల్లోనే వింత అనుభవం ఎదురైంది. హైదరాబాద్ సమీపిస్తున్నాం. నా ఎదుటి సీట్లో ూర్చున్న ఒకాయన కాలు పొరపాటున నా కాలికి తగిలింది. ‘మాఫ్ కరో బేటీ’ అన్నాడు. నేను కంగారుపడి … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
దుర్గాబాయి దేశ్‌ముఖ్ – అక్కిరాజు రమాపతి రావు
(గత సంచిక తరువాయి…) చింతామణీ – నేనూ దుర్గాబాయి స్వయంగా రాసుకొన్న తన జీవిత సంక్షిప్త చరిత్రకు ఈ పేరు పెట్టింది. అంటే ఇది ఆమె ఆత్మ కథ. చింతామణి దేశ్‌ముఖ్ కూడా స్వీయ చరిత్ర రాసుకున్నారు. దాని పేరు ‘ది కోర్స్ ఆఫ్ మై లైఫ్’ (నా జీవన స్రవంతి) అని పెట్టుకున్నారు. దుర్గాబాయి … Continue reading
Posted in జీవితానుభవాలు
Leave a comment
పోరాటం చేస్తే పోయేదేముంది… -పి. ప్రశాంతి
చాలా రోజుల తర్వాత స్నేహితురాళ్ళు ముగ్గురూ ఊరిచివర చెరువు గట్టు మీదున్న చింతచెట్టు కింద కలిశారు. అదే ఊర్లో పుట్టి పెరిగి పదో తరగతి వరకు కలిసి చదువుకున్న పూల, సరిత, పర్వీన్ ప్రాణ స్నేహితులు. దాదాపు మూడేళ్ళు దాటింది వాళ్ళు కలిసి. ముగ్గురూ మూడు రకాల కారణాలతో ఊరికి దూరమై మూడేళ్ళు గడిచాక ఈ … Continue reading
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
చదువుల తల్లి పుల్లగూర దీనమ్మ – డా|| చల్లపల్లి స్వరూపరాణి
జ్యోతీరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలేల కాలం అంటే 19వ శతాబ్దం నాటి ఆంధ్ర దేశంలో సామాజిక పరిస్థితులు, అణగారిన వర్గాల స్థితిగతులు, వాటిపై సంస్కరణ దిశగా సాగిన ప్రయత్నాల మీద అటు అకడమిక్ రంగంలో కానీ, బయట గానీ అసలు పరిశోధన జరగలేదనే చెప్పాలి. ఆ రోజుల్లో అత్యంత దయనీయమైన పేదరికం, అంటరానితనం, ఊరెలపటితనం వంటి … Continue reading
Posted in మిణుగురులు
Leave a comment
వర్జిన్ టెస్ట్ – వి.శాంతి ప్రబోధ
అప్పుడే ఢిల్లీకి వచ్చి నాలుగో రోజు. టీ బ్రేక్‌లో టీ సిప్ చేస్తుంటే రమణి గుర్తొచ్చింది జయకి. ఈ సమయంలో రమణికి సహాయంగా ఉండాల్సింది. ఒక్కటే ఎంత తిప్పలు పడుతున్నదో మనసులోనే అనుకున్నదామె.
Posted in కధలు
Leave a comment
భావచిత్రాల భోషాణం – ‘జొన్నకంకి’ -చక్రవర్తి వేనంక
మనుషులనీ, మనుగడలనీ లోతుగా అధ్యయనం చేస్తూ… వస్తువుల ఆత్మల్నీ వాస్తవాల గమ్యాల్నీ కూలంకషంగా తెలుసుకున్న వారే ఆయా భావాలని అందమైన కవితా వాక్యాలతో అలంకరించగలరు. తమదైన విలక్షణ శైలి ప్రదర్శించి వారి కవిత్వ లోకంలోకి తీసుకెళ్ళి అలరించగలరు. అట్టి అనుభూతికి సాక్షీభూతంగా చెప్పదగినది ”జొన్నకంకి”.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
నల్లజాతి విముక్తి చిహ్నం ‘హ్యారియెట్ టబ్మాన్’ శివలక్ష్మి
నల్లజాతీయుల ఆత్మగౌరవ ప్రతీక ‘హ్యారియెట్ టబ్మాన్’. అమెరికాలో బానిసత్వ నిర్మూలన గురించిన ఉత్కంఠభరితమైన చరిత్ర వివరాలు తెలియాలంటే దానితో పెనవేసుకుపోయిన టబ్మాన్ వ్యక్తిగత కథ గురించి తెలుసుకోవాలి.
Posted in సినిమా సమీక్ష
Leave a comment
విస్మృత కథారచయిత్రి – వేదుల మీనాక్షీదేవి శీలా సుభద్రాదేవి
ఆధునిక సాహిత్యరంగంలో స్వాతంత్య్రానంతరం అధిక సంఖ్యలోనే మహిళలు సాహిత్య రంగంలోకి వచ్చారు. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే దానికి సమాంతరంగా స్త్రీ విద్యపై కూడా మహిళలు కొంత ఉద్యమస్ఫూర్తితో రచనలు చేయటం కావచ్చు, స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలలు కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు కావటం వలన కావచ్చు, సాంస్కృతికంగా, ఆర్థికపరంగా వెసులుబాటుగల కుటుంబాలలోని స్త్రీలకు విద్యావంతులయ్యే అవకాశం లభించింది. … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
అసలు యుద్ధం దేనిపైనా?! -దేవి
”లవ్ జిహాద్” ఆర్డినెన్స్ తెచ్చేసింది యు.పి. యోగి సర్కారు. ఈ అరుపు ఇవ్వాళ కొత్తగా మొదలు కాలేదు. భాజపా ప్రభుత్వాల చేతకానితనం, అసమర్ధత, పరిపాలనలో అవకతవకలు బయటపడినప్పుడల్లా సంఘ్ పరివార్‌లోని ఏదో ఒక అంశం భజరంగ్‌దళ్ లేదా విశ్వ హిందూ పరిషత్ గొంతు చించుకొని లవ్ జిహాద్ అంటూ రంకె వేస్తుంది.
Posted in వ్యాసాలు
Leave a comment
మనకు మనమే ప్రతిధ్వనులుగా ఉండిపోవద్దు -మమత కొడిదెల
”నువ్వు బిఎల్‌ఎమ్ ను సమర్ధిస్తావు కదా. మరి రామ మందిరాన్ని ఎందుకు సమర్ధించవు?” వాట్సాప్ గ్రూప్‌లో సౌమ్యంగా అడిగింది ఇరవై ఐదేళ్ళ క్రితం కాలేజిలో పరిచయమైన స్నేహితురాలు. తల తిరిగిపోయే ఇలాంటి ఉపమానాలు ఈ మధ్య దాదాపు ప్రతిరోజూ వింటూనే ఉన్నా. విన్న ప్రతిసారీ కోసుకుపోతున్నట్లుండే నొప్పి గుండెలో. హేతుబద్ధంగా ఆలోచిస్తున్నారని ఇన్నాళ్ళూ అనుకున్న స్నేహితుల … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
విభిన్న సమూహాలు-కఠోర వాస్తవాలు -ప్రచారోద్యమం
ఇతివృత్తానికి ప్రవేశిక: ”ఈ భిన్న లైంగికతకు సంబంధించిన సమూహ సభ్యులు, వారి కుటుంబాలు… శతాబ్దాల తరబడి అనుభవించిన అవమానాలకు, సంఘ బహిష్కరణలకూ… దిద్దుబాటు చర్యలను చేపట్టడంలో జరిగిన ఆలస్యానికి, వారికి చరిత్ర ఒక క్షమాపణని ఋణపడి ఉంది. ఈ సమూహంలోని సభ్యులు తమ జీవిత పర్యంతం… ప్రతీకారం మరియు పీడన అనే భయాల మధ్య నిర్బంధించబడ్డారు” … Continue reading
Posted in మనం గళమెత్తకపోతే
Leave a comment
వలస కార్మికులు – ప్రచారోద్యమం
దినసరి కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, పట్టణ ఉత్పత్తిదారులు, సేవారంగ కార్మికులు, ఇంటి పనివారలు మొదలయినవారంతా వలస కార్మికుల కోవలోకి వస్తారు. 2020 మార్చి 23న భారత ప్రధాని నరేంద్ర మోడి కోవిడ్-19 వ్యాప్తి అదుపు చేయడానికి దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించారు. నూట నలభై కోట్ల భారత ప్రజానీకం బలవంతంగా … Continue reading
Posted in మనం గళమెత్తకపోతే
Leave a comment
ఒక స్వప్నం – బి.గోవర్ధనరావు
ఆమె – తనను… అడ్డుకుంటున్న అవరోధాల్ని అధిగమించి చుట్టూ పరుచుకున్న సంక్షోభతెరల్ని దాటుకొని అక్షరాల్ని ప్రాణప్రదంగా చూసుకొని… శ్రద్ధగా నేర్చుకుని
Posted in కవితలు
Leave a comment
మనకు మనమే ఆయుధాలం! – శిలాలోలిత
చెట్టు కొమ్మలు నరుకుతుంటేనే ఆకులన్నీ దుఃఖంతో గడ్డ కట్టుకుపోయి ముడుచుకుపోయి భూమి కనురెప్పల్లో కాల్వలవుతాయి
Posted in కవితలు
Leave a comment
సగం సగం – యల్. రాజా గణేష్
దాంపత్య జీవితం మూడే మూడు ముడులతో మొదలైనా అనేకానేక పీఠముళ్ళూ చిక్కుముళ్ళూ పడి కాలకొలమానం హీనాతిహీనంగా ఒకవైపుకే
Posted in కవితలు
Leave a comment