Daily Archives: February 4, 2026

ఫిబ్రవరి 2026

ఫిబ్రవరి 2026

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ఇదీ సంగతి – కొండవీటి సత్యవతి

ఒకానొక సఖి సెంటర్‌కి ఒక కుటుంబ హింస బాధిత మహిళ వచ్చారు. ఆమెతో ఆమె ఇద్దరు పిల్లలు ఉన్నారు. కౌన్సిలర్ ఆమెను కూర్చోబెట్టి భోజనం చేసారా అని అడిగింది. లేదు అన్నారామె. భోజనం తెప్పించి ముందు తినండి తర్వాత మాట్లాడదాం అంది కౌన్సిలర్. పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు గబగబా తింటున్నారు. ఆమె కళ్ళ నుండి … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

గర్భసంచి మహిళలకి లైఫ్ లైన్ – పి. ప్రశాంతి

‘పండగలంటే పల్లెటూళ్ళలోనే చూడాలి. మరీ ముఖ్యంగా దసరా పండక్కి తెలంగాణా పల్లెల్లో రకరకాల పూలతో బతుకమ్మల్ని చేసి అందమైన ఆటపాటలతో సాగానంపడం చూడాల్సిందే. ఆంధ్రా పల్లెల్లో అయితే సంక్రాంతి పండక్కి నెల ముందునించే ముంగిళ్ళలో ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెడ్లు, హరిదాసులు…. చెప్పడం కాదు చూసి తీరాల్సిందే’ పరవశంగా చెప్పుకు పోతున్నాడు నరేంద్ర.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

‘నో’ చెప్పడం తప్పు కాదు – అపర్ణ తోట

ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ముగించాక, ఒక అమ్మాయి నన్ను దొరకబుచ్చుకుని “పెళ్లి తరవాత కుటుంబంలో మగస్వామ్య బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడం ఎలా?” అని అడిగింది ఒక అమ్మాయి. ఒక పాతికేళ్ళు ఉండవచ్చు. ఇంకా పెళ్ళికాలేదన్నది. సూటిగా అడిగిన ఈ ప్రశ్న నాకు కాస్త ఆశ్చర్యాన్ని ఆలోచనను ఇచ్చింది. ఇంత మౌలికమైన, బలమైన ప్రశ్న … Continue reading

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత

గత రెండు నెలలుగా తెలుగు టెలివిజన్, సోషల్ మీడియా, సినిమా పెద్దలు, తెలుగు మహిళలు ఎలా ఉండాలని జరుపుతున్న చర్చలో తెలుగు మగవాళ్ళు చాలా ఉత్సహంగా ఆడవాళ్లు స్వేచ్చని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో, ఎలా వాళ్ళని నియంత్రణ చెయ్యాలో, ఏ బట్టలేసుకుంటే గౌరవించాలో, లేకుంటే ఎలా తన్ని తరిమేయ్యలో కామెంట్లు చేస్తున్నారు. మొదట్లో వీళ్ళందరూ బోట్స్ … Continue reading

Share
Posted in ఇంకు పెన్ను | 1 Comment

సామాజిక మాధ్యమాలు: ట్రాన్స్‌జెండర్ సముదాయానికి ప్రజాస్వామ్య వేదిక – అర్చనరావు మానుకొండ

భారతదేశంలో మారుతున్న సామాజిక-రాజకీయ పరిస్థితుల్లో, ట్రాన్స్‌జెండర్ సముదాయాలు చరిత్రపరంగా ప్రధాన మీడియా ద్వారా తప్పుగా చూపబడుతూ, అవమానించబడుతూ, నేరపూరితంగా, హేళనాత్మక హాస్యంతో చిత్రీకరించబడ్డాయి. ఈ చిత్రీకరణలు తరచుగా ట్రాన్స్ వ్యక్తులను సాధారణ జీవితాలు గల విభిన్న వ్యక్తులుగా కాకుండా, మోసపూరితులుగా, మానసికంగా అస్థిరులుగా లేదా సమాజానికి ముప్పుగా చూపిస్తుంటాయి.

Share
Posted in ప్రతిబింబం | Leave a comment

తప్పెవరిది? – కేతు పద్మమ్మ

‘నాన్నా! పేపరు వచ్చింది, ఇదిగో!’ అంటూ లీల నా మంచం దగ్గరికి వచ్చి ఇచ్చింది. ‘ఏమిటి లీలా అప్పుడే పేపర్ తెచ్చావా! ఇప్పుడే కదా లేస్తున్నా!’ అని పేపర్ తీసుకున్నా. ‘నేను స్కూలుకు రెడీ అవుతున్నాను నాన్నా! అందుకని నీకిచ్ఛేసి పోతున్నా!’ అంటూ పరిగెత్తింది.

Share
Posted in కధలు | Leave a comment

మంతస్రాని..! – నాంపల్లి సుజాత

ఇప్పుడంటే.. దగ్గినా తుమ్మినా దావఖాండ్లు డాక్టర్లు అంటండ్రు గానీ,

Share
Posted in కవితలు | Leave a comment

“కావలెను!” – గిరిధర్

హృదయ దానం చేసేవారు కావలెను!!” బ్రెయిన్ డెడ్ అయిన వారు; కాని వారు.. ఎవరైనా సరే,

Share
Posted in కవితలు | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

` అనువాదం: ప్రభాకర్ మందార (గత సంచిక తరువాయి…) 12. కారంచేడులో దళితుల రక్తంతో ఎరుపెక్కిన పొలాలు ఇబ్రహీంపట్నంలో పని చేస్తున్నప్ప్పుడు భూస్వాముల దురహంకారం ఎంత దారుణంగా ఉంటుందో చూసి వున్నప్పటికి 1985లో కారంచేడులో జరిగిన ఘోరాన్ని తట్టుకోలేకపోయాను. 18 జులై 1985 నాటి దినపత్రికలో ‘కారంచేడులో ఆరుగురు దళితులను వెంటాడి గొడ్డళ్లతో నరికివేత’ అన్న … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

విరసం మా ఊపిరి : కృష్ణాబాయి – కొలిమి

నాన్నది భూస్వామ్య కుటుంబం: మాది కృష్ణా జిల్లా దివి తాలూకా ఘంటశాల పాలెం. చల్లపల్లి జమీందారు గ్రామాలన్నమాట. ఆ జమీందారు కిందున్న జీమీ గ్రామాలవి. చాలా చిన్న ఊరు. 1930లో పుట్టాను. మా నాయనమ్మ పేరు కలిపి వెంకట సుబ్బమాంబ అని పేరు పెట్టారట. అది అసలు పేరు. మా మేనమామ దోనేపూడి వెంకట్రామయ్య బతుకుదెరువు … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

లలితా రాందాస్ జీవన ప్రస్థానం – గిరిజ పైడిమర్రి

ఎనభై ఆరేళ్ళ లలితా రాందాస్ జీవన ప్రస్థానంలో.. రాజకీయంగా, సామాజికంగా, విద్యావ్యవస్థలో వచ్చిన పరిణామాలు పాఠకులకు అవగాహనకు వస్తాయి. బాల్యంలో సహచరులిద్దరి జీవితాలలో జరిగిన సశీఘటనలు.. భవిష్యత్తులో ఇండియా పాకిస్తాన్ దేశాల శాంతి సయోధ్యకు పనిచేసేలా చేసాయి. ఇండియన్ నేవీ కుటుంబాలకు ఉండే హై సెక్యూరిటీ సిస్టం పెట్టని కోటగోడ లాంటిది.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

16 రోజుల కార్యాచరణ – భూమిక టీం

స్త్రీలు బాలికలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా 16 రోజుల కార్యాచరణను భూమిక సంస్థ పనిచేస్తున్న అన్ని బస్తీలలో నిర్వహించాము. గత రెండు సంవత్సరములుగా రకరకాల అంశాలపై అవగాహన కార్యక్రమాలు, ట్రైనింగ్స్ నిర్వహించడం, హింసకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వివిధ సంస్థల యొక్క సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

ఆదర్శపాఠకురాలి ‘పఠనాత్మకథ’ – మృణాళిని

నిన్నటి తరం రచయితలు మరోసారి తమ పఠనాప్రయాణాన్ని గుర్తు చేసుకోడానికీ, ఈ తరం పాఠకులు, రచయితలు ఏ రచయితలను విధిగా చదివి తీరాలో తెలుసుకోడానికీ ఎంతో ఉపకరించే రచన ఇది. చంద ‘మామ’ నుంచి సోమర్సెట్ ‘మామ’ వరకూ భార్గవి తన పఠనానుభవాన్ని ఒక రసగుళికగా మార్చి రాసిన అందమైన పుస్తకం ‘నా చదువు కథ’.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

కొన్యాక్ పచ్చబొట్లు: జ్ఞాపకాల పటాలు – సర్వజయ భట్టాచార్య / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా

నాగాలాండ్‌కు చెందిన కొన్యాక్ ఆదివాసీ సముదాయపు సంస్కృతిలో పచ్చబొట్ట్లు ఒక విడదీయరాని భాగంగా ఉండేవి. ఆ పచ్చబొట్లను మహిళలే వేసేవారు. 1970లలో వాటిని నిషేధించిన తర్వాత, వాటిని వేసేవారు చాలా కొద్దిమంది మాత్రమే మిగిలారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment