Author Archives: భూమిక

– –

– చింతనూరి కృష్ణమూర్తి ఒక రచయిత రాసిన ఒకటి రెండు కథల ఆధారంగా ఆరచయిత వస్తు స్వీకరణ, దృక్పథాలను నిర్థారించడం కోసం ఈ కథలను మూల బిందువుగా తీసుకొని యశోదారెడ్డి గారి రెండు కథలను పలుమార్లు చదివాక, చదువుతూ ఉన్నప్పుడు కలిగిన ప్రతి స్పందనలే ఇవి.

Share
Posted in వ్యాసం | Leave a comment

– శివపురపు శారద, తెలుగు అనువాదం : పి. సౌజన్య కుమారిపన్నెండు సంవత్సరాలుగా మా ఇంట్లో ఒకామె పనిమనిషిగా ఉండేది. నాకు బదిలీ కావడం వల్ల ఆమెను వదులుకోవలసి వచ్చింది. ఆమె పనితో అసంతృప్తితో వుండటం వాళ్ల కాదు గాని అలాంటి పనిమనిషి బెంగుళూరులో దొరుకుతుందో లేదోననే నా దిగులంతా.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

– కూకట్ల హనుమంతరావు ”అనుకూలాం విమలాంగీం కులజాం కుశలాం సుశీల సంపన్నాం పంచ లకారం భార్యాం పురుషః పుణ్యోదయాల్లభతే” – మనుస్మృతి ”కార్యేశుదాసీ, మాతృదేవోభవ, అమృతం సద్గుణా భార్య, యత్రనార్యస్తు పూజ్యంతే ఇలా మనస్మృతిలోనూ ఇతర గ్రంథాలలోనూ అనేక సందర్భాలలో స్త్రీమూర్తిని వేనోళ్ళ కొనియాడారు అణువుతో నిండినదిగా ఈ బ్రహ్మాండాన్ని గుర్తించినట్లే – ఆడదే ఆధారం. … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

?

– రమాసుందరి బత్తుల నిర్భయ అత్యాచారం, హత్య నేపధ్యంలో పెల్లుబుకిన ప్రజాగ్రహం అనేక నాణ్యమైన చర్చలకు, పరిణితి గలిగిన ఉద్యమాలకు పురుడు పోసింది. అత్యాచారాలకు సంబంధించిన మూలాల మీద దాదాపు అన్ని సాహిత్య ప్రక్రియల నుండి మెరుగైన సాహిత్యం వచ్చింది. ఏళ్ళ తరబడి ఉచ్చరించటానికి వెసులుబాటు దొరకని, మాట్లాడుకోవటానికి అనుమతి దొరకని అత్యాచారాల అంతర్గత మూలాలు … Continue reading

Share
Posted in వ్యాసం | 4 Comments

– సామాన్య ఆస్కార్‌ వైల్డ్‌ రాసిన పిల్లల కథల పుస్తకం ”ది హ్యేపీ ప్రిన్స్‌ అండ్‌ అదర్‌ స్టోరీస్‌”లో మొదటి కథ ”ది హ్యేపీ ప్రిన్స్‌”. నాకు బాగా ఇష్టం ఈ కథ. యెన్నెన్నో చదువుతూ బాగా పెద్దైపోయాక కూడా మనల్ని వెంటాడే కథ ఇది. చిన్నపుడెపుడో పాఠ్యాంశంగా ఉండింది మాకు.

Share
Posted in సినిమా లోకం | 1 Comment

– ఎపి మహిళా సమత సొసైటి, కరీంనగర్‌ చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో మహిళా సమత సొసైటి 1998 సం. నుండి స్త్రీలను సంఘటిత పరచి వారి సమస్యలను / అవసరాలను తీర్చుకోవడం కోసం అవగాహన కల్పిస్తూ 36 మంది మహిళలతో జీవన జ్యోతి మహిళా సంఘంగా ఏర్పాటు కావడం జరిగింది.

Share
Posted in గ్రామీణ మహిళావరణం | Leave a comment

‘ ,

రచయితలకు, కవులకు ఆహ్వానం గత 66 సంవత్సరాలుగా నిరంతరాయంగా వెలుపడుతున్న ఏ.పి.టి.ఎఫ్‌. అధికార మాసపత్రిక ”ఉపాధ్యాయ”లో గత 4 సంవత్సరాల నుండి కథలు, కవితల పోటీ నిర్వహిస్తున్నాము. ఫిబ్రవరి జన్మదిన సంచిక నుండి బహుమతి పొందిన రచనలను ప్రచురించడం జరుగుతుంది. కావున రచయితలు, కవులు తమ రచనలను పంపవలసినదిగా ఆహ్వానిస్తున్నాము.రచయితలకు సూచనలు

Share
Posted in ప్రకటనలు | Leave a comment

భూమిక ప్రతి సంవత్సరం కథ, కవిత, వ్యాసరచనల పోటీని నిర్వహిస్తున్న విషయం మీకు తెలుసు. కధ, కవితకు సంబంధించిన అంశం ఎంపిక రచయితల అభీష్టానికే వదిలేస్తున్నాం. వ్యాసం ”మహిళలపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులు – పరిష్కారాలు” అనే అంశం మీద రాయాలి.

Share
Posted in ప్రకటనలు | Leave a comment

Title Page

Share
Posted in Uncategorized | Leave a comment

మాలతీ చందూర్‌ మాలతీ చందూర్‌ మరణం …. అదీ క్యాన్సర్‌ బారినపడి హఠాత్తుగా మరణించడం చాలా బాధాకరం. మాలతి గారిని తలుచుకుంటే నాకు గుర్తొచ్చేది ఆవిడ పరిచయం చేసిన ప్రపంచ సాహిత్యం. పాత కెరటాల్లో ఆవిడ పరిచయం చేసిన పుస్తకాలను ఎలాగైనా సంపాదించి చదవాలనిపించేంత ప్రేరకంగా వుండేవి.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

సంపాదకులు సత్యవతిగారు… నమస్కారములు… జులై నెల భూమిక కవరుపేజీమీద నవ్వులు చిందిస్తూవున్న మహిళవి రెండు ఫోటోలు, ఫోటోల క్రింద ‘ఐనా నేను ఓడిపోలేదు’ చూడగానే ఇదేదో ప్రత్యేకత కల్గినదిగా తోచింది.

Share
Posted in ఎడిటర్ కి ఉత్తరాలు | Leave a comment

– ఓల్గా  మాలతీ చందూర్‌ 30వ దశాబ్దపు తొలి సంవత్సరంలో జన్మించారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆమె పదిహేడు సంవత్సరాల ఆధునిక యువతి. ఒక విశాలమైన అర్థంలోనైనా ‘ఆధునికత’ అంటే చెప్పుకోవటం అవసరం.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

– ఎమ్‌. సుచిత్ర  జూన్‌ 14 నుంచి జజీరా తన ముగ్గురి పిల్లలతోపాటు ప్రభుత్వ కార్యాల యాల ఎదుట కూర్చొని ఇసుక తవ్వకాల నుంచి కేరళ సముద్రతీరం రక్షణ కోరుతూ నిశ్శబ్దంగా నిరసన తెలుపుతోంది.

Share
Posted in గ్రామీణ మహిళావరణం | Leave a comment

” ()” ()

– విడదల సాంబశివరావు అర్థరాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాలు. విజయవాడ నగరంలో పోలీసులు కృష్ణలంక ప్రాంతంలో తుఫాన్‌కి కూలిపోవడానికి సిద్ధంగా వున్న ఓ పాత పెంకుటిల్లు ముందు జీపు ఆపారు. సి.ఐ., ఎస్‌.ఐ., నలుగురు పోలీసులు ఆ ఇంటి తలుపుకొట్టారు. సరిగ్గా 20 నిమిషాల తరువాత యాభై సంవత్సరాల వయస్సు కలిగిన ఓ స్త్రీ … Continue reading

Share
Posted in కధలు | Leave a comment

– సామాన్య ”మై నైబర్‌ టొటోరో” హయొమియొజాకి సినిమా. మియొజాకి సినిమాలలో నాకు అత్యంత ఇష్టమైన సినిమా ఇది. యానిమేషన్‌ అంటే డిస్నీ, డిస్నీ అంటే యానిమేషన్‌ అని భావిస్తున్న సమయంలో ‘స్పిరిటెడ్‌ అవే’ చూడటం తటస్థపడింది. అంత చిక్కటి శైలీ, శిల్పం ఉన్న యానిమేషన్‌ సినిమాని చూడటం మాకు అదే ప్రథమం.

Share
Posted in సినిమా లోకం | Leave a comment

– పూర్ణిమ  చైనా దేశంలో ఒక ఫ్యాక్టరీ కాంపౌండ్‌. ఆ పూట అక్కడంతా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. కార్మికులంతా ఊపిరి బిగబట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఆర్థికమాంద్యం (ఇది రెండేళ్ళ కింద వచ్చిన ఆర్థికమాంద్యం కాదు!) వల్ల కార్మికులను ఉద్యోగాలనుండి తీసేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఒక జాబితా వెలువడబోతుంది.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment