Category Archives: సంపాదకీయం

సంపాదకీయం

”మిస్సింగ్…”

  2001 మార్చి మొదటి తారీఖు నాటికి భారతదేశ జనాభా ఒక బిలియన్‌. అంటే వందకోట్లు. ఈ ఏడేళ్ళ కాలంలో మరిన్ని కోట్ల మంది  పుట్టి వుంటారు. ఈ విషయంలో మనం నెంబర్‌ టూ పోజిషన్‌కు చేరుకున్నాం.

Share
Posted in సంపాదకీయం | 1 Comment

బడా కార్పోరేట్లను గడ గడ లాడిస్తున్న ”ముక్తా జోడియా”

 ”మేము మాకోసం పోరాడ్డం లేదు. మా తరువాత తరం కోసం పోరాడుతున్నాం.  ఈ అడవి మా తాత ముత్తాతలకు చెందింది.  ఇక్కడ మేము ఎలా  ప్రశాంతంగా బతికామో మా తరువాత తరం కూడా  ఇలాగే బతకాలి.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

భూమిక పాఠకులకు, సాహితీ మిత్రులకు అంతర్జాతీయ మహిళాదిన శుభాకాంక్షలు.

భూమికకు పదిహేనేళ్ళు నిండాయి. ఒక సీరియస్‌ స్త్రీల పత్రికకు ఎడిటర్‌గా నాకు పదిహేనేళ్ళు గడిచాయి. నిజానికి ఎంతో ఆనందంగా పదిహేనేళ్ళ పండుగ జరుపుకోవాల్సిన సందర్భం.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

విజ్ఞప్తి

పదిహేను సంవత్సరాలుగా భూమికను ఆదిరిస్తూ, మాకు కొండంత అండగా నిలబడిన ప్రియపాఠకులకు నమస్కారం. భూమిక మాస పత్రికగా మారి రెండు సంవత్సరాలు పూర్తయ్యింది.

Share
Posted in సంపాదకీయం | 1 Comment

ప్రతికూల పరిస్థితుల్లో ఒంటరి పోరాటం

జూలై మూడు 2007. రాజ్కోట్ వీధుల్లో పూజా చౌహాన్ అనే మహిళ లోదుస్తులు మాత్రమే ధరించి తన నిరసనని ప్రపంచానికి తెలియచెప్పింది.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

మానవీయ భాష నేటి అవసరం

ఆగష్టు ఆరవ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాలులో ”పాలపిట్ట పాట – ప్రత్యేక తెలంగాణా పోరాట పాటలు” వరవరరావు రాసిన పాటల సిడీల ఆవిష్కరణ సభ జరిగింది. మా భూమి సినిమాలో ”పల్లెటూరి పిల్లగాడా” పాటతో జనం నాలుకల మీద ఈనాటికీ నిలిచిన సంధ్య, విమల, రడం శ్రీను, పుష్ప, వెంకట్ల పాటలు … Continue reading

Share
Posted in సంపాదకీయం | 5 Comments

భూమిక పాఠకులకు, అభిమానులకు విజ్ఞప్తి

భూమిక పాఠకులకు, అభిమానులకు నమస్కారం. భూమిక అజేయ ప్రయాణం ప్రారంభించి దాదాపు పదిహేను సంవత్సరాలు కావస్తోంది. త్రైమాస పత్రికగా మొదలై, ద్వైమాస పత్రికగా కొనసాగి ప్రస్తుతం మాసపత్రికగా నిలదొక్కుకున్నది. అన్వేషి అండదండలతో తొలి అడుగు వేసినా, అచిర కాలంలోనే స్వయంసిద్ధగా ఎదిగింది. ఒక ప్రత్యామ్నాయ స్త్రీవాద పత్రికగా తన లక్ష్యాలు, ఉద్దేశ్యాల విషయంలో ఎలాంటి రాజీ … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

”మీ కలలపై నమ్మకం ఉంచండి. విజయం మీదే”

సునీతా విలయమ్స్‌. స్ఫూర్తికి మారు పేరు. సంచలనాల చిరునామా. అంతరిక్షంలో 195 రోజులు గడిపిన తొలి మహిళ. చిరునవ్వుల సునీత భారత సంతతికి చెందడం, ఇంత ఘనమైన ప్రపంచ రికార్డును సాధించడం, అపూర్వం. అపురూపం. భారతీయులందరికి గర్వకారణం. భారతీయ మహిళలకు స్ఫూర్తిదాయకం. ఆకాశం మా హద్దంటూ నినదించిన మహిళోద్యమం, ఇక నుండి అంతరిక్షం మా ధ్యేయం … Continue reading

Share
Posted in సంపాదకీయం | 1 Comment

“ది అదర్‌ హాఫ్‌” కోసం కలానికి పదును పెట్టిన కల్పనా శర్మ

కల్పనా శర్మ. హిందూ పేపర్‌ చదివే వారికి ఈ పేరు సుపరిచితమే. ముంబయ్‌ హిందూ చీఫ్‌ బ్యూరో గాను, డిప్యూటీ ఎడిటర్‌గాను పని చేస్తున్న కల్పన మే నెలాఖరుకి తన పదవి నుంచి రిటైర్‌ కాబోతున్నారు. మే 24 న ఆమె అరవై ఏళ్ళకు చేరుకుంది. ఈ సందర్భాన్ని మహిళా జర్నలిష్టుల నెట్‌వర్క్‌, బెంగుళూరు విభాగం … Continue reading

Share
Posted in సంపాదకీయం | 1 Comment

రండి చేనేతను ప్రేమిద్దాం చేనేతను ధరిద్దాం

మన రాష్ట్రం ఎంతో సొగసైన చేనేత సొబగులను కలిగి వుంది. బహు నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్న అద్భుతమైన చేనేత కళాకారులు వున్నారు. రాష్ట్రం నలుమూలలా విస్తరించి వున్న ఈ కళాకారులు క్రమంగా ఉపాధిని కోల్పోతూ కుంచించుకు పోతున్నారు. పొట్ట గడవని స్థితిలో ఆత్మహత్యల వేపు నెట్టబడుతున్నారు. చేతిలో అద్భుతమైన నేత కళ వుండి కూడా … Continue reading

Share
Posted in సంపాదకీయం | 2 Comments

“ఫ్రెష్‌” మార్కెట్ల వెనక క్రష్‌ అవుతున్న మహిళల జీవనోపాధి

పెద్ద చేప చిన్న చేపను మింగుతుంది. ఫుడ్‌ బజార్లు ప్రవేశించి ఎన్నో సూపర్‌బజార్లను మింగేసాయి. జెయింట్‌లు, బిగ్‌ బజార్లు వచ్చి ఫుడ్‌ బజార్లను దెబ్బతీసాయి. ఇపుడు తాజా కూరగాయలు, తాజా పండ్లు అందిస్తాం అంటూ తాజాగా మార్కెట్‌లో ప్రవేశించిన “ఫ్రెష్‌” సూపర్‌ మార్కెట్లు, నగరంలో ఎక్కడెక్కడ కూరగాయలు అమ్మే స్థలాలున్నాయో, అక్కడే తమ దుకాణం తెరిచి … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

మార్చి ఎనిమిది మార్గంలో…

సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి దూసుకెళ్ళి అక్కడే మకాం పెట్టిన ఈ రోజుల్లో కూడా ఆడవాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన రోజు వుండాలని మీరింకా ఎందుకనుకుంటున్నారు? అంటూ ఇటీవల ఒక విలేఖరి నన్ను ప్రశ్నించాడు. అంతర్జాతీయ మహిళా దినం మార్చి ఎనిమిది గురించి నన్ను ఇంటర్వ్యూ చేస్తూ అతను పై ప్రశ్న వేసాడు. సునీత అంతరిక్ష యానం … Continue reading

Share
Posted in సంపాదకీయం | 1 Comment

మణిపూర్ ఉక్కు మహిళ షర్మిలా ఇరామ్

షర్మిలా ఇరామ్, 35 సంవత్సరాల మణిపూర్ ఉక్కు మహిళ నిరవధిక నిరాహారదీక్ష మొదలుపెట్టి ఏడు సంవత్సరాలు దాటుతోంది. మణిపూ‌ర్‌లోనే కాక మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో 48 సంవత్సరాలుగా అమలులో ఉన్న అమానుష చట్టం ఆర్మడ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్స్) చట్టాన్ని (ఎఎఫ్ఎస్‌పిఎ) కి వ్యతిరేకంగా షర్మిల నవంబర్ 2000 లో తన అమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టింది. … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

మహిళలకు మేలు చేసిన 2006

భూమిక పాఠకులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు 2006 సంవత్సరంలో స్త్రీలపరంగా చూసినపుడు చాలా ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. భారతీయ స్త్రీలు అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధించి జయకేతనాలెగరేసారు. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, కల్పనా చావ్లా ఆశయాన్ని, రోదసికి ఎగిసి వెళ్ళి సాధించగలిగింది. ప్రపంచంలోనే శక్తివంతమైన వ్యాపారవేత్తగా ఇంద్ర నూయీ ఎదగగలిగింది.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

హెచ్ఐవి/ ఎయిడ్స్ ప్రత్యేక సంచిక

మానవ ప్రవృత్తి వైపరీత్యాల ఫలితం… ఒకటిన్నర దశాబ్ద కాలంగా స్త్రీల సమస్యల గురించి, స్త్రీల అంశాల గురించి భూమిక చేస్తున్న కృషి మీకందరికి తెలుసు. ఈ కృషిలో భాగంగానే గత సంవత్సరం, అంతర్జాతీయ ఎయిడ్స్ దినం సందర్భంగా, స్త్రీల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న హెచ్ఐవి/ ఎయిడ్స్ పై ప్రత్యేక సంచికను వెలువరించాం. రెండో ప్రయత్నంగా, … Continue reading

Share
Posted in సంపాదకీయం | 1 Comment

ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి/ఎయిడ్స్

ఆంధ్రప్రదేశ్ 2001 జనాభా లెక్కల ప్రకారం 76.2 మిలియన్‌ల జనాభాతో భారతదేశంలో ఐదవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా వుంది. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఎక్కువగా వున్న ఆరు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. మిగతా ఐదు రాష్ట్రాలు: మణిపూర్, నాగాలాండ్‌లతో పాటు ఇరుగుపొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు.

Share
Posted in సంపాదకీయం | 1 Comment