Monthly Archives: May 2007

పెదవుల తాకిడి

– బి. బాలాదేవి సింధూరపు ఎరుపూ నీలాకాశాన్నావరించిన నీలమూ ఎరగ్రులాబీ ఎరుపు దనమూ పచ్చని ఆకుల పచ్చదనమూ నీ పెదవుల తాకిడిని గుర్తుకు తెస్తాయి నాలో!

Share
Posted in కవితలు | Leave a comment

విలక్షణ స్నేహశీలి వాసిరెడ్డి సీతాదేవి

– అబ్బూరి ఛాయాదేవి డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవిగారితో నాకు పరిచయం నలభై ఏళ్ళ క్రితం జరిగింది. ఢిల్లీలో మా ఇంట్లో. ఆమె అబ్బూరి రామకృష్ణరావుగారి శిష్యురాలుగానూ, నేను కోడలుగానూ పరస్పరం పరిచయం అయ్యాం- రచయిత్రులుగా కాదు. సీతాదేవిగారు మద్రాసు నుంచి హైద్రాబాదుకి తరలి రావడం, మేము హైదరాబాదు నుంచి న్యూఢిల్లీకి తరలి వెళ్ళడం దాదాపు ఒకేసారి … Continue reading

Share
Posted in నివాళి | Leave a comment

హైదరాబాదీ సంస్కృతికి అద్దం పడతాయి

– వారణాసి నాగలక్ష్మి డాక్టర్ కె.బి.లక్ష్మి గారి ‘వీక్షణం’ చిటారు కొమ్మ నున్న గూటిలోంచి తలబైటకు పెట్టి లోకాన్ని కలయజూస్తున్న విహంగ వీక్షణమే. కమనీయ కవితా విహాయసంలోకి దూసుకుపోవాలని రెక్కల్లోకి శక్తి పుంజుకుంటున్న కౌజు పిట్ట కుతూహలమే. ‘గమనం’ ప్రారంభించేసరికి ఆ రెక్కల నిండా విశాల గగనంలో ఎంత దూరమైనా అలుపులేక సాగిపోగల శక్తి నిండింది. … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

శభాష్! ఫరా అజీజ్

– వేములపల్లి సత్యవతి ఫరా బీహార్లోని భౌనాత్పూర్ అనే చిన్న పట్టణంలో పుట్టింది. ఫరా అమ్మా-నాన్న ఆమెను ఘోషాలో వుంచి, పరదాచాటున పెంచలేదు. వివక్షతలేకుండా ఎంతో స్వేచ్ఛగా పెంచారు. చిన్నప్పుడే ఫరా సైకిల్ మీద పట్టణమంతా తిరిగి వచ్చేది. హైస్కూల్ చదువు పూర్తయిన తర్వాత ఉన్నత విద్యాభ్యాసానికి ఆలీఘడ్ యూనివర్శిటీలో అడుగు పెట్టింది. యూనిర్శిటీ క్యాంపస్లో … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

స్త్రీల జీవితాల్లోని వాస్తవాలను ప్రతిబింబించని సినిమాలు

– శివలక్ష్మి 2007 మార్చి 23వ తేదీ నుంచి మార్చి 29 వరకూ మన హైదరాబాద్లో సినిమా పండగలు బ్రహ్మాండంగా జరిగాయి. 22వ తేదీ సాయంత్రం పబ్లిక్ గార్డెన్స్లోని లలిత కళాతోరణంలో గౌతమ్ ఘోష్ ”యాత్ర” చిత్రంతో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభమైంది. ఈ ఏడు రోజులూ ఉదయం 9 గంటల నుంచి రోజుకి నాలుగు … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కలం దూరమవ్వడం అంటే ఆక్సిజన్ కరువవ్వడమే.

– ఇంటర్వ్యూ: శాంతసుందరి హిందీ రచయిత్రి, బాధితులైన స్త్రీలకోసం కౌన్సులింగ్ సెంటర్ ముంబైలో నడుపుతున్న, సుధా అరోరా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమెతో జరిపిన ఇంటర్యూ ప్రశ్న : సుధా అరోరాగారు, మీ నేపధ్యం కొద్దిగా చెపుతారా? సుధ : నేను 1946లో దేశవిభజనకు పూర్యం లాహోర్లో పుట్టాను. మాది చాలా సంప్రదాయమైన కుటుంబం. మా కుటుంబంలో … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

రచయిత/రచయిత్రులకు విజ్ఞప్తి

కొంతమంది రచయిత్రులు, పాఠకులు అర్ధం కాని చేతిరాతతో తమ రచనలు, ఉత్తరాలు పంపుతున్నారు. దీనివల్ల తప్పులు దొర్లడమే కాక టైపు చేయడం చాలా కష్టంగా ఉంటోంది. కాబట్టి ఇకనుంచి తమ రచనలనుగాని, ప్రతిస్పందన శీర్షికకు పంపే ఉత్తరాలు, స్పష్టంగా అర్ధం అయ్యే విధంగా కాగితానికి ఒక వైపునే రాసి పంపించాల్సిందిగా కోరుతున్నాం.

Share
Posted in ఎడిటర్‌కి లేఖలు | Leave a comment

వాల్‌మార్ట్ – కొన్ని వాస్తవాలు !

– డా. చైతన్య వాల్‌మార్ట్ గురించి ఈ వాస్తవాలను మీతో పంచుకుందామనుకుంటున్నాను. Walmart గురించి మనం తెలుసుకోవలసిన కొన్ని నిజాలు – ఇవి తెలుసుకున్నాక Walmart లో తక్కువ ధరలు ఎందుకుంటాయో అర్థం కాక మానదు. Walmartలో అన్నింటికన్నా ఎక్కువ ఉండేవి సేల్స్ అసోసియేట్స్ ఉద్యోగాలు. 2001 లో సగటున వారి సంవత్సర ఆదాయం $13,861. … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

‘మహారాజా లేడిస్క్లబ్, విజయనగరం’ వారి కథా కమామిషు

– డా. సుహాసిని M.R. లేడీస్క్లబ్ అనగానే మనకు గుర్తువచ్చే పేరు ‘లోపాముద్ర’. సామాజిక, కళా, విద్యా రంగాలకి ఆమె అందిస్తున్న చేయూత చిన్నదికాదు. ఎందరో లబ్ద ప్రతిష్టులను, కళాకారులను, ఏటా సన్మానిస్తు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తూ నేటికీ నిత్యనూతనంగా నడిపిస్తున్న ఘనత శ్రీమతి లోపాముద్ర గారికే చెందుతుంది. 1937లో ఈ క్లబ్ని … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

చేనేత కార్మికులుగా మారిన బాలికలు

– యస్.వి. శివరంజని, పరిశోధనా సహాయకురాలు చేనేత విజ్ఞాన విధాన కేంద్రం (చిప్) పధ్నాలుగు సంవత్సరాలు నిండని వారిని ”బాలలు” అంటారు. ఈ వయసులో పనిచేస్తున్న వారిని బాలకార్మికులంటారు. సాధారణంగా బాలకార్మికులు ఎక్కువగా ఫ్యాక్టరీ పనుల్లో మెకానిక్ పనుల్లో, హోటళ్లలో, బట్టల షాపుల్లో, వ్యవసాయ కూలీలలో కనిపిస్తారు. చేనేతరంగంలో బాలకార్మికులు (బాలికలు) ఉన్నారు. ఆడపిల్లలు చదువుకుని … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

విరబూయని జీవితాలు-విసిరేసిన మందారాలు

– డా. కె. పద్మ, ఎన్. అలివేలుమంగ ఆడపిల్లే ఇంటికి వెలుగు-వీధిబాలికల జీవితాలలో వెన్నెల విరబూయిద్దాం కాజీపేట్ రైల్వేజంక్షన్లో ఉదయం 8.30 ని||కు కృష్ణా ఎక్స్ప్రెస్ భాగ్యనగరం నుండి వచ్చి ఆగింది. అందులో నుంచి ప్రయాణీకులతోపాటు కొంతమంది బాలికలు చేతిలో వేరుశెనగకాయలు అమ్మే బుట్టలతో రైలు నుండి గుంపుగా క్రిందికి దిగి నడిచివస్తున్నారు. వీరంతా ఎవరు? … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఈ హిపోకస్రీని వదిలేద్దాం

– బంగార్రాజు నిన్న నేనొక మీటింగ్కి హాజరయ్యాను. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గృహహింస నిరోధక చట్టం 2005 మీద కొన్ని స్వచ్ఛంద సంస్ధలు ఏర్పాటు చేసిన సమావేశమది. స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. గృహహింస అంటే ఏమిటి? దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? హింసకు గురైన స్త్రీ ఎవరిని … Continue reading

Share
Posted in వ్యాసాలు, సాహిత్య వార్తలు | Leave a comment