Monthly Archives: June 2007

ఫోనులో… సాంత్వన !

జీవితమన్నాక ఎన్నెన్నో సమస్యలు…వాటినెదుర్కొని ముందుకు సాగాలనే అందరి ప్రయత్నమూ. కానీ ఒక్కోసారి ధైర్యం సన్నగిల్లుతుంది. మనసంతా చీకటి ఆవరిస్తుంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఒక్కోసారి ఇక చాలు… ఈ లోకం నుంచి నిష్క్రమిద్దామని కూడా అన్పించవచ్చు. అలాంటి వారికి నేనున్నానని ఎవరైనా అండగా నిలబడితే… నాలుగు మంచి మాటలతో మెరుగైన భవిష్యత్తుపై చిగురంత ఆశ కలిగేలా … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు, ప్రకటనలు | 3 Comments

“ది అదర్‌ హాఫ్‌” కోసం కలానికి పదును పెట్టిన కల్పనా శర్మ

కల్పనా శర్మ. హిందూ పేపర్‌ చదివే వారికి ఈ పేరు సుపరిచితమే. ముంబయ్‌ హిందూ చీఫ్‌ బ్యూరో గాను, డిప్యూటీ ఎడిటర్‌గాను పని చేస్తున్న కల్పన మే నెలాఖరుకి తన పదవి నుంచి రిటైర్‌ కాబోతున్నారు. మే 24 న ఆమె అరవై ఏళ్ళకు చేరుకుంది. ఈ సందర్భాన్ని మహిళా జర్నలిష్టుల నెట్‌వర్క్‌, బెంగుళూరు విభాగం … Continue reading

Share
Posted in సంపాదకీయం | 1 Comment

ప్రకృతి వైపరీత్యాలు- జండర్‌ అంతరాలు

ప్రకృతి వైపరీత్యాలప్పుడు జరిగే నష్టాలు, ప్రాణాపాయాలు, స్త్రీ పురుషులిద్దరి విషయంలో ఒకేవిధంగా ఉండవు. సమాజంలో ఏదో వొక విధమైన వివక్ష నెదుర్కొంటున్న వారిపైనా, అణచివేయబడుతున్నవారిపైనా, వనరులు అందుబాటులో లేనివారిపైనా ప్రకృతి వైపరీత్యాలు తీవ్రప్రభావాన్ని చూపిస్తాయి.

Share
Posted in అనువాదాలు, వ్యాసాలు | 1 Comment

కంచె

– శీలా సుభద్రాదేవి “నాతాన పైసల్లేవు పీజులు కట్టాల్నంటే ఏడకెల్లి తెవాల్ని? నామిండడితాన కెల్లి తేవాల్నా? ఏంజేస్తె గది సెయ్యుండ్రి. నేనేమనా. పోరల్ని ఇంటికి తోలిస్తమంటారా గట్లే తోలియ్యుండ్రి…” ప్రక్క క్లాసుముందు వరండాలో నిలబడి పెద్దగా అరుపులు విని నాక్లాసునుండి బయటకు వచ్చాను.

Share
Posted in కథలు | Leave a comment

సాంఘిక వెలిలో రచించటమంటే? – అవకాశాలు, సవాళ్ళు, సంకటాలు !

– భామ (అనువాదం : ఓల్గా) సాంఘిక వెలికి గురైన గ్రూపుకి చెంది అలా వెలికి గురైన వారి గురించి మాత్రమే రాస్తున్న నాకు రచయిత్రిగా ఎలాంటి అవకాశాలున్నాయి, ఎలాంటి సవాళ్ళను, సమస్యల నెదుర్కుంటున్నాను అనే విషయం గురించి ఆత్మ పరిశీలన చేసుకునేందుకు ఆహ్వానించినందుకు విమెన్స్‌ వరల్డ్‌ వారికి ధన్యవాదాలు.

Share
Posted in అనువాదాలు, వ్యాసాలు | Leave a comment

విప్లవం మధ్యలోంచి రాయటం

మంజుశ్రీ థాపా (నేపాల్‌) అనువాదం: ఓల్గా 2005 ఫిబ్రవరిలో రాజు జ్ఞానేంద్ర హఠాత్తుగా చట్టవిరుద్ధంగా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని రద్దుచేశాడు. ఆ చర్య ద్వారా ఆయన అనుకోకుండా డెమోక్రాట్లు సంఘటితమవటానికి సహాయపడ్డాడు. అంతకు ముందు వాళ్ళు పరమ అరాచకంగా ఉన్నారు. రచయితలు భావ ప్రకటనా స్వాతంత్రం గురించి ఎంత నిబద్ధతతో ఉన్నారనే దానికి యిదొక పరీక్ష పెట్టింది.

Share
Posted in అనువాదాలు, వ్యాసాలు | Leave a comment

“నాలోని స్తీ” కవితా సమీక్ష

– ఆర్‌.శాంతసుందరి ఎలా చెప్పనమ్మా మనిద్దరికీ ఇక అక్కడ చోటే లేదని! మనసులో గాని ఇంట్లోగాని మన జ్ఞాపకాలేవీ లేవనీ!

Share
Posted in పుస్తక సమీక్షలు | 3 Comments

యాక్సిడెంట్‌

అత్తలూరి విజయలక్ష్మి మంచు కురుస్తొంది… అయినా లోపలికి వెళ్లాలనిపించడంలేదు.. నాగుండెల్లో రగులుతున్న మంట చలిని కాచుకున్నట్టు వెచ్చగానే అనిపిస్తొంది. జరిగిన సంఘటన తాలూకు షాక్‌ నుంచి నేను బైటపడలేదు.. పడలేను కూడా. ఆ షాక్‌తో నా కాళ్లు చచ్చుబడినట్టు ఐనాయి. సర్వశక్తులు నన్ను అసహించుకుని వదిలేసి వెళ్లినట్టు నిస్సత్తువగా మారిపోయాను..

Share
Posted in కథలు | Leave a comment

ఏటికేడు బతుకు గోడు

– ఎ. విద్యాసాగర్‌ ఏటికేడు బతుకు గోడు ఏళ్ళకొద్ది బతకుబీడు ఎన్ని బాధలమ్మ తల్లీ ఎంత వేదనమ్మ తల్లీ!

Share
Posted in కవితలు | 2 Comments

దానికేం కోరికలుంటాయమ్మా!

– ఉదయమిత్ర “నిన్ను చూడ్డానికి వొస్తున్నారే!” అంటే చాలు తెగ గాబరపడిపోయి అద్దంముందు వయసును సరిచేసుకుని ఉబికి వొచ్చే ప్రశ్నల్ని పంటికిందతొక్కిపట్టి

Share
Posted in కవితలు | 1 Comment

ఒక ప్రశ్న…!!

– శైలజామిత్ర అమ్మాయి పుడితే ఆడపిల్ల అంటారు పుట్టిననాడే ఆ పేరులో ఒక ప్రశ్నే.., యుక్త వయసును జాగత్త్రంటూ దాచిపెడతారు పప్రంచాన్ని చూడనీయక ఆ వయసంతా ఒక ప్రశ్నే…,

Share
Posted in కవితలు | Leave a comment

స్త్రీలు

నిర్మలా ఠాకూర్‌ (హిందీ కవిత) తెలుగు సేత : నిర్మలానంద సోదరా! ఇది నేటి పప్రంచం పట్టపగలే ఇక్కడ బాహాటంగా రోడ్డుమీద, నాలుగు రోడ్ల జంక్షనులో బస్సులో టైయిన్‌లో ఇంట్లో సయితం రక్షణ లేని స్థితిలో వుంది సీత

Share
Posted in కవితలు | Leave a comment

ఆహ్వానం

– వత్సల రా! నేస్తం రా! నీకిదే నా తుది ఆహ్వానం-

Share
Posted in కవితలు | Leave a comment

ముట్టు

– అరవింద ఎక్కడ పడితే అక్కడె విష్పర్‌, కేర్ఫ్రీ, స్టేఫ్రీకి ప్రకటనలు వస్తుంటే, అసలు మనదేశంలో ముట్టు గురించి ఎవరికైన విష్పర్‌ చేయవలసిన అవసరం వచ్చిందా? అవకాశం వచ్చిందా? ముట్టు వస్తే మనకి ఫ్రీడం ఎప్పుడు వచ్చి చచ్చింది? అనే ప్రశ్నలు రావచ్చు. ఎందుకంటే, మన అమ్మాయిలకి “పెద్ద మనిషి” అయినప్పుడు, నలుగురిని పిలిచి ఫంక్షన్‌ … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సమాచార విప్లవం ఎవరి కోసం?

“స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వారికి కేటాయించి సీట్లలో వారినే కూచ్చోనిద్దాం” అనడానికి, జేబులు కొట్టకపోవడం మన సంప్రదాయం. ఎవరి జేబులో పైసలు వారినే ఖర్చు పెట్టుకోనిద్దాం – అనడానికి ఆ దృష్టిలో ఏమి తేడా లేదు. అంటే హక్కుల్నీ, సమస్యల్ని ఆదర్శం తోనో, భావజాలానికి సంబంధించిన మాయాజాలంలోనో దక్కించుకోగలమని మనం ఇంకా నమ్ముతున్నామా?

Share
Posted in మృదంగం | Leave a comment

గౌరవనీయ రవాణా శాఖామాత్యులకు ఉత్తరం

18.4.07 గౌరవనీయ రవాణా శాఖామాత్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణగార్కి, నేను డా. సమతా రోష్ని 3.4.07 తేదీన నిర్మల్‌ నుంచి హైదరాబాదుకు ఆర్‌.టి.సి బస్‌. నెం. ఎపి11 2 2406 లో ప్రయాణం చేసాను. ఆ రోజు ఆ బస్సులో స్త్రీలకు రిజర్వ్‌ చేసిన మూడు సీట్లలోను పురుషులే కూర్చున్నారు. ఈ బస్‌ ఆదిలాబాద్‌ నుండి … Continue reading

Share
Posted in ఉత్తరం | 3 Comments