Monthly Archives: May 2007

రండి చేనేతను ప్రేమిద్దాం చేనేతను ధరిద్దాం

మన రాష్ట్రం ఎంతో సొగసైన చేనేత సొబగులను కలిగి వుంది. బహు నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్న అద్భుతమైన చేనేత కళాకారులు వున్నారు. రాష్ట్రం నలుమూలలా విస్తరించి వున్న ఈ కళాకారులు క్రమంగా ఉపాధిని కోల్పోతూ కుంచించుకు పోతున్నారు. పొట్ట గడవని స్థితిలో ఆత్మహత్యల వేపు నెట్టబడుతున్నారు. చేతిలో అద్భుతమైన నేత కళ వుండి కూడా … Continue reading

Share
Posted in సంపాదకీయం | 2 Comments

ప్రతిస్పందన

ఏప్రిల్ 07 లో రాసిన సంపాదకీయం ‘ఫ్రెష్ మార్కెట్ల వెనుక క్రష్ అవుతున్న మహిళల జీవనోపాధి” అనేది నేడు ఎంతో కీలకమైన సమస్య. గత కొద్ది మాసాలుగా, ముఖ్యంగా ఈ విశాఖ పట్నంవంటి మహా పట్టణాల్లో వెలుస్తున్న ‘సూపర్’ ‘డాపర్’ తాజా మార్కెట్లు చూస్తున్నప్పుడల్లా, మనసులో ఏదో ఒక బాధ, భయం తొలిచేస్తున్నాయి. అసలు సామాన్యుడు … Continue reading

Share
Posted in ఎడిటర్‌కి లేఖలు | Leave a comment

స్త్రీల పదాలు – ప్రపంచాలు

విమెన్స్ వరల్డ్ ఇండియా యేర్పడిన తర్వాత ముఖ్యంగా జరగవలసింది దక్షిణాసియా దేశాల రచయిత్రుల సమావేశమని అనుకున్నాం. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల రచయిత్రులతో కలిసి రచయిత్రులపై జరిగే సెన్సార్షిప్ ను చర్చకు పెడితే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయనుకున్నాం. ఐదు దేశాలలోనూ భిన్న రాజకీయ, సాంఘిక నేపధ్యాలున్నా స్త్రీల అణచివేత, రచయిత్రులను చూసే దృష్టి … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

దాడుల నేపధ్యంలో రాయటమంటే

– ఎస్తర్ డేవిడ్ (అనువాదం- ఓల్గా) నేనీ మధ్యనే కొత్త ఇంటికి మారాను, ఎందుకంటే 2002లో గుజరాత్లో జరిగిన మారణ కాండ తర్వాత హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతంలో ఉంటుంటే నేను ”మైనారిటీని” అనే భావం యింకా యింకా పెరుగుతోంది. మా పాత ఇల్లు, మిని పాకిస్తాన్ అని అనుకునే ముస్లిం ప్రాంతానికీ, హిందువుల ప్రాంతంగా … Continue reading

Share
Posted in వ్యాసాలు, అనువాదాలు | Leave a comment

సరిగ్గా ఇక్కడ మనుషులు జీవించే వారు!

– చంద్రలత పుట్టి పెరిగిన ప్రాంతం నుంచి మరొక కొత్త ప్రదేశానికి తరలి వెళ్ళడంలో – ఎంతో ఘర్షణ ఉంది. ఎవరైనా అలాంటి నిర్ణయానికి రావడానికి ముందు వారు ఎంతో సంఘర్షణ పడి ఉండాలి. అందుకు ఏదో బలమైన కారణమే ఉండి ఉండాలి. సామూహికంగా, వ్యక్తిగతంగా ఎదురుపడే ఇలాంటి సందర్భాలు మనం చరిత్ర పొడవునా వింటూనే … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

దోపిడీ

– టి. సంపత్ కుమార్ ”ఏంటీ?… ఈ సంబంధంకూడా క్యాన్సలయ్యిందా?…” ఆదుర్దాగా, ఆశ్చర్యంగా అడిగాను. ఆఫీసునుండి వస్తూనే నేను మొదట చేసేపని నా బ్రీఫ్కేస్ని స్టడీరూములో దానికి కేటాయించిన చోటపెట్టి, కారు తాళం చేతుల్ని కీబోర్డుకి తగిలించి, డ్రాయింగ్ రూములో ఉన్న సోఫాలో కూచోని నెమ్మదిగా షూస్ విప్పి ర్యాక్లో పెడతాను. ఆరోజువచ్చిన పోస్టును ఓసారి … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

సెక్సువల్ పాలిటిక్స్

– పి. సత్యవతి స్త్రీవాద ఉద్యమ రెండవ ప్రభంజనం లోని సంచలనాత్మక గ్రంధం కేట్ మిల్లెట్ వ్రాసిన ”సెక్సువల్ పాలిటిక్స్”. 1968 లో దీనిని తన పరిశోధనా పత్రంగా సమర్పించి 1970లో గ్రంధంగా వెలువరించినప్పుడు అమెరికాలోనూ ఇంగ్లండ్లోనూ కూడా సంచలనం సృష్టించింది. లైంగిక రాజకీయాల స్వరూప స్వభావాలని స్త్రీవాద ధృక్పధంలో నించీ విస్తృతంగా చర్చించిన ఈ … Continue reading

Share
Posted in వ్యాసాలు | 1 Comment

ఢిల్లీలో గ్లోరియా స్టీనమ్

– డాక్టర్ జె. భాగ్యలక్ష్మి అమెరికాలోను, ప్రపంచవ్యాప్తంగాను స్త్రీవాదంతో పూర్తిగా ఒకతరం స్త్రీలను ప్రభావితం చేసిన గ్లోరియా స్టీనమ్ ఇటీవల భారతదేశాన్ని సందర్శించిన సందర్భంలో ఢిల్లీకి కూడా వచ్చారు. ఇక్కడ కొన్ని సంస్థలను, వారి ద్వారా జరిగే పనులను కూడా చూశారు. మురికివాడల్లో స్త్రీలతో ముఖాముఖీ మాట్లాడారు. ఇండియన్ ఉమెన్స్ ప్రెస్కోర్లో మహిళా జర్నలిస్టులతో ముచ్చటిస్తూ … Continue reading

Share
Posted in సాహిత్య వార్తలు | Leave a comment

స్వప్నాలన్నీ తెగ్గొట్టబడ్డ జ్ఞాపకాలే

– ఇంటర్వ్యూ : డా. సుహాసిని నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలం, ఆత్మకూరు గ్రామంలో శ్రీ కుఱ్ఱా సుబ్బరామిరెడ్డి,రాజమ్మలకు 28-8-1942లో ప్రథమ సంతానంగా శ్రీమతి దోర్నాదుల సుబ్బమ్మ జన్మించారు. ఈమె ఆత్మకూరు కాలేజీలో పి.యు.సి. దాకా చదివారు. భర్త దోర్నాదుల రామిరెడ్డి గారు స్కూల్సు ఇన్స్పెక్టరుగా పనిచేస్తూ వివిధ జిల్లాలలో అనే ప్రాంతాలలో వుండటం వల్ల … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

నల్లదుప్పటి కప్పుకున్న ఆత్మ

– దోర్నాదుల సుబ్బమ్మ ప్రవాహమై దొర్లుతూ ఉంది ఒక్కో జ్ఞాపకం ఒక్కోచోట ఒకే గాయం… ఒకే హృదయం గాయాలు అనేక మయినా లేపనం ఒకటే అయినట్లు మనసు మాతం ఒంటరిదే… పాటలూ లేవూ… పల్లవుల ఆత్మఘోషాలేదు పువ్వులూ లేవు… పూల సుగంధాలు అంతకంటే లేవు

Share
Posted in కవితలు | Leave a comment

ఆదివాసీ, దళిత, ముస్లిం, బహుజన స్త్రీల కవిత్వానికి ఆహ్వానం

ఆదివాసీ, దళితముస్లిం బహుజన స్త్రీల కవిత్వాన్ని తెలుగు సాహిత్యంలోకి సంకలనంగా తీసుకు వచ్చే ప్రయత్నంలో భాగంగా ఆదివాసీ, దళిత, ముస్లిం, బహుజన స్త్రీల కవిత్వాన్ని ఆహ్వానిస్తున్నాం. నేడు అస్తిత్వ ఉద్యమాల సందర్భంగా వస్తున్న సాహిత్యాన్ని సంకలనంగా తీసుకురావాలని భావిస్తున్నాము. ఆదివాసీ దళిత, ముస్లిం, బహుజన స్త్రీల సాహిత్యం బలంగా వస్తున్నా కూడా అది అక్కడక్కడ విడి … Continue reading

Share
Posted in ఆహ్వానం | 4 Comments

కవిత్వమై, జీవితమై… ఆమె

– ఎస్. జయ ఆమెకు శిల్పకళలు, శిఖరాలు, లోయలు, పచ్చిక మైదానాలు అంటే పరవశం. కవిత్వం అంటే పరవశం. ఆకాశమల్లెల్ని పిల్లన గ్రోవిని చేసి, అక్షరాలతో అడుకుంటుంది. కాసేపు బాల్య స్మృతులతో ఆనంద డోలికల్లో వూపుతుందా అంతలోనే, యాభైలోపడి, మెనోపాజ్తో, పరుగుల జీవితం విరామం పొంది ఏకాకితనంలో వేదనాభరిత అనుభూతులు మన గొంతు నరాల్ని సాగదీస్తాయి. … Continue reading

Share
Posted in వ్యాసాలు, కవితలు | Leave a comment

పెళ్ళి అనబడు రాచముష్టి కీడ్ర

– కొండేపూడి నిర్మల ”మొగుడు” కాని వాడ్ని మొగుడుగా ఊహించి ఇంద్రుడివి, చంద్రుడివి అని పొగడ్డం కష్టంగా వుందక్కా….” అంది పొద్దున్న మా పిన్ని కూతురు చాటింగులో. రాజేశ్వరికి నెల్లాళ్ళ క్రితమే ఒక పెళ్ళి సంబంధం చూశారు. చూపులకి తల్లి, తమ్ముళ్ళు, దూర బంధువులుకూడా వచ్చారు. పిల్ల బావుందని వెంటనే చెప్పారు. నాన్చడం తమకు ఇష్టం … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

జీవితం – యుద్ధం

– జి. విజయలక్ష్మి కుక్క గొడుగు కింద కూర్చొని చకవ్రర్తులమనుకుంటే కుమ్మరి చక్రం చూసి భూ చకమ్రనుకుంటే ఎలా? యుద్ధం వేరు జీవితం వేరు కాదు జీవితం యుద్ధం చేయడానికి యుద్ధం జీవించటానికి

Share
Posted in కవితలు | Leave a comment

గృహ హింస

– పాతూరి అన్నపూర్ణ గృహ హింసకు వ్యతిరేకంగా చట్టం వచ్చి నా అస్తిత్వానికి కొత్త రెక్కలు తొడిగింది ఇన్నేళ్ళ కన్నీళ్ళ సముదాల్రకి ఓ కాంతి రేఖను చూపించింది ఎప్పుడూ సాలెపురుగు బత్రుకే నాది పడుతున్న కొద్దీ ఎగబాక్రడం పాకుడు మెట్లపై జారే అడుగులు పడకూడదని పోరాటం

Share
Posted in కవితలు | Leave a comment

ఆటకెక్కిన అక్షరాలు

– కొత్త పద్మావతి నా చిట్టి తల్లీ! నువ్వు నేను కలిసి ఒక పప్రంచాన్ని నిర్మించుకొన్నాం మన మాటల్లో మన పప్రంచాన్ని నిర్మించుకొన్నాం నీకు నేను, నాకు నీవు ఒకరికొకరం ఒకే భాషలో ఒకే పప్రంచాన్ని నిర్మించుకొన్నాం

Share
Posted in కవితలు | Leave a comment