Monthly Archives: July 2007

”మీ కలలపై నమ్మకం ఉంచండి. విజయం మీదే”

సునీతా విలయమ్స్‌. స్ఫూర్తికి మారు పేరు. సంచలనాల చిరునామా. అంతరిక్షంలో 195 రోజులు గడిపిన తొలి మహిళ. చిరునవ్వుల సునీత భారత సంతతికి చెందడం, ఇంత ఘనమైన ప్రపంచ రికార్డును సాధించడం, అపూర్వం. అపురూపం. భారతీయులందరికి గర్వకారణం. భారతీయ మహిళలకు స్ఫూర్తిదాయకం. ఆకాశం మా హద్దంటూ నినదించిన మహిళోద్యమం, ఇక నుండి అంతరిక్షం మా ధ్యేయం … Continue reading

Share
Posted in సంపాదకీయం | 1 Comment

ప్రతిస్పందన

జూన్‌ సంచికలో కల్పనా శర్మ మీద రాసిన సంపాదకీయం చాలా బావుంది. హిందూ పేపర్‌లో ఆమె కాలమ్‌ నేను రెగ్యులర్‌గా చదువుతాను. ఇక ముందు ఆ కాలమ్‌ వుండదంటే (తను రిటైర్‌ అవుతోంది కాబట్టి) బాధగా వుంది. ఆమె గురించి సంపాదకీయం రాసినందుకు అభినందనలు.

Share
Posted in ఎడిటర్‌కి లేఖలు | Leave a comment

ప్రసారమాధ్యమాల్లో స్త్రీ, పురుషులు సమానమేనా?

– డాక్టర్‌ జె. భాగ్యలక్ష్మి ఈ ప్రశ్న కొత్తదేమీ కాదు. సుమారు నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ లేవనెత్తటం జరుగుతోంది. చాలావరకు పురుషులే నిర్వహిస్తూ వచ్చిన వృత్తుల్లో స్త్రీలు ప్రవేశించటంతో, అందులోని వివక్ష, భేదభావాలు, ప్రతికూల వాతావరణం, అభిప్రాయాలు వీరి వృత్తి నిర్వహణ మరింత కష్టతరం చేస్తూ వచ్చాయి. కానీ ఈ సమస్యలు … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తారాబాయి చాల్‌ – గది నంబర్‌ 135

– సుధా ఆరోరా అనువాదం: ఆర్‌.శాంతా సుందరి (హిందీ మూలం) ఆమెకు పిల్లలు లేరు. ముప్ఫై ఎనిమిదేళ్ల ఆమె భర్త చనిపోయి ఇవాల్టికి పధ్నాలుగో రోజు. స్నానంచేసి, నీళ్లతో నానిన పెట్టికోట్‌ని పిండుకుని దాంతోనే తన ఒళ్లు తుడుచుకుంటూ ఉండగా, హఠాత్తుగా ఆమె కళ్లు అద్దంలోకి చూశాయి. అద్దం మీది దుమ్ముని ఆమె తడివేళ్లతో తుడిచేసింది.

Share
Posted in అనువాదాలు | 1 Comment

తీరం చేరని కెరటం

– తమ్మెర రాధిక జానకమ్మ జానమ్మ కాబోతోంది. పెండ్లి సూపులైనయి. పిలగాడు నల్లగ బక్కపలచగ ఓ మోస్తరుగా వున్నాడు. ప్యాంటు చొక్కా మీదంగ ఎర్ర తువ్వాల ఏస్కోని వచ్చిండు. పొల్లగాడే! జానకి మేనత్త చిద్రగాళ పైలమ్మ తెచ్చిందీ సంబంధం. ”పిలగాడు ఒక్కడు. ముగ్గురు ఆడిబిల్లలు… పెండ్లీలు గాలె. తల్లి వున్నది.

Share
Posted in కధానికలు | Leave a comment

”చీరనెరజాణ”

– పోడూరి కృష్ణకుమారి కళ్యాణమండపం గేటు దగ్గర నిలబడి పూలతో ఏర్పాటైన ఆర్చి, దానిమీద అందంగా తీర్చిన వధూవరుల పేర్లు చూస్తూ ఓ నిమిషం అలాగే నిలబడింది లత. కళాత్మకంగా తీర్చిదిద్దబడి, ఆహూతులతో కళకళలాడి పోతున్న ఆ హాలు అందాలు, సందడి చూసేందుకు రెండు కళ్ళు చాలవనిపించింది.

Share
Posted in గల్పికలు | 1 Comment

దళిత సాహిత్యానికి దళిత తల్లే నిర్మాత

– కత్తి పద్మారావు దళితులు అంటే అస్పృశ్యతకు గురైన జాతులు అని అర్థం. అస్పృశ్యతకు గురిచేసిన వారు భారతీయులు. అస్పృశ్యతకు గురైన వారు ఆదిభారతీయులు. అస్పృశ్యత అనే శబ్దం సంస్కృత శబ్దం. అస్పృశ్యులంటే స్పృశించబడనివారు అని అర్థం. ఈ భావం బ్రాహ్మణ కుటుంబ జన్యం అని అంబేద్కర్‌ చెప్పాడు. స్పృశ్యతా భావం పరిపూర్ణంగా ఉన్నవారే అస్పృశ్యులుగా … Continue reading

Share
Posted in వ్యాసాలు | 1 Comment

గ్రామీణ దళిత మహిళ – జీవన స్థితిగతులు

– సంకినేని వెంకటయ్య, చిట్యాల వినోద (రీసెర్చ్‌ స్కాలర్స్‌) ప్రపంచంలోనే మహోజ్వలమైన చరిత్ర ఉన్న పవిత్ర గ్రామీణ భారత దేశంలో సంస్కృతి పరంగా స్త్రీని దేవతామూర్తిగా పిలుస్తారు. దేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళలే ఉన్నారు. ప్రస్తుతం పితృస్వామిక కుటుంబాలుగా చలామణి అవుతున్న భారత గ్రామీణ వ్యవస్థలో గతంలో మాతృస్వామిక కుటుంబాలు ఉండేవి. అనగా … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆవృతం

– శారదా మురళి చిన్నప్పటినుంచీ వినయ్‌కి ఆడవాళ్ళంటే చాలా జాలి. ఆడవాళ్ళ బ్రతుకు చాలా దుర్భరమనీ, వాళ్ళకీ ఏ మాత్రం ఆత్మగౌరవం లేకుండా చేయటమే కుటుంబ వ్యవస్థ ధ్యేయమనీ అతను నమ్మేవాడు. తన తల్లినీ, నానమ్మనీ, ఇంకా అత్తయ్యల్నీ, పిన్నమల్నీ చూసి అతనా అభిప్రాయాని కొచ్చాడు.

Share
Posted in కథలు | 1 Comment

అద్భుతానందాన్ని కల్గించిన హిమాలయాల ట్రెక్కింగు

– బీడుపల్లి భాగ్య ఆకులో ఆకునై పూవులో పూవునై ఈ అడివి దాగిపోనా….. అని కృష్ణశాస్త్రి గీతం అడవి మాధుర్యాన్ని, సౌందర్యాన్ని గుర్తుచేస్తుంది. అంతగొప్పగా హిమాలయాలు ఆ పరిసరాలు మనల్ని ఎంతో పరవశింపచేస్తాయి. ఈ మురికి, ఇరుకు జీవితాల నుండి విముక్తి చేయగలిగే మహాశక్తి హిమాలయాలకు వుందని చెప్పటం అతిశయోక్తికాదు.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | 1 Comment

సెక్సువల్‌ పాలిటిక్స్‌

స్థూలంగా ఈ గ్రంథ సారాంశం ఇది. రాజకీయాలంటే ఒక వర్గంపై మరొక వర్గం ఆధిపత్యం కలిగివుండడం. ఒక వర్గం అధికారంలోనూ మరొక వర్గం అనుచరంగానూ వుండడం అనుకుంటే స్త్రీ పురుష సంబంధాలు కూడా రాజకీయ సంబంధాలే. మన వ్యవస్థాగత రాజకీయా లలో ఇంతవరకూ లేనటువంటి ఒక స్పష్టమైన, సముచితమైన, మనస్తత్వ శాస్త్రాన్నీ, తత్వశాస్త్రాన్నీ మనం నిర్మించుకోవాలి.

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

ఆర్తనాదం

– డి. గాయత్రి ఆర్తనాదం ఆర్తనాదం ఎవరిదీ గొంతు ఎక్కడిదీ అరుపు కర్ణ కఠోరంగా…

Share
Posted in కవితలు | Leave a comment

”ఎదురీత”

– పాతూరి అన్నపూర్ణ కాలానికి కొత్త రెక్కలు మొలిచాయి నా అడుగుల దారీ మారింది! సమస్యలను అధిగమించేందుకు ఆలోచనల పదునూ పెరిగింది!

Share
Posted in కవితలు | Leave a comment

ఈ ఉత్తరం – శ్వేతగీతం

– ఎన్‌. అరుణ నీకో తెల్లకాగితాన్ని పోస్టు చేస్తాను. అక్షరాలు మలినమౌతున్నాయి వాక్యవిన్యాసాల్లో భావాలు పులుముడైపోతున్నాయి

Share
Posted in కవితలు | Leave a comment

గులాబీపూవులారా!

– శ్రీవాణి వాగ్దేవి గులాబీపూవులారా! మీ మృదుమంజులదళములకు పదును పెట్టుకోండి! లేకుంటే, దుర్మార్గం, దౌర్జన్యం

Share
Posted in కవితలు | 2 Comments

చిట్టిపాప

– అంజనా బక్షీ (అనువాదం : శాంతసుందరి) చిట్టిపాపా నెమ్మదిగా మాట్లాడు ఊరికే అటూ ఇటూ తిరగద్దు అంట్లుతోమి, ఇల్లు శుభం చెయ్యి త్వరగా!

Share
Posted in కవితలు | Leave a comment