Monthly Archives: August 2007

భూమిక పాఠకులకు, అభిమానులకు విజ్ఞప్తి

భూమిక పాఠకులకు, అభిమానులకు నమస్కారం. భూమిక అజేయ ప్రయాణం ప్రారంభించి దాదాపు పదిహేను సంవత్సరాలు కావస్తోంది. త్రైమాస పత్రికగా మొదలై, ద్వైమాస పత్రికగా కొనసాగి ప్రస్తుతం మాసపత్రికగా నిలదొక్కుకున్నది. అన్వేషి అండదండలతో తొలి అడుగు వేసినా, అచిర కాలంలోనే స్వయంసిద్ధగా ఎదిగింది. ఒక ప్రత్యామ్నాయ స్త్రీవాద పత్రికగా తన లక్ష్యాలు, ఉద్దేశ్యాల విషయంలో ఎలాంటి రాజీ … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

డా. సమతారోష్ని సత్యవతిగార్లకు మీరు జూన్ సంచికలో రవాణాశాఖమంత్రిగారికి రాసిన ఉత్తరం చదివాను. అందులో రాసిన విషయం మంత్రి గారికిగాని ఆర్టిసి వారికి గాని అతి మాములు విషయం. వారినించి ఏలాంటి సమాధానం రాదు. ఒక వేళ వచ్చినా ఆ డిపో మేనేజరుకు ఎంక్వయిరీ చేయమని వస్తుంది. డిపో మేనేజర్ ఆ రోజు బస్సులో ఉన్న … Continue reading

Share
Posted in ఎడిటర్‌కి లేఖలు | Leave a comment

సమూల పరివర్తన ద్వారానే స్త్రీవిముక్తి సాధ్యం

(డా|| ఉమ చక్రవర్తితో డా|| రమేశ్ ఉపాధ్యాయ జరిపిన ఇంటర్వ్యూ అనువాదం- జె. ఎల్. రెడ్డి (హిందీనుండి) ‘Social Dimensions of Early Budhism’, ‘Rewriting History : The Life and Times of Pandita Ramabai’, ‘Gender and Caste through a Feminist ‘Everyday Lives and Everyday Histories : … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | 1 Comment

నీలోన్నా క్రమోన్మీలన వ్యక్తిత్వ వికాసం “అమ్మ”

– వి. ప్రతిమ అలెక్స్య్ మక్సీమొవిచ్ పీష్కోవ్…… మాక్సింగోర్కీ కలం పేరుతో నిరుప మానమయిన రచనలు చేసి ప్రపంచ సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా… కార్మిక కర్షక వర్గాలకు, సామాన్య ప్రజలకు ప్రాతఃస్మరణీయుడుగా నిలిచి పోయాడు… ఆనాటి రష్యన్ సమాజంలోని దుష్టత్వానికి అణిచివేతలకు, పీడనకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన కలం యోధుడు గోర్కీ… గోర్కీ అయిదో ఏట … Continue reading

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | 1 Comment

పట్టపగటి చీకటి

– ఓల్గా పరిశుభ్రమైన నీటి మడుగులో చిక్కగా చేరుతున్న కల్మశం, కుంచించుకుపోతున్న నీళ్ళు – విస్తరిస్తున్న మురికి చేస్తున్న విజయహాసం. మడుగు చుట్టూ చేరిన వారందరూ ఆ మురికిని చూసి సంతోషిస్తున్నారు. ఇష్టంగా ఒంటికి రాసుకుంటున్నారు. తనకూ రాయబోతున్నారు.

Share
Posted in కథలు | 5 Comments

తొవ్వ

జయప్రకాష్ మాటేటి గాలికి కిటికీలు టపటప కొట్టు కుంటాంటె దెబ్బకు తెలివికొచ్చింది. టైం ఎంతైందో అనుకుంటనే ఉన్న. దూరంగ పదకొండు గంట్ల సీటీ ఇనొచ్చింది. వానకు ట్రాన్స్ఫార్మర్ పేలి కరంట్ పోయింది. దీపం పెట్టుకొని సంటోన్ని కాల్లమీద ఏసుకొని ఊపుతుంటె ఎప్పుడు కన్నంటుకున్నదో తెలువలే.

Share
Posted in కథలు | Leave a comment

“ది గార్డెడ్ టంగు”

కె. ఆర్. మీరా అనువాదం: ఓల్గా “నేను నా రాజకీయ తీర్పులను, స్పష్టంగా, గట్టిగా బలమైన రీతిలో వ్యక్తీకరించటానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాను – నేను చెప్పే విషయాలు సత్యమైనవి కావన్నట్లు, నేనేదో కపటంగా ఉన్నట్లూ అనిపిస్తుంటుంది. ఎందుకంటే జీవితం గురించి నా ఆలోచనలను ఒకే గొంతులోంచి వచ్చే సంగీతానికి, ఒకే దృక్పథానికీ కుంచించలేను.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

జయప్రద నానీలు

డా|| పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి భర్త మంచితనం ఖరీదెంత? కట్టుకున్న ఇల్లాలి సహనమంత. వృద్ధాప్యాన్ని వేగంగా కొనుక్కుంటున్నాం గర్భాశయాన్ని పీకిపారేసి.

Share
Posted in కవితలు | Leave a comment

మహిళా విన్యాసం

డా|| వాసా ప్రభావతి హరిత చందనమై అరిగిపోతూ చల్లగా పరిమళిస్తూ! కన్నబిడ్డలనే కాదు ఆత్మీయతానురాగాలకు ఆలంబనమైన నీ గొంతు ఏ స్వాప్నికులకైనా మేలుకొలుపే! ఏ కోకిలగానానికైన ఆదర్శమే! ఈ భౌతికలోకంలో నీ కాయకష్టాన్ని ఏ హృదయ త్రాసులు తూచలేవు?

Share
Posted in కవితలు | Leave a comment

ద్వంద్వనీతి

కృతి (కె. కృష్ణకుమారి) బీటలు వారిన నేల గుండెను ఆర్తిగా హత్తుకున్న చినుకు చుక్కలా నీ మాటలోని మానవీయ స్పర్శ ఆత్మీయంగా నన్ను అల్లుకుంటే వెలుగుదారులు పరిచినట్లయ్యింది

Share
Posted in కవితలు | Leave a comment

మరి మనిషేంటి…!?

సరికొండ నరసింహ రాజు రాలిన ఆకుల గూర్చి చింతంచదు చెట్టు రేపటి చిగురుకై రేయింబవళ్ళు శ్రమిస్తుంది! మరలి పోయిన అలకై నీరసించదు సందం! పోటెత్తే అలలతో పొంగి పొంగి పొర్లుతుంది!

Share
Posted in కవితలు | Leave a comment

నాతి చెరామి

వేలూరి సుధారాణి నాలుగేళ్ళనుంచి ప్రేమిస్తున్నానన్నాడని నాలుగు లక్షలు కట్నం ఇచ్చి కట్టుకున్నాను వాడ్ని పెళ్ళికి ముందు “సీతాకోకచిలుక “ అన్నవాడు ఏడాది గడిచేసరికి “గొంగళి” పురుగు అన్నాడు

Share
Posted in కవితలు | 2 Comments

సారా అబూబక్కర్ – శాశ్వత కీర్తి

రాజేశ్వరి దివాకర్ల కన్నడంలోని సుప్రసిద్ధ ముస్లిం రచయిత్రి శ్రీమతి సారా అబూబక్కర్. ఈమె కథలు, నవల, వ్యాసం, అనువాదం ఇత్యాది అనేక రచనలను కావించారు. వీరికి ఈ నడుమ నంజనగూడు తిరుమలాంబ గారి పేరిట శాశ్వతి మహిళా అధ్యయన కేంద్రం వారిచ్చిన పురస్కారం లభించింది. శ్రీమతి నంజన గూడు తిరుమలాంబ కన్నడంలోని మొట్టమొదటి లేఖకి, సంపాదకురాలు, … Continue reading

Share
Posted in అనువాదాలు | Leave a comment

గ్రామీణ అభివృద్ధి – ఉపాధి హామీ చట్టం

డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి, కె. సుభాషిణి, కాకతీయ విశ్వవిద్యాలయం నిర్మాణ కార్యక్రమంలో గాంధీజీకి అపారమైన విశ్వాసం ఉండేది. భారతదేశంలో నూటికి ఎనభై మంది గ్రామాలలో నివసి స్తున్నారు. అందువల్ల గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని, నగరవాసులు గ్రామీణ ప్రజలను దోచుకోరాదని ఆయన అభిప్రాయం. మానవాళి, మనుగడకు దోహదంచేసే రంగాలలో వ్యవసాయరంగం ఒకటి. 91 శాతం ఆహారం మనకు … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అదొక చతుర్శాల భవంతి – రోదన కూడ వ్యక్తీకరించలేని స్త్రీ

వై. విజయలక్ష్మి మా అత్తగారు వారి హయాంలో 40, 50 సం||ల క్రింది విషయాలు, సంఘటనలు చెబుతుంటే మనుషుల్లో ఇలాంటివారు కూడా ఉంటారా! అని అనిపించేది. అదొక చతుర్శాల భవంతి. సనాతనమైన హైందవ సంస్కృతికి ఆచారాలకు ప్రతీక ఆ ఇల్లు. ఉదయం మగవారు లేచి కాలకృత్యాలు తీర్చుకోగానే వారికంటే ముందే లేచి అన్ని పనులు చకచకా … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

భూమిక పాఠకులకు శుభవార్త

ప్రతి సంవత్సరం కొత్త పుస్తకాలు ఎన్నో విడుదలవుతుంటాయి. ఇంతకు ముందు వాటిని కొనుక్కోవడానికి అందరం పుస్తకాల షాపులకి వెళ్ళేవాళ్ళం. మనకి కావలసిన పుస్తకాలను కొనుక్కునే వాళ్ళం. పుస్తకాల షాపులకెళ్ళడం, ఓ చక్కటి అనుభవం. గంటల తరబడి కాళ్ళు పీకుతున్నా ఒక్కో పుస్తకాన్ని ఎంతో ప్రేమగా తడుముతూ, పేజీలు తిరగేస్తూ పరవశించిన వాళ్ళమే అందరం. క్రమంగా చాలావరకు … Continue reading

Share
Posted in ప్రకటనలు | Leave a comment