September, 2007 సంచిక

మానవీయ భాష నేటి అవసరం

భూమిక September 2007

ఆగష్టు ఆరవ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాలులో ”పాలపిట్ట పాట - ప్రత్యేక తెలంగాణా పోరాట పాటలు” వరవరరావు రాసిన పాటల సిడీల ఆవిష్కరణ సభ జరిగింది. మా భూమి సినిమాలో ”పల్లెటూరి పిల్లగాడా” పాటతో జనం నాలుకల మీద ఈనాటికీ నిలిచిన సంధ్య, విమల, రడం శ్రీను, పుష్ప, వెంకట్ల పాటలు వినడానికి ఎంతో ఉత్సాహంలో ఆ మీటింగుకు వెళ్ళడం జరిగింది. మీటింగు మొదలవ్వడానికి ముందు అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం.

పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

ప్రతిస్పందన

భూమిక September 2007

జులై నెల ‘భూమిక’లో ”యుద్ధ సమయంలో రాయటమంటే” అన్న అమీనా హుసేన్ (శ్రీలంక) వ్యాసం అద్భుతంగా వుంది.
స్త్రీలు రాస్తున్నపుడు ఎంత సెన్సార్షిప్ వుంటుందో మనందరికీ తెలుసు.. దీని గురించి మనమంతా యిదివరకే చర్చించి వున్నాం కూడా…

పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

పోలవరం వద్దే వద్దు

భూమిక September 2007

టోనీ స్టీవర్ట్, వి. రుక్మిణి రావు

పోలవరం ఆనకట్ట కట్టకూడదని ఈ పుస్తకం వాదిస్తుంది. దీనికి కారణాలు : అది చెప్పుకుంటున్న ప్రయోజనాలు ఒనగూరవు, దీనివల్ల
ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, నిర్వాసితులయ్యే ప్రజలపై దారుణ పరిణామాలుంటాయి.

పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

పరంపర

భూమిక September 2007

యం. వసంత కుమారి

అమెరికాకు వచ్చి ఆరు నెలలైంది. వచ్చే ఆదివారమే నా ఇండియా ప్రయాణం. వారం రోజుల నుండి మధన పడ్తున్నాను. ఇండియాకు ఒక్కదాన్ని వెళ్ళగలనా? వచ్చేటప్పుడు కోడలుతో రావటంతో ఏమీ గమనించలేదు.

పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

మాటలు - వెలివేసే పద్ధతులు

భూమిక September 2007

మునీజా షంసీ
అనువాదం: ఓల్గా

పాకిస్తాన్లో ఫ్రీలాన్స్ ఫీచర్ రచయిత్రిగా, సాహిత్య విమర్శకురాలిగా చాలా సంవత్సరాలనుండి అనేక రచనలు ప్రచురించాను.జండర్ కారణంగా నా దారిలో పెద్ద అవరోధాలేమీ యేర్పడలేదనే అను కుంటాను. ఎందుకంటే నేను ఆఫీసుల్లో ఉద్యోగాల కోసం పోటీ పడటం లేదని నాకు తెలుసు. అలాగే పత్రికా రచనలో అసలైన విషయాలై, కొద్దికాలం క్రితం వరకూ కేవలం పురుషుల ప్రాంతంగా ఉన్న రాజకీయాలు, ఆర్ధిక వ్యవహారాలు వీటిలోకి నేను చొచ్చుకు పోవటం లేదు.

పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

ఏండ్రియా డ్వోర్కిన్

భూమిక September 2007

పి.సత్యవతి

”పోర్నోగ్రఫీ పరిశ్రమకి ముఖ్య భాష మన శరీరం. వాళ్ళు చెప్పదలచిందంతా మన శరీరాల చేత చెప్పిస్తారు. వాళ్ళకా అధికారం లేదు. వుండకూడదు. వాళ్ళు మన శరీరాల ద్వారా లాభం పొందడాన్ని మనం నిరో ధించాలి.

పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

ఆధునిక జీవితంలో ఆధునిక పాఠాలు ఈ ‘టూకీలు’

భూమిక September 2007

శిలాలోలిత

జీవితం, జీవనవిధానం అత్యంత వేగంగా మారిన ప్రస్తుతకాలంలో సాహిత్యాభి లాష తగ్గుతూ వస్తోంది. సాహిత్యపఠనం ఇంచుమించుగా తగ్గి పోతోంది. ముఖ్యంగా ఇటీవలి యువతరంలో ఈ ధోరణి ఎక్కువగా కనబడుతోంది.

పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

గార్డెడ్ టంగు

భూమిక September 2007

షబ్నమ్ నాదియ
అనువాదం. ఓల్గా

బరాహో కోడలు, చక్రవర్తికి ఆస్ధాన జ్యోతిష్కురాలు, చిక్కుల్లోనుంచి బైటపడేసే తాంత్రికురాలు అయిన ఖానా తన విద్యలో చాలా ప్రావిణ్యం సంపాదించింది. ఆమె భవిష్యత్తుని గురించి చెప్పే మాటలన్నీ నిజం కాసాగాయి.

పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

ఇస్లాం పితృస్వామ్యంపై ముస్లిం మహిళాలోకం ఢంకారావం

భూమిక September 2007

షాజహానా - నఖాబ్
యం. రత్నమాల

నల్లటి బురఖాల్లోపల కదులుతున్న అగ్నిపర్వతాలు ముస్లిం స్త్రీలు. బురఖా, నఖాబ్కి కంటిచూపు కోసం కళ్ళ ప్రాంతంలో వలలాంటి అతుకుదారాల సందుల్లోంచి ఎగజిమ్ముతున్న తీక్షణ వీక్షణ లావా షాజహానా కవితాసంపుటి నఖాబ్ -
పితృస్వామ్యం ఏకాండి శిలారూపం కాదు (ఏకశిలాసదృసం-మొనోలితిక్) పితృస్వామ్యానికి, కుల, మత, ప్రాంత, వర్గ ప్రత్యేక స్వభావమూ ఉంటుంది.

పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

బాల్య వివాహాల్ని తలపిస్తున్న మన పెళ్ళితంతు

భూమిక September 2007

కొండేపూడి నిర్మల

మీ అమ్మమ్మనో, బామ్మనో వాళ్ళ పెళ్ళి సంబరాల్ని గురించి చెప్పమనండి! అర్థరాత్రి భాజాలు వాయించి నిద్ర లేపి, బెల్లం ముక్క తినిపిస్తూ తాళి కట్టించారనో, పల్లకీలో వూరేగడం తప్ప ఇంకేమీ గుర్తు లేదనో…చెబుతారు.

పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

అస్థిత్వ వేదనాశకలాల నిషిద్ధాక్షరి

భూమిక September 2007

శీలా సుభద్రాదేవి

అంతకుముందు అక్కడక్కడ కొందరు మాత్రమే గొంతు ఎక్కుపెట్టినా చలించని స్థితిలో నుంచి ఎనభై దశకం తర్వాత సాహిత్యరంగాన్ని ఒక్క కుదుపుకుదిపి ఒక స్పష్టమైన రూపుదాల్చిన ఉద్యమాలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది స్త్రీవాదం. దీనిపట్ల ఆకర్షితులై కావచ్చు, గుర్తింపుకోసం కావచ్చు, అప్పట్లో వర్ధమాన కవులు, కవయిత్రులే కాక ప్రసిద్ధులైనవాళ్ళు సైతం తమవంతు ప్రోత్సాహాన్ని ఉద్యమానికి అందిస్తూ కవిత్వం వెలువరించారు. కొంతమంది నిజాయితీగా తమ స్పందనల్ని, తమ మనసుల్ని, అణచివేతల్ని, మథనల్ని ఆవిష్కరిస్తూ, తమ హక్కుల్ని, తమ అస్థిత్వాన్నీ కోరుకొంటూ కవిత్వీకరించారు. అటువంటి వారిలో మందరపు హైమవతి ఒకరు.
ఈమె కవిత్వంలో అస్పష్టత ఉండదు. చెప్పదలచుకొన్నది పదునైన పదాలతో సూటిగా చెప్తారు.

పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

కడలితీరంలో కవి మిత్రులతో కాసేపు

భూమిక September 2007

వి. ప్రతిమ

సముద్రం అనగానే సాహితీప్రియులకి
‘ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరు లెందరో’ అన్న దాశరథి గీతం నాలుకల మీద నర్తిస్తుంది.

పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

జిగినీ పరదాలు

భూమిక September 2007

పుట్ల హేమలత

నీడగానే సాగాలన్నచోట
గోడగానే మారాలి
శలభానివి కావల్సిన చోట
పమ్రిదగానే వెలగాలి
పేమ్రాలింగనాల కొలిమిలో
అభిమానం అడుసుగా మారుతుంది

పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

అరికిల్ల దండమై వురికిరావా

భూమిక September 2007

జూపాక సుభద్ర

నువ్వు నా గుండె గుడిసెలకు
అరికిళ్ల దండమై అడుగేస్తివి
నీ యెండపొడ కండ్ల పలకరింపులు
నా మన్సంత నల్లతామెర్లల్లుకున్న

పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

నేను ఆడదాన్ని

భూమిక September 2007

మరాఠీ మూలం - డా|| శైలలోహియా
అనువాదం : ఆచార్య ఎస్ శరత్జ్యోత్సారాణి

నేను ఆడదాన్ని
నేను తల్లిని
నేను చెల్లిని
నేను ఇల్లాలిని
నేను ఆడదాన్ని
నేను ఒక అమ్మను

పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

బొమ్మా-బొరుసు

భూమిక September 2007

డి. చంద్రకళ

మహిళలు మగవారితో సమానంగా బయట అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారు
ఇంట్లో హింస గురించి మాత్రం అడగొద్దు!!
పంచభూతాల్లో ఎక్కడైనా - ప్రపంచదేశాల్లో ఏ చోటైనా పనిచేయగల్గుతున్నారు.
భూగర్భంలోనైనా సరే (కుటుంబ యజమాని బాధ్యత నుంచి తప్పుకుంటే)!!

పూర్తిగా చదవండి »

Share/Save/Bookmark

Next »