-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: వ్యాసం
రొమ్ము పన్ను’కి వ్యతిరేకంగా గళం విప్పిన నంగేలీ వ్యథ… ములక్కరం! -డా. జడా సుబ్బారావు
జల్లెడలో నిప్పులు పోసి చెరుగుతున్నాడు సూర్యుడు! ప్రముఖుడి మరణానికి సంతాపం ప్రకటిస్తున్నట్లుగా కదలకుండా నుంచున్నాయి చెట్లు. గుడిసె పక్కనున్న చావిట్లో పరధ్యానంగా కూర్చుంది నంగేలి. ఆమె చూపు చేసే పనిమీద లేదు. చేతులు మాత్రం యథాలాపంగా వెదురు బుట్టకు ఒక రూపాన్నివ్వడానికి ఆరాటపడుతున్నాయి.
Posted in వ్యాసం
Leave a comment
మృత్యు ముఖాన చిరునవ్వ పూయించే ‘స్పర్శ్ హాస్పైస్’ సత్యవతి కొండవీటి
చాలారోజుల క్రితం క్షయ పీడితుల కోసం ఊళ్ళకు దూరంగా శానిటోరియంలు ఉండేవి. ఆహ్లాదకరమైన, ప్రకృతికి, పచ్చదనానికి దగ్గరగా ఎత్తైన ప్రదేశాల్లో ఈ శానిటోరియంలు ఉండేవి. నాకు తెలిసి ఒకటి వికారాబాద్ దగ్గర అనంతగిరిలోను, ఇంకొకటి మదనపల్లిలోను ఉన్నాయి.
Posted in వ్యాసం
Leave a comment
వ్యాధి, విధ్వంసం, విలయం, అవి లేవనెత్తుతున్న కొన్ని ప్రశ్నలు… -సుధా కిరణ్
అంటువ్యాధి ఉత్పాతాలు అనేవి సమాజాలలో హఠాత్తుగా, ఎలాంటి హెచ్చరికా లేకుండా జరిగే యాదృచ్ఛిక సంఘటనలు కావు. అందుకు విరుద్ధమైనవి. ప్రతి సమాజమూ తనవైన బలహీనతల్ని సృష్టించుకుంటుంది. వాటిని అధ్యయనం చేయడమంటే, ఆ సమాజపు సాంఘిక నిర్మాణాన్నీ, జీవన ప్రమాణాలనీ, దాని రాజకీయ ప్రాధాన్యతలనీ అర్థం చేసుకోవడమే.
Posted in వ్యాసం
Leave a comment
ఆయన కథలు నేటివి, రేపటివి కూడా! -లాంగుల్య
మాస్టారి కొన్ని కథల గురించి ఈ సందర్భంలో రేఖామాత్రపు స్పర్శగా ఇక్కడ గుర్తు చేసుకుందాం. మాస్టారి ‘యజ్ఞం’తో తొమ్మిది కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. మాస్టారికి అనేక పురస్కారాలు అందడం ద్వారా వాటికి గౌరవం
Posted in వ్యాసం
Leave a comment
కరోనా పాజిటివ్ -అయోధ్యా రెడ్డి
దాదాపు ఏడు శతాబ్దాల క్రితం ` 1353లో ఇటలీని వణికించిన భయానక మహమ్మారి ప్లేగు (బ్లాక్ డెత్) లక్షలాది మంది ప్రాణాలు బలిగొంది. దీని నేపథ్యంలో ఇటాలియన్ కవి, రచయిత, పరిశోధకుడు జియోవన్ని బొకాసియో ‘‘డికామెరాన్’’ పేరుతో ఒకే ఇతివృత్తం చుట్టూ అల్లిన వంద రూపక కథలు రాశారు.
Posted in వ్యాసం
Leave a comment
రంధి నవలలో స్త్రీ చైతన్య దృక్పథం -డా॥ మంగమార మునిలక్ష్మి
‘‘రంధి’’ నవలను ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు రచించారు. ఇందులో ప్రధాన కథ ఊరికి పల్లెకు మధ్య జరిగే అంతర్యుద్ధం. అంటే అగ్రవర్ణాల వారికి, దళితులకు మధ్య జరిగే గొడవ. కథంతా గుంటూరు వేజెండ్ల గ్రామ నేపథ్యంలో జరిగే సంఘటనలు, అగ్రకులాల ఆధిపత్య పోరులో నలిగిపోయే దళితులు, దళిత స్త్రీ అస్థిత్వ సమస్య ప్రధాన సందర్భం. … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
కుడుంబశ్రీ : కోవిడ్`19 లాక్‌డౌన్ సమయంలో మహిళా స్వయం సహాయక బృందాల పాత్ర -కందగట్ల శ్రవణ్ కుమార్
భారతదేశంలో లాక్‌డౌన్ సమస్య తీవ్రతను తగ్గించడంలో వీలైనంత తక్కువ సమయంలో ఉత్తమ పరిష్కారాలు చూపించడంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో మహిళల పాత్ర ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఇక్కడి ప్రభుత్వ యంత్రాంగాలకు మహిళలు అందించిన చేయూత గొప్ప సామాజిక ప్రభావాన్ని చూపాయి. కోవిడ్`19 లాంటి విపత్తును ఎదుర్కోవడం కేవలం ప్రభుత్వాలకు మాత్రమే సాధ్యం కాదు.
Posted in వ్యాసం
Leave a comment
కరోనా కట్టడిలో మోడీ వైఫల్యం -ఎ.నర్సింహారెడ్డి
దేశంలో కొవిడ్ వైరస్ రెండో దశలో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. దవాఖానాలు ఫుల్, స్మశానాలు ఫుల్, ఊపిరాడటం లేదు. నేడు కరోనా గాఢ పరిష్వంగంలో ఎప్పుడు ఎవరు వాలిపోతారో, ఎక్కడ ఎవరు రాలిపోతారో తెలియని హృదయ విదారకరమైన పరిస్థితి. ఇంత దారుణ పరిస్థితులు… దేశం ముందెన్నడూ చూడని భయానక పరిస్థితిని చూస్తోంది.
Posted in వ్యాసం
Leave a comment
అలనాటి రచయిత్రి కోమలాదేవితో కాసేపు -వి. శాంతిప్రబోధ
ప్రేమ కథలు, నవలలు రాజ్యమేలుతున్న కాలంలో అందుకు భిన్నంగా రచనలు చేసిన రచయిత్రి గుర్తున్నారా…! ఆవిడ ఎవరని ఆలోచిస్తున్నారా.. ఆవిడేనండి అలనాటి రచయిత్రి కోమలాదేవి.
Posted in వ్యాసం
Leave a comment
అక్కడ దళితులను ఆపిన శక్తి ఏది? -ప్రసాద్ చరసాల
ఇక్కడ రెండు ఫోటోలు జత పరుస్తున్నాను చూడండి. ఇవి రెండూ మా ఊరికి సంబంధించిన గూగుల్ మ్యాప్ చిత్రాలు. ఒకటి ప్రస్తుతం మా ఊరి సామాజిక, నైసర్గిక స్వరూపాన్ని చూపిస్తే మరొకటి ఊరి చుట్టుపక్కల భూములను చూపిస్తుంది.
Posted in వ్యాసం
Leave a comment
బ్రిటిష్ సైనిక బలగాలను సవాల్ చేసిన యోధ బేగం హజరత్ మహాల్ – సయ్యద్ నశీర్ అహమ్మద్
మాతృభూమి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి, బ్రిటిష్ సైనిక బలగాలతో తలపడిన రాణులు స్వాతంత్య్రోద్యమ చరిత్రలో అరుదుగా కన్పిస్తారు. ఆ అరుదైన ఆడపడుచులలో అగ్రగణ్యురాలు బేగం హజరత్ మహాల్. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తొలి దశలో ఈస్టిండియా
Posted in వ్యాసం
Leave a comment
రైతుల కోసం పనిచేయడానికి నూతన ఉత్సాహాన్ని నింపిన రైతు స్వరాజ్య వేదిక దశాబ్ది ఉత్సవాలు – రైతు స్వరాజ్య వేదిక టీమ్
రైతు స్వరాజ్య వేదిక వ్యవసాయ రంగ సమస్యలపై పనిచేయడానికి ఫిబ్రవరి 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక స్వతంత్ర వేదికగా ఏర్పడిరది. గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గ్రామీణ, ఆదివాసీ ప్రాంత సమస్యలపై స్వతంత్రంగానూ, ఇతర
Posted in వ్యాసం
Leave a comment
ఉన్నత విద్యలో స్త్రీల సమస్యలు – ఆర్.ఎల్.మాధవి
ప్రస్తావన : ఒక స్త్రీ చదువుకొంటే మొత్తం కుటుంబం చదువుకొన్నట్లేనని పెద్దల మాట. ఒక కుటుంబాన్ని అన్ని విధాలా సంరక్షించే పెద్దగా ఈ మాట అక్షరాలా నిజం. స్త్రీ చదువుకొని ఉండి పిల్లల చదువుల గురించి చక్కగా శ్రద్ధ తీసుకొని కుటుంబం ఉన్నతస్థాయికి ఎదిగేటట్లు చేయగలదు. చదువు ఆధారంగా ఉద్యోగం చేసి కుటుంబ ఆర్థిక పరిస్థితి … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
మానవీయ మహా మహిళ -డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి యస్. నిర్మలాదేవి
డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి తండ్రి నారాయణస్వామి అయ్యర్, తండ్రి చంద్రమ్మాళ్ (ఆమె ఒక దేవదాసి). ఆ రోజుల్లోనే బాగా చదువుకున్న నారాయణస్వామి అయ్యర్ దేవదాసి దురాచారాలను ఎదిరించి నిలిచి, పోరాడి చంద్రమ్మాళ్‌ను వివాహం చేసుకున్నాడు.
Posted in వ్యాసం
Leave a comment
అత్యాచారం వ్యక్తిగతం కాదు… సామాజిక నేరం – షేక్ పీర్ల మహమూద్
ఓ బూర్జువా సమాజం నిర్మించే చట్టాలతో నేరాలను ఏ మేరకు కట్టడి చేయగలం? ఈ సమాజానికి ఇంకో అదనపు కోర కూడా ఉంది. అది పితృస్వామ్యం. పురుషుల ఆధీనంలో నడిచే వ్యవస్థ స్త్రీల సహజ హక్కులను కాపాడగలదా? మగాడు కేంద్రంగా తయారు చేయబడిన ఏ చట్టమూ సరిగా పనిచేయదు. వరకట్న నిషేధ చట్టం దీనికో ఉదాహరణ. … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
కార్పొరేట్ల కబంధ హస్తాల్లో వ్యవసాయం -ఎ.నర్సింహారెడ్డి
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో, ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడుతున్న వేల ప్రజల ప్రాణాలను ఎంత మాత్రం పట్టించుకోని మోడీ ప్రభుత్వం తన ఆశ్రితుల కోసం, స్వదేశీ విదేశీ వ్యవసాయ వాణిజ్య సంస్థల కోసం రైతులను సంక్షోభంలోకి నెట్టే అతి ప్రమాదకరమైన మూడు వ్యవసాయ చట్టాలు చేయడం దారుణం. ఆదరాబాదరా తెచ్చిన చట్టాలు … Continue reading
Posted in వ్యాసం
Leave a comment