Category Archives: వ్యాసం

హ్యాపీ ఫెమినిస్ట్స్‌ -చిమమండా అడిచే

– అనువాదం : ఎ. సునీత ముందు మాట: 2012లో ఆఫ్రికాపై టెడ్‌ ఎక్స్‌ యూస్టేన్‌ నిర్వహించే వార్షిక సమావేశంలో నేను చేసిన ప్రసంగాన్ని కొద్దిగా మారిస్తే వచ్చిందీ పుస్తకం. వివిధ రంగాల నుంచి వక్తలు ఆఫ్రికన్లని, ఆఫ్రికా మిత్రులని ఉద్దేశించి, వారికి స్ఫూర్తినిస్తూ, అలాగే సవాలు చేస్తూ క్లుప్తంగా ప్రసంగాలు చేసే సమావేశం ఇది.

Share
Posted in వ్యాసం | Leave a comment

స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి కిరణం ` సావిత్రిబాయి ఫూలే -దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు

తొలితరం విద్యా కుసుమం సావిత్రిబాయి ఫూలే భారతీయ సంఘ సంస్కర్తలలో మేటి తొలి భారతీయ ఉపాధ్యాయురాలు తొలి నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి తొలి బాలికల పాఠశాలలను కట్టించిన సాహసి

Share
Posted in వ్యాసం | Leave a comment

కాలంతో పాటు మారాల్సిన ఆచారాలు -శీలా సుభద్రాదేవి

ఆ కళ్ళల్లో తోడు కోల్పోయిన దిగులు, అంతలోనే జావకారిపోతున్న గుండెకు ధైర్యాన్ని అద్ది గట్టిపరచుకోవాలన్న తపనతో పొడారిపోతున్న కళ్ళు. మరి కాసేపటికే అతని తోడి జీవితంలోని సంఘటనలు గుర్తుకువచ్చి అతను లేని లోటును తలచుకుంటూ చెలమలైపోతున్న కళ్ళు. నిద్రలో కూడా భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తుంటే నిద్రని తోలుకుంటూ వాడిపోతున్న

Share
Posted in వ్యాసం | Leave a comment

పిలుపులో గౌరవం -డా॥ విజయభారతి

భర్త ‘ముండా’ అని పిలిస్తే దారినపోయేవాడూ ‘ముండో’ అన్నాడని సామెత. ఇది పూర్వకాలపు సామెత అయితే కావచ్చు గాని ఈ రోజుల్లోనూ దీని గురించి ఆలోచించాల్సిందే. ‘‘ఏ సమాజంలో స్త్రీకి గౌరవముంటుందో ఆ సమాజం గౌరవింపబడుతుంది’’ అన్నారు పూర్వ పండితులు. కలకంఠి కంట్లో కన్నీరు వస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి (సంపద) ఉండనంటుందట.

Share
Posted in వ్యాసం | Leave a comment

‘నా ఎముకలు బోలుగా మారాయని డాక్టర్లు చెప్పారు’ -మేధా కాలే / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

(అనువాదం: ఆపర్ణ తోట) జీవితకాల అనారోగ్యం, గర్భాశయం తొలగింపుతో సహా నాలుగు శస్త్రచికిత్సల తర్వాత పూణే జిల్లాలోని హదాషి గ్రామానికి చెందిన బిబాబాయి లోబారే వంగిపోయింది. అయినా పొలం పనులు చేసుకుంటూ పక్షవాతంతో బాధపడుతోన్న భర్తను చూసుకుంటోంది.

Share
Posted in వ్యాసం | Leave a comment

భావాలూ బాధలూ పంచుకొన్న డా.సవితా ‘అంబేద్కర్‌’ -డా॥ బి.విజయభారతి

సవితా అంబేద్కర్‌ డాక్టర్‌ అంబేద్కర్‌కు చివరి దశలో తోడునీడగా నిలిచిన సహచరి. వారి వివాహం 1948 ఏప్రిల్‌ 15న జరిగింది. అంబేద్కర్‌ పుట్టినరోజు ఏప్రిల్‌ 14. సవితను చేసుకున్నది ఏప్రిల్‌ 15న. అప్పటికి అంబేద్కర్‌కు 55 సంవత్సరాలు నిండాయి. ఆ వివాహం ఆయన జీవితానికి మరో మలుపు.

Share
Posted in వ్యాసం | Leave a comment

తూత్తుకుడి ఉప్పుమడుల రాణి- అపర్ణ కార్తికేయన్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

(గత సంచిక తరువాయి…) (అనువాదం: ఆపర్ణ తోట) కొంతమంది యువకులు ఇక్కడ రొయ్యల యూనిట్లలోనూ, పూల ఫ్యాక్టరీల్లోనూ పనిచేస్తారు. కానీ ఉప్పు మడులలో పనిచేసేవారు 30 ఏళ్ళ పైబడ్డవారే. వీరు దశాబ్దాల తరబడి ఇక్కడ పనిచేశారు. కుమార్‌ కోపమంతా వేతనంతోనే. ‘‘ఇక్కడ ప్యాకర్లు కాంట్రాక్టు పనివారి

Share
Posted in వ్యాసం | Leave a comment

తన అందమే తనకు శత్రువైన అంజనీ బాయ్‌ మాల్పేకర్‌ -రొంపిచర్ల భార్గవి

అంజనీ బాయ్‌ మాల్పేకర్‌ పాత తరానికి చెందిన ప్రసిద్ధ హిందుస్థానీ గాయని. ఆమె పాడుతుంటే ప్రేక్షకులు ఆమె గానానికీ, ఆమె సౌందర్యానికీ పరవశులయ్యేవారు. పెద్ద పెద్ద సంస్థానాధీశులూ, రాజులూ, యువరాజులూ ఆమె సాన్నిహిత్యం కోసం తహతహలాడిపోయే

Share
Posted in వ్యాసం | Leave a comment

థెరిగాథ`బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు ` పార్ట్‌ 2 -బొల్లోజు బాబా

ఆమ్రపాలి వైశాలి నగరంలో ప్రమదావనంలో పనిచేసే తోటమాలికి ఒక మామిడిచెట్టు క్రింద ఓ చిన్నారి శిశువు దొరికింది. ఆ శిశువుకు అతడు అంబపాలి/ఆమ్రపాలి అని పేరు పెట్టి పెంచుకోసాగాడు. ఆమె అపురూపమైన సౌందర్యరాశిగా రూపుదిద్దుకొంది. ఆమెను పెండ్లాడాలని అనేకమంది యువరాజులు పోటీపడి వాదులాడుకొనేవారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా

Share
Posted in వ్యాసం | Leave a comment

తూత్తుకుడి ఉప్పుమడుల రాణి – అపర్ణ కార్తికేయన్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

(అనువాదం: ఆపర్ణ తోట) ప్రతి ఏడాది ఆరునెలల పాటు తమిళనాడు తూత్తుకుడి జిల్లాలో ఉప్పుమడుల కార్మికులు మండుటెండలో, అసౌకర్యంగా ఉండే పని ప్రదేశంలో, అతి తక్కువ వేతనాలతో మనమంతా వంటగదిలో ముఖ్యమైన దినుసుగా వాడే ఉప్పుని పండిస్తారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

‘మరో మలుపు’లో స్త్రీ పురుష సంబంధాలు -ఎ. కె. ప్రభాకర్‌

ప్రతి రచయితకు వారి ప్రాతినిధ్య రచనలు కొన్ని ఉంటాయి. ఒక్కో రచయిత పేరు చెప్పిన వెంటనే ఒక కవితో కథో, నవలో, నాటకమో గుర్తుకొస్తుంది. కొందరికి అది వారి ఇంటి పేరయిపోతుంది. దాసరి శిరీష పేరు చెప్పగానే నాకు చటుక్కున గుర్తుకు వచ్చే కథ ఆమె

Share
Posted in వ్యాసం | Leave a comment

గుండె బస్తరై మండుతుంది – అశోక్‌ కుంబము

వియత్నాం మీద అమెరికా సామ్రాజ్యవాదం దాడి చేస్తున్న కాలంలో నక్సల్బరీ ప్రాంతంలో అరెస్ట్‌ చేయబడిన ఒక ఆదివాసిని ఒక పోలీస్‌ ఆఫీసర్‌ అడిగాడట, ‘‘మీ నక్సలైట్లు మాట మాట్లాడితే వియత్నాం జిందాబాద్‌ అని అంటున్నారు కదా, మరి చూపించు అదెక్కడ ఉందో’’ అంటూ ప్రపంచ పటాన్ని ఆ ఆదివాసి ముందు పెట్టాడట. అతనికేమో చదువు రాదు.

Share
Posted in వ్యాసం | Leave a comment

బీహార్లో ఇంట్లో 7 కాన్పులైన 36 ఏళ్ళ అమ్మమ్మ -కవిత అయ్యర్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: అపర్ణ తోట శాంతి మాంరిa, బీహార్‌లోని షియోహార్‌ జిల్లాలో ముసహర్‌ అనే కుగ్రామంలో తన ఏడుగురు పిల్లల్ని ఇంట్లోనే ప్రసవించింది. చాలా తక్కువమందికి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి. అందులో చాలామందికి అక్కడ పిహెచ్‌సిలో కాన్పులు చేస్తారని కూడా తెలీదు.

Share
Posted in వ్యాసం | Leave a comment

తల్లి అవడం సమాజం కోసమేనా? -సరిత భూపతి

‘‘ఎక్కడి గొడ్దుది దాపురించిందో, కడుపనుకుని సంతోషపడేలోపే రెండు నెల్లకో ముట్టు లేదా పండుగ పూట పదిహేను రోజులకే చాపెక్కటం’’ ఊర్లో ఇంకా ఇట్లాంటి మాటలు వినపడుతూనే ఉంటాయి. ఇర్రెగ్యులర్‌ పీరియడ్స్‌ సమస్య, ఇలాంటి వాళ్ళు పెట్టే ఒత్తిడి వల్ల మరింత తీవ్రమవుతుంది. అలాంటి మనుషులు పిఎంఎస్‌ని, మానసిక, శారీరక బాధని ఏ

Share
Posted in వ్యాసం | Leave a comment

‘‘తన మార్గం’’ వైపునకు ‘‘ప్రయాణం’’ చేసిన అబ్బూరి ఛాయాదేవి -డా॥ వేలూరి శ్రీదేవి

సమాజం, సాహిత్యం పరస్పర ప్రేరేపితాలు. నాటినుండి నేటివరకు సమాజంలో సగభాగమైన స్త్రీలు లింగ వివక్షకు గురవుతూనే ఉన్నారు. వివిధ కాలా7ల్లో, వివిధ ప్రాంతాల్లో శక్తి స్వరూపిణిగా, చదువుల తల్లిగా, ధనలక్ష్మిగా ఆకాశానికెత్తినప్పటికీ, మరికొన్ని పరిస్థితుల్లో

Share
Posted in వ్యాసం | Leave a comment

థేరిగాథ: బౌద్ధ భిక్షుకిల ప్రాకృత గాథలు ` పార్ట్‌ 1 -బొల్లోజు బాబా

బుద్ధునికి సమకాలీనులు స్వయంగా ఆయనవద్దే శిష్యరికం చేసిన తొలి బౌద్ధ సన్యాసినులు చెప్పుకొన్న స్వీయానుభవ కవితలు థేరిగాథలు. థేరి అంటే సన్యాసిని/భిక్షుకి/భిక్షుణి అని అర్థం. ఈ గాథలు క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో వ్రాయబడినా చాలాకాలం

Share
Posted in వ్యాసం | Leave a comment