ఇంటర్‌వ్యూలు

వివాహ వ్యవస్థ మారాలి

భూమిక ఫిబ్రవరి 2008

రమేష్‌ ఉపాధ్యాయ

“కేర్‌ కల్చర్‌ మరియు సిటిజెన్‌షిప్‌, ఛేజింగు కిన్‌షిప్‌, ఫ్యామిలీ, జెండర్‌ రిలేషన్‌షిప్‌ ఇన్‌ సౌత్‌ ఏషియ, షిప్టింగు సర్‌క్లాస్‌ ఆఫ్‌ సోసైటీ, స్టక్‌చర్స్‌ అండ్‌ స్టైటజి, మ్యారేజ్‌, మైగ్రేషన్‌ అండ్‌ జెండర్‌” అనే పుస్తకాల రచన, సహ-రచన, సహ-సంపాదకత్వం, చేసిన రజనీ పాలడీవాలా (జననం 1955) ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సమాజశాస్త్ర విభాగంలో ప్రొఫెసరు.

పూర్తిగా చదవండి »

మహిళా సమతే ధ్యేయం

భూమిక జనవరి 2008

ఇంటర్వ్యూ సేకరణ: హసేన్‌

ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమత సొసైటీి అనే స్వచ్ఛంద సంస్థకి స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఆమె. ఆమె పేరు ప్రశాంతి పేరు లాగే ప్రశాంతంగా కనిపిస్తారు ఆమె.

పూర్తిగా చదవండి »

ఉర్దూ సాహిత్యంలో భార్యది కాదు, ప్రేయసిదే వెలుగు

భూమిక అక్టోబర్ 2007

(శ్రీ జుబైర్ రిజ్వీతో డా|| రమేశ్ ఉపాధ్యాయ ‘కుటుంబంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపైన జరిపిన
ఇంటర్వ్యలోని చివరి భాగం. హిందీనుండి అనువాదం.)
అనువాదం: డా|| జె.ఎల్. రెడ్డి

పూర్తిగా చదవండి »

సమూల పరివర్తన ద్వారానే స్త్రీవిముక్తి సాధ్యం

భూమిక ఆగస్టు 2007

(డా|| ఉమ చక్రవర్తితో డా|| రమేశ్ ఉపాధ్యాయ జరిపిన ఇంటర్వ్యూ అనువాదం- జె. ఎల్. రెడ్డి (హిందీనుండి)

‘Social Dimensions of Early Budhism’, ‘Rewriting History : The Life and Times of Pandita Ramabai’, ‘Gender and Caste through a Feminist ‘Everyday Lives and Everyday Histories : Beyond the Kings and Brahmins of India’ లాంటి ముఖ్యమైన పుస్తకాలు రచించిన డా|| ఉమ చక్రవర్తి (జననం 1941) ప్రసిద్ధ స్త్రీవాద చరిత్ర రచయిత్రి. స్త్రీల, సాధారణ పజ్రల అధికారాలకు సంబంధించిన ఉద్యమా ల్లో క్రియాశీలమైన పాత వహించడమేగాక ఈమె ఢిల్లీ లోన Centre for Women Development Studies అనే సంస్థలో ప్రశంసించదగ్గ పనిచేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం మిరండాహౌస్లో చరితోప్రన్యాసకురాలుగా చాలా ఏళ్ళు పనిచేసి పదవీ విరమణ చేశారు. డా|| రమేశ్ ఉపాధ్యాయ వారితో జరిపిన ఈ ఇంటర్వ్యూ 10-5-2003న రికార్డు చేయబడి ‘కథన్’ అనే హిందీ సాహిత్య పతిక్ర జూలై-సెప్టెంబర్ 2003 సంచికలో వెలువడింది. డా|| ఉపాధ్యాయ ‘కథన్’ పతిక్ర సంపాదకులే కాక, పేరుమోసిన హిందీ రచయిత. 25కు పైగా వీరి నవలలు, కథాసంపుటాలు, అనువాదాలు, వ్యాస సంపుటాలు వెలువడ్డాయి. వీరు కూడా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో హిందీ ఉపన్యాసకులుగా పని చేసి పదవీ విరమణ చేశారు.

పూర్తిగా చదవండి »

ఫోనులో… సాంత్వన !

భూమిక జూన్ 2007

జీవితమన్నాక ఎన్నెన్నో సమస్యలు…వాటినెదుర్కొని ముందుకు సాగాలనే అందరి ప్రయత్నమూ. కానీ ఒక్కోసారి ధైర్యం సన్నగిల్లుతుంది. మనసంతా చీకటి ఆవరిస్తుంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఒక్కోసారి ఇక చాలు… ఈ లోకం నుంచి నిష్క్రమిద్దామని కూడా అన్పించవచ్చు. అలాంటి వారికి నేనున్నానని ఎవరైనా అండగా నిలబడితే… నాలుగు మంచి మాటలతో మెరుగైన భవిష్యత్తుపై చిగురంత ఆశ కలిగేలా చేస్తే… ఆ పనే చేస్తోంది భూమిక హెల్ప్‌లైన్‌.

పూర్తిగా చదవండి »

ఫెమినిస్ట్‌ పెస్ర్‌ డైరెక్టర్‌ - ఫ్లారెన్స్‌ హావ్‌

భూమిక జూన్ 2007

- కె. సత్యవతి, డా.సమత

(ఫ్లారెన్స్‌ హావ్‌ న్యూయార్క్‌లోని గ్రాడ్యుయేట్‌ సెంటర్‌ ఆఫ్‌ ద సిటి యూనివర్సిటీలో ఇంగ్లీషు ప్రొఫెసరుగా పని చేసారు. ది ఫెమినిస్ట్‌ ప్రెస్‌ పబ్లిషర్‌/ డైరెక్టరుగా వున్నారు. ఆమె డజను కన్నా ఎక్కువ పుస్తకాలను వంద కంటే ఎక్కువ వ్యాసాలు ప్రచురించారు. ఆమె ఎన్నో గౌరవ హోదాలను ఆరు గౌరవ డాక్టరేట్లను పొందారు. ఇటీవల ఆమె మాడిసన్‌ లోని విస్కాన్‌ సిన్‌ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ను పొందారు. పూర్తిగా చదవండి »

స్వప్నాలన్నీ తెగ్గొట్టబడ్డ జ్ఞాపకాలే

భూమిక మే 2007

- ఇంటర్వ్యూ : డా. సుహాసిని

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలం, ఆత్మకూరు గ్రామంలో శ్రీ కుఱ్ఱా సుబ్బరామిరెడ్డి,రాజమ్మలకు 28-8-1942లో ప్రథమ సంతానంగా శ్రీమతి దోర్నాదుల సుబ్బమ్మ జన్మించారు. ఈమె ఆత్మకూరు కాలేజీలో పి.యు.సి. దాకా చదివారు.

భర్త దోర్నాదుల రామిరెడ్డి గారు స్కూల్సు ఇన్స్పెక్టరుగా పనిచేస్తూ వివిధ జిల్లాలలో అనే ప్రాంతాలలో వుండటం వల్ల ఆయా ప్రాంతాల గ్రామీణ సామాజిక ఆర్థిక స్థితి గతులను అవగాహన చేసుకోగలిగారు. ఆ స్త్రీల స్థితిగతులను విశ్లేషిస్తూ తన రచనా వ్యాసంగాన్ని 1958 లోనే ప్రారంభించి కథలు కథానికలు, గేయాలు, నవలికలు లేఖాసాహిత్యం ఇలా విభిన్న ప్రక్రియలలో సాహిత్యాన్ని రచించారు. అవి విభిన్న పక్షమాసదిన పత్రికలలో వెలువడ్డాయి. ఎన్నో రేడియో ప్రసంగాలు చేశారు. పెక్కు వేదికల మీదనుంచి తన కవితా పఠనాన్ని ప్రసంగాలని వినిపించారు.
పూర్తిగా చదవండి »

కలం దూరమవ్వడం అంటే ఆక్సిజన్ కరువవ్వడమే.

భూమిక మే 2007

- ఇంటర్వ్యూ: శాంతసుందరి

హిందీ రచయిత్రి, బాధితులైన స్త్రీలకోసం కౌన్సులింగ్ సెంటర్ ముంబైలో నడుపుతున్న, సుధా అరోరా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమెతో జరిపిన ఇంటర్యూ

ప్రశ్న : సుధా అరోరాగారు, మీ నేపధ్యం కొద్దిగా చెపుతారా?
సుధ : నేను 1946లో దేశవిభజనకు పూర్యం లాహోర్లో పుట్టాను. మాది చాలా సంప్రదాయమైన కుటుంబం. మా కుటుంబంలో ఎమ్.ఏ. చదువుకున్న మొదటి ఆడపిల్లని. మొదట్నించీ (మంచి మార్కులు తెచ్చుకుంటూ) చదువులో ఫస్ట్గా ఉంటూ (ఉండటం గమనించి) డిగ్రీలో యూనియర్శిటీ టాపర్గా వచ్చిన నన్ను ఎమ్.ఏ. చదివించాలని పోట్లాడి సాధించిన వ్యక్తి మా అమ్మ. మా అమ్మ లాహోర్లోనే పుట్టి పెరిగింది. సాహిత్యరత్న పట్టం పుచ్చుకుంది (అది ఈనాటి ఎమ్.ఏ.తో సమానం) కవిత్వం రాసేది (కానీ ఎక్కడా ప్రచురించలేదు-అలాంటి పరిస్థితులు ఆకాలంలో లేవు)
పూర్తిగా చదవండి »

ఆంధ్రప్రదేశ్‌ హెచ్‌ఐవి/ఎయిడ్స్‌

భూమిక ఏప్రిల్ 2007

అల్లిగూడెం నుండి వచ్చిన రాములమ్మ రెండో తరగతి చదివి మానేసి వ్యవసాయం చేసేది. తల్లిదండ్రులు చదివించడానికి అంగీకరించ లేదు. లిడ్స్‌లో చేరి చదువు కొనసాగిస్తోంది. ఆటలంటే ఇష్టమని చెప్పింది. నేషనల్‌ కబాడీ పోటీలకు చత్తీస్‌గడ్‌ వెళ్ళింది.జాతీయ స్థాయిలో ఆడింది రాములమ్మ.
పూర్తిగా చదవండి »

ఆగమ్మ

భూమిక మార్చ్ 2007

- ఇంటర్వ్యూ: జె. సుభద్ర

(వరంగల్ జిల్లాలో సర్పంచిగా పనిచేస్తున్న దళితురాలు ఆగమ్మ. పేరుకి ఆమె సర్పంచిగాని అధికారమంతా ఆమె కొడుకుదే. ఆగమ్మతో సుభద జరిపిన ఇంటర్వ్యూ.)

ప్రః చెప్పమ్మా ఎప్పుడు ఎన్నికయ్యావు నువ్వు, ఎవరు నిల్చోబెట్టారు, మీ పంచాయితీ గురించి చెప్పు…?
పంచాయితీ సంగతి కొడుక్కి తెలుసు గద నాకేం దెలుత్తది నన్ను నిలబెట్టుకున్నడు నేను మండలంబోత ఒత్త ఇంక ఏడికన్న తీస్కపోతె పోత అత్త. ఫొటోలు దించుకున్నరు. పూర్తిగా చదవండి »

గ్లోరియా స్టీనమ్

పి. సత్యవతి మార్చ్ 2007

- ఇంటర్వ్యూ: అమ్మూ జోసెఫ్ (అనువాదం: పి.సత్యవతి)

గ్లోరియా స్టీనం అనగానే సెకండ్ వేవ్ ఫెమినిజం ఉత్తుంగ తరంగం, సివిల్ రైట్స్ ఉద్యమం, వియత్నాం యుద్ధ వ్యతిరేక ఉద్యమం అన్నీ గుర్తుకొస్తాయి. ఎంఎస్ పత్రిక వ్యవస్థాపకురాలు, రచయిత్రి, ఉద్యమ కార్యకర్త 72 ఏళ్ళ వయస్సులో ఆశకి మారుపేరులా వుండే గ్లోరియా ఇటీవల జరిగిన విమెన్ జర్నలిస్టుల సమావేశానికి బెంగుళూరు వచ్చారు. పూర్తిగా చదవండి »

కష్టాల్ని కవిత్వంతో అధిగమిస్తాను

భూమిక డిసంబర్ 2006

-కనకదుర్గ (ఇంటర్‌వ్యూ: కె.సత్యవతి, ప్రసన్న)

నా పేరు కనకదుర్గ. మాది విజయవాడ. కాని ఇక్కడే పుట్టి పెరిగాను. నాకు 1997 లో పెళ్ళయింది. అపుడు నా వయస్సు 19 సంవత్సరాలు. 2000 లో బాబు, డెలివరీ టైములో నేను పాజిటివ్ అని వచ్చింది. బాబుకి టెస్ట్ చేయించాను, కాని రాలేదు. చెస్ట్ హాస్పిటల్‌లో కౌన్సిలర్స్ ఫలానా ఆర్గనైజేషన్ వుంది, అక్కడకు వెళ్ళి చెప్పితే సమస్యలు తీరుస్తారు అంటే మేం అక్కడికి వెళ్ళి చెప్పాం. పూర్తిగా చదవండి »

ఆశ ప్రోగ్రాం మారు మూల గ్రామాల్లోకి చొచ్చుకు పోవాలి

భూమిక డిసంబర్ 2006

-రాగిణి (ఇంటర్‌వ్యూ: ప్రసన్న)

నా పేరు రాగిణి. మా గ్రామం పచ్చల తాడిపర్రు. మా అమ్మ నాన్నలకు ముగ్గురం ఆడపిల్లలం. వారిలో చివరి అమ్మాయిని. పెద్దక్కను 10వ తరగతి వరకు చదివించారు. యింక చదివించలేక ఆమెకు పెళ్ళి చేయాలని నిర్ణయించుకుని కట్నం ఇచ్చే స్థోమత లేక రెండో సంబంధం అతనికి ఇచ్చి పెళ్ళి చేశారు. రెండవ అమ్మాయిని కూడా ఎక్కువ చదివించలేక కట్నం ఇచ్చే స్థోమత లేక రెండో సంబంధం అతనికే ఇచ్చి పెళ్ళి జరిపించారు. పూర్తిగా చదవండి »

ప్రివెన్షన్ మీద ఎక్కువ ఫోకస్ చెయ్యాలి

భూమిక డిసంబర్ 2006

-వి. రాజేశ్వరి (ఇంటర్‌వ్యూ: కె. సత్యవతి)

నేను వనితా మహా విద్యాలయలో రీడర్‌గా పనిచేస్తున్నాను. మా కాలేజిలో చదివే పిల్లలకి హెచ్ఐవి గురించి అవగాహన వుందనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే మా కాలేజిలో ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ వుంది. దీని తరఫున విద్యార్థులు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు, ఎన్నో ర్యాలీల్లో పాల్గొంటుంటారు. ఎయిడ్స్ ర్యాలీలో పాల్గొంటారు. మా కాలేజీలో రెడ్ రిబ్బన్ క్లబ్ వుంది. ఇటీవలే మైక్రో బయాలజీ డిపార్ట్‌మెంటువాళ్ళు మూడురోజుల ఎగ్జిబిషన్ నిర్వహించి హెచ్ఐవి వైరస్ గురించి తెలియచెప్పారు. పిల్లలంతా ఆ ఎగ్జిబిషన్ చూసారు. పూర్తిగా చదవండి »

నేనూ పాజిటివ్‌నే-పాజిటివ్‌ల కోసమే ఈ నెట్‌వర్క్

భూమిక డిసంబర్ 2006

-స్వప్న

మా నెట్‌వర్క్ 2003 లో మొదలయి,24 మంది సభ్యులతో 2004 లో రిజిస్టర్ అయింది. 2004 నుంచి ఇప్పచిజీవరకు మేము 2500 సభ్యులను చేర్చుకోగలిగాం.

ప్రధానంగా కుటుంబం అంగీకరిస్తేనే సమాజం కూడా పాజిటివ్స్‌ని అంగీకరిస్తుంది. దానివల్ల వాళ్ళకు మంచి జీవితం వుంటుంది. పూర్తిగా చదవండి »

గ్రామ సభల్లో హెచ్ఐవి గురించి చర్చించాలి

భూమిక డిసంబర్ 2006

-ఎన్.గీత (ఎం.ఆర్.ఓ చెన్నారావుపేట)

గ్రామాల్లో ‘ఆశ’ ప్రోగ్రాం వల్ల ఇప్పుడిప్పుడే హెచ్ఐవి గురించి తెలుస్తోంది. అది చాలా తీవ్రమైన వ్యాధి అని వారికి తెలియదు. గ్రామంలో చనిపోయిన వారందరూ తాగడం వల్ల, పోషకాహారం లేకపోవడం వల్ల చనిపోతున్నారని అనుకుంటారు. రక్త పరీక్షలు జరగడం లేదు. ఇప్పుడిప్పుడే అంగన్‌వాడీ వర్కర్లు గర్భిణీలకు హెచ్ఐవి టెస్ట్ చేస్తున్నారు. పూర్తిగా చదవండి »

- Next »