Category Archives: కథలు

కథలు

మ…నం?!

– వత్సల ‘బచ్చీని’ చూడాలి… ఎలాగయినా చూడాలి….. ఎలాగయినా సరే… తనని చూడాలి…. . తనను చూడకుండా మాత్రం వెళ్ళకూడదు – ఎందుకంటే?… నేను మళ్ళీ ఈ ఊరు వస్తానో? రానో?…

Share
Posted in కథలు | Leave a comment

లచ్చువమ్మ కత

– వేములపల్లి సత్యవతి లచ్చువమ్మ కత కణ్వమహర్షి ఆశ్రమంలో పెరిగిన అమాయకపు మునికన్య శకుంతల కథకాదు. హంస రాయబారం నడిపిన రాజకుమారి దమయంతి కథ కాదు. పురూరవుని వెనుకనే అదృశ్యంగా వుండి అతని ముందు ప్రేమలేఖను జారవిడిచిన అప్సరస ఊర్వశి కథలాంటిది కాదు. సలీమ్‌ని ప్రేమించి అక్బర్‌ చక్రవర్తిచేత జీవసమాధి చేయబడిన అనార్కలి కథలాంటిది కూడ … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

కంచె

– శీలా సుభద్రాదేవి “నాతాన పైసల్లేవు పీజులు కట్టాల్నంటే ఏడకెల్లి తెవాల్ని? నామిండడితాన కెల్లి తేవాల్నా? ఏంజేస్తె గది సెయ్యుండ్రి. నేనేమనా. పోరల్ని ఇంటికి తోలిస్తమంటారా గట్లే తోలియ్యుండ్రి…” ప్రక్క క్లాసుముందు వరండాలో నిలబడి పెద్దగా అరుపులు విని నాక్లాసునుండి బయటకు వచ్చాను.

Share
Posted in కథలు | Leave a comment

యాక్సిడెంట్‌

అత్తలూరి విజయలక్ష్మి మంచు కురుస్తొంది… అయినా లోపలికి వెళ్లాలనిపించడంలేదు.. నాగుండెల్లో రగులుతున్న మంట చలిని కాచుకున్నట్టు వెచ్చగానే అనిపిస్తొంది. జరిగిన సంఘటన తాలూకు షాక్‌ నుంచి నేను బైటపడలేదు.. పడలేను కూడా. ఆ షాక్‌తో నా కాళ్లు చచ్చుబడినట్టు ఐనాయి. సర్వశక్తులు నన్ను అసహించుకుని వదిలేసి వెళ్లినట్టు నిస్సత్తువగా మారిపోయాను..

Share
Posted in కథలు | Leave a comment

చెల్లెలు రాసిన కథలకు అన్న చెప్పిన ఆమె కథ

– డి. రాజేశ్వరి కన్నడ కథా సాహిత్యంలో, ప్రత్యేకించి ముస్లిం కథా రచయితలలో శ్రీమతి రజియా, ఎస్‌.జె.బి మెరిసి మాయమై పోయిన గగన తార. ఆమె నిజ జీవితం కూడా కథలాంటిది. కథకంటే ఆమె బతుకు గొప్పది, అంటారు ఆమె రాసిన కథలకు ‘మీతో’ అన్న ముందు మాటను రాసిన ఆమె సోదరుడు శ్రీహనీఫ్‌.

Share
Posted in కథలు | Leave a comment

ఊబి

– తురగా జానకీరాణి చిత్ర పరుగెత్తుతోంది. భుజాన పుస్తకాల సంచీ బరువుగా ఉంది. వగరుస్తూ పరుగెడు తోంది. ‘అమ్మో, టీచరు చంపేస్తుంది? అనుకుంటోంది. అల్లా పరుగెత్తి రైల్వే స్టేషన్‌ దగ్గర ఆగింది. అది వూరికి చివర. రైలు ఆగివుంది. మెట్లు ఎత్తుగా వున్నాయి రైలు పెట్టెకి. ఐనా, సంచీ గట్టిగా పట్టుకొని ఎక్కేసింది. ఎంతో కష్టమైంది. … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

దోపిడీ

– టి. సంపత్ కుమార్ ”ఏంటీ?… ఈ సంబంధంకూడా క్యాన్సలయ్యిందా?…” ఆదుర్దాగా, ఆశ్చర్యంగా అడిగాను. ఆఫీసునుండి వస్తూనే నేను మొదట చేసేపని నా బ్రీఫ్కేస్ని స్టడీరూములో దానికి కేటాయించిన చోటపెట్టి, కారు తాళం చేతుల్ని కీబోర్డుకి తగిలించి, డ్రాయింగ్ రూములో ఉన్న సోఫాలో కూచోని నెమ్మదిగా షూస్ విప్పి ర్యాక్లో పెడతాను. ఆరోజువచ్చిన పోస్టును ఓసారి … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

పెళ్ళి అనబడు రాచముష్టి కీడ్ర

– కొండేపూడి నిర్మల ”మొగుడు” కాని వాడ్ని మొగుడుగా ఊహించి ఇంద్రుడివి, చంద్రుడివి అని పొగడ్డం కష్టంగా వుందక్కా….” అంది పొద్దున్న మా పిన్ని కూతురు చాటింగులో. రాజేశ్వరికి నెల్లాళ్ళ క్రితమే ఒక పెళ్ళి సంబంధం చూశారు. చూపులకి తల్లి, తమ్ముళ్ళు, దూర బంధువులుకూడా వచ్చారు. పిల్ల బావుందని వెంటనే చెప్పారు. నాన్చడం తమకు ఇష్టం … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

పునరుజ్జీవనం

– చల్లపల్లి స్వరూపరాణి సునీత బియస్సీ, బియ్యీడీ చేసి హైదరాబాదులోని ఓ ప్రైవేటు రెసిడెన్షియల్‌ స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తోంది. కర్నూలు దగ్గర కోడుమూరు తన స్వగ్రామం. హైదరాబాదు నుంచి యింటికెళ్ళాలన్నా, యింటినుంచి హైదరాబాదు వెళ్ళాలన్నా మధ్యలో కర్నూల్‌లో దిగి తన ఫ్రెండ్స్‌ అరుణ, విమలలను కల్సి ఒకటీ రెండు రోజులుండి మళ్ళీ గమ్యస్థానానికి చేరడం సునీతకి … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

చిలుక జోస్యం

– ఎల్‌. మల్లిక్‌ (అది రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని అసెంబ్లీ భవన సముదాయ పరిసర ప్రాంతం. అక్కడ ఒక చోట ఇద్దరు చిలుక జోస్యం వాళ్ళు, తమ చిలుకల పంజరాలను పక్కపక్కన పెట్టి, ఆ ప్రక్కనే ఉన్న టీ బడ్డీ వద్ద టీ తాగుతున్నారు. అప్పుడు ఆ చిలుకలు రెండూ ఒకదానితో ఒకటి సంభాషించడం … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

నరాల్లో సుడి తిరగిన వ్యధకి అక్షర రూపం

– పంతం సుజాత ప్రతి రోజూ వెన్నెల్ని చూసి చూసి అమావాస్య వస్తే మనసు భారమవడం ఖాయం. అలాగే ఒకేసారి ఇన్ని మంచి కథలు చదివి చదివీ పుస్తకం మూసాక ఆలోచన చెమ్మగిల్లుతుంది. గొరుసు జగదీశ్వర రెడ్డి కథలు ‘గజ ఈతరాలు’ చదివితే ప్రతి పాఠకుడికీ అదే భావన కలుగుతుంది. మూడు ప్రాంతాల భాషల మీద … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

సన్నజీవాల సణుగుడు

– దీప్తి సూర్యుడికంటే ముందే లేచిన భారతమ్మ ఉదయపు వాహ్యాళి స్నానం గట్రా పూర్తి చేసుకొని ఇంకా ప్రయాణపు బడలిక తీరక తాపీగా కాఫీ తాగుతూ పేపర్లో హెడ్‌లైన్స్‌ చూస్తోంది. ముందుగదిలోంచి కొడుకు సత్యం, కోడలు ప్రియల సంభాషణ పేపరు మీదినుంచి దృష్టి మరలిస్తున్నాయి. అక్కడికీ భార్యా భర్తల మాటలు వినకూడదన్న ఇంగితం అడ్డుపడుతున్నా వాళ్ళ … Continue reading

Share
Posted in కథలు | 1 Comment

సరికొత్త దృశ్యం

– నంబూరి పరిపూర్ణ బి.కాం. ఫైనలియర్లో వున్న సుజాతకు చదువు తప్ప మరే లోకంతోనూ పన్లేదు. ఫస్టు క్లాసు ఓ లెక్కలోది గాదామెకు. అంతకు మించిన మెరిట్ మార్కుల్తో పాసవ్వాల్సిందే. తండ్రి రంగనాధరావు పి.డబ్ల్యులో సెక్షనాఫీసరు. సంపాదన పరిమితమే అయినా సంతానం చదువుల గూర్చిన శ్రద్ధ అపరిమితం. పిల్లలు సైతం చదువుల్లో దిట్టలు.

Share
Posted in కథలు | 5 Comments

ఆడదిక్కు

– లతాశర్మ (అనువాదం: ఆర్. శాంతసుందరి) “అమ్మా! తొమ్మిదిన్నరవుతోందే, ఇంకా ఎంతసేపిలా ఆకలితో కూర్చునుండాలి?” రమ ఎంతో సౌమ్యంగా అడిగింది. “ఇదిగో, ఐదే ఐదు నిమిషాలు!” అమ్మ చటుక్కున లేచి వెళ్ళి బాత్రూమ్ తలుపు మళ్ళీ తట్టింది.” ఒరే అమర్, త్వరగా రారా!… అక్క యింకా ఏమీ తినకుండా కూర్చునుంది!” అంది.

Share
Posted in కథలు | 4 Comments

మాయమవుతున్న మనసు

-డి.విజయకుమారి (భూమిక నిర్వహించిన కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ) కోటమ్మ బాల్కనీలో కూచుంది, కొన్ని వందల సార్లు అలారమ్ గడియారం వంక చూసుంటది. ఇంకా తెల్లవారుజాము మూడే అయింది. తెల్లవారాలంటే మూడు గంటలయినా ఎదురు చూడాలి. తన గది తలుపులు తెరవాలంటే ఎనిమిది కావలిసిందే, అది తన కొడుకు ఆర్డర్. రోజూ వుండేదే … Continue reading

Share
Posted in కథలు | 3 Comments

గంగకి వరదొచ్చింది

గంగ అలవాటు ప్రకారం పొద్దున్నే నిద్ర లేచింది. కళ్ళల్లో ఇసుక కూరినట్లు మంటగా వుంది. కళ్ళు తెరవలేకపోయింది. మంచం మీద అలాగే కూలబడింది. రాత్రంతా కంటిమీద కునుకు లేదు. నిన్న సాయంత్రం జరిగిన సంఘటనలు పదే పదే సినిమా రీళ్ళల్లా కళ్ళముందు కదలాడ్డం, అవమానంతో, ఉక్రోషంతో మంచం మీద పడుకోలేక పోయింది. కన్నీళ్ళ చారికలు తెల్లారాక … Continue reading

Share
Posted in కథలు | 1 Comment