Monthly Archives: September 2012

Share
Posted in Uncategorized | Leave a comment

అభ్యుదయకరమైన ఆలోచనలకు గవాక్షం

(ఇటీవల మరణించిన సత్తిరాజు రాజ్యలక్ష్మిగారికి భూమిక నివాళి) సత్తిరాజు రాజ్యలక్ష్మి గారి నుండి ఫోన్‌ వచ్చిందంటే నాకు  చాలా సంతోషంగా వుంటుంది. ఎందుకంటే ఆవిడ చాలా కాలంగా భూమిక అభిమానిగా ఎంతో సహకారమందిస్తున్నారు. కథలపోటీకి ప్రథమ విరాళం ఆవిడ నుండే.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

వందేళ్ళ ‘కన్యక’ ‘పూర్నమ్మ’లు

ఓల్గా నూటయాభై సంవత్సరాల క్రితం పుట్టిన ఒక కవి కవిత్వాన్ని ఇవాళ మళ్ళీ చదువుకుని ప్రేరణ పొందటానికేమైనా ఉంటుందా? ఉంటే అది ఆ కవి, ఆ జాతి అదృష్టమా, దురదృష్టమా? గొప్ప కవులను మళ్ళీ మళ్ళీ చదువుకుని ఆనందించవచ్చు, ఆస్వాదించవచ్చు. కానీ ఒక సామాజిక అవసరంగా వారి కవిత్వం నూరేళ్ళ తర్వాత కూడా చదవతగినదిగా ఉందంటే … Continue reading

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

వెండి మబ్బు

స్వర్ణ ప్రభాతలక్ష్మి ”అత్తయ్యా ! మీరూ, మామయ్యగారూ కనీసం అమిత్‌ పుట్టినరోజు వరకైనా ఉంటారనుకున్నాను. పైగా మామయ్యగారికి బెర్త్‌ కూడా కన్‌ఫర్మ్‌ కాలేదు కదా!” అప్పటికి నాలుగోసారి ఇదే మాటలు అంది ముక్త. ”నిరంజన్‌ టి.సి. దగ్గరికి వెళ్ళాడుగా! ఎలాగోలా బెర్త్‌ సాధిస్తాడ్లే ! అమిత్‌ పుట్టిన రోజుకి మీరే అక్కడికి వచ్చేయండి.” నవ్వుతూ అన్నాడు … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

అక్కిరాజుపల్లిలో….

కొండమ్మ : మా ఊరు కేశవపురం, నా పేరు కొండమ్మ. రజాకర్లొచ్చిన్రు, దొడ్డి వెట్టిండ్రు. ఆడోల్లనోదిక్కు, మొగోల్లనోదిక్కు దొడ్డివెట్టిన్రు. మొగోల్లనేమొ పొడి సేసిన్రు, ఆడోల్లనేమొ బట్టలిప్పేసిన్రు, నల్లపూసలు దెంపుకున్రు. డ్రస్సు లేసుకుని, లాగులేసుకుని వచ్చిండ్రు. వాల్లకు బస్సు, గిస్సు ఎక్కడిది? ఇండ్లు దోస్కపోటానికి బండ్లు గిండ్లు గట్టుకొని వచ్చిరి.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

సదా మీ ‘యాది’లో..

డా. రోష్ని వారం వారం వచ్చిన ‘యాది’ వ్యాసాలు చదివిన తర్వాతే తెలంగాణ భాషలోని సౌందర్యం తెలిసోచ్చింది. అది చదివాక మిగితా తెలంగాణా రచయిత్రుల రచనలు చదివే ప్రేరణ కలిగింది.

Share
Posted in నివాళి | Leave a comment

శరీరంలో సగం చీకటినా???

కొండేపూడి నిర్మల ఈ మధ్య దినపత్రికలో ”యోని ముద్ర” అనే వ్యాయామం గర్భవతులకి ఎంత అవసరమో, సుఖప్రసవానికి అది ఎలా తోడ్పడుతుందో చెబుతున్న వివరం చూశాను. రెండు అరచేతులూ విశాలం చేసి చూపుడు, బొటన వేళ్ళు తాకిస్తూ అద్భుతంగా ఆకారాన్ని నిర్మించింది ఆ వ్యాయామ ఉపాధ్యాయిని. చాలాసేపు ఆసక్తిగా చూస్తూ వుండిపోయాను.

Share
Posted in మృదంగం | Leave a comment

‘చైతన్య భూమిక’

బి. కళాగోపాల్‌ పున్నమి చంద్రునిలా ఎదగాలనుకొన్నా జీవితం వెన్నెల పూలై విరియాలని కలలుకన్నా..

Share
Posted in కవితలు | Leave a comment

హింస ఒక వ్యాపారం

మల్లీశ్వరి అదొక ఇ.ఎన్‌.టి డాక్టర్‌ క్లినిక్‌. ఛాంబర్‌ బైట వరుసగా వేసిన కుర్చీల్లో కూర్చుని ఎదురు చూస్తున్నారు పేషెంట్లు. తమ వంతు రాగానే లేచారు ఒక యువజంట. అబ్బాయి తలుపు దగ్గరే ఆగి ”మే ఐ కమిన్‌ డాక్టర్‌?” అలవాటయిన సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనలిజంతో చిన్న నవ్వుని జోడించి పొలయిట్‌గా అడిగాడు. పక్కనున్న అతని భార్య నవ్వుతూ … Continue reading

Share
Posted in లోగిలి | Leave a comment

ఎ మేటామార్పిసెస్‌

వి. ప్రతిమ అడవిలోని చెట్టూ మీది ఉసిరికీ, ఎక్కడో సముద్రంలో జనించే ఉప్పుకీ జత కుదరడం అంటే అదే మరి… భూమిక హెల్ప్‌లైన్‌లో పనిచేస్తోన్న కల్పనకీ… నెల్లూర్లో వుంటున్న ప్రశాంత్‌కీ నెల్లూరు బాప్టిస్ట్‌ చర్చిలో పెళ్ళి నువ్వు నెల్లూరోచ్చావంటే మనిద్దరం కలిసి కల్పనని సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుదాం అంటూ సత్యవతి మేఘసందేశం పంపింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

రెక్కలున్న పిల్ల

పసుపులేటి గీత ‘గంటల పర్యంతం నేనే ఆకాశంలో చుక్కల్ని చూస్తూ గడిపేసే దాన్ని, అక్కడేముంది? ఒక్కోసారి నాకు చాలా విచిత్రమైన ఆలోచన తట్టేది…., ఎక్కడో ఒక చోట, మరో గ్రహం మీద నాలాంటి మరో అమ్మాయి నాలాగే ఆలోచిస్తూ, నాలాగే చుక్కలకి చూపులనతికించి తిరుగుతుంటుందేమో కదా?!’

Share
Posted in కిటికీ | Leave a comment

ఉద్యమం నెలబాలుడు ఈ అరసవిల్లి కృష్ణుడు

లకుమ మనకు, కవిత్వాన్ని ఉద్యమంగా భావించి రాసిన కవితలూ వున్నాయి. ఉద్యమ కవిత్వమూ వుంది. ఈ పుస్తకంలో వుంది ఆ రెండోదే. అందుకే అరసవిల్లి కృష్ణను ఉద్యమం నెలబాలుడంటున్నది.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఆల్‌ విమెన్‌ ఆర్‌ క్లీనర్స్‌ కానీ…

జూపాక సుభద్ర జూలై 21-22 న ఫెమినిస్టు ఇండియా యాహు గ్రూపు మీటింగు కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ సదరన్‌ రీజినల్‌ సెంటర్‌, రాజేంద్రనగర్‌, హైద్రాబాద్‌ ఆధ్వర్యంలో జరిగింది. పాత కొత్త ఇండియన్‌ ఫెమినిస్టులు వందమంది దాకా వచ్చారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

రవీంద్రుని నాటికల్లో స్త్రీలు

డా. వేలూరి శ్రీదేవి ప్రపంచ సాహిత్య వినీలాకాశంలో ధృవతారలుగా నిల్చిపోయి ఆచంద్రార్కంగా వెలిగిపోతున్న కవులు, రచయితలు కొద్దిమంది ఉన్నారు. అలాంటి విశిష్టమైన కవుల్లో విలక్షణమైన కవి, రచయిత, తత్త్వవేత్త, గాయకుడు, చిత్రకారుడు మన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌.

Share
Posted in వ్యాసం | Leave a comment

మానవత్వం మంట కలసిన కాళరాత్రి

వేములపల్లి సత్యవతి దుశ్శాసనుల పర్వానికి తెరలేచిన రాత్రి. రాక్షసత్వం పరవళ్లు తొక్కిన రాత్రి. మానవత్వం మంటగలసిన కాళరాత్రి అదే 9 – జులై – 2012 సోమవారం రాత్రి.

Share
Posted in వ్యాసం | Leave a comment

నేర్పకుండా వచ్చిన పాఠం

సత్తిరాజు రాజ్యలక్ష్మి గుండు అనే పిల్లవాడుండేవాడు, వాడి వయస్సు ఎనిమిది సంవత్సరాలు. వాళ్ళ అమ్మానాన్న అతిగారాబం చేసి గుండును చెప్పిన మాట వినకుండా చేశారు. వాడు ఏపనైనా చెయ్యాలనుకుంటే అమ్మా, నాన్న ఒద్దన్నా చేస్తాడు.

Share
Posted in Uncategorized, పిల్లల భూమిక | Leave a comment