-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2020 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Daily Archives: November 9, 2020
పోలీస్ అమర వీరులకు నివాళి, స్మృత్యంజలి – కొండవీటి సత్యవతి
ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలను రక్షించాల్సిన గురుతరమైన బాధ్యతతో పోలీసు శాఖ పనిచేస్తుంది. శాంతి భద్రతలను కాపాడడం, ప్రజల ధన, మాన రక్షణ చేయడం పోలీసుల ప్రథమ బాధ్యతగా ఉంది. ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా ఠక్కున గుర్తొచ్చేది పోలీసులే. అందుకే వారు రక్షక భటులయ్యారు. ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత రక్షక భటులది. 100 నెంబర్ పోలీసుల … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
అడుగడుగునా సుడిగుండాలు దాటే ఆడపిల్లలు – పి. ప్రశాంతి
చిన్నగా, ఒక్కొక్కటిగా మొదలైన పిట్టల కిలకిలలు, అంతలోనే బృందగానాలూ అన్నీ కలిసి సుప్రభాతం ఆలపించడం ప్రారంభిం చాయి. దుప్పటి ముసుగులా కప్పుకుని ముడుచుకు పడుకున్న శిరీష మరింత మునగ దీసుకుంది. రాత్రి మొదలైన పీరియడ్స్‌తో కడుపునొప్పి మొదలై బద్దకంగా ఉండి లేవాలని పించట్లేదు. పక్కింటి పద్మత్త వాకిలూ డుస్తున్న చప్పుడు, ఎదురింటి అలివేలు పిన్ని పాలు … Continue reading
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
ఓ అమ్మాయీ! -ఉమా నూతక్కి
ఇదే మొదటిసారి కాదు, ఇదే చివరిదన్న భరోసా అస్సలు లేదు. అయినా ప్రతిసారీ దుఃఖం ముంచి లేపుతుంది. అక్షరాలు అల్లుకుపోయేంత దుఃఖం. అయినా మళ్ళీ మళ్ళీ రాస్తాం. ఎంత మంది ఎన్ని రాసినా, మానుపడుతున్న పాత గాయాల మీద కొత్తగా అయిన గాయం మళ్ళీ నిద్రని దూరం చేస్తుంది. జీవితం పట్ల భయాన్ని కలుగ చేస్తుంది. … Continue reading
Posted in మంకెన పువ్వు
Leave a comment
జనం ప్రేమ గెలుచుకున్న అడవి చుక్క -డా|| చల్లపల్లి స్వరూపరాణి
ఆదివాసీ సమూహాలలో ఇప్పటికీ చాలావరకు మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ తాలూకు లక్షణాలు కొనసాగుతున్నాయి. వాటిలో ‘కోయ’ తెగ ఆదివాసీ తెగ మాతృస్వామిక సంస్కృతికి ఒక ఆదిమ బిడ్డ వంటిది. అమ్మాయి ఇతర కులం అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే అతని నాలుక మీద కాల్చిన ఇనుపకడ్డీతో వాత పెట్టి, అల్లుడికి తమ ఇంటిపేరు ఇచ్చినాక కానీ వాళ్ళు … Continue reading
Posted in మిణుగురులు
Leave a comment
కరోనా కల్లోల సమయంలో… – రోజా రమణి
కరోనా నేపథ్యంలో చాలామంది తమ అనుభవాలను పంచుకున్నారు. నేను ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది అనుకున్నా కానీ రాస్తే బాగుంటుందని ఒక మిత్రుడు ఇచ్చిన సలహాతో ఈ సాహసం చేస్తున్నా.
Posted in కరోనా డైరీస్
Leave a comment
నకిలీ!! – పరిమళ పప్పు
ఉదయాన్నే పేపర్ చదువుతూ, కాఫీ తాగుతూ ఉన్న చంద్రంతో పక్కనే కూర్చుని వాట్సాప్‌లో మెసేజ్‌లు చూస్తున్న భార్య భానుమతి ”ఏమండీ. ఈ రోజు పేపర్లో మీ కథ పడింది చూశారా?!” అని అడిగింది.
Posted in కధలు
Leave a comment
స్త్రీవాద కవిత్వం – ఆవిర్భావ, ఆవశ్యకతలు – సూరేపల్లి పద్మావతి
వస్తు వైవిధ్యం అనేది ఆధునిక కవిత్వ ప్రత్యేక లక్షణం. ప్రాచీన కవితా ధోరణులైన పురాణ కవిత్వం, ప్రబంధ కవిత్వాలలో కథా ఇతివృత్తం ప్రసిద్ధం, నాయికా నాయకులు దివ్వులు, దివ్యాదివ్యులు అనే నియమం ఉండడం వల్ల వస్తు వైవిధ్యానికి అవకాశం తక్కువ. మానవాతీతమైన వ్యక్తుల చుట్టూ, శక్తుల చుట్టూ పురాణ, ప్రబంధాలు పరిభ్రమించడం వల్ల వస్తువునకు పరిమితులేర్పడినాయి. … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
ఆహార భద్రతే కాదు, ఆహార సార్వభౌమత్వం, ఆహార న్యాయం కావాలి – ప్రజా అసెంబ్లీ
ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో పేద, అణగారిన వర్గాలలో ప్రజలందరికీ సామాజిక భద్రతను కల్పించే పథకాలు అందడంలేదు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు, సురక్షితమైన ఆహారం, పోషకాలతో కూడిన ఆహారం అందుబాటులో లేవు. ముఖ్యంగా పేద వర్గాలకు రేషన్ దుకాణాలలో బియ్యం ఇవ్వటమే ఆహార భద్రతగా చెప్పబడుతోంది. పోషకాహార లోపం కారణంగా చిన్నపిల్లలు, మహిళలు, వృద్దులు … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
తెలంగాణలో మహిళా రైతుల హక్కులకు భద్రత కల్పించటానికి చేపట్టాల్సిన విధాన చర్యలు – ప్రజా అసెంబ్లీ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రైతులకు అనేక పథకాలను ప్రకటించింది. ఇటీవల నియంత్రిత పంటల సాగు ప్రణాళికను కూడా అమలులోకి తెచ్చింది. అయితే రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలు భూమి యజమానులకు మాత్రమే వర్తింపచేస్తున్నారు. భూమిలేని సాగుదారులను, వ్యవసాయ కూలీలను రైతులుగా గుర్తించకపోవడం చేత మహిళా రైతులు, కౌలు రైతులు, అటవీ … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
దాక్షిణాత్య సాహిత్యంలో తొలిదశ కవయిత్రులు – బోడి నాగశేషు
ప్రాచీన సాహిత్యంలో స్త్రీలు రచన చేయడానికి సరైన మేథో సంపత్తి, విద్య ఉన్నా కూడా, వారికున్న అప్పటి పరిమితులు, వారి దృక్పథం, రచనా వ్యాసంగం పట్ల అనాసక్తి, నిర్బంధాలు, కట్టుబాట్లు, అంతకుమించి స్త్రీ రచనా సాంప్రదాయం ఆ కాలం నాటికి లేకపోవడం వల్ల మహిళా కవయిత్రులు ప్రారంభ దశలో అరుదుగా కనిపించడానికి కారణంగా చెప్పుకోవచ్చు. వీటన్నింటినీ … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
నిరుడు వెలిగిన దీపశిఖలు – డా|| షేఖ్ మహబూబ్ బాషా
బ్రిటిషాంధ్రలో మహిళోద్యమం ముమ్మరంగా నడిచింది. తమ రచనల ద్వారా, మహిళా సంఘాల నిర్మాణం ద్వారా బలమైన మహిళోద్యమాన్ని నిర్మించారు బ్రిటిషాంధ్రలోని స్త్రీలు. వీరు ముఖ్యంగా స్త్రీల పత్రికలైన ‘తెలుగు జనానా’, ‘హిందూ సుందరి’, ‘సావిత్రి’, ‘వివేకవతి’, ‘అనసూయ’, ‘ఆంధ్రలక్ష్మి’, ‘గృహలక్ష్మి’, ‘ఆంధ్రమహిళ’ మొదలైన వాటిలో తమ రచనల్ని ప్రచురించేవారు. 1910 చివరినాటికే మహిళా రచయితల సంఖ్య … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
ప్రకృతితో స్త్రీ మమేకత బతుకమ్మ! – అనిశెట్టి రజిత
మన ఉనికికి మూలం ప్రకృతి, సకల చరాచర ప్రాణులకు జన్మనిచ్చింది ప్రకృతి. ఆ ప్రకృతి సంపూర్ణ ఆరాధనే బతుకమ్మ పండుగ వేడుక. ఈ పండుగ ఒక ఉత్సాహం, ఉల్లాసమే కాదు సంఘ జీవన తాత్వికతకు నిదర్శనం. మానవ సంబంధాల్లేని స్నేహ మాధుర్యాలకు ప్రతీక. అన్నింటినీ మించి ”బతుకు”ను నిర్వచించే నిలువెత్తు జీవధనం! మానవాళి మనుగడకు దీవెనలతో … Continue reading
Posted in పుస్తక పరిచయం
Leave a comment
గణన పాత్ర మీ గణిక – చందనాల సుమిత్రాదేవి
ఇందులోని కథలన్నీ దాదాపు వాస్తవిక సంఘటనల ఆధార ఇతివృత్తాలతో రచింపబడ్డప్పటికీ రచయిత్రి భండారు విజయ గారు ఈ కథనంలో ఎక్కడా వినిపించరు, కనిపించరు. కానీ, ఆ వాస్తవ ఘటనల తాలూకు గాఢతను, ముద్రలను మనపై వేస్తూ భారమైన, ఛిద్రమైన, వేదనాభరితమైన మన హృదయాలపై తాను ఎంచుకొన్న లక్ష్యాలను ఆవిష్కరింపచేస్తూ అప్రతిహతంగా విజయ పథంలో సాగిపోతూ ఉంటారు. … Continue reading
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
యువత హక్కులు – ప్రచారోద్యమం
పరిచయం: యువ జనం ఈ నాటి సృజన కారులు, అన్వేషకులు, నిర్మాతలు, నాయకులు. స్వాతంత్య్రపు 74వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న భారతదేశం 29 సం||రాల సగటు వయస్సు ప్రపంచంలో యువ జనాభాకు ఆవాసంగా ఉన్న దేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది. మొత్తం జనాభాలో యువత 28%గా ఉండి ఆర్థికాభివృద్ధి పెంపుదలకు అవసరమైన శక్తిని ఇచ్చే జనభాగం కలిగి ఉంది. … Continue reading
Posted in మనం గళమెత్తకపోతే
Leave a comment
ఇంటి పనివారి గురించిన వాస్తవాల ప్రకటన – ప్రచారోద్యమం
సంక్షిప్త పరిచయం: దేశ, రాష్ట్ర చట్టాల రక్షణ లేకుండా ఇళ్ళల్లో మూసి ఉన్న తలుపుల వెనుక కనబడకుండా చాకిరీ చేస్తూ ఉండే తరగతి శ్రామికులు పనివారలు. కుటుంబంలో స్త్రీలు చేసే చాకిరీకి, ఇంటి పనికి సామాజికంగా విలువలేని తనాన్ని ప్రతిబింబిస్తూ ఈ పనివారు చేసే పనులు ”శ్రమ”గా గుర్తింపబడవు. నిజానికి 90% ఇంటి వనివారు స్త్రీలే. … Continue reading
Posted in మనం గళమెత్తకపోతే
Leave a comment