Daily Archives: October 3, 2025

అక్టోబర్ 2025

అక్టోబర్ 2025

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

‘‘కూర్చునే హక్కు – కార్మికుల మానవ హక్కు’’ – కొండవీటి సత్యవతి

ఒకప్పుడు షాపింగ్‌కి వెళ్తే మనకి వస్తువులు చూపించే సేల్స్‌ గర్ల్స్‌, సేల్స్‌ బాయ్స్‌ కూర్చోడానికి చిన్నచిన్న స్టూల్స్‌ లాంటివి ఉండేవి. కస్టమర్స్‌ ఎవరూ లేకపోతే వాళ్ళకి కూర్చోగలిగిన వెసులుబాటు ఉండేది. దాదాపు పది సంవత్సరాల నుండి సేల్స్‌ సెక్షన్స్‌లో పనిచేసే వారు ఎనిమిది నుంచి పది గంటల వరకు నిలబడే ఉండాల్సిన పరిస్థితి ఈ రోజు … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

(గత సంచిక తరువాయి…) అనువాదం: ప్రభాకర్‌ మందార 9. ఇబ్రహీంపట్నం స్థితిగతులు నేను 1984 ఆగస్ట్‌లో మొట్టమొదటిసారి ఇబ్రహీంపట్నం వెళ్లాను. అప్పుడు జలాల్‌మియాపల్లెలో పాల్‌ దివాకర్‌ వాళ్లింట్లో వున్నాను. జలాల్‌మియాపల్లె ఇబ్రహీంపట్నం టౌన్‌కు పద్దెనిమిది కిలో మీటర్ల దూరంలో రంగాపూర్‌లోని ఓ చిన్న పల్లెటూరు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

యాపకాయలు అనబడు ‘ది బెస్ట్‌’ కత – వినోదిని మాదాసు

‘‘యాపకాయలు కొంటాం… యాపకాయాలు కొంటాం…’’ ఈ అరుపు కోసమే నిన్నటి నుండి ఎదురు చూస్తా ఉంది ఎలిజబెత్‌. అక్క విక్టోరియా అంట్లు తోముతావుంటే ఎదురుగా బక్కెటు నిండా నీళ్లు పెట్టుకొని వాటిని కడుగుతా ఉంది. ఆ మొయినే వాటినొదిలేసి రోడ్డు మీదకి పరిగెత్తింది.

Share
Posted in కథలు | Leave a comment

గర్భసంచిని రక్షిస్తే మహిళల జీవితాల్ని సంరక్షించినట్లే – పి. ప్రశాంతి

టైమ్‌ 11 అవుతోంది. అపార్ట్మెంట్‌ సెల్లార్‌లో ఉన్న ఆఫీసు రూమ్‌లో దాదాపు 20 మంది మహిళలు ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా రావలసిన దోస్తుల కోసం వచ్చేయండంటూ కొందరు ఫోన్లు చేస్తున్నారు. ఆ రోజు వాళ్ళకి ఆటవిడుపు.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఆడవారి బట్టలకు అర్థాలే వేరులే – అపర్ణ తోట

డ్రెస్సింగ్‌. బట్టలు. వస్త్రాలు. అలం కరణ. గౌరవం. హుందాతనం. సాంప్ర దాయం. సంస్కృతి. అసభ్యం. వెకిలితనం. ఒంపుసొంపుల ప్రదర్శన. మగవారిని ఆకర్షించుట. కులుకులాడి, కులట.

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

డాక్టరు కే.ఎన్‌. కేసరిగారి బంగరుపతక బహుమానమునందిన వ్యాసము ‘‘స్త్రీ అబల కాదు’’ – శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మ

` సేకరణ : డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా (నెల్లూరు ప్రొగ్రెసివు యూనియను వారు ప్రతివత్సరమును ఆంధ్ర స్త్రీలకు వ్యాసరచమున పోటీ పరీక్ష నొకదానిని నిర్వహించుచున్నారు. ఈ పరీక్షకు గాను పంపబడు వ్యాసములలో నుత్తమమగు దానికి డాక్టరు కే.ఎన్‌. కేసరిగారు ఒక స్వర్ణపతకమును ఇచ్చుచుండుట వాడుక.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఛాయ సాహిత్యోత్సవం -Soul of Telugu

ఇన్నాళ్ళూ ప్రచురణ రంగంలో తనదైన ముద్ర వేసిన ఛాయ, ఇప్పుడు ఛాయ సాహిత్యోత్సవం చేయబోతున్నది. దేశవ్యాప్తంగా అనేక సాహిత్య ఉత్సవాలు జరుగుతున్నా అవి ఎక్కువగా ఇంగ్లీష్‌ కేంద్రంగానే ఉంటున్నాయి.

Share
Posted in సమాచారం | Leave a comment

ఆమె ఒక నిశ్శబ్ద యుద్ధ నౌక – గిరిజ పైడిమర్రి

‘‘అట్టడుగున పడి కాన్పించని కథలెన్నో కావాలిప్పుడు’’ అన్నాడు శ్రీశ్రీ. అలాంటి కథనమే యిది. కోట్లాది ప్రజల గుండెల్లో తన స్థానాన్ని పదిల పరచుకున్న ప్రజాయుద్ధ నౌక గద్దర్‌. ప్రజాగాయకుడుగా, కవిగా, విప్లవ రాజకీయ కార్యకర్తగా ఆయన గురించి తెలియని వారుండరు. ఆ యిల్లు నిత్యం వచ్చిపోయే జనానికి, ప్రజా రాజకీయాల చర్చలకు నెలవు.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

పాత పుస్తకాల షాపులు జీవిత పాఠాలు నేర్పుతాయి – కొండవీటి సత్యవతి

జపనీస్‌ రచయిత సతోషి యాగిసావా రాసిన ఈ పుస్తకం 151 పేజీల చిన్న నవల. ఇంగ్లీష్‌లోకి అనువాదం ఎరిక్‌ ఓజవా చేసారు. ‘‘డేస్‌ ఎట్‌ ది మోరిసాకి బుక్‌షాప్‌’’ హాయి గొలిపే నవల, ఇది జపాన్‌లోని టోక్యో ప్రాంతంలో జింబోచోలో ఉన్న ఒక పాత పుస్తకాల దుకాణం చుట్టూ తిరుగుతుంది.

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

మనలో మిగిలి ఉన్న మనిషిని గుర్తు చేసే ‘ముకుల’ – నరేష్‌ కుమార్‌ సూఫీ

రచయితలంటే ఏం చేస్తారు? రాస్తారు… కథా, కవిత్వమా, నిడివి పెంచితే కావ్యమో, నవలో… మధ్యలో బోర్‌ అనిపిస్తే ఓ వ్యాసమో అట్లా రాస్తారు. బస్‌! ఇంతేనా? రచయితంటే రాసే వాళ్లే కదా అనుకుంటాం, టెక్నికల్‌గా అది నిజం కూడా.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ధీర విదుషీమణి – డా.పి.చిరంజీవిని కుమారి – బొల్లోజు బాబా

డా. చిరంజీవినికుమారి విద్యావేత్త, అభ్యుదయవాది, కవయిత్రి, అనువాదకురాలు, సాహిత్య-సామాజికాంశాలపై అద్భుతమైన వక్త, సాహితీ కార్యకర్త, సమాజ సేవకురాలు అన్నింటికీ మించి అనన్య సామాన్యమైన వ్యక్తిత్వం, నిత్యచైతన్య శీలత కలిగిన ధీర.

Share
Posted in నివాళి | Leave a comment

తన విద్యార్థుల కోసం గొప్ప కలలు కంటోన్న ఉపాధ్యాయురాలు – సంధ్య లక్రా / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

Jharkhandలో, ఒక ముండా ఆదివాసీ ఉపాధ్యాయురాలు రూపొందించిన పాఠ్యాంశాల వల్ల, షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన ఎంతోమంది పిల్లలు తరగతి గదులకు వస్తున్నారు. చుట్టూ చీకట్లు ఆవరించే సాయంత్రం పేరే నాకు పెట్టారు. అయితే, ‘సంధ్య’ (సాయంత్రం) అనేది నల్లని నా ఒంటి రంగుకు తగిన పేరని నా కుటుంబం భావించింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

బౌద్ధ నీతి వివిధ వైఖరులు: ఒక అధ్యయనం – డా. సి.హెచ్‌. వెంటక శివసాయి

వ్యాస సంగ్రహము: బ్రహ్మ విహారం, బౌద్ధ మతం యొక్క నైతిక సూత్రాలను సూచిస్తుంది. విశ్వ ఉనికిని కొనసాగించకపోతే మనం కూడా నాశనం చేయబడతాము. ప్రకృతి మరియు మనిషి ముఖ్యమైనవి రెండూ పరస్పరం ఆధారపడి ఉంటాయి. ఇది బౌద్ధ ప్రతిత్యసముత్పద సిద్థాంతం ద్వారా బాగా ప్రదర్శించబడిరది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

గాజాలో కాలం భిన్నంగా, భారంగా గడుస్తుంది!-శివలక్ష్మి

సాధారణంగా ఎవరైనా, దేనికైనా ఒక సమయం, ఒక ప్రాంతం ఉంటాయి అని అంటారు కదా, మీరు వేరే ప్రదేశంలో ఉండటం వల్ల మీరు వేరే రకమైన కాలంలో జీవిస్తున్నట్లు నా అనుభవం నాకు చెబుతోంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఫెయిరీ క్వీన్‌..!! – బి.కళాగోపాల్‌

ఓ దిక్కు మాసిపోయిన మూసి కన్నీరు యేరై ప్రవహిస్తుంటే/ మరోదిక్కు బొండికాయ తెగ్గోసిన గుట్టల దుఃఖం/ మండ్రగబ్బలా గుడగుడలాడి భయపెడుతుంటే/ చెమట ఉప్పునీటి దోసిళ్ళతో పల్లీలమ్ముకుంటున్న చెవి తెగిన గెంటీల/

Share
Posted in కవితలు | Leave a comment