స్పందన – శాంతిశ్రీ బెనర్జి 

ముప్ఫై సంవత్సరాలు నిండిన మగువ ‘భూమిక’. స్త్రీల ఆలోచనలను, భావజాలాలను, సమస్యలను, సంఘర్షణలను, అంతర్మథనాలను తనలో ఇముడ్చుకున్న పరిణీత ‘భూమిక. Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -కావూరి శారద

భూమిక స్త్రీ వాద తెలుగు మాసపత్రికను గత 30 సంవత్సరాలుగా నిరవధికంగా పాఠక మిత్రులకు అందిస్తున్న యాజమాన్యానికి, సంపాదక, కార్యవర్గ సభ్యులకు, సిబ్బందికి శుభాభినందనలు. Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -తమ్మెర రాధిక,

అప్పుడే 30 ఏళ్ళు గడిచిపోయాయా అన్పిస్తోంది భూమిక గురించి ఆలోచిస్తోంటే. దక్షిణ భారతదేశంలో పూర్తి స్థాయిలో వస్తున్న స్త్రీవాద పత్రిక భూమికనే అనడంలో ఎలాంటి అతిశయోక్తి Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -శ్రీలలిత

30 సంవత్సరాలు ఏ ఆటంకం లేకుండా పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా కొనసాగాలని, కొనసాగుతుందని ఆశిస్తున్నాను. Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -శాంతిప్రియ ఆర్‌.

భూమిక స్త్త్రీవాద పత్రికను మనం ఎందుకు చదవాలి అని నన్ను నేను నిజాయితీగా ప్రశ్నించుకున్నప్పుడు నాలో చెలరేగిన భావాలకు అక్షరరూపం ఇది. స్త్రీలు పెద్ద సంఖ్యలో చదువుకుంటూ ఉద్యోగాలు, పనులు, వ్యాపారాలు చేస్తున్న కాలం ఇది. Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -ఎ.శ్రీలత

భూమిక పత్రికా సంపాదకులకు నమస్కారం. పత్రిక తన 30 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణాన్ని నిరాఘాటంగా నిర్వహించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ… ఇంకా మున్ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -అమరజ్యోతి

‘‘సౌందర్య లహరి’’లో…
‘‘భూమిక’’ స్త్రీల మాసపత్రికను నేను ‘‘మనలో మనం’’గా ప్రారంభమైన ‘‘ప్రజాస్వామిక రచయిత్రుల’’ వేదిక కార్యక్రమం అనకాపల్లిలో జరిగినప్పుడు చూశాను. Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -కృష్ణ కుమారి

భూమిక అనే ఈ శబ్ధం ఒక్కోక్కరిలో ఒకో విధంగా ఆలోచింపచేస్తది, ఆహ్వానిస్తుంది, భయపెడుతుంది. ఓదార్పునిస్తుంది. కొత్త ఆలోచనలకు ఆస్కారమిస్తుంది. Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన కాత్యాయనీ విద్మహే

భూమికతో నా ప్రయాణం
ఈ మధ్య కొన్ని సందర్భాలు నా సాహిత్య సామాజిక ప్రయాణం మొదలై ముప్పయ్‌ నలభై ఏళ్ళయిందని గుర్తు చేస్తే అప్పుడే అన్నేళ్లు గడిచిపోయాయా!? అని అశ్చర్యపోయా.. ఆ ప్రయాణంలో నా నేస్తాలు పత్రికలు పుస్తకాలే కదా! అలా నాకు లభించిన ఒక నేస్తం భూమిక Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన Rama melkote

Wishing Bhumika all the best. In appreciation of its support to the women’s movement, being a part of the human rights movement, Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – పద్మ వంగపలి

ఒక జర్నలిస్ట్‌ గా, మహిళలకు సంబంధించిన సమాచారం కోసం వెతికినప్పుడు, భూమిక పత్రిక నాకు మొదటి వరుసలో కనిపించేది. భూమికలో ప్రచురితమయ్యే అనేక ఆర్టికల్స్‌ అనేక సందర్భాల్లో, నా వృత్తి జీవితంలో నాకు ఉపయోగపడుతూ ఉండేవి. అలా నాకు భూమికతో అనుబంధం కొనసాగుతూ వచ్చింది. Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – సునీత ఏ

భూమిక తో నా ప్రయాణం 1990 ల మధ్యలో ప్రారంభమయింది. విద్యార్ధినిగా అన్వేషి లైబ్రరీకి వస్తున్న క్రమంలో భూమిక ని చదవటం ప్రారంభించాను. అప్పటి వరకూ ఇంగ్లీషులోనే పరిచయమయిన స్త్రీవాద ఆలోచనా రీతులను తెలుగులో చదవటం కొత్తగా, ఉద్వేగ భరితంగా ఉండేది. భార్గవి ధావర్‌ స్త్రీల మానసిక ఆరోగ్యం గురించి, కె. లలిత ఇంటి పని గురించి, మాధవి అసంఘటిత స్త్రీల సమస్యల గురించి రాసినవి నాకు ఇప్పటికీ లీలగా గుర్తున్నాయి. నా డాక్టరల్‌ పరిశోధన నుండి నేను రాసిన వ్యాసం భూమికలో రావటం నాకు సంతోషం కలిగించిన విషయం.
భూమిక నాకు అర్ధమయినంత వరకూ తెలుగులో స్త్రీవాద ఆలోచనకు ఒక మంచి వేదికగా ఉంటూ వచ్చింది. అవి పరిశోధన నుండి వచ్చినవి కావచ్చు, రచనా వ్యాసంగం నుండి వచ్చినవి కావచ్చు, సామాజిక ఉద్యమ నేపధ్యం నుండి వచ్చినవి కావచ్చు. ఈ రకమైన వైవిధ్యం ఇతర పత్రికల్లో, స్త్రీవాద పత్రికలూ అయినా, కాకపోయినా, తక్కువగా కన్పిస్తుంది. ఈ రకమైన విషయ వైవిధ్యాన్ని నిలుపుకుంటూ పత్రికని నడిపించటం చాలా కష్టమైన విషయం. రచనల్లోని కాక, రచనలు చేసే వారిలో వైవిధ్యాన్ని కూడా ఆహ్వానించటం కూడా భూమికలో కనిపిస్తుంది. జూపాక సుభద్ర కాలం, కొంత కాలం క్రితం నుండి మొహమ్మద్‌ భాషా గారు వలస పాలనా కాలంలో స్త్రీల పత్రికల గురించి రాస్తున్న కాలం దీనికి మంచి ఉదాహరణలు. రచనా వ్యాసంగంలో వున్న వారికి బలమైన ఊతమిచ్చిన భూమిక స్త్రీవాద రాజకీయాల చర్చలని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఇప్పటికీ వుంది. దేశ రాజకీయాల లాగే, స్త్రీవాద రాజకీయాలు కూడా మరింత సంక్లిష్టం గా మారిన ఈ చారిత్రిక సందర్భంలో భూమిక మరిన్ని రకాల స్త్రీవాద రచనల్ని, సమకాలీన స్త్రీల సమస్యల గురించిన విశ్లేషణని, అలాగే పరిశోధనని అందించాలని నా కోరిక.
మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంలో భూమిక టీవ్‌ు అందరికీ శుభాకాంక్షలతో…
` సునీత ఏ

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన

భూమిక పుట్టి ముఫ్పై సంవత్సరాలు అయిందా! అప్పుడే! అనిపిస్తుంది. అప్పుడు భూమికలో ఎక్కువ మంది లేరు. సత్యవతి ఈ విషయం చెప్పినప్పుడు రజిత నేను చాలా సంతోషించాం. ఢల్లీి నుండి వచ్చే మధుకిష్వర్‌ నడిపే మానుషి మ్యాగ్‌జైన్‌ లాంటిది ఇక్కడ తెలుగుదేశంలో Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన

భూమిక
భూమిక అరుణోదయ పూర్ణ కలశం!
అభ్యుదయ పథాన మమ్ము నడిపిస్తూ చైతన్యపరుస్తూ,
మూఢాచారాల్ని నమ్మకాల్ని ఖండిస్తూ వెళుతోంది.
భూమిక సప్తవర్ణ హరివిల్లు శోభ!
కుల మత వర్గ జాతి వివక్ష లేని,
సకల స్త్రీల సమ్మిళిత సమాహార సంఘటితం!
భూమిక ఒక జీవనది!
ఎల్లవేళలా ఎల్లకాలం,
నిస్సహాయులకు సహకారం, చేయూతనందిస్తూ పయనిస్తుంది.
భూమిక చల్లని జాబిల్లి!
వెన్నెల చెలులు ప్రసరించేది,
అందించేది సమాజహిత జ్ఞాన కిరణాల్ని!
భూమిక ఉప్పొంగే సాగరం!
స్త్రీల నిర్వేదనల్ని భయకంపితాల్ని అయోమయాల్ని
తనలో బడబాగ్నిలా దాచుకొని,
చెలియలికట్టను దాటక అందరికీ అభయాన్నిస్తూ రక్షిస్తోంది.
భూమిక విరిసిన ఎర్ర మందారాల పొద!
వివక్షను లైంగిక వేధింపులను ఖండిస్తుంది.
అత్యాచార బాధితులకు అండ!
విజృంభించి వెంటాడి వేటాడుతుంది నేరస్థులను!
భూమిక మధుర గానాల వేణువు పిలుపు!
ఆర్తులకు స్ఫూర్తినిచ్చి సేవలందించే చెలుల,
నందనందన ఆనంద బృందావనం.
షషష ` రమాదేవి చేలూరు

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన

విశ్వ స్తీ మూర్తుల పేమ్రిక
తరాల నుండి అతివల ఆవేదనను ఓపిగ్గా ఒడిసిపడుతున్న ‘‘భూమిక’’
ఎల్లలు చెరిపి చెరగని చరిత్ర సృష్టిస్తున్న ‘‘విశ్వ స్త్రీ మూర్తుల ప్రేమిక’’
మహిళలు సాధించిన అపురూప విజయాలు అందించే ‘‘పసిడి జ్ఞాపిక’’ Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

ప్రియమైన ఇజువేలా పదిహేను సూచనలతో ఒక స్త్రీవాద మేనిఫెస్టో -పి. సత్యవతి

పరిచయం
కొన్నాళ్ళ క్రిందట నా బాల్య స్నేహితురాలు ఒకామె, ఆడపిల్లని స్త్రీవాదిగా ఎట్లా పెంచాలని నన్ను సలహా అడిగింది. ఒక శక్తిమంతురాలైన స్త్రీ, కరుణా స్వభావురాలు కూడా అయిన ఆమె నన్ను ఈ సలహా అడిగినప్పుడు నిజంగా నాకు తెలియదు అని Continue reading

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment